Ranti Devudu In Telugu – రంతిదేవుడు

Ranti Devudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రంతిదేవుడు నీతికథ.

రంతిదేవుడు

పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.

ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్పుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.

ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. “రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.

Ranti Devudu Story In Telugu

ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు.

ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడున్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.

బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

దానము తీసుకొనువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదియేకాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేక పోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Gopika Geetham In Telugu – గోపికాగీతమ్

Gopika Geetham

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోపికాగీతమ్ గురించి తెలుసుకుందాం…

Gopika Geetham Lyrics Telugu

గోపికాగీతమ్

గోప్యః :

జయతి తే ధికం జన్మనావ్రజశ్రయత ఇన్దిరా శశ్వ దత్ర హి,
దయిత దృశ్యతాం దిక్షుతావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే.

1

శర దుదాశయే సాధుజాత సత్సరసిజోదర శ్రీముషా దృశా,
సురతనాథ తే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధః.

2

విషజలాప్యయాద్వ్యాళరాక్షసాద్వర్షమారుతాద్వైద్యుతానలాత్,
వృషమయాత్మజాద్విశ్వతోభయాదృషభ! తే వయం రక్షితా ముహుః.

3

న ఖలు గోపికానన్దనో భవానఖిలదేహినామన్తరాత్మదృక్,
విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే.

4

విరచితాభయం వృష్టిధుర్య తే శరణమీయుషాం సంసృతేర్భయాత్,
కరసరోరుహం కాన్త కామదం శిరసి దేహి నశ్రీ కరగ్రహమ్.

5

ప్రజజనార్తిహన్ వీరయోషితాం నిజజనస్మయధ్వంసనస్మిత,
భజ సఖే భవత్కిజ్కరీస్మ్స నో జలరుహాననం చారు దర్శయ.

6

ప్రణతదేహినాం పాపకర్శనం, తృణచరానుగం శ్రీనికేతనమ్,
ఫణిఫణార్పితం తే పదామ్బుజం, కృణు కుచేషు నః కృద్ధి హృచ్ఛయమ్.

7

మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ,
విధికరీరిమా వీర ముహ్యతీరధరశీధునా ప్యాయయస్వ నః.

8

తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్,
శ్రవణమఙ్గళం శ్రీమదాతతం, భువి గృణంతి యే భూరిదా జనాః.

9

ప్రహసితం ప్రియ ప్రేమవీక్షణ విహరణం చ తే ధ్యానమఙ్గళమ్,
రహసి సంవిదో యా హృదిస్పృశః కుహక నో మనః క్షోభయన్తి హి.

10

చలసి యద్ర్వజాచ్చారయన్ పశూన్ నళినసున్దరం నాథ తే పదమ్,
శిలతృణాజ్కురై స్సీదతీతి నః కలిలతాం మనః కాస్త గచ్చతి.

11

ధినపరిక్షయే నీలకున్తలై ర్వనరుహాననం బిభ్రదావృతమ్,
ఘనరజస్స్వలందర్శయన్ ముహుర్మనసి నస్మ్ఫరం వీర యచ్ఛసి.

12

ప్రణతకామదం పద్మజార్చితం ధరణిమణ్ణనం ధ్యేయమాపది,
చరణపఙ్కజం శస్త్రమం చ తే రమణ నస్తనేష్వర్పయాధిహన్.

13

సురతవర్ధనం శోకనాశనం స్వరితవేణునా సుష్ఠు చుమ్బితమ్,
ఇతరరాగవిస్మారణం నృణాం వితర వీర నస్తే ధరామృతమ్.

14

అటతి యద్భవా నహ్నికాననం త్రుటి యుగాయతే త్వామపశ్యతామ్,
కుటిలకున్తలం శ్రీముఖంచ తే జడ ఉదీక్షతాం పక్ష్మకృద్ధశామ్.

15

పతిసుతాన్వయభ్రాతృబాన్ధవానతివిలజ్ఝ్య తే హ్యచ్యుతాగతాః,
గతివిదస్తవోద్గీతమోహితాః కితవ యోషితః కస్త్యజేన్నిశి.

16

రహసి సంవిదం హృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమవీక్షణమ్,
బృహదురశ్ర్శియో వీక్ష్య ధామ తే ముహురతిస్పృహా ముహ్యతే మనః.

17

వ్రజజనౌకసాం వ్యక్తిరఙ్గ తే వృజినహస్త్యలం విశ్వమఙ్గళమ్,
త్యజ మనాక్చ నస్త్యత్స్పృహాత్మనాం స్వజనహృద్రుజాం యన్నిషూదనమ్.

18

యత్తే సుజాతచరణామ్బురుహం స్తనేషు
భీతాశ్శనైః ప్రియ దధీమహి కర్కశేషు,
తేనాటవీమటసి తద్వ ్యథతే న కింస్విత్
కూర్పాదిభిరమతి ధీర్భవదాయుషాం నః.

19

ఇతి గోపికా గీతమ్

మరిన్ని భక్తి గీతాలు

Govardhana Ashtakam In Telugu – గోవర్ధనాష్టకమ్

Govardhana Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోవర్ధనాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Govardhana Ashtakam Lyrics Telugu

గోవర్ధనాష్టకమ్

గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్,
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్.

1

గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్,
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్.

2

నానాజన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః,
కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్.

3

సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్,
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్.

4

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్
ధ్యాయంతం కృష్ణ కృష్ణతి వందే గోవర్ధనం గిరిమ్.

5

విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లవప్రియమ్,
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్.

6

ఆనందకృత్సురాధీ శకృతసంభారభోజనమ్,
మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్.

7

కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్,
కృష్ణానన్దప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిమ్.

8

గోవర్దనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః,
తన్నేత్రగోచరో యాతి కృష్ణా గోవర్ధనేశ్వరః.

9

ఇదం శ్రీమర్థనశ్యామనందనస్య మహాత్మనః,
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్.

10

ఇతి శ్రీ గోవర్ధనాష్టకమ్

మరిన్ని అష్టకములు

Sri Venkateswara Suprabhatam In Telugu – శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం

Sri Venkateswara Suprabhatam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే “సుప్రభాతం” అని అంటారు.

Sri Venkateswara Suprabhatam Telugu Lyrics

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥

1

ఉత్తిష్ఠ త్తిష్ఠ గోవింద ఉ త్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలాకా న్త త్రైలోక్యం మంగళం కురు ॥

2

మాతస్సమస్తజగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహరదివ్యమూ ర్తే |
శ్రీస్వామిని శ్రితజనప్రియదానశీలే
శ్రీవేంక టేశదయితే తవ సుప్రభాతమ్ ॥

3

తవ సుప్రభాతమరవిందలోచనే
భవతు ప్రసన్నముఖచంద్రమండలే |
విధిశంక రేన్ద్రవనితాభిరర్చితే
వృషశైలనాథదయితే దయానిధే ॥

4

అత్ర్యాదిస ప్తఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధుకమలాని మనోహరాణి |
ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ ॥

5

పంచాననాబ్జభవషణ్ముఖవాసవాద్యాః
త్రైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి |
భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్॥

6

ఈషత్ప్రఫుల్ల సరసీరుహనారి కేళ
పూగద్రుమాదిసుమనోహరపాలికానామ్|
ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ ॥

7

ఉన్మీల్య నేత్రయుగము త్తమపంజరస్థాః
పాత్రావశిష్టకదలీఫలపాయసాని|
భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ |

8

తంత్రీప్రకర్షమధురస్వనయా విపంచ్యా
గాయత్యనంతచరితం తవ నారదోపి |
భాషాసమగ్రమసకృత్కరచారరమ్యం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ ||

9

భృంగావళీ చ మకరందరసానువిద్ధ
ఝుంకారగీతనినదైః సహ సేవనాయ |
నిర్యాత్యుపాంతసరసీకమలోదరేభ్యః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ ॥

10

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః |
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ ॥

11

పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా|
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ ॥

12

శ్రీమన్న భీష్టవరదాఖిలలోకబంధో
శ్రీశ్రీనివాస జగదేకదయైకసింధో|
శ్రీదేవతాగృహభుజాంతరదివ్యమూ ర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

13

శ్రీస్వామిపుష్కరిణికాప్ల వనిర్మలాంగాః
శ్రేయోర్థినో హరవిరించిసనందనాద్యాః |
ద్వారే వసంతి వరవేత్రహతో త్తమాంగాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

14

శ్రీకేషశై లగరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రివృషధాద్రివృషాద్రిముఖ్యామ్ ।
ఆధ్యాం త్వదీయవసతేరనిశం వదంతి
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

15

సేవాపరాః శివసురేశకృశానుధర్మ
రక్షోంబునాథపసమానధనాధినాథాః ।
బద్ధాంజలి ప్రవిలసన్ని జశీర్షదేశాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

16

ధాటీషు తే విహగరాజమృగాధిరాజ
నాగాధిరాజగజరాజహయాధిరాజాః |
స్వస్వాధికారమహిమాధిక మర్థయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

17

సూర్యేందుభౌమబుధవాక్పతికావ్యసౌరి
స్వర్భానుకేతుదివిషత్పరిషత్ప్రధానాః |
త్వద్దాసదాసచరమావధిదాసదాసాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

18

త్వత్పాదధూళిభరితస్ఫురితో త్తమాంగాః
స్వర్గాపవర్గనిర పేక్షనిజాంతరంగాః |
కల్పాగమాకలనయా కులతాం లభంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

19

త్వన్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః |
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్త్
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

20

శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాధిదేవ జగదేకశరణ్యమూ ర్తే |
శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఫ్రే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

21

శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే |
శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

22

కందర్పదర్పహరసుందరదివ్యమూర్తే
కాంతాకుచాంబురుహకుట్మలలోలదృష్టే |
కల్యాణనిర్మలగుణాకర దివ్యకీర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

23

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణి
స్వామి పరశ్వథతపోధన రామచంద్ర |
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

24

ఏలాలవంగఘనసారసుగంధితీర్థం
దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్|
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ ||

25

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః |
శ్రీవైష్ణవాః సతతమర్థితమంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ ॥

26

బ్రహ్మాదయస్సురవరాస్సమహర్షయ స్తే
సంతస్సనందనముఖా స్త్వథ యోగివర్యాః |
ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

27

లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో
సంసారసాగరసము త్తరణైక సేతో |
వేదాంతవేద్య నిజవై భవభ క్త భోగ్య
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

28

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః |
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే ॥

29

ఇతి శ్రీవేంకటేశసుప్రభాతం సమాప్తమ్

మరిన్ని కీర్తనలు:

Bodhimpare Yerigina Budhulaala Peddalala In Telugu – బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల

బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
సంఖ్య : 58
పుట: 39
రాగం: బౌళి

బౌళి

73 బోధింపరే యెరిఁగినబుధులాల పెద్దలాల
శ్రీధరునిమాయలలోఁ జిక్కితిమి నేము.

||పల్లవి||

దైవమును నొల్లము ధర్మమును నొల్లము
దావతిసంసారముతో తగులేకాని
భావపుభవబంధాలభయమూ నెరఁగము
వేవేలు విధులే కాని వేగిలేచి నేము.

||బోధిం||

ముందు విచారించము మొదలు విచారించము
పొందేటిసతులతోడిభోగమేకాని
చెందినమనసులోనిచింతలను బాయము
మందపుమదమే కాని మాపుదాఁకా నేము.

||బోధిం||

పరమూఁ దడవము భక్తీఁ దడవము
అరిది ధనముమీఁది ఆసలేకాని
ఇరవై శ్రీవేంకటేశుఁ డేలుకొనెఁ దానే నన్ను
నిరతి నెరఁగనైతి నే నించుకంతాను.

||బోధిం||

అవతారిక:

“ఓ పెద్దలారా! మేము శ్రీధరుని మాయలో చిక్కుకుపోయామయ్యా! దిక్కు తెలీటంలేదు. మాకు యేమి చెయ్యాలో చెప్పండయ్యా!” అంటున్నారు జాలిగా అన్నమాచార్యులవారు. దేవుణ్ణి నమ్మం, ధర్మం ఒప్పుకోము, భవబంధాలలో అల్లాడిపోతున్నాం. ముందు విచారించము, మొదల విచారించము యెంతసేపూ వనితాభోగమే. మందపుమదమే మాపుదాకా, పరము వద్దంటాము. భక్తిసున్నా. ఏమిటీ దౌర్భాగ్యం!! తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన ఇది. జాగ్రత్తగా చదవండి.

భావ వివరణ:

ఓ పెద్దలారా! బుధులారా! (పండితులారా!) మీరు అన్నీ యెరిగినవారు కదా! నాకు బోధింపరో (బోధపరచండయ్యా!) నేము (మేము) శ్రీధరుని మాయలలో చిక్కుకుపోయాం.

మేము దేవుని వొల్లము (అంగీకరించము). ధర్మమునంగీకరించము. దావతి సంసారముతో (దుఃఖభాజన ప్రపంచపు తగులే (అనుబంధములే) కాని, భవబంధాల భయంలేనేలేదాయెను. అనేక మార్గాలనవలంభిస్తాము కాని, వేగిలేచేము (ప్రతిదానికీ తొందరే). మాకేమి చేయాలో తెలియుటలేదు.

మాకున్న ఇంకొక దురలవాటు ముందుగా విచారించము (కార్యము ప్రారంభమునకు ముందుగ ఆలోచన చేయము). మొదలు విచారించము (కార్య ప్రారంభమునందును ఆలోచించము). మాకు లభించిన భామలతో భోగాసక్తే కాని ఇంకొక ఆలోచనేవుండదాయెను. ఈ వ్యవహారాలవల్ల మనస్సులో యెప్పుడూ దిగుళ్ళే, ఆలోచనలే. వాటిని బాయము (వదలము). మాపుదాకా (ముసలివాళ్ళమై జవసత్వాలు వుడిగేదాక ) మందపు మదమే (దట్టమైన గర్వమే…) కాని మరొకటి లేదు. మేము భ్రష్టులమైపోయాము.

అవన్నీ అటుంచి, పరము మోక్షము) అంటే యేమిటో తడవము (చలించము) భక్తి గురించిన ఆలోచనేలేదు. అరిది ధనముపై ఆసలే (అరుదుగా లభిస్తుందని ధనముపై వ్యామోహమే)… కాని భగవంతుని మాటే తలవము. ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకనాడు శ్రీవేంకటేశునికి ఈ జీవిపై దయపుట్టింది. ఆయన ఇరవై (నా తలపులలో నెలకొని) తానే నన్ను యేలుకొనె. నేను ఇంచుకంతా, నిరతినెరుగనైతి (కొంచెము కూడా అత్యాశ లేక) జీవించుట ప్రారంభిచితిని. ఆ విధంగా ధన్యుడనైతిని.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Ghanudatada Itadu Kalasa Puramukaada In Telugu – ఘనుడాతడా యితడు కలశాపురముకాడ

ఘనుడాతడా యితడు కలశాపురముకాడ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఘనుడాతడా యితడు కలశాపురముకాడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఘనుడాతడా యితడు కలశాపురముకాడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
సంఖ్య : 302
పుట: 204
రాగం: గుండక్రియ

గుండక్రియ

72 ఘనుఁడాతఁడా యితఁడు కలశాపురముకాడ
హనుమంతుఁ డితఁడా అంజనాతనయుఁడు.

||పల్లవి||

పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె
అడరి దానవుల హనుమంతుఁడు
బెడిదంపుఁ బెనుదోఁక బిరబిరఁ దిప్పి మొత్తె
అడఁగ మాల్యవంతు హనుమంతుఁడు

||ఘనుఁ||

దాకాల మోఁకాలఁ దాటించెఁ గొందరి
ఆకాశవీధినుండి హనుమంతుఁడు
పైకొని భుజములఁ బడఁదాఁకెఁ గొందరి
ఆకడ జలధిలోను హనుమంతుఁడు.

||ఘనుఁ||

ఆరుపుల నూరుపుల నందరిఁ బారఁగఁ దోలె
ఔరా సంజీవికొండహనుమంతుఁడు
మేరతో శ్రీవేంకటాద్రిమీఁదిదేవునిబంటు
ఆరితేరినబిరుదు హనుమంతుఁడు.

||ఘనుఁ||302

అవతారిక:

కలశాపురంలో తనయెదుటనున్న ఘనమైన హనుమంతుని యెదుట అన్నమాచార్యులవారు ఈ కీర్తనను వినిపిస్తున్నారు. ఆనాడు లంకలో రాక్షసమూకనుయెట్లు చీల్చి చెండాడినాడో వర్ణిస్తున్నారు. నేటి మన దుస్థితి యేమంటే అచ్చతెలుగు కీర్తనకి, సంకరతెలుగులో వివరణ ఇచ్చుకోవలసిన వస్తున్నది. “ఆరుపుల నూరుపులనందరి బారగ దోలె”… ఆయన హూంకారముతో కూడిన గట్టి నిశ్వాసవదిలి అందరూ కకావికలై పారిపోయేట్లు చేశాడట. ఇట్లా అడుగడుగునా తేలికగా తెలియని తెలివైన తెలుగు తికమకలు దిట్టంగావున్నాయి ఈ కీర్తనలో.

భావ వివరణ:

ఆనాడు లంకలో అన్ని ఘనకార్యములను చేసిన ఆ ఘనుడైన హనుమంతుడు ఆతడా, యితడు (ఈ కలశాపురంలో మనయెదుటనున్న ఆంజనేయుడు). ఏమి ఆశ్చర్యము!

ఈయన సీతాన్వేషణలో లంకలోని రాక్షసులను యెట్లు చితక్కొట్టాడో వినండి. ఆయన తన మోచేతితో కొందరిని కుమ్మి చంపాడు. కొందరిని చేతిలోపలి భాగంలో నొక్కి చంపాడు. అడరి (ఆ విధంగా అతిశయించి) ఆ హనుమంతుడు దానవులను చంపాడు. అప్పుడు మాల్యవంతుడనే రాక్షసుడు ఆయనపైకి వెళ్ళాడు. బెడిదంపు (భయంకరమైన) పెనుతోక (పెద్దతోకతో) బిరబిర తిప్పి అణిగిపోయేట్లు మొత్తి వాడిని ఆ హనుమంతుడు చంపేశాడు.

తన కాలు (దాగుకాలు) కాలివెనుక భాగంతో) తో తన్ని కొందరిని, మోకాలితో కుమ్మించి కొందరిని తాటించినాడు (కొట్టినాడు), ఆ హనుమంతుడు. ఇదంతా ఆయన ఆకాశవీధిలోనే చేశాడు. ఆ కడ (అప్పుడు) కొందరిని పైకొని (మీదపడి) భుజములతోపడదోసి జలధిలో చంపేశాడు. హనుమంతుని మారణకాండనేమని వర్ణింతుము?

అనంతరం ఆ హనుమంతుడు “ఆరుపుల నూరుపుల నందరి బారగదోలె” (తన హూంకారముతో కూడిన గట్టి నిస్వాసముతో అందరినీ చిందరవందరగా పారిపోయేట్లు చేశాడు. ఔరా సంజీవి కొండను తెచ్చిన ఈ హనుమంతుడు జగజ్జెట్టి. మేరతో (ఆ క్రమంలో) వేంకటాద్రిమీది దేవుడైన వేంకటేశ్వరుని బంటు అనే ఆరితేరిన బిరుదుతో ఈ హనుమంతుడు శోభించుచున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Doratanamulatoda Todapai Srisatitoda In Telugu – దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
సంఖ్య: 518
పుట: 348
రాగం: నాట

నాట

71 దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
కేరలీఁ బంతముల సుగ్రీవనారసింహము.

||పల్లవి||

నిక్కినకర్ణములతో నిట్ట చూపుగుడ్లతో
మిక్కుటమైన పెద్దమీసాలతోడ
వెక్కసపునోరితోడ వెలయుబుగ్గలతోడ
క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవనారసింహము.

||దొర||

చల్లునూరుపులతోడ సంకుఁజక్రములతోడ
మొల్ల మైనసహస్రకరములతోడ
తెల్లనిమేనితోడ దిండైనపిరుఁదుతోడ
కెల్లరేఁగీఁ గరుణ సుగ్రీవనారసింమము.

||దొర||

విరులపాదాలతోడ వెలయుసొమ్ములతోడ
తిరమైనకోటిసూర్యతేజముతోడ
విరులదండలతోడ వేడుక శ్రీవేంకట
గిరిమీఁద వెలసె సుగ్రీవనారసింహము.

||దొర||

అవతారిక:

సహజత్వం వుట్టిపడేలా వర్ణనలు కీర్తనలో జొప్పించటం అన్నమాచార్యుల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన నరసింహుని వర్ణిస్తుంటే మనకళ్ళయెదుట ఆ స్వామి నిలుచున్నట్లే వుంటుంది. “దొరతనంతోడ, తొడపై శ్రీసతితోడ ఈ సుగ్రీవనరసింహుడు పంతములకేరలీ” అంటున్నారు. ఈయన కంఠము సుగ్రీవమట. అందంగావున్న కంఠస్వరం అన్నమాట. ఈయన పాదాలు పువ్వుల్లా వున్నాయట. వేంకటగిరి మీదనున్న సుగ్రీవనరసింహుని కీర్తించండి అంటున్నారు.

భావ వివరణ:

దొరతనముతోడ (సర్వేశ్వరుని ఠీవితో) తనతొడపై శ్రీదేవితో ఈ సుగ్రీవనారసింహుడు (చక్కటి కంఠధ్వనిగల నరసింహుడు), కేరడి పంతములవాడు (మిక్కుటమైన పట్టుదలగలవాడు).

ఈయన యెలావున్నాడో చూడండి. ఇతను నిక్కిన కర్ణములతో (నిక్కపొడుచుకొనిన చెవులతో) నిట్టచూపుగుడ్లతో (మిడిగుడ్లతో). దట్టమైన పెద్ద మీసాలతో, వెక్కసపు (భీతినిగొలుపు) నోటితోను, వెలయు (మెరయుచున్న) బుగ్గలతోను, క్రిక్కిరిసిన నవ్వులతోనూ (దట్టమైన నవ్వులు చిందించుచూ) ఈ సుగ్రీవ నారసింహుడు దర్శనమొసగుచున్నాడు.

ఈయన చల్లునూరుపులతో వున్నాడు. (వెలువడునప్పుడు విస్తరించుచున్న నిశ్వాసములతో వున్నాడు.) వున్నాడు.) ఈ చతుర్భుజుని, రెండుచేతులలో శంఖచక్రములన్నవి. అధికముగ వేయి కరములతో ఈ స్వామి వెలసియున్నాడు. ఈయన తెల్లని మేనితో (దేహంతో) దిండ్లవంటి పిరుదులతోనున్నాడు. ఈయన కెల్లురేగిన (పెల్లుబికిన) కరుణ మూర్తీభవించినట్లున్నాడు. ఈ సుగ్రీవనారసింహుని చూచి తరించండి.

ఈ దేవదేవుడు విరులవంటి (పుష్పములవలె సున్నితమైన) పాదములను కలిగియున్నాడు. విరివిగానున్న సొమ్ములు (ఆభరణములతోనున్నాడు). తిరమైన (స్థిరమైన) కోటి సూర్యులకాంతితో వెలుగొందుచున్నాడు. మెడలో ఈ స్వామి అనేక పుష్పహారములను ధరించియున్నాడు. వింతగా ఈ సుగ్రీవనారసింహుడు వేడుకతో శ్రీ వేంకటగిరిమీద వేంకటేశ్వరుడై వెలసియున్నాడు. ఈ స్వామిని చూచి భక్తితో మొక్కండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vari Vari Bhagyamulu Vrasivunnavi Nosalla In Telugu – వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
సంఖ్య : 270
పుట: 181
రాగం: రామక్రియ

రామక్రియ

52 వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల
ధీరతతో నేది మేలో తెలుసుకోరో

||పల్లవి||

అట్టే కొందరు మతము లన్నియు నేకమని
పట్టవర్ధనము నెత్తిఁబెట్టి చూపిరి
జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని-
పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి

||వారి||

కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని
అంది వట్టిలలాటశూన్యము చూపిరి
కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని
ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి

||వారి||

చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు
అలమేలుమంగపతి యై యున్నవాఁడు
యిలవీర నీదాసుల కిట్టిభాగ్య రేఖలు
వలసినవారికెల్లా వ్రాసినాఁ డితఁడు

||వారి||270

అవతారిక:

“ఎంత మాత్రమున నెవ్వరు తలచిన అంతమాత్రమె నీవు” అనే అన్నమాచార్యుల వారి కీర్తనలో అన్న విషయాన్నే ఈ కీర్తనలోనూ ప్రస్తావిస్తున్నారు. ఎవరి భాగ్యంయెట్లా వుంటుందో వారి నొసటిపై విధాత వ్రాసి భూమిపైకి పంపిస్తాడని పెద్దవాళ్ళు చెబుతారు. ఎవరికేది మేలో ఏమిచెయ్యాలో ఎవరికివారే ధైర్యంతో ఆలోచించి తెలుసుకోవాలి అని అంటున్నారు శ్రీవేంకటేశుని దాసులు భాగ్యరేఖలు మాత్రం వారికెట్టాకావాలో అట్లా వ్రాస్తాడట.. ఆవిధాత. ఎందుకని? ఆయన దిష్ట అందుకని. దిష్ట అంటే అదృష్ట ప్రదాత అని చెప్పుకోవచ్చును. ఇది జటిలమైన కీర్తన అని విడిగా చెప్పనక్కరలేదు కదా!

భావ వివరణ:

ఓ ప్రజలారా! వారి భాగ్యములు (ఎవ్వరికి ప్రాప్తించెడి భాగ్యములు) వారి నొసళ్ళ (అవ్వారి నుదుటి భాగములలో) వ్రాసివున్నవి, (విధాత చేత పుట్టుకనాడే వ్రాయబడినవి). ఈ విషయాన్ని ధీరతతో తెలుసుకోరో! (ధైర్యంతో తెలుసుకోండయ్యా!) ఈ ప్రపంచంలో వేర్వేరు మతస్థులు వేర్వేరు నమ్మకాలతోవుంటారు.అ ట్టె (అదేవిధంగా) కొందరు మతములన్నియు ఏకమని (ఒక్కటేనని) పట్టవర్ధనము (నొసటిపై ధరించు ఒకరకమైన బొట్టు) నెత్తిబెట్టి (నుదుట ధరించి) చూపిరి. జట్టి (నిర్ణయించి) కొందరు జీవులు, జంగమే (శివుడే) లింగమ రూపంలో వుంటాడని జీవితాంతంలో పుట్టుకలన్నీ బూడిదయ్యేవేనని నమ్మి తమ శరీరమంతా భస్మము వ్రాసుకొని జీవిస్తారు. అది వారి నమ్మకం మనమెలా కాదనగలము? కొందరు శూన్యవాదులున్నారు. వారు పాపపుణ్యాలు రెండూ లేవంటారు. అసలు భగవంతుడే లేడు అంటారు. కొట్టకొనలయము (చిట్టచివరికి చావు తప్పదు కాబట్టి, మంచివాడు చెడ్డవాడు ఇద్దరూ చావక తప్పదు కనుక, ఏమీ అవసరంలేదని, వట్టి లలాటము (బోసిగావున్న నుదురుతో బొట్టులేకుండా శూన్యముగావున్న నొసలు) చూపిరి. కందువ (సామర్థ్యంగల) కొందరు లక్ష్మీపతియైన శ్రీహరియే అంతరాత్ముడని తమ నొసటిపై ఎచూర్ణము (తిరుచూర్ణము, పంగనామాలుగా ధరించి చూపిరి.

ఇప్పుడు శ్రీవేంకటేశ్వరుడు దిష్టము వలె (అదృష్టప్రదాతగా) చెలగి (అతిశయించగా) సిరులరాణియైన అలమేల్మంగమ్మ పతియైయున్నవాడు. అందుకని ‘యిల’ (ఈలోకంలో) వీర (వీరే… అంటే… అదేవీ ఆవిడ భర్తా) నీదాసులకు (హరిదాసులకు) ఇట్టి భాగ్యరేఖలు, వారికెల్లా వలసిన విధముగా (వారు కోరిన విధముగా) ఇతడు విధాత రూపంలో వారి భాగ్యం వారి నొసళ్ళపై వ్రాస్తాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vinavamma Janaki Nivibhudintesesinadu In Telugu – వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
సంఖ్య : 462
పుట: 311
రాగం: రామక్రియ

రామక్రియ

51 వినవమ్మ జానకి నీవిభుఁ డింతసేసినాఁడు
యెనసి యీరఘరాముఁ డిఁక నేమి సేసునో

||పల్లవి||

వానరులదండు గూడి వారధి కొండలఁ గట్టె
ఆని లంక చుట్టిరా నదే విడిసె
కోనలఁ ద్రికూటమెక్కె గొడగులన్నియుఁ జెక్కె
యేనెపాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

కోరి ఇంద్రజిత్తుఁ జంపె కుంబకర్ణు నిర్జించె
గోరదానవులనెల్ల కూలఁగుమ్మెను
మారణహెూమము నేనె మతకమింతాఁ జెరిచె
యీరసాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

లావున రావణుఁ జంపె లంక విభీషణు కిచ్చె
చేవల నోసీత నిన్నుఁ జెకొనెను
భావించి శ్రీవేంకటాద్రిఁ బట్టము దాఁ గట్టుకొనె
యీవలనావల నాతఁ డిఁక నేమిసేసునో

||విన||462

అవతారిక:

ఇటువంటి కీర్తన నభూతో న భవిష్యతి అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గతంలో “ఓ సీతమ్మ తల్లీ! నను బ్రోవమని చెప్పవే” అని మొరబెట్టిన వారున్నారు. తల్లీ! నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివమ్మా! అని కీర్తించినవారున్నారు కాని తానే ఒక రామదూత కపియై శ్రీరాముని శత్రు నిర్మూలనం సీతమ్మకు వర్ణించి వివరించటం యెన్నడూ యెరుగము. అన్నమాచార్యుని కృపచేత ఈ కీర్తన రూపంలో ఆలోటు తీరింది. “ఓ జానకమ్మా! మీ ఆయన యేమి చేశాడో వినవమ్మా! ఈయనగారు తిరుమల కొండలెక్కాడు. ఇకపై యేమిచేస్తాడో తెలియకుండావున్నది” అంటున్నారు, నభవిష్యతి- అని ఎందుకన్నానంటే ఈ తెలుగు పాండిత్యం వున్న మొనగాడెవడండీ…

భావ వివరణ:

ఓ జానకీదేవీ! ఇది వినవమ్మా! నీ విబుడు (నీభర్తయైన శ్రీరాముడు) ఇంసేసినాడు, ఇన్ని వీరోచితకార్యములను చేసినాడు. ఈ రగురాముడు, ఎనసి (పూని) ఇకన్ యేమిసేసునో!! ఇంకా ఏమిచేస్తాడో యేమో!!

నీ భర్త వానరదండు (కపులసేనతో కూడి కొండలతో వారధిగట్టె (సేతువును నిర్మించినాడమ్మా!) ఆపైన ఈ లంక చుట్టిరా (చుట్టూతా) అదే తన సైన్యంతో విడిసె (విడిది యేర్పరచుకొనినాడు) అదిగో ఆ లోయలవైపునుంచి చిత్రకూట పర్వతమునెక్కినాడు. ఆయనశక్తిసామర్థాల గురించి చెవులు కొరుక్కున్నవారి గొడుగులన్నిటికీ (గొణుక్కోవటాలకన్నింటికీ) చెక్కె (చెక్కినట్లు సమాధానమిచ్చాడు. ఈ రఘురాముడు ఇకపై యేనెపానటేమిసేసునో!! (దేనికోసం యేమిచేస్తాడో చెప్పలేము తల్లీ!)

కోరి ఇంద్రజిత్తుని జంపె (సీతాపరహరణంలో అతని పాత్రయేమీ లేకపోయినా, వాడు రావణుని ఆత్మజుడు కావున లక్ష్మణునితో చంపించాడు). అనేక వానరులను మూకొమ్మడిగాచంపాడని కుంభకర్ణుని తెగవేసినాడు. ఘోరమైన దానవులను కూలగమ్మె (కూలవేసినాడు). మతకమంతా జెరిచి (రాక్షసమాయను పటాపంచెలము చేసెను). రణరంగంలో మారణ హెూమం (మృత్యుహెూమం) చేశాడు ఈ రఘురాముడు, ఈరసానవున్నాడు (కోపముచేత వివశుడైయున్నాడు. ఇంకాయేమిసేసునో!!

ఆపైన రావణాసురుని లావున (ధైర్యముతో) చంపెను. లంకానగరానికి విభీషణుని పట్టాభిషిక్తునిచేశాడు. ఓ సీతా! ఆయన ఇక నిన్న చేవల చేకొనును (వశమై చేపట్టును). భావించి (ఆశ్రీరాముడే ఈ శ్రీవేంకటేశ్వరునిగా యెంచి) తాను శ్రీవేంకటాద్రిని, పట్టము కట్టుకొన్నాడు (పట్టాభిషిక్తుడయ్యాడు). ఈవల నావల (ఇక్కడ తిరుమలలోను అక్కడ అయోధ్యలోను) అతడు ఇక నేమిసేసునో!! ఎవరు చెప్పగలరు?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Sainatha Dandakam In Telugu – శ్రీ సాయినాథుని దండకం

Sri Sainatha Dandakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథుని దండకం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథుని దండకం

శ్రీసాయిబాబా! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా! శ్రీదత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ ధరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్దాల్చి నీ పూజలన్, నీ సేవలన్, నీ నామ సంకీర్తనల్ జేయు భక్తాళికిన్,భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యావత్తులన్ బాపి, యోగంబు,క్షేమంబుజేకూర్చి రక్షించు దివ్యస్వభావా! నమస్కార మర్పింతు, లోకంబులో జాతిభేధాలు గల్పించు కొన్నట్టివేగాని సత్యంబుగా లేవులేవం చు భక్తాళికిన్ విశ్వప్రేమంబుజాటు చందబునన్ ప్రతిగ్రామంబులో విఫ్రిగే హంబులోజన్మమున్ గాంచి బాలుండవైయుండ, నీ తల్లిదండ్రుల్ ఫకీరొ క్కనింగాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాధుపోష్యంబులో నుండి, యా పిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశముఖ్యుండు, గోపాలరా యుండు,నిన్ చెంతకుజేర్చి సద్భోదనలే జేసి, జ్ఞానోపదేశంబుగావించి, నిన్నంపివేయంగ, నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండగ సంచార మున్జేసి, యష్టాదశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా, పూర్వపుణ్యంబు పక్వంబుగానొప్పు గోదావరి తీరప్రాంతంబులోనున్న షిరిడీయను గ్రామంబు నన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మాహాప్రీతితో నిల్చి, నీవచటన్ క్రిందగూర్చున్న, యా కొమ్మకున్ చాలామాధుర్యయుక్తం బులౌ యాకులంగూర్చి, యాచెంతనన్ పాడుబడ్డట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై నివాసంబుజేయంగ కాంక్షించి, యద్ధానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరునా శక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షీ బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాంచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నేన న్నంగరీతి వీలౌను? ప్రాపంచికార్ధంబులన్ గోరునవ్వారికిన్ గొప్ప ఉద్యోగ ముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాధినాథుండు సర్వేశ్వరుడైన యాదేవుపై భక్తిభావంబు సూచింపు చున్. కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరుగారంచు నాత్మానుసంధానుభావంబు బోధించు చున్, కొందరున్ బ్రోచిపంచ ప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్న మున్ది నుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాధులోకాళికిన్ ఖర్చు గావిం చి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబుసర్వంబునున్ వైచి సద్గురుడంచునినే సదా నమ్మి సేవించు జీవాళికార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబం గారమైవారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్యపాదాబ్జముల్గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మె ల్లరన్ గాపాడుతూ దీనబంధూ, మహాదేవ! దయాసింధు! శ్రీసాయినాధా! నమస్తే నమస్తే నమః

మరిన్ని దండకములు: