Niddirinchi Pala Jalanidhivalene In Telugu – నిద్దిరించి పాల జలనిధివలెనే

నిద్దిరించి పాల జలనిధివలెనే – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నిద్దిరించి పాల జలనిధివలెనే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నిద్దిరించి పాల జలనిధివలెనే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: నిద్దిరించి పాల జలనిధివలెనే
సంఖ్య : 343
పుట: 233
రాగం: మధ్యమావతి

మధ్యమావతి

67 నిద్దిరించి పాల జలనిధివలెనే
వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు

||పల్లవి||

వేగుదాఁకా చిత్తగించి విద్యలెల్ల నాదరించి
బాగుగా కృపారసము పంచి పంచి
యేగతిఁ బవ్వలించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని పూఁచ వుయ్యాలను

||నిద్ది||

వాలుఁకన్నుల రెప్పల వడదాఁకి తనుతావి
చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత-
కాలము కన్నులఁ దిప్పక (ప్పీఁగ?) ప్పరే దోమతెర

||నిద్ది||

సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ
కరుణించ తలచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుడయి మించి (చీ?)
విరివి నాలవట్టాలు విసరరే సతులు

||నిద్ది||

అవతారిక:

పరమాత్ముడైన శ్రీమన్నారాయణునికి వుయ్యాలలూపుతూ మధురమైన కీర్తనతో నిద్రబుచ్చుతున్నారు అన్నమాచార్యులవారు. ఉప్పునీటి సముద్రాలు ఉవ్వెత్తు తరంగాలతో భీకరంగా వుంటే క్షీరసాగరం అలలు లేకుండా ప్రశాంతంగా వుంటుందట. ఈ దేవదేవుడు పాలజలనిధి వలెనే నిద్దిరించీ… ఈయనకి ఒద్దికతో పాదాలు ఒత్తండమ్మా! అని శ్రీదేవికి భూదేవికి చెబుతున్నారు. “సకల లోకములచే ఆరాధ్యుడై అతిశయించుచున్న ఈ శ్రీరమణుని ఓ సతులారా ఆలవట్టములు విసరండమ్మా!” అంటున్నారు.
“స్వామి మధ్య మధ్య కళ్ళు తిప్పుతున్నాడు, దోమతెర సరిగా కప్పండి” అంటున్నారు. తినబోతూ రుచియెందుకు? ఆస్వాదించండి.

భావ వివరణ:

ఓ తల్లులారా! (శ్రీదేవి, భూదేవి) ఈ శ్రీరమణుడు పాలజలనిధివలెనే (క్షీరసాగరము మాదిరి) ప్రశాంతంగా (వువ్వెత్తు తరంగాలు లేక వున్నట్లు, నిశ్చలంగా నిద్రిస్తున్నాడు). ఈయనకు ఒద్దికతో (అణుకువతో) పాదములను వొత్తండమ్మా!

వేగుచుక్క కనుపించేదాకా ఈయన నిద్రపోడు. మాబోటివారి విద్యలెల్లా ఒకపక్క ఆలకిస్తూనే మమ్మల్ని తరింపజేస్తుంటాడు. మాలోవున్న శరణార్థులపై అమితదయాళువై కృపారసమును పంచిపంచీ ఇంకా అలిసిపోతాడు. పాపం ఎట్లా పడుకొన్నాడో చూడండమ్మా! ఈ యోగీంద్రవరదుడు ఎట్లు భోగించేనోకాని ఆయన వుయ్యాల నెమ్మదిగా వూచరే (వూపండమ్మా!) అప్పుడుగాని ఆయన నిద్రించడు.

స్వామి, వాలు కన్నులరెప్పలు అరమోడ్చి నిద్రిస్తున్నాడు. మీ ఒంటి వేడిమి ఆయన ఒంటికి తాకి నిద్రాభంగం కావచ్చునమ్మా! చూడండి నిద్రలో కూడా చాలుకొన్న వూర్పులు చల్లిచల్లీ (అతిశయించిన నిట్టూర్పులు) యెలా విడుచుచున్నాడో! ఆయన భక్తుల బాధలు యెప్పుడూ వుండేవే. ఈ నీలవర్ణుని గుణం మీకు తెలుసుకదమ్మా!! ఆయనకు నిద్రపట్టదు. కొంచెంసేపు ఆ కళ్ళమీద వెలుతురు పడకుండా దోమతెరకప్పి కళ్ళు తిప్పకుండా జాగ్రత్తపడ్డారంటే నెమ్మదిగా నిద్రపడుతుందమ్మా!

ఇంకాసేపట్లో మళ్లీ సుప్రభాతం అంటూ తగులుకొంటారు. వీళ్ళు వచ్చేలోగా కాస్త నిద్రపట్టితే బాగుండును. ఈ వేంకటగిరిపై సరుగున (వెంటనే) యోగనిద్ర చాలించి లోకాన్నంతా కరుణించాలని ఆయనకెప్పుడూ ఆరాటమే. సకలలోకారాధ్యుడైన ఈ శ్రీవేంకటేశ్వరుడు అరుదుగ మించీ (అపూర్వమైన ఔన్నత్యంకలవాడు) ఓ సతులారా! ఈ స్వామి సుఖంగా నిద్రించుటకు ఆలవట్టుములు (వింజామరలు) విరివి విసరరే (కాస్తగట్టిగా వీయండమ్మా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Narayanuda Ninamamai Mantrinchivesi In Telugu – నారాయణుడ నీనామమె మంత్రించివేసి

నారాయణుడ నీనామమె మంత్రించివేసి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నారాయణుడ నీనామమె మంత్రించివేసి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నారాయణుడ నీనామమె మంత్రించివేసి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: నారాయణుడ నీనామమె మంత్రించివేసి
సంఖ్య : 494
పుట: 332
రాగం: సామంతం

సామంతం

75 నారాయణుఁడ నీ నామము మంత్రించివేసి
పారేటియీజంతువులభ్రమ విడిపించవే.

||పల్లవి||

మదనభూతము సోఁకి మగువలుఁ బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళఁ జించుకొంటా
కొదలు కుత్తికలనుఁ గూసేరు జీవులు.

||నారా||

పంచభూతములు సోఁకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుఁబూసుకొంటాను
అంచెల వీడెపురస మందు నిందు గురియుచు
యెంచి ధనముపిశాచాలిటైరి జీవులు.

||నారా||

తమితోడ మాయాభూతము సోఁకి బహుజాతి-
యెముకలుఁ దోలు నరా లిరవుచేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ జేర కెక్కడైన
తముఁ దా మెరఁగరింతటాఁ జూడు జీవులు.

||నారా||494

అవతారిక:

‘పారేటి’ జీవులు అంటే జీవనసంగ్రామంలో కకావికలై పరుగులు పెడుతున్న జీవకోటి (మనబోటివాళ్ళం) అన్నమాట. ఎందుకు వీళ్ళంతా పరుగులు పెడుతున్నారు? భ్రమకులోనైనందువల్ల. స్త్రీ మీద భ్రమ, ధనంమీద భ్రమతో, మాయ అనే భూతంపట్టి వాళ్ళు పరమాత్మ అంశ అనే జ్ఞానం లేక ‘నేను’ అంటే ఎముకలు నెత్తురు మాంసం నరాలు వున్న 60 కిలోల దేహం అనుకొంటున్నారు. మరి ఇక వాళ్ళు నారాయణుడైన శ్రీవేంకటేశ్వరుని చేరితే ఏమవుతుంది? తామెవరో తెలుసుకోగలుగుతారు.

భావ వివరణ:

ఓ శ్రీమన్నారాయణుడా! నీనామమును “మంత్రించి” ప్రయోగించినచో, పారేటి (జీవనయానంలో పరుగులు పెడుతున్న) యీ జంతువుల భ్రమలన్నీ విడిపించవే (తొలగించవయ్యా!)

ఈ జీవులకు ‘మదన భూతము’ సోకినది (మన్మథుడు అనే భూతం పట్టుకొన్నది). ఆడామగా అనే వివక్ష లేక విరిదలలై (తొలగిన విచక్షణ కలవారై) అంగమొలలై (దిగంబరులై) పెదవులు రక్తాలు చిమ్మేదాకా వీర్చి (చిమ్మించి) గోళ్ళతో గీరి, కొదలి (అతిశయించి) అవతలివారి పొందుకోసం గొంతుకలు కోసుకునే దాకా తెగిస్తారు. ఎంత దౌర్భాగ్యం!!

ఈ జీవులకి ప్రకృతిలో నున్న పంచభూతములు సోకి వశులను చేసికొని భ్రమలకు గుఱిచేసి అజ్ఞానులను చేస్తున్నవి. మన్ను పూసుకొనేవాడు ఒకడైతే తాంబూల రసాస్వాదనతో బ్రతికేవాడు ఇంకొకడు. ధనపిశాచి పట్టి జీవులు ఇటైరి. ఉచ్ఛము నీచమూ లేదు. ధనంకోసం చేయరాని పనులు చేస్తారు. ఎంత హేయమైన బ్రతుకులు!!

తమితోడ (అతి ఆసక్తిగల) ఈ జీవులకు భూతం పట్టింది. దానిపేరు “మాయా భూతము”. దానివల్ల ఈ జీవుడు వాడెవరో తెలుసుకోలేకున్నాడు. ఓ శ్రీవేంకటేశ్వరా వాడు ‘నేను’ అనుకొంటున్నది తన దేహాన్ని అనేభ్రమలో వున్నాడు. దేహంలోని తోలు, నరాలు, యెముకలు వాడి జాతి అని అనుకొంటున్నాడు. నేను అంటే జీవుడు. వాడు నిజానికి పరమాత్మ ప్రతిరూపమే. కానీ మాయవాడిని ఆవరించి, అజ్ఞానియై అనేక భ్రమలకులోనై అరిషడ్వర్గ పీడితుడై దాని పర్యవసానంగా జననమరణాల విషవలయంలో చిక్కాడు. వీడికి ఏడుకొండలవాడి దయకలిగేదాకా ఈ భ్రమలు తప్పవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Shiva Tandava Stotram In Telugu – శ్రీ శివతాండవ స్తోత్రమ్

Sri Shiva Tandava Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివతాండవ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Tandava Stotram Lyrics Telugu

శ్రీ శివతాండవ స్తోత్రమ్

జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే
గళే వలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం |
డమడ్డమడ్డమ డ్డమ న్నినాదవడ్డమద్వయం
చకార చండతాండవం తనోతు నశ్శివశ్శివమ్ ॥

1

జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్హరీ
విలోల వీచివల్లరీ విరాజమాన మూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వల ల్లలాటపట్ట పావకే
కిశోరచంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥

2

ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధుర
స్ఫురదృ(ద్ది) గంత సంతతి ప్రమోద మానమానసే |
కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది
క్వచిద్ధగంబరే మనో వినోదమేతు వస్తుని ||

3

జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబకుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే |
మదాంధ సింధురస్ఫుర త్త్వగుత్తరీయ మేదురే
మనోవినోద మద్భుతం బిభర్తు భూతభర్తరి ॥

4

సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్ర పీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాట జూటకః
శ్రియై చిరాయజాయతాం చకోరబంధు శేఖరః॥

5

లలాటచత్వరజ్వల ధనంజయ స్ఫులింగభా
నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజటాల మస్తు నః॥

6

కరాళఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాధరీ (హుతీ) కృత ప్రచండ పంచసాయకే |
ధరాధరేంద్రనందినీ కుచాగ్ర చిత్ర పత్రక
ప్రకల్పనైక శిల్పినీ త్రిలోచనే మతిర్మమ॥

7

నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
త్కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధ (బంధు) కంధరః
నిలింపనిర్ఘరీ ధర స్తనోతుకృత్తి సింధురః |
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః॥

8

ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమచ్ఛటా
వలం (విడం)బి కంఠ కందళీ (కంథరా) రుచిప్రబంధ కంధరమ్।
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం ముఖచ్ఛిదం
గజచ్ఛిదంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥

9

అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ
రసప్రవాహ మాథురీ విజృంభణా మధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంథకాంతకం తమంతకాంతకంభజే ॥

10

జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురత్
ద్ధగ ద్ధగ ద్వినిర్గమత్కరాళ బాల హవ్యవాట్ |
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వనన్మృదంగ తుంగ మంగళ
ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః॥

11

దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తికస్రజోః
ర్గరిష్ఠరత్నలోష్టయో స్సుహృద్విపక్షపక్షయోః |
తృణారవిందచక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదాసదాశివంభజామ్యహమ్॥

12

కదా నిలింప నిర్హరీ నికుంజకోటరే వసన్
విముక్త దుర్మతిస్సదా శిరస్థమంజలిం వహన్.
విలోల లోలలోచనో లలాట ఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్ఛరన్కదా సుఖీ భవామ్యహమ్ ॥

13

ఇమం హి నిత్యమేవ ముక్త ముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్రువన్నరో విశుద్ధి మేతి సంతతమ్ |
హరే గురౌ సుభక్తి మాశుయాతి నాన్యధాగతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥

14

పూజావసాన సమయే దశవక్త్రగీతం
యశ్శంభు పూజనమిదం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః ||

15

ఇతి శ్రీ దశకంఠ రావణ విరచితం శివతాండవస్తోత్రం సమాప్తమ్.

మరిన్ని స్తోత్రములు

Gopika Viraha Geetham In Telugu – గోపికా విరహగీతమ్

Gopika Viraha Geetham

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోపికా విరహగీతమ్ గురించి తెలుసుకుందాం…

Gopika Viraha Geetham In Telugu

గోపికా విరహగీతమ్

ఏహి మురారే ! కుంజవిహారే ! ఏహి ప్రణతజనబంధో !
హే మాధవ ! మధుమథన ! వరేణ్య ! కేశవ ! కరుణాసింధో !
రాసనికుంజే గుంజతి నియతం భ్రమరశతం కీలకాంత ఏహినిభృతపథపాంథ !
త్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన ! శాంత !

1

శూన్యం కుసుమాసనమిహ కుంజే శూన్యః కేళికదంబదీనః కేకికదంబః
మృదుకలనాదం కిల సవిషాదం రోదితి యమునాస్వంభః

2

నవనీరజధర ! శ్యామల సుందర ! చంద్రకుసుమరుచివేష ! గోపీగణ హృదయేశ !
గోవర్ధనధర ! బృందావనచర ! వంశీధర ! పరమేశ !

3

రాధారంజన ! కంసనిషూదన ! ప్రణతిస్తావకచరణే నిఖిలనిరాశ్రయశరణే,
ఏహి జనార్దన ! పీతాంబరధర ! కుంజే మంథరపవనే.

4

ఇతి శ్రీ గోపికావిరహగీతం సంపూర్ణమ్

కాలక్షేపో న కర్తవ్యః
క్షీణమాయుర్దినేదినే,
దేహస్య పతనం వీక్ష్య
కర్తవ్యం హరికీర్తనమ్.

మరిన్ని కీర్తనలు:

Bhudana Mahima In Telugu – భూదాన మహిమ

Bhudana Mahima

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

భరద్వాజ సంహిత లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భూదాన మహిమ నీతికథ.

భూదాన మహిమ

ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:

మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.

ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరి పైరు తయాఱయింది!

ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.

అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్పుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dasohamanu Buddhi Dalacaru Danavulu In Telugu – దాసోహమనుబుద్ధిదలచరు దానవులు

దాసోహమనుబుద్ధిదలచరు దానవులు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దాసోహమనుబుద్ధిదలచరు దానవులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దాసోహమనుబుద్ధిదలచరు దానవులు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
సంఖ్య : 5
పుట: 4
రాగం: నాట

నాట

74 దాసోహ మనుబుద్ధిఁ దలఁచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు.

||పల్లవి||

హరిచక్రముదూషించేయట్టివారే యసురలు
అరయఁ దామేదైవమన్న వారు నసురలే
ధర నరకాసురుఁడు తానే దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు.

||దాసో||

పురుషోత్తమునిపూజపొంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు

||దాసో||

సురలును మునులును శుకాదియోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు.

||దాసో||

అవతారిక:

దానవులు దేవతలు అక్కచెల్లెళ్ళ పిల్లలే కాని వారి మధ్య ఎంత అంతరం వున్నదంటే ఒకరు చెడుకు వుదాహరణైతే, ఇంకొకరు మంచికి మారుపేరు. హరికి సురులు శరణాగతులైతే, అసురులు హరి విరసులు. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు దానవులకు హరికి దాసోహమనే బుద్ధివుండదని, వారు అసూయకే అలవాటుపడ్డవారని, అందుకనే చెడిపోయారని అంటున్నారు. తన వాదనని సోదాహరణంగా నిరూపిస్తున్నారు కూడా. అసురులు అట్లావుంటే, సురులు మునులు హరి శరణాగతులు.

భావ వివరణ:

దానవులు (రాక్షసలు) దాసోహమనుబుద్ధి (శరణాగతిని) దలచరు (ఒప్పుకోరు. ఇప్పుడు (ఈ కలియుగంలో) కొందరు మానవులు, ఈసులకే (అసూయతో) పెనగేరు (ఒకరితో నొకరు కొట్లాడుచున్నారు).

అసురులంటే వేరేవరో కాదు. విష్ణుదేవుని చక్రాన్ని దూషించేవారంతా అసురులే. అ (పరిశీలించి చూచిన) తామే దైవమని అహంకరించినవారెవరైనా అసురులే. విష్ణువు భూకాంతలపుత్రుడు నరకుడు. వాడు అసురుడై లోక కంటకుడైనాడు. హరి వానిని సంహరిస్తాడు కావున భూదేవి హరిని వాడినంతము చేయవద్దని వేడుకొంది. “నేను చంపను వీడిని నీవు చావు అని తిట్టే దాకా వాడు చావడు” అని వరమిచ్చాడు విష్ణువు. నరకాసురుడు తానే దైవమని లోకకంటకుడయ్యాడు. వాడికోసం భూదేవి అంశతో పుట్టిన సత్యభామతో కృష్ణుడైన హరి తమపుత్రునే చంపించాడు. ఈరోజుల్లో నరుల్లో కూడా నరకాసురులు కోకొల్లలు.

అసురులు పురుషోత్తముని పూజదగ్గరకే పోరు. విష్ణుని జపించనివారంతా అసురులే. కృతయుగమున హిరణ్యకశిపుడు కూడా హరి నొల్లక అంతమైనాడు. ఈ కలియుగంలో కూడా కొందరు యీతని (ఈ దేవదేవుని వొల్లరు (అంగీకరించరు).

దేవతలు, మునులు, శుకుడు మొదలైన యోగులు పరమము మోక్షప్రదాత శ్రీవేంకటేశ్వరుడే అని శరణాగతితో బ్రతుకుచున్నారు. సరి (అదట్టుండగా) నేడు వైష్ణవులు కూడా కొందరు “యెరపరికాన” (రోత కలిగి) పొయ్యేరు (ద్వేషముతో జీవించుచున్నారు).

గమనిక : ఆచార్యులవారి భావన ఇదేనేమోనని నా ఊహ. నా ఆశ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu | శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

Sri Varalakshmi Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu Lyrics

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

  • ఓం ప్రకృత్యై నమః
  • ఓం వికృత్యై నమః
  • ఓం విద్యా నమః
  • ఓం సర్వభూతహితప్రదాయై నమః
  • ఓం శ్రద్ధాయై నమః
  • ఓం విభూత్యై నమః
  • ఓం పరమాత్మికాయై నమః
  • ఓం వాచే నమః
  • ఓం పద్మాలయాయై నమః
  • ఓం పద్మాయై నమః
  • ఓం శుచైయై నమః
  • ఓం స్వాహాయై నమః
  • ఓం స్వధాయై నమః
  • ఓం సుధాయై నమః
  • ఓం ధన్యాయై నమః
  • ఓం హిరణ్మయ్యై నమః
  • ఓం లక్ష్మ్యై నమః
  • ఓం నిత్యపుష్టాయై నమః
  • ఓం విభావర్యై నమః
  • ఓం ఆదిత్య నమః
  • ఓం డిత్యై నమః
  • ఓం దీప్తాయై నమః
  • ఓం వసుధాయై నమః
  • ఓం వసుధారిణ్యై నమః
  • ఓం కమలాయై నమః
  • ఓం కాంతాయై నమః
  • ఓం క్షమా నమః
  • ఓం క్షీరోదార్ణవ సంభవాయై నమః
  • ఓం అనుగ్రహప్రదాయై నమః
  • ఓం బుద్ధయై నమః
  • ఓం అనఘాయై నమః
  • ఓం హరివల్లభాయై నమః
  • ఓం అశోకాయై నమః
  • ఓం అమృతాయై నమః
  • ఓం దీప్తాయై నమః
  • ఓం లోక శోక వినాశిన్యై నమః
  • ఓం ధర్మ నిలయాయై నమః
  • ఓం కరుణాయై నమః
  • ఓం లోకమాత్రే నమః
  • ఓం పద్మ ప్రియాయై నమః
  • ఓం పద్మ హస్తాయై నమః
  • ఓం పద్మాక్షకై నమః
  • ఓం పద్మ సుందర్యై నమః
  • ఓం పద్మోద్భవాయై నమః
  • ఓం పద్మముఖీ నమః
  • ఓం పద్మనాభ ప్రియాయై నమః
  • ఓం రమాయై నమః
  • ఓం పద్మమాలాధరాయై నమః
  • ఓం దేవ్యయ్ నమః
  • ఓం పద్మిన్యై నమః
  • ఓం పద్మగంధిన్యై నమః
  • ఓం పుణ్యగంధాయై నమః
  • ఓం సుప్రసన్నాయై నమః
  • ఓం ప్రసాదాభిముఖీయై నమః
  • ఓం ప్రభాయై నమః
  • ఓం చంద్రవదనాయై నమః
  • ఓం చంద్రాయై నమః
  • ఓం చంద్ర సహోదర్యై నమః
  • ఓం చతుర్భుజాయై నమః
  • ఓం చంద్రరూపాయై నమః
  • ఓం ఇందిరాయై నమః
  • ఓం ఇందుశీతలాయై నమః
  • ఓం ఆహ్లాదజనన్యై నమః
  • ఓం పుష్టేయాయ్ నమః
  • ఓం శివాయై నమః
  • ఓం శివకర్యై నమః
  • ఓం సత్యై నమః
  • ఓం విమలాయై నమః
  • ఓం విశ్వజనన్యై నమః
  • ఓం తుష్టయే నమః
  • ఓం దారిద్ర్యనాశిన్యై నమః
  • ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః
  • ఓం శాంతాయై నమః
  • ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  • ఓం శ్రీయై నమః
  • ఓం భాస్కర్యై నమః
  • ఓం బిల్వనిలయాయై నమః
  • ఓం వరారోహాయై
  • ఓం యశస్విన్యై
  • ఓం వసుంధరాయై
  • ఓం ఉదారాంగాయై
  • ఓం హరిణ్యై
  • ఓం హేమమాలిన్యై
  • ఓం ధనధాన్యకర్యై
  • ఓం సిద్ధయే
  • ఓం స్త్రైణసౌమ్యాయై
  • ఓం శుభప్రదాయై
  • ఓం నృపవేశ్మగతానందాయై
  • ఓం వరలక్ష్మ్యై
  • ఓం వసుప్రదాయై
  • ఓం శుభాయై
  • ఓం హిరణ్య ప్రాకారాయై
  • ఓం సముద్ర తనయాయై
  • ఓం జయాయై
  • ఓం మంగళాయై
  • ఓం విష్ణువక్ష స్థల స్థితాయై
  • ఓం విష్ణుపత్న్యై
  • ఓం ప్రసన్నాక్ష్యై
  • ఓం నారాయణ సమాశ్రితాయై
  • ఓం దారిద్య్ర్య ధ్వంసిన్యై
  • ఓం దేవ్వైయ్
  • ఓం సర్వోపద్రవ వారిణ్యై
  • ఓం నవదుర్గాయై
  • ఓం మహాకాళ్యై
  • ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై
  • ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై
  • ఓం భువనేశ్వ ర్యై
  • ఓం శ్రీ దేవ్యై

లక్ష్మ్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామావళి: సమాప్తా

మరిన్ని అష్టోత్తరములు:

Sri Shiva Pratah Smarana Stotram In Telugu – శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

Sri Shiva Pratah Smaranam Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ ప్రాతఃస్మరణమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Pratah Smarana Stotram Telugu

శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం
గంగాధరం వృషభవాహన మంబికేశం |
ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

1

ప్రాత ర్నమామి గిరిశం గిరిజార్థదేహం
సర్గ స్థితి ప్రళయకారణ మాదిదేవం |
విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

2

ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాన్తవేద్య మనఘం పురుషం మహాన్తం |
నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

3

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే నుదినం పఠంతి |
తే దుఃఖజాతం బహుజన్మసంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో ||

4

ఇతి శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

మరిన్ని స్తోత్రములు

Aevvarum Ganani Vamdu Yashoda Gane Natte In Telugu – ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
సంఖ్య : 316
పుట : 213
రాగం : శంకరాభరణం

శంకరాభరణం

36 ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె

||పల్లవి||

ఘనయోగీంద్రులమతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె.

||ఎవ్వ||

అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికలపాలఁ జిక్కినాఁ డట్టె.

॥ఎవ్వ||

యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టే
అంది కృష్ణావతారముయినట్టిదేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె.

||ఎవ్వ|| 316

అవతారిక:

ఒకరోజు యశోదకు కృష్ణయ్య అల్లరి వినిపించడం లేదేమిటబ్బా! అని కొడుకును రహస్యంగా చూద్దామని మెల్లిగా నక్కి చూసిందట. అక్కడ పడుకొన్నది ఆవిడ కొడుకా? ఆయన, పరమేష్ఠితండ్రి, ఆదినారాయణుడు. కొంచెం తెరుచుకొనియున్న ఆస్వామినోట్లోంచి లోకాలన్నీ కనిపిస్తున్నాయట. దిమ్మతిరిగి పోయిందావిడకి. ఆయన ఎవ్వరూచూడలేని శ్రీమన్నారాయణుడు. భయంతో చేతులు జోడించిందా గొల్లది. చటుక్కున లేచి “అమ్మా”! అన్నాడు. అంతా కలలాగా మరచిపోయింది ఆ వెట్టితల్లి. అన్నమాచార్యులవారి ఈ అద్వితీయ కీర్తనకి ఈ పిట్టకధే మూలభూతి. దీనిని భావించి తరించండి.

భావ వివరణ:

ఆహా! ఏమి ఈ యశోద భాగ్యము! ఎవ్వరూ గాననివాడు (అగోచరుడై యెవ్వరికీ కనుపించని పరమాత్మ) ఈమె పొత్తిళ్ళలో పవ్వళించినాడే!! ఈ దేవదేవుడే, పితామహుడైన బ్రహ్మకే కన్నతండ్రియా? అట్టె (అతిసులువుగా) బాలుడయ్యెను. ఏమి ఆశ్చర్యము.

ఘనులైన యోగీశ్వరుల మదిలోకూడా కట్టుబడనివాడు, ఓహెూ! ఈనాడు రేపల్లెలో ఒక పనిలేని రోటికి కట్టబడినాడే!! సుకుమారమైన ఆయన పాదములెలావుంటాయో చూడాలని తహతహలాడే దేవతలకు తన అరిపాదములను చూపనట్టిదేవుడు ఈరోజు రేపల్లెలో ఒక కొయ్య బండికి చూపించి సూటిగా తన్నాడే!! ఏమి ఆ శకటాసురుని అదృష్టము!!

అమృతము కొరకై క్షీరసాగరమును చిలికించి, నిస్వార్ధంగా దేవతలందరికీ పంచిపెట్టించిన పురుషోత్తముడు, తానే తమితో (ఆసక్తితో) గోపికల ఇండ్లలో వెన్నదొంగిలించుచున్నాడే!! గుమురై (గుమిగూడిన) దేవదానవ కోట్లకు కూడా చిక్కని శ్రీమన్నారాయణుడు, నేడు బృందావనమున గొల్లభామలకు భ్రమకలిగినవానిలా చిక్కినాడే!! ఏమివింత!

ఇందుగలడు, ఇందులేడు అని ఇదమిద్ధంగా యెంచి చూపశక్యముకాని సర్వాతర్యామి ఈ రేపల్లెవాడలలో యెంత అందముగా ఆడుచున్నాడో చూడండి. ఆనాడు (ద్వాపరయుగమున) కృష్ణావతారమునంది పైలీలలన్నీ చేసినట్లే నేటి కలియుగంలో, యిందున (ఈ తిరుమలలో) శ్రీవేంకటాద్రి నెక్కి శ్రీవేంకటేశ్వరుడై నిలిచియున్నాడే!! ధన్యోస్మి తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uma Maheshwara Sthotram In Telugu | ఉమా మహేశ్వర స్తోత్రం

Uma Maheshwara Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమా మహేశ్వర స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Sthotram In Telugu Lyrics

ఉమా మహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

1

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

2

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ట్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

3

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

4

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

5

నమః శివాభ్యామతిసుందరాభ్యా
మత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

6

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

7

నమః శివాభ్యామశుభాపహాభ్యా
మశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

8

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

9

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాభోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

10

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

11

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి ||

13

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్ |

మరిన్ని స్తోత్రములు: