మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శంఖ లిఖితుల కథ.
శంఖ లిఖితుల కథ
పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేద వేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.
తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.
చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.
మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్పుని చంపడము, విప్పుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడ వైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటనే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిర మ్మనాడు.
అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విపులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక పూజ అనేది భక్తులు వినాయకుడు దేవుడిని ఆరాధించడానికి విధానము. ఈ పూజలో వినాయకుడిని ఆవాహన, ప్రణామం, ఆరతి, నైవేద్యం, మంత్రార్చన మరియు ఆయుధాల అర్పణ ఉంటుంది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
స్వాతంత్ర్య సమరయోధులనాటి నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రతిజ్ఞా పాలన కథ.
ప్రతిజ్ఞా పాలన
స్వరాజ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రతి భారతీయుడు వందేమాతర నినాదాలు చేస్తూ బ్రిటిషర్లకు గుండెదిగులయ్యాడు. స్వదేశాభిమానంతో విదేశీవస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తననుండీ దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది. అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ళ న్యాయస్థానాల్లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞబూనాడు.
డిసెంబర్ 1924 లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందఱో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందఱూ చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్ళాడు. అందఱూ విభ్రమంతో చూడసాగారు.
“అయ్యా! గొప్ప చిక్కొచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచండి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తాను” అని అర్థించాడు ఇందోర్ మహారాజు. ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించి నట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింప బడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయివుండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యావవాదిని ఎన్నుకున్నాడు.
మరెవరైనా అయివుంటే “మహాభాగ్యం” అని కేసు ఒప్పుకునేవారే. కానీ ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు “అయ్యా! క్షమించండి. ఆంగ్లన్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వసాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేను” అని జవాబిచ్చాడు. ఆ న్యాయవాది సత్య వాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు.
ఆ న్యాయవాది “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
ఏమైనా రాని ఏమైనా కానీ అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణమ్. 50 లక్షల రూపాయలొస్తున్నా కొంచంకూడా ప్రలోభ పడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశ బంధువైనారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రామ సహస్రనామ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హనుమాన్ చాలీసా నీ మనము ఎక్కువగా, సంస్కృతం లోను, మరియు, ఇతర భాషలలో చూసి వుంటాము, కాని ఎం.ఎస్ రామారావు గారు మనందరికోసం తెలుగు లోకి అనువదించిన హనుమాన్ చాలీసా గురించి మన అంతర్జాల స్థలం అనగా భక్తివేద్.కం నందు తెలుసుకుందాం.
భాష్యకారుడు అంటే వ్యాఖ్యానం చేసేవాడు అని అర్థం. భగవంతుని లీలలను గురించి సోదాహరణంగా వ్యాఖ్యానించి, భక్తిని పెంపొందింపజేస్తారు భాష్యకారులు. వైష్ణవ పరిభాషలో రామానుజాచార్యుల బిరుదు అది. అన్నమాచార్యులవారి ఈ కీర్తనలో తన గురువుని కీర్తిస్తూ మా భాస్యకారులు మమ్మల్ని దొడ్డవాడిని చేశారు. నిజానికి మేము పామరులమే. ఏమీ యెఱగని మమ్ము “అన్నమాచార్యులవారిని చేసి యెక్కువ చేసి అనుగ్రహించారు అంటున్నారు. “తన్న” అంటే కోల్పోబడిన… లేక… కోల్పోయిన అని అర్థం. ఇట్లా సూటిగ నిఘంటువులో దొరకని చాలామాటలున్నాయి, ఈ కీర్తనలో.
భావ వివరణ:
ఈ భాష్యకారులు (రామానుజాచార్యులవారు) ఏమీ యెరుగని పామరులమైన (అజ్ఞానులమైన) మమ్ము ఆచార్యపదవితో దొడ్డవానిని (గొప్పవానిని) చేశారు.
గతచన్న (గతించిపోయిన, లేక, కోల్పోయిన వేదాలను కమలజునకు (పద్మసంభవుడైన బ్రహ్మకు తిరిగి ఇచ్చిన ఆతని (శ్రీహరి) దయవలన అన్నియు నెఱిగి, గతిలేని (సక్రమమైన ధర్మ మార్గంలేని) కలియుగంలో వచ్చి (అవతరించి) ప్రతిపాదించగలిగె (నిరూపించగలిగెను… అంటే భగవంతుని సాక్షాత్కరింపజేసెను) ఈ భాష్యకారులు.
అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించఁగ
యేలమి శ్రీవేంకటేవు నెంచి చూచితే
కలిమిగల యీ కాంత కౌఁగిటఁ బెనఁగఁ గాను
నిలువెల్లా సిరులై నిండిన ట్టుండెను
||ఎన్ని||
అవతారిక:
ఈ తిరుమలేశుడు యెన్ని మహిమలు గలవాడె! అని ఆశ్చర్యపడుతున్నారు అన్నమాచార్యులవారు. ఆ మహిమలన్నీ కన్నులపండువగా శోభిల్లుతున్నాయని అంటున్నారు. అన్నమయ్యకి ఈ మధురమైన భావలహరియెలా వస్తుందా అనిపించి, ఏడుకొండలవాడే ఆ భావలహరిని ఆయనలో యెగసిపడేలా చేస్తాడు అని సమాధానపడ్డాను. శ్రీమహాలక్ష్మియైన అలమేల్మంగ ఈ స్వామి కౌగిట్లో కరిగే తరుణంలో ఆవిడ ఒంటిమీద నగలన్నీ ఈయనకు అంటుకున్నాయట. భళి భళీ! నీ వూహ భావాతీతమయ్యా! అన్నమయ్యా!
భావ వివరణ:
ఈ దేవదేవుడు యెన్ని మహిమలు కలవాడో యేమని చెప్పగలను? అవి కన్నులపండుగలై అన్నీ నన్ను దగ్గరై అలరించుచున్నవి.
ఈస్వామికి కర్పూరపు వంటిపై మెత్తారు. ఆకలింప (ఆరంగారంగవేసిన) ఆకాపు ఈ పురుషోత్తమునికి ఎలావున్నదంటే… పాలసముద్రములో, పవ్వళించినందున అలల తాకిడికి అంటిన లేతలుంగారు రంగు మీగడ బాగా అంటుకొని మెలపుతో (మెత్తినట్లుగా) వున్నది.
పునుగుపిల్ల నుంచి తీసిన సుగంధద్రవ్యము తట్టుపునుగు. దేవతలందరిలో శిఖామణి (తలమానికమైన) ఈ స్వామి నిమజ్జనానంతరం తట్టు పునుగు కాపు వేస్తారు (మెత్తుతారు). మరి పరికించి చూచితే అది యెట్లా వుంటుందంటే… చిట్టకాన (శృంగారలీలగా) అలనాడు రేపల్లెలో ఈ శంగారరాయుడు అనేక “చీకటి తప్పులు” సేసినందున ఆ రాత్రులన్నీ ఈయన వంటిపై ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని, అందాలమేనిపై ఆ తట్టు పునుగుకాపు ఇంకా అందము పెంచుతున్నది. నేడు అలమేల్మంగతో చేరిన ఈ మహానుభావుడు అట్టె (అదిగో) యెలావున్నాడంటే… కలిమికాంత (శ్రీమహాలక్ష్మియైన) ఆదేవిని ఈ శ్రీవేంకటేశ్వరుడు బిగి కౌగిట జేర్చగా, పెనగులాడెడి, ప్రేయసి ఒంటిపై నగలన్నీ ఈ చిలిపి శ్రీనావాసునికి అటుకొన్నవా అన్నట్లుంది. అందుచేతనే ఈయనకు నిలువెల్లా సిరులై (నగలై) నిండిపోయినవా అన్నట్లుంది. ఇకపై చెప్పే శక్తి నాకు లేదు తండ్రీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
విక్రమార్కుని సాహసగాధల నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వితరణశీలి విక్రమార్కుడు నీతికథ.
వితరణశీలి విక్రమార్కుడు
విక్రమార్కుని ధైర్యసాహసాలు దానపరోపకారగుణాలు త్యాగనిరతి పేరుప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి “నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతులు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.
ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు “స్వామి! విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు. అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండి” అని ప్రార్థించాడు. సన్యాసి “రాజా! నీకొక సూక్ష్మోపాయం చెబుతాను. హిమవన్నగర సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయప్రాంతంలోకి ప్రవేశించు. గుండమొకటి త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుంది” అని హితము చెప్పాడు.
సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన కాళికాదేవితో “ప్రతిదినమూ ఏడుకోట్ల ధనం నాకు రావాలి” అని అడిగాడు. “నాయనా! ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుంది” అని దేవి చెప్పి అంతర్ధానమయినది. అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.
Vitharanasili Vikramarkudu Katha
విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నది. కైలాశశిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరినాడు “గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”. దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి “తథాస్తు” అని ఆశీర్వదించింది.
ఈ విషయం తెలుసుకున్న అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి “రాజా! నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడు” అని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.
పిల్లలూ! మరి మనకింతటి విశాల హృదయం వితరణగుణం ఉన్నాయా?
శ్రీమన్నారాయణుని స్తుతిస్తున్నారు అన్నమాచార్యులవారు. ‘కుచ్చి’ అంటే కుచించుకుపోయి, లేక బాగా తగ్గిపోయి అని అర్థం. అచ్చుతుడంటే ‘చ్యుతి’ లేక నాశనమెరుగనివాడు. “ఓ ప్రభూ! అచ్చుతుడనే పేరుగల నీవు కాక, రక్షించే వారెవరు వున్నారు? అణకువతో నిన్ను శరణని కొలిచితేచాలు. ఈ మాటే గుర్తుగా మమ్ము గావగదే!” అంటున్నారు భక్తిని ప్రకటించాలి అంటే శరణాగతిని మించిన ఉపాయము లేదు. ఈ కీర్తన వివరణ అనుకున్నంత తేలికకాదని పల్లవి చదవంగానే అర్థం అయింది. అయితేనేమి ఆదిలోనే ఆదిదేవునితో అంతయు నీవేహరి పుండరీకాక్ష! అన్నాము కదా! ఇంకా భయమెందుకు? పదండి ముందుకు.
భావ వివరణ:
ఓ దేవదేవా! అచ్చుతుడు (అచ్యుతుడు) అనే పేరుగల నీవు తప్పించి, మాకు మరొక దిక్కులేదు. నీకు నేను కుచ్చి (వినమ్రుడనై) నీవే శరణని కొలిచితిని. నన్ను గురుతుగ (నన్నే లక్ష్యముగా) కావగ (రక్షింపు తండ్రీ)
దాకొని (అవ్యక్తుడవై) జగములనన్నింటినీ సృజించు పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని సృజించి నీవు ఆయనకు తండ్రిగారైనావు. ఆనాడు సోమకుడు అనే రాక్షసుడు ఆయన దగ్గరనుంచి చదువులను (వేదములను కాజేస్తే నీవు కైకొని (పూనుకొని) వాడిని చంపి, వాటిని కాపాడినావు. నీకంటే రక్షకులెవరు?
ఏకోదకముగా (ఒక్క నీరు తప్ప ఇంకేమీ లేనట్లుగా వున్నప్పుడు, వటపత్రశాయివై (ఒక్క మఱియాకుపై పవ్వళించిన శిశువు వలె యీదేటి (తేలిన) నీకంటే దీకొని పలికిన (ధైర్యంగా చెప్పాలంటే) కాలంబుల కొనదేలిన (యుగాంతాలలో కూడావుండే దేవుడు మఱివేఁడి (ఇంకలేడయ్యా!)
శ్రీవేంకటాద్రి మీద వెలసి వరములనొసగే శ్రీపతీ! నీకంటే తావున గన్నుల జూడ (నెలకొని చూడాలంటే) ఇంకొక ప్రత్యక్షదైవము లేనేలేడు. వేవేలకు (వేలకొద్దీ శరణాగతుల కొరకు) వైకుంఠపతివై ఈ తిరుమలలో వెలసిన నీకంటే అంతరంగమున (మానసాకాశమున) భావించి చూచిన (భావనలో నిలిపి సందర్శించిన) ఇంకమరి యొక పరోక్షదైవము (ఇంద్రియములకు _గోచరింపని పరమాత్మ) మరి వేఁడీ (ఇంకాయెవ్వరున్నారు?)