మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… బ్రహ్మరాక్షసుని విముక్తి నీతికథ.
బ్రహ్మరాక్షసుని విముక్తి
అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీ ప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగా వచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?
“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్భాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రేయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతు వై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.
సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక ౧౦౦ వర హాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.
“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది ౫ం రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.
ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి మనస్సు మణిహారములుగురించి తెలుసుకుందాం…
Sai Manasu Maniharamulu Telugu
సాయి మనస్సు మణిహారములు
పది కనులు పడకుండను పదిల పరచి
ముచ్చట గొలుపు తీరుగ మోము దిద్ది
భక్తి భావన లొలుకగా పరమ నిరతి
నిన్ను చేరితి మదిలోన నిలువు సాయి
1
గర్వపడుచుందు జనకుల గాంచి నేను
ఆది గురువులయిరి నాకు అమ్మ నాన్న
ఋణము దీర్చగ నాదంటు ఏమి గలదు
వారికొసగెద నతులను భక్తి సాయి
2
చూడుమయ్య ఈ మదిలోని చూపు లెల్ల
చిత్రములు చేయు చుండెను శిథిల మవగ
నవ్వినట్టి తారల వెంట నడిచి వెడల
అదుపు తప్పెడు మముమార్చు మయ్య సాయి
3
నిన్ను చూడకున్న కనులు నిలువ వాయె
అందమైన దేముండెనో అక్షయాత్మ
నిన్ను వదలగ ఈమది నిలువ బోదు
అంధకారమై తో రావయ్య సాయి
4
ఎంత చెప్పిన మారదు వింత మనసు
తనకు నచ్చిన దానికి తలను ఊపి
మాను దొరికి మురిసినట్టి మల్లె వోలె
ఎదిగి పోయి నేర్చెను వెక్కిరించ సాయి
5
దాచినంతన ప్రేమలు దాగబోవు
ముల్లెగట్టి మురియ చూడ ముసరి పోవు
మనసు విప్పనంతగనవి మాయమవవు
విప్పి చెప్పి చూడంగను విరియు సాయి
6
సంకట మొకటి వాటిల్లె సంశయముగ
మొదట ఈమది పరుగెత్తి మోస బోయె
తనకు నచ్చిన దెల్ల సొంతమని తలచి
నన్ను విడచి ఎడారిలో నడిచె సాయి
7
మధుర పిలుపుతో తాకిరి మనసునెవరో
మగువయో మణి మాణిక్య మాల ఏమొ
రాగమో బంధమో లేక రాణి చెలిమి
మహిమయో నాకు తెలుపుము మహిత సాయి
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అంజినీదేవి కొడుకు హనుమంతుడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అంజినీదేవి కొడుకు హనుమంతుడు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 4
కీర్తన : అంజినీదేవి కొడుకు హనుమంతుడు
సంఖ్య : 272
పుట : 182
రాగం : మాళవి
కలశాపురంలో వెలసిన హనుమంతునిపైచక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అంజినీదేవి కుమారుడైన ఈ రామబంటు సారెగా సంజీవని పర్వతం తీసికొని వచ్చాడు, అంటున్నారు. సారెగా అంటే పెట్టుబడిగా అని అర్థం చెప్పుకోవాలి. ఉద్ద విడి అంటే చాలా గొప్పగా అని భావించవచ్చును. ఈయన ఆయుధం ఏమిటో తెలుసా? ‘పండ్లగుత్తి’ అంటే ముళ్ళలాంటి పొలుసులున్న గద అన్నమాట. ఆయనతోక కదులుతున్నట్లు భావించగలిగిన ఈ పదకవితాపితామహుడు నిజంగా ధన్యజీవి
భావ వివరణ:
ఓ ప్రజలారా! అంజినీదేవి కుమారుడైన ఈ హనుమంతుడు, రామలక్ష్మణులను రక్షించుటకు సారెగా (పెట్టుబడిగా.. లేక… అర్పణగా) సంజీవినీ పర్వతము తీసికొని వచ్చినాడు.
అల (అదిగో) కలశాపురం అనే ఈ వూరిలో కదలీవనాల నీడ (అరటి తోటల చల్లని నీడలలో) వున్న వాడే హనుమంతుడు. ఈ మహానుభావుడు యెక్కడో కొండల కోనలలో వున్న గుహలో వెలసి, కోరి తన భక్తుల ద్వారా కొలువు చేయించుకొనినాడు. ఈ హనుమంతుడు ఈ రీతిని అలరుచున్నాడు.
పసలుగా (మృదువుగా) జంగవెట్టి (కాళ్ళఅంగజాచి), పండ్లగుత్తి (ముళ్ళవంటి పండ్లు వున్న గదను) చేతిలో పట్టుకొని రాక్షసులనందరినీ ఈ హనుమంతుడు చావబాదినాడు. దివ్యత్వముగల ఈ హనుమంతుడు, ప్రతాపించి (ప్రతాపమును చూపి) తనతోకను వడిన్ కదలించి (వేగముగా వూపి) పాలించీ, దెసలెల్లా (దిక్కులన్నీ ఏలుచున్నాడు).
ఆనాడు త్రేతాయుగంలో ఈయన యేమి చేశాడో తెలుసా? వుద్దవిడి (చాలా గొప్పగా) లంకలోకి చొచ్చి (దూరి) శ్రీరామముద్రికయైన వుంగరమును సీతాదేవికిచ్చి అద్దివో (అదిగో ఆయన శ్రీరామచంద్రుని మెప్పించినాడు. ఈనాడు కలియుగంలో, అటు (ఆ తిరుమల శిఖరాలపై) శ్రీవేంకటేశ్వరునకు బంటై తన భక్తులకు వరమిచ్చి కొద్దిమీర (అశేషముగా) సంతోషములను గుప్పించుచున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీరామచరిత మానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దురాశ దుఃఖములకు చేటు నీతికథ.
దురాశ దుఃఖములకు చేటు
కైకయ రాజైన ప్రతాపభానుడు సద్గుణసంపన్నుడు మరియు గొప్పయోధుడు. అతని ప్రియసోదరుడు అరిమర్దనుడు. అరి మర్దనుడు మహాబలశాలి వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతజ్ఞుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రుని తోటివాడు శ్రీహరి భక్తుడు రాజుకు హితైషి. దిగ్విజయయాత్రలో ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి సమస్త భూమండలమునకు ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన ఆ రాజు గురువులను దేవతలను సాధుసజ్జనులను పితరులను భూసురులను భక్తివిశ్వాసాలతో సేవించుచుండెడివాడు. రాజధర్మములను వేదోక్తముగా పాటిస్తూ నిత్యమూ అనేక దానధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసములను భక్తిశ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులు చెఱువులు ఉద్యానవనాలు దేవతా మందిరాలు కట్టించి ప్రజారంజకముగా రాజ్యపాలన చేసేవాడు.
వనాలలో ఆశ్రమములను నిర్మించుకొన్న మహర్షులు తమ తపశ్శక్తిలో ఆఱవభాగము రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధ ముగా రాజ్యపాలన చేయుచుందురు. కావున లోకహితైషులైన మహర్షులను క్రూరమృగములనుండి కాపాడంటం రాజుల విధి. ఒకసారి ప్రతాపభానుడు వింధ్యాటవికి శాస్త్రప్రకారము చంపదగిన మృగములను వేటాడుటకై వెళ్ళెను. ఆ సుందరారణ్యములో ఒక పెద్ద అడవిపందిని చూసి దానివెంటబడ్డాడు రాజు. ఆ వనవరాహము ఎంత ప్రయత్నించినా తనకి చిక్కలేదు. ఎంతో దూరం పరుగెత్తి ప్రవేశించుటకే దుర్గమమైన ఘనారణ్యములోకి వెళ్ళిపోయింది ఆ వరాహము. ధీరుడైన ప్రతాపభానుడు తనప్రయత్నం మానక ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళుటకు వీలులేక నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మఱలాడు. కాని ఆ ఘోరారణ్యములో దారితప్పిపోయాడు.
ఆ వనములో తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమము ఒక కపటసన్యాసిది. ఆ కపటవేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధములో ఓడిపోయి పాఱిపోయిన శత్రురాజు. హృదయములో ప్రతాపభానునిపై ద్వేషమును నింపుకొని ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే అతనిని గుర్తు పట్టాడు. కానీ అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు వాడిని గుర్తించలేదు! దాహముతో బాధపడుతున్న రాజుకు ఒక సరోవరం చూపించాడు. ప్రతాపభానుడు సరోవరములో స్నానముచేసి శుచి అయ్యి నీరు త్రాగినాడు. ప్రతాపభానుని ఆశ్రమములోపలికి ఆహ్వానించాడు ఆ కుహనాసన్యాసి.
“నాయనా! నీవెవఱు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరాటవిలోకి ఎందులకు వచ్చావు”? అని అడిగినాడు కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడిలా సమాధానమిచ్చినాడు “ఓ మహాత్మా! మీ సహాయమునకు కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి తప్పిపోయాను. నీ దర్శభాగ్యము కలుగుట నా అదృష్టము”. “ఓ సజ్జనుడా! బాగా చీకటి పడినది. నీ రాజ్యము ఇక్కడికి డెబ్బది యోజనములున్నది. కావున నీవు ఈ రాత్రికి నా ఆశ్రమములో విశ్రాంతి తీసుకుని తేపు వెళ్ళు” అని చెప్పాడు ఆ కపటుడు. సన్యాసి దయాగుణాలను ఎన్నో విధాల పొగిడి ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు.
మాయమాటలతో రాజును తనను నమ్మేలా చేసి ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపట సన్యాసి నిర్మలుడైన ప్రతాపభానుడు ఆర్థించుటచే తన వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు “సోదరా! వినుము. నేనిచట చాలా కాలముగా ఉంటున్నాను. ఇంతవఱకూ నా వద్దకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధముచేసే అగ్నివంటిది కాదా! అందుకనే ప్రపంచానికి దూరముగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప నాకింకెవరితోను పనిలేదు”. వైరాగ్యబుద్ధి కలిగి శ్రీహరిభక్తుడై ఉన్నాడని తెలియగానే ప్రతాపభానునికి ఆ బకధ్యానిమీద గౌరవం పెరిగిపోయింది. ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడైనాడని తెలుసుకొని “పుత్రా! నా పేరు ఏకతనుడు.
సృష్టిప్రారంభములో నేను జన్మించాను. తరువాత మఱియొక దేహము దాల్చలేదు అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యముగా వింటున్న ప్రతాపభానునికి అప్పుడు కపట సన్యాసి ఎన్నో ప్రాచీనగాథలు పురాణేతిహాసములు సృష్టిస్థితిలయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు. జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడై రాజు “స్వామీ! నేను ప్రతాపభానుడను” అని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతి మెచ్చుకుంటున్నాను. తెలియని వానితో పేరు చెప్పిన రాజ్యమునకే అపాయము అని తెలిసి నీవు ఇందాక నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు ఆ కపటసన్యాసి.
సద్గుణ సంపన్నుడైనా ప్రతాపభానునకు ఒక తీరనికోరిక ఉండేది. దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతున్న ఆ రాజు ఇలా కోరాడు “ఓ దయాసాగరా! నా శరీరము జరామరణదుఃఖ రహితమగుగాక. యుద్ధములో నన్నెవరూ జయింపకుండు కాక. భూమిపై నూఱుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యము నిలిచియుండుగాక”. ధర్మరుచి ప్రభావము వలన తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి “సర్వం కృష్ణార్పణమ్” అని అంటున్నా ప్రతాపభానుడు ఆ సూక్తిలోని ఆంతర్యమును అర్థంచేసుకోలేదు. పూర్వం హరణ్యకసిపుడు కోరిన వరము వెలెనున్న ఈ దురాశాభూయిష్టమైన వరమును కోరినాడు. నిజమైన సన్యాసి అయితే ఈ కోరిక విని “నాయనా! ఈ శరీరము శాశ్వతము కాదు.
ఎందులకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ కపటుడగుటచే ఆ సన్యాసి “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండి కాపాడతాను. నా ప్రభావం వల్ల యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ ఒక్క విప్రశాపం నుండి నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురూత్తమా! విపులను ప్రసన్నము చేసుకునే ఉపాయము దయతో నాకు నెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే. కానీ నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా చెపితే నీకు బహుదుఃఖములు కలుగుతాయి. నీ మంచి కోరే చెపుతున్నాను. మూడోకంటికి ఈ విషయము తెలిసిందా నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.
“గురువర్య! త్రిమూర్తులు కోపగించినా గురు రక్షిస్తాడు కానీ గురువే కోపిస్తే రక్షించేవాడుండడు. మీ ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞ ఇప్పండి. శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. ఆహా! ఆశ ఎంత దారుణమైనది! ఇన్ని ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని ప్రసాదించిన తన నిజగురువును ఒక్క నిమిషములో వదిలేసి కపట సన్యాసి గురించి ఏమీ తెలియకుండానే వాడిని నమ్మి “గురూత్తమా!” అని సంబోధించేలా చేసింది. అప్పుడు ఆ బకధ్యాని “విపులను స్వాధీనపఱచుటకు అనేక మార్గములు కలవు. నీకు అన్నిటికన్నా సులభ మార్గము చెప్పెదను. ఒక సంవత్సరముపాటూ ప్రతిరోజు లక్షమంది ఉత్తములైన విపులను కుటుంబసహితముగా అహ్వానించు. నేను నా తపశ్శక్తిచే మీ పురోహితుని వేషముదాల్చి వారికి వండిపెట్టెదను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తిచే నిన్ను నీ అంతఃపురములో చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత నీ పురోహితుని రూపములో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లు చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి బాగా అలసిపోయినందు వలన గాఢనిద్రపోయాడు.
ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతు రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము దాల్చి ప్రతాపభానుని దారిమఱల్చినాడు. స్త్రీలను సజ్జనులను దేవతలను హింసిస్తున్న కాలకేతు నూర్గురుకుమారులను పదిమంది సోదరులను యుద్ధములో చంపి దుష్టసంహారం చేశాడు. ప్రతాపభానుడు. దీనిని గుర్తుపెట్టుకుని అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసి కాలకేతువు కలిసి నాటకమాడి ప్రతాపభానుని నాశనం చేయదలచారు! కాలకేయుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురంలో చేర్చి పురోహితుని ఒక గుహలో బంధించి తానే పురోహితునిగా కామరూపం ధరించాడు. తరువాతరోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని తాను అంతఃపురములో ఉన్న విషయము గ్రహించి ఆ కపటసన్యాసి శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మూడురోజులు క్షణమొక యుగముగా గడిపినాడు. శ్రీహరి ధ్యానం వదిలి ప్రతిక్షణం ఆ కుహనాసన్యాసి పాదాలనే ధ్యానించసాగినాడు.
అనుకున్న ప్రకారం లక్షమంది ఉత్తమ విపులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనాపురోహితుడు తన మాయచేత లెక్కలేనన్ని వ్యంజనములు నాలుగురకాలైన పంటలను పాకశాస్త్రమును అనుసరించి షడ్రసోపేతముగా సిద్ధంచేసినాడు. కానీ వానిలో అనేకజంతువుల మాంసములేకాక బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించినాడు. భోజనార్ధము విప్పులు సిద్ధమగుతుండగా కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి “ఓ విప్రోత్తములారా! ఈ భోజనము హానికరము. దీనిలో జంతువిప్రు మాంసమున్నది. దీనిని భుజింపవద్దు” అని పలికించెను. ఆకాశవాణి వినగానే ఆ లక్షమంది విపులు “ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భృష్టులను చేయ తలచితివి. నీవు కుటుంబ సహితముగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరములో నీవు నీవంశంతో సహా నశిస్తావు.
మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి సఫలమైనదని కాలకేతుడు కపటసన్యాసి సంతోషించారు. కపట సన్యాసి శత్రురాజులందఱిని కూడబెట్టుకోని ప్రతాపభానునిపై దండెత్తినాడు. వీరుడైన రాజు అరిమర్దనుడు ఎంతో కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత తన వంశముతో సహా ప్రతాపభానుడు నశించినాడు. కొలది కాలము తరువాత వారందఱూ రాక్షసులై జన్మించినారు. ప్రతాపభానుడు రావణునిగా అరిమర్దనుడు కుంభకర్ణునిగా ధర్మరుచి విభీషణునిగా జన్మించిరి. ఒకానొక కల్పములో శ్రీరామావతారమునకు ఇదియే నాంది.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
మానవునకు ఆశ ఉండవచ్చు. కాని “అతి సర్వత్ర వర్ణతే”. సమస్త భూమండలానికి ఏకచ్ఛత్రాధిపతి అయికూడా ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి చివరికి నాశనమైనాడు.
మన శాస్త్రాలలో గురువుని ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి ఉత్తముడైన వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు తన దురాశ వలన ఒక్క రాత్రి పరిచయంతోనే కపటుని గురువుగా స్వీకరించాడు.
బహిశ్శత్రువులైనా అంతశ్శత్రువులైనా (కామ క్రోధాదులు) హాని చేయకమానవు. కావున ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి. ప్రతాపభానుడు శత్రువులైన కాలకేతు కపటసన్యాసులను గమనించక వారిచేత మోసగించబడినాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చాతక పక్షి దీక్ష నీతికథ.
చాతక పక్షి దీక్ష
అది గ్రీష్మం. సూర్యుడు నడినెత్తిన ఉండి ఠీవిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగనతలంలో ఎగురుతోంది. పసి చాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి. తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది. నేల పై ఒక పెద్ద మఱి వృక్షం కనబడింది. దాని పేరు బొఱియలలో ఎలుకల చీమల పుట్టలు. తొఱఱ్ఱలలో పాములు. కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు. నేలమీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను తరింపచేయగలడు!
సామాజిక విలువ తేలిసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో “అయ్యో పాపం! వాటికి ఇల్లు లేదే” అన్నాయి. “ఇన్నాళ్ళకికదా మా జీవనం సార్థకమైనది. మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి” అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి.
ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. “ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది?” అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతిచెంది “ఔరా!” అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలూ దీక్షా రూపం అని కళ్ళతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపినాయి. చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. ఈ స్వాభావిక గుణాన్ని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉండాలనుకున్నది.
జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు. హంస తామర తూళ్ళనే తింటుంది. అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. అందుకే ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకి కేవలం వెన్నెల ఆహారం. అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవీ అతనికి అక్కరలేదు!
పుత్రోత్సాహం తల్లితండ్రులకు తమ పిల్లలు నలుగురికీ ఉపయోగపడ్డప్పుడు కాని పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తుచేశాయి పక్షులు. తమ పిల్లలు ఎదుటివారి కష్టాలని చూసి “అయ్యో పాపం!” అని జాలిచూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
శ్రీ ఆదిలక్ష్మీ దేవి ఒక ప్రముఖ హిందూ దేవత. ఆమె లక్ష్మీ దేవియొక అవతారము. ఈ దేవి అమ్మవారిని ఆదిలక్ష్మీ అని పిలుస్తారు, అమ్మవారు సృష్టిచేసిన ప్రపంచమును తన సృష్టివిస్తారు అని నమ్ముతారు. ఆదిలక్ష్మీ ఆది లక్ష్మిని పిలుస్తుంది మరియు ఆమె దేవతల మొదటి మూర్తి. ఆదిలక్ష్మీదేవి పరమేశ్వరుడు వారిపై ఆశీర్వచనం ప్రసాదిస్తారు మరియు ఐశ్వర్యము మరియు భక్తులకు మహిమా ప్రదానం చేస్తారు. ఆమె శ్రీ విష్ణు సహితముగా సాయంకాలం పూజించబడుతారు మరియు ఆదిశేషుడు ఆమెని సాయంకాలం కనిపించే విధంగా ఉండాలి. ఆదిలక్ష్మీ సాయంకాలం మందిరాలలో ఆలంబనముగా ఉంటారు. ఆమె ఐశ్వర్యముతో లోకమును ఆకర్షించే విధంగా ఉంటారు.
వరములు నీవియ్యఁగా వచ్చి సేవించుటగాని
కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌటగాని
ఆరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు
||సర్వే||
అవతారిక:
భూమి మీద ఇంతమంది ‘దేవుడు’ అని కొలిచే వాడిని చూసిందెవరు? పోనీ ఆ దేవుడి మాటలను విన్నదెవరు? పూర్వము వారు చెప్పగా ఔనేమో అనుకోవడమే కాని ఆయన అనుభవం పొందినవాడెవడు? సర్వేశ్వరుడైన ఆయనతో సరియైనవారు లేరు. ఆయననుంచి ఏవో వరాలు ఆశించి సేవించే వారేగాని వారేగాని ఆయనను తెలుసుకోవాలని తెలుసుకోవాలని వెదకేవారేలేరు అంటున్నారు అన్నమాచార్యులవారు. ఇదికూడా తేలిక అనిపించే అతి క్లిష్టమైన కీర్తన. ఈ కీర్తన పాడినప్పుడు ఆచార్యులవారి మనోభావాలు సులభగ్రాహ్యం అనిపించుటలేదు. జాగ్రత్తగా పరిశీలిద్దాం.
భావ వివరణ:
ఓ సర్వేశ్వరా! నీతో సరియైన వారలెవ్వరు? పూర్వపువారు (మా పెద్దలు) చెప్పగా ఔనేమో నని పూచి (ప్రయత్నపూర్వకంగా) కొలుస్తున్నాను. కానీ నిన్ను తెలుసుకోలేకున్నాను.
ప్రభూ! వేదము నీగురించి వర్ణించగా వినుటయే కాని నీ రూపమును దర్శించినవారలెవ్వరు? ధారుణి (భూలోకంలో) నీయవతారాలను చూచిన వారు ఆయా యుగాలలో వున్నారేమో గాని ధీరతతో (గాఢమైన నమ్మకంతో) నీ మహిమను తెలిసినవారెవ్వరు?
దేవా! ఈ భూమి మీద వున్న మాతోడి మానవులనుచూచి వారుచేసినట్లే నిన్ను పూజిస్తున్నాను. నిజానికి కావాలని ప్రయత్నించి నీతో మాట్లాడిన మానవమాత్రుడెవడు? అంతటి ఘనులెవ్వరైనా ఉన్నారా? దీమసాన (నేర్పుతో) నీదాసులయొక్క ద్రిష్టము (అదృష్టము) యెంతగొప్పదో తెలుసుకోవటమేకాని, యీమేర (వైపున నీ దైవికము (దివ్యశక్తిని) యెరిగే వారెవరున్నారు? అనుభవేక వేద్యమైన నీ మహిమ తెలియుటెట్లు సాధ్యము?
దేవా! నీవు కోరిన వరములిస్తావనే ఆశతో దూరభారమునెంచక నీవద్దకు వచ్చి సేవించేవారేగాని, కెరలి (అతిశయించి) నీ మూర్తిని (దివ్యమంగళ రూపాన్ని) వెదకే వారెవ్వరున్నారు? ఓ శ్రీహరీ! ఓ శ్రీవేంకటేశ్వరా! అంతా నీ కరుణ పొందాలనుకొనేవారే కాని, నిన్ను అరసి (నీపై దృష్టి సారించి) నీ సుద్దులు (నీపుణ్యకథలు) అడిగేవారెవ్వరు? (వినాలని తహతహలాడేదెవరు?) హతవిధీ! నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా వున్నది తండ్రీ!
రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆ విభుని సీతఁ గూర్చి అయోధ్యనుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు
||కల|| 216
అవతారిక:
కలశాపురములో వెలసిన హనుమంతునిపై చక్కటి కీర్తన చెబుతున్నారు అన్నమాచార్యులవారు. వాయుసుతుడైన ఈ హనుమంతుడు తన భక్తులకు కావలసిన వరములనిస్తున్నాడు. ఆయన అందుకోసమే కాచుకొనివున్నాడు అంటున్నారు. ఆ హనుమంతుడు సీతను రామచంద్రుని కలిపి అయోధ్యనుంచే శ్రీవేంకటేశుని గొల్చి శిష్టరక్షణకై వావిరి నిలుచున్నాడట. అంటే ‘అధికుడై” నిలుచున్నాడట. పనిలోపనిగా హనుమంతుని ప్రతాపాన్ని వివరించే రామాయణ అంతర్గత కథలను వుటంకిస్తున్నారు.
భావ వివరణ:
ఈ వాయునందనుడైన హనుమంతుడు, కలశాపురము వద్ద కాచుకొని యున్నాడు. (నిరీక్షించుచున్నాడు). శ్రీరామ భక్తులకు, తనను నమ్మిన భక్తులకు ఆయన లెక్కకు మించిన వరములను అనుగ్రహించుచున్నాడు.
సీతాన్వేషణ సమయంలో మాయాబిలం (గుహ)లో ప్రవేశించిన వానరులు దిక్కుతోచక అల్లాడుతుంటే, ఆపద్భాంధవుడై ఆదుకొన్నదీ హనుమంతుడే. మగుడి (తదనంతరం) అంబుధి దాటే సమయంలో ‘సింహిక’ నీడ వలె తననాక్రమించి రామకార్య విఘాతమునకు వొడిగడితే దానిని చంపివేశాడు. లంకలో లంకిణిని ఒక్క గుద్దుతో మట్టి కరిపించాడు. అంతలో జగన్మాత జానకీదేవిని అశోకవనంలో చూచి రామకార్యం నెరవేర్చి వాయువేగాన తిరిగివచ్చి కపివర్యుల ప్రాణాలు నిలబెట్టాడు. ఈ వాయునందనుడు జగజ్జెట్టి.
ఆపైన కడలి దరి నుండిన కపులతో (సముద్రం ఒడ్డున తనకోసం నిరీక్షిస్తున్న వానరులతో) గూడుకొని (కలసి) వడదీరగ (అలసటనుపశమించుటకు) మధువనము ప్రవేశించి నానా అల్లరి చేశాడు. అటు పిమ్మట సత్వరమే రామునికి సీతాదేవి పరిణామము (వర్తమానము) నెల్లా వివరించాడు. ఈ వాయునందనుడు వడిగలవాడు (చాలా వేగము కలవాడు).
ఆ వెనుక జరిగిన రామరావణ యుద్ధంలో ఈయన పాత్ర మరువలేనిది. రావణాది రాక్షసులనందరిని రామునిచేత సాధింపించినవాడు (నెగ్గుటకు దోహదపడినవాడు) ఈయనే. ఆ విభునికి (శ్రీరామచంద్రునకు) సీతను గూర్చి (కలిపి) అయోధ్యలోవుంచి (పునః ప్రతిష్ఠించినాడు). నేడు ఈ కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై నిలిచిన తన రాముని గొల్చుచున్నవాడై ఈనాటి ఆవశ్యకతననుసరించి శిష్ట రక్షణకై (సన్మార్గులను సంరక్షించుచూ ఈ వాయునందనుడు కలశాపురములో వావిరి (అధికుడై) నిలుచునియున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు తొలి ఏకాదశి విశిష్టత, తొలి ఏకాదశి పండుగ ఎందుకు జరుపుకుంటారు, మరియు తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం.
పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.
తొలి ఏకాదశి విశిష్టత
సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తరువాత వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మన పండగలన్నీ దీంతోనే మొదలవుతాయి. లోకంలో మోక్షగాములైన వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే నాలుగు నెలలపాటు పుణ్య తిధులుగా భావించి ‘దేవశయని’ అనే వ్రతాన్ని చేస్తారు. సన్యాసులు, యతీశ్వరులు మొదలైన వారు కూడా ఈ కాలంలో ప్రయాణం చేయకుండా ఒక చోట స్థిరంగా ఉంటారు. దీన్నే ‘చాతుర్మాస్యము’ అంటారు.
ఒక రోజున ధర్మరాజుకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మోక్షగాములు దేవశయని వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి? ఇదే సమయంలో చాతుర్మాస్యము చెయ్యటానికి గల కారణాలేవి? తన అనుమానాన్ని తీర్చే వారెవరున్నారు? అని ఆలోచించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరి వల్లా కాదని నిశ్చయించుకున్న వాడై, భగవానుడి దగ్గరకు వెళ్ళి ‘ఓ పరంధామా! పరాత్పరా! దేవశయని వ్రతాన్ని, చాతుర్మాస దీక్షను గురించి నాకు వివరించ వలసినది’ అని ప్రార్థించాడు. ధర్మజుని ప్రార్ధన ఆలకించిన భగవానుడు ఈ రకంగా చెప్పటం ప్రారంభించాడు.
‘ధర్మనందనా! ఆషాఢ శుద్ధ ఏకాదశి నే దేవశయనీ ఏకాదశి’ అని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా ఈ రోజున దేవశయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజే చాతుర్మాస్యము కూడా ప్రారంభమవుతుంది.
సూర్యుడు కర్కాటకరాసి లోనికి వచ్చిన తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువును పవళింప చెయ్యాలి. సూర్యుడు తులారాసిలో ప్రవేశించిన తరువాత అనగా కార్తీక మాసంలో తిరిగి ఆయనను మేల్కొల్పాలి. ఈ నాలుగు నెలల కాలము శ్రీహరి నిద్రావస్థ లో ఉంటాడు. ఇది వర్షా కాలము. అందుచేత యతీశ్వరులు, సన్యాసులు దేశాటన చెయ్యటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక బోధలు చేస్తుండాలి. ఇదే చాతుర్మాస్యము.
రాజా! ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు ప్రతిమకు పంచామృతా లతో చక్కగా స్నానంచేయించి, సుగంధ లేపనము కావించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, ‘దేవదేవా! వర్షాకాలము నాలుగు నెలలు దాట నువ్వు తిరిగి, మేల్కొనే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులూ లేకుండా ఈ వ్రతము పూర్తి అయ్యేటట్లు గా అనుగ్రహించ వలసినది’ అని ప్రార్థించి రెండు వైపులా తలగడతో, తెల్లని వస్త్రముతో శయ్యను ఏర్పాటుచేసి, ఆమహానుభావుని శయనింప చెయ్యాలి. ఆయన నిద్రిస్తే ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. ఆయన మేల్కొన్నప్పుడే ఈ జగత్తు మేల్కొంటుంది.
పాండవాగ్రజా! ఈ వ్రతాన్ని ఆషాడ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అష్టమి లేదా కర్కాటక సంక్రమణం జరిగిన రోజున ప్రారంభించి నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిన పూర్తిచెయ్యాలి. ఈ వ్రతం ఆరంభించటానికి మంచి చెడులతో పని లేదు. జనన మరణాల వలన కలిగే శౌచా శౌచములు చూడవలసిన పనిలేదు. స్త్రీ పురుష భేదము అంతకన్నా లేదు. ఈ వ్రత మాచరించిన వాడు మరణించిన తరువాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ, సూర్య తేజముగల విమాన మెక్కి విష్ణు లోకం చేరతాడు.
చాతుర్మాస్య వ్రతం అనేక రకాలుగా ఆచరిస్తారు.
ప్రతి రోజూ దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి, నీళ్ళు చల్లి ఆవుపేడతో అలికి రంగవల్లులు తీర్చి దిద్దిన వాడు ఏడు జన్మల వరకు శ్రేష్ఠమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్య ధర్మ పరాయణుడవుతాడు.
ఈ నాలుగు నెలలూ శ్రీమహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించినవాడు మరణానంతరము విష్ణులోకానికి వెళ్ళి సారూప్య ముక్తి పొందుతాడు. అంటే లక్ష్మీదేవి, శ్రీవత్సము, సృష్టి స్థితి లయ సామర్థ్యము తప్ప రూపు రేఖలు, భక్తుల కోరికలు తీర్చటములో శ్రీహరి రూపంలోనే ఉంటాడు.
ఈ సమయంలో ఉత్తముడైన బ్రాహ్మణునికి భూదానం గాని, సువర్ణ దానం గాని చేసిన వాడు ఈ లోకంలో ఇంద్ర భోగాలనుభవించి, మరణానంతరము విష్ణులోకం చేరతాడు.
చాతుర్మాస్యంలో ప్రతిరోజూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భగవంతు డికి నైవేద్యం సమర్పించేటప్పుడు బంగారు తామర పువ్వును సమర్పించిన వాడు ఈ లోకంలో అనంతమైన భోగాలనుభవించి, చివరకు స్వర్గం చేరతాడు.
ఈ సమయంలో ప్రతిరోజూ హరిని తులసి దళాలతో అర్చించి, బంగారు తులసి దళము దానం చేసినవాడు విష్ణులోకం పొందుతాడు.
వ్రత సమయంలో భగవంతునికి ధూప దీపాలు సమర్పించి, వ్రతాంతమున దీపపు కుందులు దానం చేసినవాడు గొప్ప శ్రీమంతుడవు తాడు. సకల సౌభాగ్యాలు పొందుతాడు.
ఈ కాలంలో ప్రతి రోజూ రావి చెట్టుకు గాని, శ్రీమహావిష్ణువుకు గాని ప్రదక్షిణలు చేసినవాడు వైకుంఠం చేరతాడు.
వ్రత సమయంలో ప్రతి రోజూ సాయంత్రం దేవుని సన్నిధిన దీపారాధన చేసి, వ్రత సమాప్తిన వస్త్రము, బంగారము, దీపపుకుంది. దానం చేసినవాడు ఈ లోకంలో మహా తేజస్వి అవుతాడు. మరణా నంతరము వైకుంఠంచేరతాడు.
శ్రీమహావిష్ణువు పాదోదకాన్ని పానంచేసినవాడు విష్ణులోకం పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు.
ఈ సమయంలో ప్రతిరోజూ మూడు వేళలా దేవాలయంలో 108 గాయత్రీ జపం చేసిన వాడికి పాపాలు అంటవు.
చాతుర్మాస్యంలో ప్రతిరోజూ పురాణ శ్రవణంచేసి, వ్రతసమాప్తి యందు పుస్తకము, వస్త్రము, బంగారము దానంచేసినవాడు సకల భోగాలు అనుభవిస్తాడు.
చాతుర్మాస్యంలో శివనామం కాని, కేశవ నామంకాని జపంచేసి, వ్రత సమాప్తిన బంగారపు శివ ప్రతిమగాని, విష్ణు ప్రతిమగాని దానంచేసిన వాడికి మహాపుణ్యము లభిస్తుంది.
స్నాన సంధ్యాది నిత్యకృత్యాలు పూర్తిచేసి సూర్యమండల మధ్య వర్తి అయిన శ్రీమన్నారాయణునికి అర్ఘ్యమిచ్చి, వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రము, బంగారము, గోవును దానం చేసినవాడు పరిపూర్ణ … ఆరోగ్యవంతుడవుతాడు. చిరాయువౌతాడు.
ప్రతిరోజూ అన్నహోమము చేసి, వ్రతాంతమందు నేతితో నిండిన కుండను, మంచి వస్త్రమును దానంచేసినవాడు మంచి ఆరోగ్యము, శరీరచ్ఛాయ, పుత్రపౌత్రాది సంపద కలిగి బ్రహ్మదేవునితో సమానుడౌతాడు.
ప్రతిరోజూ అశ్వత్థ వృక్షాన్ని పూజించి, ఆఖరు రోజున వస్త్రము, బంగారము దానంచేసిన వాడు మంచి ఆరోగ్యవంతుడవుతాడు.
ప్రతిరోజూ తులసిని పూజించి, తులసి దళాలను ధరించినవాడు సర్వపాపములనుండి విముక్తుడై విష్ణులోకము పొందుతాడు.
ప్రతి. దినము గరికెను పూజించి శిరస్సున ధరించి, వ్రతాంతమున బంగారు గరికె దానంచేసిన వాడు సర్వపాపములనుండి విముక్తుడవు తాడు, స్వర్గాన్ని పొందుతాడు.
చాతుర్మాస్యములో శివకేశవులలో ఎవరిని ధ్యానించినా పుణ్య ఫలము వస్తుంది.
ప్రతి దినము విష్ణు పాదోదకము పారాయణచేసిన వాడు సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు. అతని ఆయువు, సంపద వృద్ధి పొందుతాయి. వ్రత సమాప్తిన గోదానము చెయ్యాలి. లేకపోతే వస్త్రదానం చెయ్యవచ్చు.
వేదవిదులైన బ్రాహ్మణులను పూజించాలి. వ్రతసమాప్తిన బ్రాహ్మణ సమారాధన, అన్నదానము చేసినవాడు ఆయుర్దాయము, ధనము పొందుతాడు.
కపిల గోవును అర్చించి, ప్రదక్షిణలు చేసినా, దానమిచ్చినా గోవు శరీరం మీద ఎన్ని రోమములున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.
ప్రతి దినము గణపతిని, సూర్యుని అర్చించినవాడు ఆయురా రోగ్య ఐశ్వర్యములు పొందుతాడు. గణపతి అనుగ్రహముతో అతడి అభీష్ట ములు సిద్ధిస్తాయి. అన్నిచోట్లా విజయం సిద్ధిస్తుంది.
చాతుర్మాస్యములో వర్ష ఋతువు, శరదృతువు రెండు ఉంటాయి. ఈ రోజులలో శివ ప్రీతికి రజత దానం చెయ్యాలి. అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితం కావలసిన వారు తేనె తో నిండిన వెండి పాత్రను, లేదా బెల్లంతో నిండిన రాగి పాత్రను దానం చెయ్యాలి.
వ్రత సమాప్తి యందు శయ్యా దానము చేసిన వారు శాశ్వత మైన సుఖం పొందుతారు.
వర్షా కాలములో ప్రతి రోజూ గోపీ చందనము దానం చేసిన వాడికి భుక్తి, ముక్తి రెండు లభిస్తాయి.
ప్రత సమాప్తిన గోపీచందనము, నూతన వస్త్రములు దానం చేసిన వారికి సకలైశ్వర్యములు లభిస్తాయి, చివరకు సాయుజ్యం కలుగుతుంది.
ప్రతి రోజు పంచదార లేదా బెల్లము దానంచేస్తే భుక్తి, ముక్తి కలుగుతుంది.
చాతుర్మాస్య వ్రతం పూర్తి అయిన తరువాత ఉద్యాపనకు ఎనిమిది లేక నాలుగు పలములు బరువుగల ఎనిమిది, నాలుగు లేదా ఒక రాగి పాత్ర నిండా చక్కెర పోసి, పాత్రపైన వస్త్రము, దక్షిణ ఉంచి నవ ధాన్యాలతో, లేదా పిండి వంటలతో ప్రతి పాత్రను దానంచెయ్యాలి. దానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదవాలి.
చక్కెరతో కూడిన రాగిపాత్ర సూర్యుడికి ప్రీతికరమైనది. సమస్త రోగాలను నశింప చేస్తుంది. పాపాలను పోగొడుతుంది. పుష్టిని, కీర్తిని ఇస్తుంది. దీని దానము వలన సంతానము కలుగుతుంది. సర్వాభీష్టములు నెరవేరతాయి. స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అటువంటి పాత్రను నేను దానం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగు గాక.
ధర్మనందనా! ఇప్పుడు వ్రత ఉద్యాపన ఫలితము చెబుతాను వినవలసినది.
చాతుర్మాస్య వ్రతం చేసిన వాడికి సంగీత ప్రావీణ్యం కలుగు తుంది. లోకంలోని స్త్రీలందరూ అతన్ని ప్రేమిస్తారు. అతడికి రాజ్యం కావాలంటే రాజ్యము,సంతానము కావాలంటే సంతానము లభిస్తుంది. ధనం కావాలంటే ధనం లభిస్తుంది. చివర కతడు మోక్షము పొందుతాడు. చాతుర్మాస్యములో ప్రతిరోజు కూరగాని, కందమూలాలుగాని, ఫలములుగాని దానంచేసి వ్రత సమాప్తిన వస్త్ర దానం చేసిన వాడు రాజయోగి అవుతాడు.
శాకము దేవతలకు ప్రీతిని మానవులకు తృప్తిని కలిగిస్తుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్టా! అట్టి శాకము నీకిస్తున్నాను. కాబట్టి దేవతలు నాకు శుభమును చేకూర్తురుగాక అంటూ శాక దానంచెయ్యాలి. ప్రతిరోజూ త్రికటుకములు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలాచేస్తే సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు. అన్ని రోగాలు నశిస్తాయి.
ఈ రకంగా ప్రతిరోజూ త్రికటుకాలు దానంచేసి వ్రత సమాప్తిని బంగారంతో చేసిన త్రికటుకలు, వస్త్రము దక్షిణలతో దానంచేసి ఉద్యా పన చేసిన వాడు నూరు సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో జీవిస్తాడు, చివరకు స్వర్గం చేరతాడు.
చాతుర్మాస్యంలో నిరంతరము మంచి ముత్యములు దానం చేసిన వాడికి అన్న వస్త్రాలకు లోటురాదు. ప్రతి దినము అన్నం దానం చేసిన వాడు అష్టశ్వర్య సంపన్నుడు, కీర్తిమంతుడు అవుతాడు. ప్రతి దినము తాను తాంబూలము సేవించకుండా, ఇతరులకు తాంబూల దానం చేసి, వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రములు దానం చేసినవాడు మహా లావణ్యవంతుడవుతాడు. అతడికి ఏరోగాలు రావు. మంచి మేధావి అవుతాడు. గాత్ర మాధుర్యముగల వాడవుతాడు. మరణానంతరము గంధర్వు డవుతాడు. తాంబూలము లక్ష్మీ ప్రదమై నది. అందులోని ఆకు, వక్క, సున్నము త్రిమూర్తుల స్వరూపము. అందుచేతనే తాంబూల దానం చేసిన వారికి త్రిమూర్తులు సకల సంపద లను ఇస్తారు.
ఈ సమయంలో ప్రతి రోజూ పసుపు దానం చేసి, ప్రతసమాప్తిని క్రొత్త వెండి పాత్రలో పసుపుపోసి దానం చేసినట్లైతే ఆస్త్రీ లేక పురుషుడు సర్వసుఖాలు అనుభవిస్తారు. వారికి సౌభాగ్యము, అస్టెశ్వర్యాలు కలుగు తాయి. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు మంచి రూప లావణ్యాలతో దేవ లోకంలో సుఖిస్తారు.
ఈ కాలంలో ఉమా మహేశ్వర స్వరూపంగా భావించి, విప్ర దంపతులను పూజించి, వారికి శక్త్యాను సారము సువర్ణ దానంచేసి, వ్రత సమాప్తి యందు ఉమా మహేశ్వరుల బంగారు ప్రతిమను చేయించి దానిని పూజించి దానం చెయ్యాలి. తరువాత రుచికరమైన పిండి వంట లతో భోజనం పెట్టాలి. అలా చేసిన వాడి సంపత్తి సురక్షితంగా ఉంటుంది. మంచి కీర్తి కలుగుతుంది. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి అంత మందు కైలాసం చేరతాడు. ప్రతి రోజూ ఫల దానం చేసి వ్రత సమాప్తిన వెండి ఫలమును దాన మిచ్చిన వాడి కోరికలు అన్నీ తీరతాయి. అతడు స్వర్గాన్ని చేరతాడు. బంగారు పుష్పములు దానం చేసినవాడు ఈ లోకంలో శ్రేష్ఠమైన సౌభాగ్యము పొంది, చివరకు గంధర్వ లోకం చేరతాడు.
వ్రత సమయంలో ప్రతిరోజూ దధ్యాన్నము దానం చెయ్యాలి. – అంత శక్తి లేకపోతే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, ఆది వారము, శుక్రవారములందు దధ్యాన్నము దానం చెయ్యాలి. ప్రత సమాప్తిన గోదానం గాని, భూదానంగాని, వస్త్ర దానం గాని చేసినట్లైతే అతడికి . అక్షయమైన అన్నం దొరుకుతుంది. పుత్ర పౌత్రాది వృద్ధి కలుగుతుంది. అంతమందు కైలాసం చేరతాడు.
చాతుర్మాస దీక్షను కేవలము కూరలు, దుంపలు, ఫలములతో గడిపి ఆఖరున గోదానం మిచ్చినట్లైతే అతడు వైకుంఠం చేరతాడు. కేవలము పాలు త్రాగి ఈ వ్రతమాచరించి, ప్రత సమాప్తిన గోదానం చేసి నట్లైతే అతడు బ్రహ్మలోకం పొందుతాడు.
చాతుర్మాస్యములో ప్రతిరోజూ అరటి ఆకులలో భోజనం చేసి చివరన వస్త్రములు, కంచుపాత్ర దానంచేసినట్లైతే అతడు గొప్ప సుఖములు పొందుతాడు. ప్రతి రోజూ మోదుగ ఆకులలో భోజనం చేసినవాడి పాపాలు సర్వము హరించివేయబడతాయి. ఈ వ్రతమాచరించిన వాడికి బ్రహ్మ హత్యా పాతకము, సురాపానము, శిశు హత్య, భ్రూణ హత్య, స్త్రీ హత్య, అసత్యము, పొందరాని స్త్రీలను పొందటము వంటి వాటి వలన కలిగే పాపాలు కూడా హరించుకు పోతాయి.
వ్రత సమాప్తి యందు సారవంతమైన భూమిని దానంచేసిన వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చివరకు వైకుంఠం చేరతాడు. ఎప్పుడూ ఏదీ అడగని విప్రునకు, సువర్ణము, చందనముతో వృషభ దానం చేసినవాడు జ్ఞానము, మోక్షము పొందుతాడు. ఈ సమయంలో ప్రతి రోజూ పగలు ఉపవాసముండి రాత్రికి భుజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. అలా చేసినవాడు కైలాసం చేరి మహా సుఖాలనుభవిస్తాడు.
చాతుర్మాస్యములో ఏకభుక్తం చేసి, వాసుదేవుని పూజించినవాడు స్వర్గలోకం చేరతాడు. ప్రతి రోజూ భూమి పైనే శయనించి, వ్రతాంతమున శయ్యాదానం చేసినవాడు శివలోకంలో గొప్ప సుఖాలనుభవిస్తాడు. ఈ కాలంలో పాయసము, తేనె, ఉప్పు, నేయి, ఫలములను విసర్జించి, కార్తీక పూర్ణిమిన వీటిని దానమిచ్చిన వాడు రుద్రలోకం పొందుతాడు.
ఈ నాలుగు నెలలు తలస్నానం చెయ్యకుండా, గోళ్ళు కత్తిరించ కుండా శ్రీ మహావిష్ణువును పూజించినవాడు విష్ణులోకం పొందుతాడు. ఈ కాలంలో కూరలను పూర్తిగా వదలివేసి వ్రతాంతమునందు వెండి పాత్రతో పాటుగా పది రకాల కూరలు, వస్త్రములు దానంచేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది.
ఈ కాలంలో గోధుమలను తినకుండా ఉండి ప్రతాంతమున బంగారు గోధుమలను దానం చేసినట్లైతే అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. బంగారు గోధుమలు దానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.
గోధుమలు సర్వజీవులకు బలాన్ని పుష్టిని ఇస్తాయి. దేవ పితృ కార్యములకు ఇవి ముఖ్యమైనవి. కాబట్టి నాకు సంపదల నిచ్చుగాక.
ఈ సమయంలో తనకు ఇష్టమైన కూరలు, పండ్లు తినకుండా వదలివేసి, వ్రత సమాప్తి యందు వెండితో చేసిన పండ్లు లేదా కూరలను దానం చేసినట్లైతే ఆయురారోగ్య ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాది సంతతి కలుగుతుంది. అంతమందు స్వర్గం లభిస్తుంది.
శ్రావణ మాసంలో శాకములు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వియుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదలి వెయ్యాలి. అంతేకాదు, అనేక బీజములున్న ఫలములు అంటే గుమ్మడి, జామ, సీతాఫలము, నారింజ, బత్తాయి, వంకాయలు వంటి వాటిని తినరాదు.
ఉసిరి, రేగు, ఆనప, చింతకాయలను ఈ నాలుగు నెలలు తినరాదు. నులక మంచం మీద గాని పట్టె మంచం మీదగాని పడుకో రాదు. ఋతుకాలము తరువాత భార్యను కలవ రాదు. బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవాడికి శ్రీహరి దూరమవుతాడు. ఈ సమయంలో ఏరకమైన వ్రతాలు చెయ్యకపోయినా, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం స్నానంచేసి శ్రీహరిని పూజించినట్లైతే అతడు వైకుంఠము పొందుతాడు.
చాతుర్మాస్యంలో తేనె విడిచిన వాడు రాజవుతాడు. బెల్లమును విడిచిన వాడు దీర్ఘాయుష్షు పొందుతాడు. దేవాలయంలో సంగీతాన్ని వినిపించిన వాడు గంధర్వ లోకం పొందుతాడు. సువాసన వెదజల్లే నూనెలు విడిచిన వాడికి – శత్రువులు నశిస్తారు. ఇప్ప నూనె త్యజించిన వాడు – మంచి సౌభాగ్యము పొందుతాడు. కారము, పులుపు, చేదు, వగరు, తీపి – వీటిని విసర్జించిన వాడి శరీరము అందముగా ఉంటుంది. పూలు మొదలైన భోగాలను వదలినట్లైతే విద్యాధర గణమందు చేరతాడు. యోగియైనవాడు బ్రహ్మలోకం చేరతాడు.
తాంబూలము వదలివేసిన వాడికి రోగాలు నశిస్తాయి. పక్వా హారము విడచినవాడు – ఇంద్రలోకం పొందుతాడు. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే – బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యంలో ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేసిన వాడికి పుణ్యలోకాలు కలుగుతాయి. ఆలయంలో లక్ష ప్రదక్షిణాలు చేసినవాడు హంస వాహన మెక్కి వైకుంఠం చేరతాడు. ఈ నాలుగు నెలలూ బయట భోజనం చెయ్యని వాడు – దేవతా స్వరూపు డవుతాడు.
ఈ సమయంలో ప్రాజాపత్య వ్రత మాచరించినవాడు మనో వాక్కాయ కర్మలచే చేసిన పాపాలనుండి విముక్తు డవుతాడు. చాతుర్మాస్యములో చాంద్రాయణ వ్రత మాచరించినవాడు దివ్య దేహము ధరించి శివలోకము చేరతాడు. ఈ సమయంలో పూర్తిగా ఉపమాసమున్న వాడికి సాయుజ్యం లభిస్తుంది. అతడికి పునర్జన్మ ఉండదు. మధూకర భిక్షాన్నము తిని గడిపినవాడు–వేద పారంగతుడవుతాడు.
శ్రీమన్నారాయణుడు నిద్రకుపక్రమించే రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి నాలుగు నెలల పాటు నిర్విఘ్నంగా వ్రత మాచరించిన వాడు ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి, అంతమందు సాయుజ్యం పొందుతాడు’. అంటూ తొలి ఏకాదశి, దేవశయని వ్రత విధానము, దాని ఫలి తాలను వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.