Lingaashtakam In Telugu – లింగాష్టకమ్

లింగాష్టకమ్ (Lingaashtakam)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లింగాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Brahma Murari Lyrics Telugu

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

1

దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

2

సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

3

కనకమహామణి భూషితలింగం
ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

4

కుంకుమచందన లేపితలింగం
పంకజహార సుశోభిత లింగం
సంచితపాప వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

5

దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

6

అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

7

సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం

8

లింగాష్టక మిదంపుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 

మరిన్ని అష్టకములు

Sri Lalitha Sthava Raja Sthotram In Telugu | శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం

Sri Lalitha Sthava Raja Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Sthava Raja Sthotram In Telugu

శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం (విశ్వరూప స్తోత్రం)

|| శ్లో ||

జయదేవి ! జగన్మాతః జయదేవి పరాత్పరే
జయకల్యాణ నిలయే జయకామకళాత్మికే

జయకామేశవామాక్షి జయకామాక్షి సుందరి
జయాఖిల సురారాధ్యే జయకామేశి కామదే

జయబ్రహ్మమయే దేవి బ్రహ్మానందరసాత్మికే
జయనారాయణి, పరే నందితాశేషవిష్టపే

జయశ్రీకంఠదయితే జయశ్రీలలితాంబికే
జయశ్రీ విజయే, దేవి విజయశ్రీ సమృద్ధిదే

జాతస్య జాయమానస్యచేష్టాపూర్తస్య హేతవే
నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యైపరాత్పరే

కల ముహూర్తకాష్ఠాం హ, ర్మాసర్తు, శరదాత్మనే
నమస్సహస్రశీర్షాయై, సమస్రముఖలోచనే

అణోరణుతరే, దేవి మహతోపి మహీయసి
పరాత్పరతరే, మాతః తేజస్త్వం తేజసామపి

అతలంతు భవేత్పాదౌ వితలంజానునీతవ
రసాతలం కటీదేశః కుక్షిస్తే ధరణీ భవేత్

హృదయంతు భువర్లోకః స్వస్తే ముఖ ముదాహృతం
దృశశ్చంద్రార్కదహనాః దిశస్తే బాహవోంబికే

మరుతస్తే తనూచ్ఛ్వాసాః వాచస్తే శ్రుతయో ఖిలాః
క్రీడాతే లోకరచనా, సఖాతే చిన్మయశ్శివః

ఆహారస్తే సదానందో వాసస్తే హృదయం సతాం
దృశ్యాదృశ్య స్వరూపాణి, రూపాణి భువనానితే

శిరోరుహానభస్తేతు తారకాః కుసుమానితే
ధర్మాద్యా బాహవస్తేస్యు, రధర్మాద్యాయుధానితే

యమాశ్చ నియమాశ్చైవ, కరపాదరుహాస్తథా
స్తనౌ స్వాహా స్వథాకారౌ, లోకోజ్జీవనకార

ప్రాణాయామస్తు తే నాసా, రసనాతే సరస్వతీ
ప్రత్యాహారస్త్వింద్రియాణి, ధ్యానం తేదీస్తు సత్తమా

మనస్తే ధారణాశక్తిః హృదయంతే సమాధికా
మహీరుహాస్తేింగరుహాః ప్రభాతం వసనం తవ

భూతం భవ్యం భవిష్యంచ నిత్యంచ తవవిగ్రహం
యజ్ఞరూపా జగద్ధాత్రీ, విశ్వగ్రూపాచపావనీ

ఆధారం త్వాం ప్రపశ్యంతి న సమ్యక్ నిఖిలాః ప్రజాః
హృదయాస్థాపిలోకానాం అదృశ్యామోహనాత్మికా

నామరూపవిభాగం చ యాకరోతి స్వలీలయా
తాన్యథిష్టాయ తిష్ఠంతి తేష్వసక్తా చ కామదా

నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యే నమోనమః
యాదేవీ పరమాశక్తిః పరబ్రహ్మాభిథాయినీ

బ్రహ్మానందాభిథానాయై తస్యైదేవ్యై నమోనమః
యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్ని సూర్యేందు మారుతాః

పృథివ్యాదీని భూతాని తస్యైదేవ్యై నమోనమః
యయా ధృతాతుధరణీ యయాకాశా ద్యమేయయా

యస్యాముదేతి సవితా తస్యైదేవ్యై నమోనమః
యదంతరస్థం త్రిదివం యదాధారో ంతరిక్షకః

యన్మయశ్ఛాఖిలోలోకస్తస్యైదేవ్యై నమోనమః
యత్రోదేతి జగత్కృత్స్నం యత్రతిష్ఠతి నిర్భరం
యంత్రాంతమేతి కాలేతు తస్యైదేవ్యై నమోనమః ||

నమో నమస్తే రజసే, భవాయై నమో నమస్సాత్విక సంస్థితాయై
నమో నమస్తే తమసే హరాయై, నమో నమో నిర్గుణతశ్శివాయై ||

నమో నమస్తే జగదేకమాత్రే నమోనమస్తే జగదేకపిత్రే
నమో నమస్తేఖిఖిలతంత్రరూపే, నమోనమస్తే ఖిలయజ్ఞరూపే||

నమో నమోలోక గురుప్రధానే, నమో నమస్తే ఖిల వాగ్విభూత్యై
నమోస్తు లక్ష్య్మై జగదేక తుప్ల్యై, నమో నమశ్శాంభవి సర్వశక్యై ॥

అనాదిమధ్యాంత మపాంచ భౌతికం హ్యవాఙ్మనోగమ్య మతర్క్యవైభవం
అరూప మద్వంద్వమదృష్టి గోచరం, ప్రభావమగ్ర్యం కధమంబవర్ణ్యతే||

ప్రసీద విశ్వేశ్వరి, విశ్వవందితే, ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి
ప్రసీద మాయామయి మంత్రవిగ్రహే ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి॥

ఇతిస్తుత్వా మహాదేవీం దేవాస్సర్వే సవాసవాః
భూయో భూయో సమస్కృత్యశరణం జగ్మురంజసా ||

మరిన్ని స్తోత్రములు:

Abhaya Dayakuda Vade Neeve Gati In Telugu – అభయదాయకుడ వదెనీవే గతి

అభయదాయకుడ వదెనీవే గతి - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అభయదాయకుడ వదెనీవే గతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అభయదాయకుడ వదెనీవే గతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : అభయదాయకుడ వదెనీవే గతి
సంఖ్య : 420
పుట : 283
రాగం : బౌళిరామక్రియ

బౌళిరామక్రియ

37 అభయదాయకుఁడ వదె నీవే గతి
యిభరక్షక నను నిపుడు గావవే

||పల్లవి||

భయహర దైతేయభంజన కేశవ
జయ జయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింక లుడుపవే.

||అభ||

బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్ష
కంధరవర్ణుఁడ గతి నీనామమె
అంధకారముల నణఁచి మనుపవే.

||అభ||

దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నావిన్నప మిదియే.

||అభ॥ 420

అవతారిక:

శ్రీమన్నారాయణుని పై శ్రావ్యమైన కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. సర్వులకు అభయప్రదాతవైన ఓ గజేంద్రవరదా! నీవే నాకు దిక్కు ఇప్పుడు నన్ను రక్షించరాదా స్వామీ! అని వేడుకొంటున్నారు. “కింకలుడపవే” – అంటే కినుకదూరం చేయవయ్యా అని అర్థం. కోపము అనే వ్యాధిని పోగొట్టమని భావన. కంధరవర్ణడు అంటే నీలమేఘశ్యాముడని అర్థం. తతచక్రాయుధము అంటే వ్యాపించే స్వభావంగల సుదర్శన చక్రం ఆయుధముగాగలవాడని అర్థం. ఇట్లా అడుగడుగునా అర్ధాలు తెలియని మధురమైన కీర్తన ఇది. సావధానుడు – అంటే యేమిటో వూహించండి.

భావ వివరణ:

ఓ ఇభరక్షకా! (గజేంద్రవరదా!) ఇపుడు నన్ను రక్షించగా నీవే దిక్కు నీవు అభయప్రదాతవు. దీనజనోద్ధారకుడవు. నన్ను కాపాడుము తండ్రీ! ఓ భయహరా! నీవు దైతేయభంజనుడవు (అసురాంతకుడవు); కేశియను రాక్షసాంతకుడవు. సర్వేశ్వరుడవైన ఓ నృసింహా! జయము జయము. మీకు ఇదే నియతము (నియమము). నీచరణములే గతి. క్రియగా (అదేపనిగా) మమ్ము పరిపాలించి మా కింకలుడపవే (మానవులమైన మాకుండే దుర్గుణమైన కోపమును నిర్మూలింపుము ప్రభూ! తన కోపమె తన శత్రువన్నారు కదా!

భవ బంధములను సడలించు పాపవినాశనా! నీవు సింధురవరదుడవు (గజేంద్రవరదుడవు) శ్రీతరక్షకుడవు (ఆశ్రయించినవారిని రక్షించే వాడవు). కంధరవర్ణుడవు (నీమేఘశ్యాముడవు). ఓదేవదేవా! అట్టి నీనామమే మాగతి మా అజ్ఞానాంధకారమును అణచి మనుపవే (రక్షించవయ్యా!)

ఓ దైవశిఖామణీ! తతచక్రాయుధ (వ్యాపించు శక్తిగల చక్రాయుథా!) శ్రీవేంకటేశ్వరా! సావధానుడవైన (హెచ్చరికతోవుండె నీ శరణ్యమే మాగతి. వేవేల విధములైన నా విన్నపములు ఇవియే ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sai! Yerchi Kurchi Perchitini… ! In Telugu | సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… !

Sai! Yerchi Kurchi Perchitini... ! 

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… ! గీతం గురించి తెలుసుకుందాం…

Sai! Yerchi Kurchi Perchitini… !

సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… !

ధరణి నీ కాంతి సోకగ ధన్యమయ్యె
కలి అహము బూడిదయ్యె నీ కాలు తాకి
మూర్ఖ బుద్ధులు నిను చూసి మూగవోయె
మంచి వెలుగొందె నీ స్పర్శ మహిమ సాయి

1

ఏమిటయ్య నీ మాయకు ఏది అంతు
రాజ్య భోగాలు లేనట్టి రాజు వీవు
సిరులు గిరులెన్నొ యుండిన శివుని వీవె
విశ్వమంత నీదే ఏమి వింత సాయి

2

అలమటించు మా తోడ నీ వలగనేల
ఆదుకొను నాథుడవు నీకు నలుగ తగదు
లోకముల నేలు దొరవు నీలోన జగతి
నిండియుండెను ఇలనీవు నిలువు సాయి

3

అలమటించు వారల నంత అక్కు చేర్చు
దిక్కు లేని వారందరి దిక్కు నీవు
ఆకలి కడుపులన్నింటి నాలకించి
అందరిని దరిచేర్చుకో వయ్య సాయి.

4

పచ్చదనపు పసిడి నేల పాయలందు
కాలకూట విషమదేదొ కలిసినేమొ
సిరులు విరియు చోటున రాళ్ళు చిందుచుండ
నీదు మహిమ దెల్పగ వచ్చి నిలువు సాయి

5

చెలిమి ముందు చెదిరిపోవు చీకటైన
సూర్య చంద్రుల చెలిమితో చూడ ధరణి
మంచి చెలిమితో నీవుండి మహిమ చూపు
చెదరనీయకు నీదైన చెలిమి సాయి

6

నీవు చేసిన లీలలు నీవు గాంచు
అన్నదమ్ముల పోరు ఈ అవని లోన
పాలి పగలాయె నిచ్చట పాము వోలె
విలువ మరచి జనము గక్క విషము సాయి

7

మాన్యుడ మహనీయుడవని మనముతోడ
కోటి కోటి దండంబుల కొలుచు చుంటి
మధ్యముడనైతి నేను నా మతిని గాంచు
కొలుచు కొనుచు గొప్పను చాటు కొందు సాయి

8

కులము లేదు మతము లేదు కుట్ర లేమి
పంతములును నీ చెంతన పట్టవోయి
మాయ జగతికి నీ మహిమలను దెల్పి
మానవతను పెంచితివి ఈ మహిన సాయి

9

రాముడవు నీవు ఏసు రహీము నీవు
ఏ విధముగ పిలిచిన మా యెదను చేరు
మమ్ము గన్న తండ్రివి నీవు మమ్ము గాంచు
మనుచు జీవులు తలప రావయ్య సాయి.

10

చిన్ననాటివౌ ఆటలు చిందు మరచె
చెలిమి చేయ ఆనాటి రోజేమి లేదు
మరల బాల్య మొకటి యున్న మాదుహృదిని
రాని బాల్యపుసిరి చూపరమ్ము సాయి

11

వయసు రేపిన బాసతో వరుస గలిపి
వావి వరుసల నెల్లను వదిలి నారు
వెళ్లి తనముల పోగొట్టి వింత జూపి
జనుల మార్చగ బూనుము సాధు సాయి

12

అవనికే భారతావని అందమగుచు
కుల మతాల భిన్నత్వాన కుదిరి పొత్తు
ఐకమత్యమే సౌఖ్యమ్ము ఐన దిచట
మూడు వర్ణాల ధ్వజముగా మురియ సాయి

13

తోటలో పూలు నిను చేర తొందరపడి
కోర్కెతో నన్ను చూసి పక్కునను విరిసె
పువ్వులెన్ని కోసిన నింక పూలు మిగిలె
పువ్వు వదలక మెడలోన పొదుగు సాయి

14

తల్లిదండ్రుల వోలెను తనువు నిచ్చి
వెలుగు పంచెడి గురువుగా వెలసి నావు
లోకముల నేలు నీకు నా లోగిలంత
యిచ్చి యుంటి కాదన బోకు మెపుడు సాయి

15

పొత్తు కుదురునే పదముల పొగడ నిన్ను
నాదు బ్రతుకెంత నీ ముందు నాదు తండ్రి
నా తరంబే పలుకగ నీ నామమైన
నీదు కాలి ధూళినవను నేను సాయి

16

నీదు కరుణయే తోడుగ నిలువ నాకు
రచనయే రాని వాడను రాయ పూని
శతక మాలిక నల్లితి శరణు కోరి
ఇటకు విచ్చేసి గైకొని యేలు సాయి

17

మరిన్ని భక్తి గీతాలు

Aghasura Vadha In Telugu – అఘాసుర వధ

Sri Krishna Lilalu Aghasura Vadha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీ కృష్ణలీలలు – అఘాసుర వధ నీతికథ.

శ్రీ కృష్ణలీలలు – అఘాసుర వధ

ఏ పరమపూరుషుని బ్రహ్మణ్యులు పరబ్రహ్మ అని, వైష్ణవులు విష్ణువని, శైవులు మరియు ఇతర భక్తులు శివుడని, కాపాలికులు కాలభైర వుడని, శాక్తేయులు శక్తి అని కొలిచెదరో అట్టి వేదవేద్యుడైన స్వామి గోపబాలురకు సఖునిగా స్నేహితునిగా మెలిగి వారితో కలిసి తని ఆడి పాడి వరిని తరింపచేసినాడు. ఆహా! గోపబాలుల అదృష్టమే అదృష్టము. (అదృష్టమంటే కనబడనిది అంటే మన జన్మజన్మాంతరాల కర్మఫలము)

ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుచుండగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు ఒక పెద్ద కొండచిలువ రూపమున వచ్చి నోటిని తెరిచి శ్రీకృష్ణునికై ఎదురుచూసెను. దాని పైపెదవి మేఘమండలమును క్రింది పెదవి భూమిని తాకుచుండెను!

శ్రీకృష్ణలీలలను ప్రత్యక్షముగా చాలాసార్లు చూసిన గోపబాలురు అతడే రక్షిస్తాడనే నమ్మకముతో గోవులతో సహా పెద్దకొండబిలము వలెనున్న అఘాసురుని నోటిలోకి వెళ్ళిపోయినారు. నందకిశోరుడు కూడా లోనికి ప్రవేశించెను. పరమాత్మ ప్రవేశించగానే అఘాసురుడు నోరుమూసివేసెను. విషవాయువుల ప్రభావముచే గోవులు గోపబాలురు ప్రాణములు విడిచిరి. అప్పుడు పరమాత్మ అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరము ఉబ్బునట్టు చేసెను. అఘాసురుని పొట్టపగిలి నందనందనుడు బయటికి వచ్చెను. సంకల్పమాత్రముచే శ్రీకృష్ణుడు గోవులను గోపబాలుర ను బ్రతికించెను. అఘాసురుడు ముక్తినొందెను.

అఘాసురుని వృత్తాంతము

శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు యౌవనుడు బలిష్ఠదేహుడు. కాని పరులను నిందించు స్వభావము కలవాడు. వాడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూచి “ఇన్ని వంకరలేమి” అని హేళన చేసెను. మహర్షి అనుగ్రహము చూపుటకు “ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు” అని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపము చెంది రక్షించమని ప్రార్థించిన అఘాసురునితో అష్టావక్ర మహర్షి.

“నాయనా! పరనింద మృత్యువువంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే నిందింపబడిన వాడి పాపములో సగం మనకివస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యసర్వస్వములో సగం అతనికి వెళిపోతుంది. కావున అనవసరముగా పరనింద చేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది పాపఫలము అనుభవించిన తరువాత ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించినాడు.

పిల్లలూ! మనమెన్నడూ అనవసరముగా పరులను నిందించరాదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Maheshwara Pancharatna Stotram In Telugu – మహేశ్వర పంచరత్న స్తోత్రమ్

Maheshwara Pancharatna Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మహేశ్వర పంచరత్న స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Maheshwara Pancharatna Stotram Lyrics Telugu

మహేశ్వర పంచరత్న స్తోత్రమ్

ప్రాతస్స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీల పరిశోషిత పంచబాణమ్
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందు చందన సుధారస మందహాసమ్ ॥

1

ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్
ఖట్వాంగ శూల హరిణాహిపినాక యుక్తాన్ ।
గౌరీ కపోలకుచరంజిత పత్రరేఖాన్
సౌవర్ణ కంకణమణిద్యుతి భాసమానాన్ ॥

2

ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్ |
పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యమ్ ॥

3

ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం
కర్పూరకుంద ధవళం గజచర్మ చేలమ్ |
గంగాధరం ఘనకపర్ద విభాసమానం
కాత్యాయనీ తను విభూషిత వామభాగమ్ ॥

4

ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యనామ
శ్రేయః ప్రదం సకల దుఃఖవినాశ హేతుమ్ ।
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గో కోటిదానఫలదం స్మరణేన పుంసామ్ ॥

5

శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్తా పఠేద్యస్సుగతిః ప్రభాతే
ఆయుష్య మారోగ్య మనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్యపదం దురాపమ్||

ఇతి శ్రీ మహేశ్వర పంచరత్నస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Sri Mrityunjaya Stotram In Telugu – మృత్యుంజయ స్తోత్రమ్

Sri Mrityunjaya Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మృత్యుంజయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mrityunjaya Stotram In Telugu

మృత్యుంజయ స్తోత్రమ్

పల్లవి:

శంబో! మహాదేవ! శంభో! మహాదేవ!
శంభో! మహాదేవ! గంగాధరా!
మృత్యుంజయా! పాహి మృత్యుంజయా! పాహి
మృత్యుంజయా! పాహి మృత్యుంజయా!!

చరణం:

1. అద్రీశ జాధీశ! విద్రా వితామౌఘ! భద్రాకృతే పాహి మృత్యుంజయా.
2. ఆకాశకేశా మరాధీశవంద్య! త్రిలోకేశ్వరా! పాహి మృత్యుంజయా.
3. ఇందూపలేందుప్రభోత్ఫుల్లకుందార విందాకృతే! పాహి మృత్యుంజయా.
4. ఈక్షాహతానంగ- దాక్షాయణీనాథ-మోక్షాకృతే-పాహి మృత్యుంజయా
5. ఉక్షేశ సంచార – యక్షేశ సన్మిత్ర – దక్షార్చితా! పాహి మృత్యుంజయా.
6. ఊహాపథాతీత మాహాత్మ్య సంయుక్త – మోహాంతకా! పాహి మృత్యుంజయా
7. ఋద్ధిప్రదాశేషబుద్ధిప్రతారజ్ఞ – సిద్దేశ్వరా! పాహి మృత్యుంజయా.
8. ఋపర్వతోత్తుంగ శృంగాగ్ర సంగాంగహేతో – సదా పాహి మృత్యుంజయా.
9. ప్తాత్మ భక్తాఘ సంఘాతి సంఘాతు కారి ప్రహన్ – పాహి మృత్యుంజయా.
10. తీకృతానేక పారాది కృత్యంతనేయాధునా -పాహి మృత్యుంజయా.
11. ఏకాదశాకార- రాకేందు సంకాశ -శోకాంతకా – పాహి మృత్యుంజయా.
12. ఐశ్వర్యధామార్క వైశ్వానరాభాస విశ్వాధికా -పాహి మృత్యుంజయా.
13. ఓషద్యధీశాంశ భూషాధి పాపౌఘ మోక్షప్రదా -పాహి మృత్యుంజయా.
14. ఔద్ధత్యహీన – ప్రబుద్ధప్రభావ – ప్రబుద్ధాఖిలా -పాహి మృత్యుంజయా.
15. అంబా సమాక్లిష్ట – లంబోదరాపత్య – బింబాధరా -పాహి మృత్యుంజయా.
16. అస్తోక కారుణ్య – దుస్తార సంసార – నిస్తారణా -పాహి మృత్యుంజయా.
17. కర్పూర గౌరాగ్ర సరాఢ్య కందర్ప – దర్పాపహా – పాహి మృత్యుంజయా.
18. ఖద్యోతనేత్రాగ్ని విద్యుద్గహర్షాది – విద్యోతితా -పాహి మృత్యుంజయా.
19. గంధేభ చర్మాంగ సక్తాంగ సంసార సింధుప్లవా -పాహి మృత్యుంజయా.
20. ఘర్మాంశు సంకాశ ధర్మైక సంప్రాప్య- మృత్యుంజయా పాహి మృత్యుంజయా.
21. జోత్పత్తి బీజాఖిలోత్పత్తి బీజామరాధీశ – మాం పాహి మృత్యుంజయా.
22. చంద్రార్ధ చూడామరేంద్రార్చితానంద సాంద్రా -ప్రభో – పాహి మృత్యుంజయా.
23. ఛందశ్శిరోరత్న సందేహ సంవేద్య – మందస్మితా -పాహి మృత్యుంజయా.
24. జన్మక్షయాతీత – చిన్మాత్రమూర్తే – భవోన్మూలనా -పాహి మృత్యుంజయా.
25. ఝుణచ్ఛారు ఘంటా మణి వ్రాతకాంచీ గుణశ్రోణికా- పాహి మృత్యుంజయా.
26. ఇణిత్యష్టచింతాంతరంగ శ్రమోచ్చాటనానందకృత్ -పాహి మృత్యుంజయా.
27. టంకాతి టంకా మరున్నేత్ర భంగాంగనా సంగతా – పాహి మృత్యుంజయా.
28. ఠాళీమహాపాళి కేళీ తిరస్కారి సత్ ఖేలనా -పాహి మృత్యుంజయా.
29. డోలాయ మానాంతరంగీకృతానేక లాస్యేశ మాం పాహిమృత్యుంజయా.
30. ఢక్కాధ్వనిధ్వాన దాహధ్వని భ్రాంత శత్రుత్వ -మాం పాహి మృత్యుంజయా.
31. ణాకారనేత్రాంత సంతోషితాత్మ శ్రితానంద మాం పాహి మృత్యుంజయా.
32. తాపత్రయాత్యుగ్రదావానలా – సాక్షిరూపావ్యయా – పాహి మృత్యుంజయా.
33. స్థాణో – మురారాతి బాణోల్ల సత్పంచ బాణాంతకా -పాహి మృత్యుంజయా.
34. దీనావనాద్యంత హీనాగమాంతైక మానోదితా – పాహి మృత్యుంజయా.
35. ధాత్రీ ధరాధీశ పుత్రీపరిష్వంగ చిత్రాకృతే – పాహి మృత్యుంజయా.
36. నందీశవాహార విందాసనారాధ్య వేదాకృతే – పాహి మృత్యుంజయా.
37. పాపాంధకార ప్రదీపాలి ద్వయానందరూప – ప్రభో! పాహి మృత్యుంజయా.
38. ఫాలాంబకానంత నీలోజ్జ్వలన్నేత్ర శూలాయుధా – పాహి మృత్యుంజయా.
39. బాలార్క బింబాంశుభాస్వజ్జటాజూటికాలంకృతా – పాహి మృత్యుంజయా.
40. భోగీశ్వరానంత యోగిప్రియాభీష్టభోగప్రదా – పాహి మృత్యుంజయా.
41. మౌళిద్యునద్యూర్శి మాలాజటాజూటికాళీప్రియా – పాహి మృత్యుంజయా.
42. యజ్ఞేశ్వరాఖండ తర్జానిధీ దక్షయజ్ఞాంతకా – పాహి మృత్యుంజయా.
43. రాకేందుకోటి ప్రతీకాశలోకాది సృడ్వందితా – పాహి మృత్యుంజయా.
44. లంకేశ వంద్యాంఘి పంకేరుహా శేష శంకాపహా – పాహి మృత్యుంజయా.
45. వాగీశవంద్యాంఘి వందారు మందార – శౌరిప్రియా – పాహి మృత్యుంజయా.
46. శర్వాఖిలాధార సర్వేశగీర్వాణ గర్వాపహా – పాహి మృత్యుంజయా.
47. షడ్వక్త్రతాత త్రిషాడ్గుణ్య లోకాది సృడ్వందితా – పాహి మృత్యుంజయా.
48. సోమావతం సాంతరంగ స్వయంధామ సామప్రియా – పాహి మృత్యుంజయా.
49. హేలా నిగీర్ణోగ్రహాలా హలాసహ్యకాలాంతక – పాహి మృత్యుంజయా.
50. ళాణీధరాధీశ బాణాసనాపాస్త శోణాకృతే – పాహి మృత్యుంజయా.
51. క్షిత్యంబుతేజో మరుద్వ్యోమ సోమాత్మ సత్యాకృతే – పాహి మృత్యుంజయా.
52. ఈశార్చితాంఘ్ర మహేశాఖిలావాస కాశీపతే -పాహి మృత్యుంజయా.

మృత్యుంజయా! పాహి, మృత్యుంజయా! పాహి మృత్యుంజయా!
పాహి, మృత్యుంజయా! పాహి మృత్యుంజయా!!
శంభో మహాదేవ! శంభో మహాదేవ
శంభో మహాదేవ గంగాధరా!!
హర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ
ఇతి శ్రీ మృత్యుంజయ స్తోత్రం సమాప్తమ్

మరిన్ని స్తోత్రములు

Sri Venkateswara Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం

Sri Venkateswara Ashtottara Shatanama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Ashtottara Shatanama Stotram Telugu

శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రియర్గకాన్తాయ కల్యాణనిధయే నిధయేఒర్థినామ్ |
శ్రీవేఙ్కటనివాసాయ శ్రీనివాసాయ మఙ్గళమ్ ॥
శ్రీవేఙ్కటాచలాధీశం శ్రియాఒధ్యాసితవక్షసమ్ |
శ్రితచేతనమన్దారం శ్రీనివాసమహం భజే ||

మునయః :

సూత సర్వార్థత త్త్వజ్ఞ సర్వవేదాన్తపారగ |
యేన చారాధితస్సద్యః శ్రీమద్వేఙ్కటనాయకః ॥

1

భవత్యభీష్ట సర్వార్థప్రద స్త ద్ర్బూహి నో మునే |
ఇతి పృష్టస్తదా సూతో ధ్యాత్వా స్వాత్మని తర్క్షణాత్ ॥

2

శ్రీసూతః :

ఉవాచ మునిశార్దూలా౯ క్రూయతామితి వైమునిః|
అస్తి కిఞ్చన్మహన్గోప్యం భగవత్ప్రతికారకమ్ |

3

పురా శేషేణ కథితం కపిలాయ మహాత్మనే |
నామ్నామష్టళతం పుణ్యం పవిత్రం పాపనాశనమ్ ॥

4

ఆదాయ హేమపద్మాని స్వర్ణ దీసమ్భవాని చ |
బ్రహ్మా తు పూర్వమభ్యర్చ్య శ్రీమద్వేఙ్కటనాయకమ్ ||

5

అష్టోత్త రశ తైర్దివ్యైర్నామభిర్మునిపూజితైః |
స్వాభీష్టం లబ్ధవా బ్రహ్మా సర్వలోక పితామహః

6

భవద్భిరపి పద్మైశ్చ సమర్చ్యనైశ్చ నామభిః |
తేషాం శేషనగాధీశమానసోల్లాసకారిణామ్ ॥

7

నామ్నామష్టశతం వక్ష్యే వేఙ్కటాద్రినివాసినః |
ఆయురారోగ్యదం పుంసాం ధనధాన్యసుఖప్రదమ్ ||

8

జ్ఞానప్రదం విశేషేణ మహదై శ్వర్యకారకమ్ |
అర్చయేన్నాభిర్దివ్యైర్వేజ్క దేశపదాజ్కితైః ||

9

నామ్నామష్టశతస్యాస్య ఋషిర్ర్బహ్మా ప్రకీర్తితః|
ఛన్దోఒనుష్టుప్తథా దేవో వేఙ్క దేశ ఉదాహృతః ॥

10

నీలగోక్షీరసమ్భూతో బీజమిత్యుచ్యతే బుధైః|
శ్రీనివాస స్తథాశ క్తి రృదయం వేఙ్కటాధిపః ॥

11

వినియోగ స్తథాఒభీష్టసిద్ధ్యర్థే చ నిగద్యతే |
ఓం నమో వేఙ్కటేశాయ శేషాద్రినిలయాయ చ ॥

12

వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః|
సదజ్జనగిరీశాయ వృషాద్రిపతయే నమః ||

13

మేరుపుత్రగిరీశాయ సరస్స్వామితటీజు షే |
కుమారాకల్ప సేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ ॥

14

సువర్చలాసుతన్యస్త సైనాపత్యభరాయ చ ।
రామాయ పద్మనాభాయ సదా వాయుస్తుతాయ చ ॥

15

త్య క్తవై కుణలోకాయ గిరికుజ్జవిహారిణే|
హరిచన్దనగో త్రేన్ద్రస్వామినే సతతం నమః ॥

16

శబ్ధరాజన్య నేత్రాబ్జవిషయాయ నమో నమః|
వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః ॥

17

అబ్ధికన్యాపరిష్వ క్త వక్షనే వేఙ్కటాయ చ|
సనకాదిమహాయోగిపూజితాయ నమో నమః ॥

18

దేవజిత్ప్రముఖాన న్తదైత్యసఙ్ఞ ప్రణాశినే |
శ్వేతద్వీపవసమ్మ క్త వూజితాజ్ఞియుగాయ చ ॥

19

శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ చ |
సానుస్థాపితతార్జ్యాయ తార్క్ష్యచలనివాసినే ॥

20

మాయాగూఢవిమానాయ గరుడస్కన్దవాసినే |
అన న్తశిరసే నిత్యమనన్తాక్షాయ తే నమః ॥

21

అన న్త చరణాయాథ శ్రీశైలనిలయాయ చ |
దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ ॥

22

బ్రహ్మాది దేవదుర్దర్శవిశ్వరూపాయ తే నమః |
వై కుణాగతసద్ధేమవిమానా న్తర్గతాయ చ ॥

23

ఆగస్త్యాభ్యర్థితా శేషజనదృగ్గోచరాయ చ |
వాసుదేవాయ హరయే తీర్థపఞ్చకవాసినే ॥

24

వామదేవప్రియాయాథ జనకేష్టప్రదాయ చ |
మార్కణేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ చ ॥

25

వాక్పతిబ్రహ్మదాత్రే చ చన్ద్రలావణ్యదాయినే |
నారాయణనగేశాయ బ్రహ్మ ప్రోత్సవాయ చ ||

26

శబ్ధచక్రవరానమ్రలసత్కరతలాయ చ |
ద్రవన్మృగమదాస క్త విగ్రహాయ నమో నమః||

27

కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే |
అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాఘహారిణే॥

28

తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే|
కుమారధారికావాసస్కన్దాభీష్ట ప్రదాయ చ ॥

29

జానుదఘ్న సముద్భూతపోత్రిణే కూర్మమూర్తయే |
కిన్నరద్వన్ద్వశాపా న్తప్రదాత్రే విభవే నమః ॥

30

వై ఖానసముని శ్రేష్ఠపూజితాయ నమో నమః |
సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ ॥

31

సద్భక్త నీలకణార్చ్యనృసింహాయ నమో నమః |
కుముదాక్షగణశ్రేష్ఠ నై నాపత్యప్రదాయ చ ॥

32

దుర్మేధఃప్రాణహల్డ్రే చ శ్రీధరాయ నమో నమః ।
క్షత్రియా న్తకరామాయ మత్స్యరూపాయ తే నమః ॥

33

పాణ్డవారిప్రహర్తేచ శ్రీకరాయ నమో నమః |
ఉపత్యకాప్రదేశస్థళఙ్కరధ్యాతమూర్తయే ॥

34

రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే|
లసల్ల క్ష్మీకరామ్భోజద త్తకల్హారక స్రజే ||

35

సాలగ్రామనివాసాయ శుకదృగ్గోచరాయ చ |
నారాయణార్థితా శేషజనదృగ్విషయాయ చ ॥

36

మృగయారసికాయాథ వృషభాసురహారిణే |
అజ్జనాగోత్రపతయే వృషభాచలవాసినే ||

37

అజ్జనాసుతదాత్రే చ మాధవీయాఘహారిణే |
ప్రియఙ్గుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ ॥

38

నీల ధేనుపయోధారా నేక దేహోద్భవాయ చ|
శఙ్కరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ ॥

39

సుధర్మిణీసుచై తన్యప్రదాత్రే మధుఘాతినే|
కృష్ణాఖ్యవిప్రవేదా న్త దేశికత్వప్రదాయ చ ॥

40

వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః |
త్రివిక్రమాయ మహతే హృషీకేశాయ తే నమః ॥

41

అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ |
నమః క్షీరాబ్ధినాథాయ వైకుణాచలవాసినే |

42

ముకున్దాయ నమో నిత్యమనన్తాయ నమో నమః |
విర్చిభ్యర్థితానీతసౌమ్యరూపాయ తే నమః ||

43

సువర్ణ ముఖరీస్నా తమనుజాభీష్టదాయినే |
హలాయుధజగ తీర్థసమ స్తఫలదాయినే ॥

44

గోవిన్దాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః |
అష్టోత్తరశతం నామ్నాం చతుర్థ్యా నమసాఒన్వితమ్ ॥

45

యపఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రద్ధాభక్తి సమన్వితః |
తన్మ శ్రీవేజ్క దేశస్తు ప్రసన్నో భవతి ధ్రువమ్ ॥

46

అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతమ్ |
వేఙ్కటేశాభిధేయైర్యో వేఙ్కటాద్రినివాసినమ్॥

47

అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర సంశయః |
గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం న ప్రకాశయేత్ ॥

48

శ్రద్ధాభక్తి యుజామేవ దాపయేన్నామసఙ్గహమ్ ।
ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే ॥

49

కపిలాఖ్యమహాయోగిసకాశాత్తు మయా శ్రుతమ్ |
తదుక్తం భవతామద్య సద్యః ప్రీతికరం హరేః ॥

50

ఇతి శ్రీవారాహసురాజే శ్రీ వేణ్కటాచలమాహాత్మ్యే
శ్రీవేఙ్క టేశా త్తరకతనామకథనం
నామైకషష్టిత మోఒధ్యాయః

మరిన్ని అష్టోత్తరలు:

Chandrasekhara Ashtakam In Telugu – చంద్రశేఖరాష్టకమ్

చంద్రశేఖరాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు చంద్రశేఖరాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Chandrasekhara Ashtakam Lyrics

చంద్రశేఖరాష్టకమ్ 

చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్

రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

పంచపాదప పుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాత పావకదగ్ధ మన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం

||చంద్రశేఖర||

మత్తవారణముఖ్య చర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచన పూజితాంఫ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం

||చంద్రశేఖర||

యక్షరాజసఖంశంభాక్షహరం భుజంగవిభూషణం
శైల రాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్
క్ష్వేళనీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్

||చంద్రశేఖర||

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్
అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం

||చంద్రశేఖర||

భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం

||చంద్రశేఖర||

భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం
సోమవారుణభూహుతాశనసోమపానిలఖాకృతిం

||చంద్రశేఖర||

విశ్వసృష్టి విధాయినం పున రేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశమ్ గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వై యమః

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్.
పూర్ణమాయురారోగ్యతామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః॥

మరిన్ని అష్టకములు

Bhakti Geethalu | భక్తి గీతాలు

Bhakti Geethalu

“భక్తి గీతాలు” అంటే భగవంతుని ఆరాధించే భావంతో ప్రేమ మరియు ఆదరణ కలిగించే గీతములు. ఈ గీతాలు సాధకుల మనసుని పరిశుద్ధీకరించే, అనుభవాత్మకంగా దేవుడి సన్నిధిలో ఆనందాన్ని పొందటంలో సహాయకరమైనవి. భక్తి గీతాలు దేవుని గుణములను, పరమాత్మ సత్యమును స్తుతించే వాక్యాలను మరియు సంకీర్తనలు కలిగిస్తాయి.

Bhakti Geethalu | భక్తి గీతాలు

భక్తి గీతాలు సాధకులను ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీస్తాయి, ప్రేమ, శాంతి, సమాధానం మరియు సాంత్వన అంతా వీటికి ఆధారం ఉంటాయి. ఈ క్రింది లింకుల ఆధారంగా భక్తి గీతాలు గురించి తెలుసుకుందాం…