Nalam Va Tava Naya Vachanam In Telugu – నాలం వా తవ నయవచనం

నాలం వా తవ నయవచనం - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాలం వా తవ నయవచనం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నాలం వా తవ నయవచనం – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : నాలం వా తవ నయవచనం
సంఖ్య : 157
పుట : 113
రాగం : రీతిగౌళ

రీతిగౌళ

27 నాలం వా తవ నయవచనం
చేలం త్యజ తే చేటీ భవామి

||పల్లవి||

చల చల మమ సంసర్ఘటనే కిం
కులిశహృదయ బహుగుణవిభవ
పులకిత తనుసంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి.

||నాలం||

భజ భజ తే ప్రియాభామాం సతతం
సుజన స్త్వం నిజసుఖ నిలయ
భుజ రేఖా రతి భోగిభవసికిం
విజయీభవ మద్విధిం వదామి.

||నాలం||

నయ నయ మా మనునయనవిధం తే
ప్రియకాంతాయాం ప్రేమభవమ్
భయహార వేంకటపతే త్వం మ-
త్రియో భవసి శోభితా భవామి.

||నాలం||

అవతారిక:

జయదేవకవి స్ఫూర్తితో చాలామంది గీర్వాణలో శృంగార కీర్తనలు రచించారు. అన్నమాచార్యులవారు సాళ్వ నరసింహరాయలు కొలువులో వున్నప్పుడూ అసంఖ్యాకమైన సరసశృంగార కీర్తనలు చెప్పారు వేంకట మకుటంతో రాజుగారి ఆస్థానంలో విద్వత్ గోష్ఠులు జరిగే తరుణంలో పాండితీ ప్రదర్శనకు కవులు సంస్కృతంలో కవిత్వం చెప్పేవారేమో అనిపిస్తుంది. ఈ కీర్తనలో నిందాస్తుతిని ఇతివృత్తంగా యెన్నుకొన్నారు. నాయిక విర హెూత్కంఠితయై స్వామిని నిందిస్తున్నది. దెప్పి పొడుస్తున్నది. చివరికి రాజీకి రాక తప్పలేదు. నీవు నా ప్రియుడివైతే నేనూ శోభిస్తాను కదయ్యా! అంటున్నది.

భావ వివరణ:

నీయొక్క నయవంచనతో కూడిన మాటలు ఇక చాలించవయ్యా! ముందు నా పైట కొంగును విడిచిపెట్టు. నీదాసినౌదునులే. నన్ను వదలిపెట్టు.

ఓ కులిశహృదయా! (కఠినహృదయుడా! నీకు నాతో పొత్తు యెందులకు? చాలు చాలు. పో పొమ్ము. ఓ బహుగుణ విభవా! (అనేక గుణములు పుణికి పుచ్చుకున్నవాడా!) చాలు చాలు పో పో. నేను పులకించిన గాత్రము (శరీరం) వలన పొందిన వేదన యొక్క మాలిన్యమును ధరించియున్నాను. ఇక నా అహమును విడనాడి నీకు వశమైతిని.

నీవు యెల్లప్పుడూ నీ వలపుకత్తెనే స్మరిస్తుంటావు. నీవు గొప్పవాడివి కదా! గొప్పవాళ్ళకి స్త్రీ వ్యసనం సహజమేలే. పైగా నీవు బ్రహ్మానందానికి నిలయుడవట కదా! నీ భుజములపై రతికూటముల చిహ్నములు కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నాయి కదా! పోనీలే. నీకు అంతా విజయమేలే. నా తిప్పలు నీకెందుకు పట్టాయి గనుకా!

నన్ను బుజ్జగించే విధానమును కూడా కాస్త నీవు తెలుసుకోకూడదటయ్యా! నీ ప్రియకాంతకే నీవలపులనందించుకో. మధ్యలో నిన్ను కాదన్న వాళ్ళెవరు? నాకేమి పట్టింది? భయహరుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు నా ప్రియుడవైనచో నేను కూడా శోభించెదను కదా! స్వామీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sai Bratuku Batalu In Telugu – సాయి బ్రతుకు బాటలు

Sai Bratuku Batalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి బ్రతుకు బాటలు గురించి తెలుసుకుందాం…

Sai Bratuku Batalu Telugu

సాయి బ్రతుకు బాటలు

లక్ష్య సాధనతో విద్య లక్షితముగ
తలచిన గురిని సాధించ వలయు నెపుడు
లక్ష్య సిద్దియే లేకున్న లక్ష్య పెట్ట
రెవరు వారి బ్రతుకులనీ ఇలను సాయి

1

నింగి చూసి భ్రమించెడు నీలి తెరలు
కొండ తోను పందెము గాసి కుప్పగూలు
తల్లి ఒడిని మరచినట్టి తనయులెల్ల
ఎంత ఎదిగి పోయిన లాభమేమి సాయి

2

నీవు పెంచిన తోటకు నీరు లేక
కలుపు మొక్కలు పెరుగుచు కలత పెట్టె
ముళ్ళతో నిండె నీ వనములిట నేరి
వేయ దయతోడ నిలువుము ప్రేమ సాయి

3

తెల్లనగు కాగితాలపై నల్ల రాత
జీవితమ్మన రంగు పేజీలు గావు
నడుమ వచ్చిన అమృతంపు నాణ్యతయును
వ్యర్థమే కాద యోచింపవలయు సాయి

4

సాగ నది వోలె జీవిక సాగి పోవ
మధ్యలో దూరు మాయని మచ్చ ఝరులు
మాటి మాటికి మాయచే మరియు మారె
మాయ వల నుండి కాపాడు మమ్ము సాయి

5

నడిమి సంద్రము నందున్న నావ మేము
మధ్య తరగతి బ్రతుకులు మమ్ము గాంచు
కష్ట సుఖముల చుట్టాలు కనుల ముందు
అలల మాదిరి ఎదురుగ నయ్యె సాయి.

6

ఆపి ఏ రాగ మనెద నేను
ఆకలియను నీ రాగమునాలపించ
ఇప్పుడే పుట్టిన పసికందేని చూడ
కాటికేగెడు ముసలి రాగమిది సాయి

7

విర్ర వీగుట తప్ప వివేకి ఎవరు
తాను ముందనుచు జనుడు తలచునెపుడు
సకల జీవులన్ని తెలివి చాలవనెడు
మతులు చెడ్డ ఈ భ్రమలను మార్చు సాయి

8

కడుపు తిప్పలుతో జీవ కణిక లిచట
అలమటించు చుండెను దేవ ఆలకించు
ఆకలి కలి పిశాచమై అరయు చుండ
ఆపకుండ నీ కరుణను చూపు సాయి

9

చదువులమ్మకు యిష్టమౌ చంటి పాప
మట్టి నిండిన మెదడుకు మనసు గూర్చి
అక్షరముల తోడనె లోకమంత వెలుగు
చిలుకరించెడు గురువులు చేరు సాయి

10

కలమునే ఆయుధమ్ముగ కనుల జూచి
పదములన్నియు నొకటిగా పదిల పరచి
నీతి విలువ చాటుచు అవినీతినణచి
చదువులమ్మ బిడ్డ కవిని సాకు సాయి

11

ఉన్న ఊరి దొరతనమ్ము ఉచ్చుపన్ని
చేత గాని వారిని చేసి చిదిమివేయ
ఆలు బిడ్డల తలిదండ్రులాత్మ మరచి
వెడలు జనముల కరుణించు ప్రీతి సాయి

12

ఏమిటి మరి చిత్రమ్మేది ఎరుక రాక
అడుగు చుంటిని చెప్ప రావయ్య ఇప్పుడు
ముందు చూడు నీయాలయ మందు చూడు
వరుస గూర్చుండిరీ ముష్టి వారు సాయి

13

పనుకు బట్టెను ఫలములు పసరు లేక
పాహియనుచిల దరి చేరె పసరు కోరి
కనికరమ్మును పూనుచు గాంచవయ్య
ప్రేమ మూర్తివి నీవు మా ప్రీతి సాయి

14

ఎండమావి బ్రతుకు దూరమెంత యున్న
నీడ పట్టు కుదురుగ నిలిచి యుండు
మగని బ్రతుకును వలచిన మగువతీరు
ఇలకు ఈ జంటయే శోభ నిచ్చు సాయి

15

తెలివి యున్నను జనులకు తెల్ల మొహము
చదువులెన్ని యున్నను వీరి చవట బుద్ధి
విందు ముందరున్నను రుచి విధమెరుగదు
నీవు మార్చగ ఇటు రమ్ము నియతి సాయి

16

పల్లె పల్లె నీరాకకై పరితపించె
వానదేవుడ కరుణించి వరములిమ్ము
బ్రతుకులన్ని వాడక ముందు వాన నొసగి
మాకు దిక్కువై నిలిచిపో మాదు సాయి

17

ఒక్క చినుకైన రాదేమి ఓర్మి గూర్చ
ధరణి తల్లికి కానని దాహ మయ్యె
మేఘునకు నెట్టి మబ్బులు మేళ వించ
యిట్టి పగబూనుచు అలిగె నేమి సాయి

18

ధాన్యరాసులు కాలము దారి మరిచి
ఆకలి కడుపులన్నియు అధిక మయ్యె
రాజ్య పదవులేమియు కానరావు ధరణి
నీవు దిగిరాగ నేమిత్తు నిజము సాయి.

19

ఆశయనెడు మూటతొ వచ్చే అవని తల్లి
అలసి పోయెను ఈ భారమంత మోసి
భాగ్య మెంతున్న బాధల బరువు పెరిగె
భారములు దించ రావయ్య భవ్య సాయి.

20

చల్లనైన కరుణ చూపు శాంత మూర్తి
చెదిరి పోతున్న బ్రతుకుల చింత దీర్చి
లోకమంతను నీ ప్రేమలోన నిలిపి
మా మదికి రాజువై యేలు మహిత సాయి

21

మరిన్ని భక్తి గీతాలు

Sri Hanuman Badabaanala Sthotram In Telugu | శ్రీ హనుమాన్ బడబానలా స్తోత్రం

Sri Hanuman Badabaanala Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ బడబానలా స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Sri Hanuman Badabaanala Sthotram In Telugu

శ్రీ హనుమాన్ బడబానలా స్తోత్రం

ఓం నమో భగవతే విచిత్ర వీరహనుమతే ప్రళయ కాలానలప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీరదైత్య దానవ యక్ష రక్షోగణ గ్రహబంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేతగ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకినీ డాకినీ గ్రహ బంధనాయ కాకినీ కామినీ గ్రహబంధనాయ బ్రహ్మ గ్రహబంధనాయ బ్రహ్మరాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారీ గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్ఛ ఆగచ్ఛ ఆవేశయ ఆవేశయ మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన నారీముఖ బంధన సభాముఖ బంధన శతృముఖ బంధన సర్వముఖ బంధన లంకా ప్రాసాద భంజన అముకం మే
వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం హ్రీం క్లీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ శతౄన్మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖేఖే శ్రీరామ చంద్రాజ్ఞయా మమకార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హైం హ్రాం హ్రః ఫట్ స్వాహా విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ శతౄన్ భస్మ కురుకురు హనహన హుం ఫట్ స్వాహా.

ఓం శ్రీ రామాయ నమః

ఓం అస్య శ్రీహనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతారామ చంద్ర ప్రీత్యర్ధం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే.

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిఙ్మండల యశో వితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీదహన ఉమా అనలమంత్ర ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీగర్భ సంభూత శ్రీ రామ లక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార

సుగ్రీవ సాహాయ్య కరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వ పాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన డాకినీవిధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వభూతమండల సర్వపిశాచమండలోచ్చాటన భూతజ్వరై కాహికజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది ఛింది ఛింది యక్షరాక్షసభూత ప్రేత పిశాచన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం శ్రీం ఓం నమోభగవతే శ్రీ మహాహనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం ప్రైం హ్రాం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి…

ఓంహం ఓంహం ఓంహం ఓం నమో భగవతే మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హరహర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయమారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారాయ సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వగ్రమోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురుకురు. శిరః శూల గుల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి . తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత బిరిగత రాత్రించర దివాచర సర్పాన్నిర్విషం కురుకురు స్వాహా

రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా చ్ఛేదయ చ్ఛేదయ స్వమంత్ర స్వయంత్రస్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశ్రతూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా.

మరిన్ని స్తోత్రములు:

Sri Annapurna Stotram In Telugu – శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్

Sri Annapurna Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Annapurna Devi Stotram In Telugu

శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్

శ్లో॥ 1

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||

సీ॥ నిత్యమానందమ్ము నెనరుతొ గల్పించు శ్రేష్ఠాభయపు దాత శివుని రాణి సౌందర్య శోభకు, సాగరమీవమ్మ సాక్షాన్మహేశ్వరి జనని వీవు సర్వ పాపంబులన్ సమసిపోవగజేయు మాతవు రక్షింపు మమ్ము నీవె హిమవంతు వంశపు ఇంపు పెంచగ బుట్టి పావనంబొనరించు పార్వతీవు.

తా॥ ప్రతిదినము ఆనందమును ప్రేమతో యిచ్చెడి ఈ శివుని అర్ధాంగి శ్రేష్ఠమైన అభయ ప్రదాయిని తల్లీ! నీవు సౌందర్యపయోనిధివి, సాక్షాత్తు మహేశ్వరివి. సర్వ పాపములను నశింపజేసెడి జననివి నీవు మమ్ము రక్షింపుము. హిమవంతుని పుత్రికయైన పార్వతివి నీవే. కాశీ పట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా మాకు జ్ఞానమను భిక్షను ప్రసాదించి అండవై నీవే దయతో మమ్ము కాపాడుము. నీదయను మాకు పట్టుగొమ్మగా అందించుము.

శ్లో॥ 2

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ |
కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

సీ॥ బహు విధంబులనున్న పలు రత్నముల నొప్పు ఆభరణంబులు అలరుచుండె పీతాంబరమ్ములన్ పేర్మిధరించగ ఆడంబరము పెంచె ఆమె సొగసు ముత్యాల హారాలు ముందువ్రేలాడంగ వక్షోజముల్ కాంతి బడసి మెరిసె అగరు, కుంకుమపూల అమరిన గంధాలు దేహశోభను పెంచె దివ్యముగను.

తా॥ రకరకంబులైన రత్న ఆభరణంబులతో శోభించునది, ప్రీతితో ధరించగా బంగారు వస్త్రము దేవి నీ అందమును, ఆడంబరమును పెంచుచున్నది. నీ వక్షోజములుపై తాకు ముత్యాల హారముల కాంతితో మెరయు చున్నవి. అగరు, కుంకుమ పువ్వువంటి సుగంధ ద్రవ్యములు నీ శరీర సొగసును పెంచుచున్నవి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మ మాకు జ్ఞాన భిక్షను ప్రసాదించుము. అండవై నీవే మమ్ము కాపాడుము. నీదయను మాకు పట్టుగొమ్మగా అందించుము.

శ్లో॥ 3

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3||

సీ॥ యోగ ఆనందమ్ము ఒసగి గాతువు దేవి! శత్రునంతము జేయు జనని నీవు ధర్మంబున, తదైకతనరు నిష్ఠను నిల్పి తపఫలంబిచ్చెడి, తల్లివీవు సూర్యచంద్రులు, అగ్ని, జొప్పించుకాంతితో శోభింతువోయమ్మ! శుభప్రదాయి సర్వఐశ్వర్యముల్ చక్కగా గల్పించి త్రైలోక్య రక్షను దేవి యిచ్చు.

తా॥ ఓ జననీ! నీవు యోగముచే కలుగు ఆనందము గల్పించి, రక్షింతువు. శత్రు నిర్మూలనమును జేసి కాపాడెదవు. ధర్మమునందు తదైక నిష్ఠను నిలిపి తపఃఫలమునొసగెదవు. శుభప్రదాయిని వైన వోతల్లీ! సూర్యచంద్రులు అగ్నివలన కలుగు కాంతినిచ్చెదవు. సర్వైశ్వర్యములు కల్పించెదవు. త్రిలోకములను కాపాడు దేవివి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణా! మాకు జ్ఞాన భిక్ష ప్రసాదించి మమ్ము రక్షించుము.

శ్లో॥ 4

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ |
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

సీ॥ కైలాస పర్వత కందరంబది నీదు నిలయంబుగా గొన్న నీవె రక్ష గౌరీ, ఉమాదేవి, కౌమారి, శాంభవీ వేదార్ధగోచరంబొదవజేయి ఓంకారమే నీకు ఒప్పె బీజాక్షరం బుగను ఓ శర్వాణి! ఉన్నతముగ మోక్షద్వారము యొక్క ముందు కవాటముల్ తెరిపింతువోయమ్మ! దేవి! కృపతో.

తా॥ కైలాస పర్వతగుహలో నివసించు ఓ పార్వతీదేవీ నీవె మాకు రక్ష. ఓ గౌరీ, ఉమా, కౌమారీ శాంభవీ మాకు వేదార్ధము తెలియునట్లు జేయుము. ఓ శర్వాణీనీకు ఓంకారమే బీజాక్షరముగా ఒప్పి యున్నది. నీవు మోక్షద్వారకవాటములు తెరిపించగల దేవివి. కాశీ పట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞాన భిక్షను ప్రసాదించుము. అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ అందించుము.

శ్లో॥ 5

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

సీ॥ ప్రత్యక్ష సిరులు అప్రత్యక్షమోక్షమ్ము పావనంబుగ నిచ్చు పార్వతీవు బ్రహ్మాండ భాండమ్ము పరగనీఉదరాన మాయ నాటకము ఓ మాత! జరుగు విజ్ఞాన దీపంబు వెలిగించునది నీవె మాతరో! తెలియునా మాయమాకు కాశివిశ్వేశుకు కడుప్రీతి కలిగించు అర్ధాంగివీవమ్మ అమ్మలమ్మ!

తా॥ ప్రత్యక్షముగా ఐశ్వర్యమును, పరోక్షముగా మోక్షమును అందించునట్టి పావనీ ఓ పార్వతీ! నీ ఉదరమున బ్రహ్మాండ భాండము నెలకొనియుండగా ఈ జగత్తును మాయా నాటకము ఆడించు చున్నావు. ఓ తల్లీ విజ్ఞాన దీపం వెలిగించునది నీవే. నీమాయ తెలియ సాధ్యమా. కాశీవిశ్వేశ్వరునకు ప్రియసతివి. కాశీపట్టణాధీశ్వరియైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞాన భిక్ష ప్రసాదించుము. అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ అందించుము.

శ్లో॥ 6

ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||6 ||

సీ॥ ‘అ’ యనెడి వర్ణంబునాదిగా ‘క్ష’ తొఅంత మయ్యెడి వర్ణంబులందుగలవు శంభుని ప్రియసతీ శాంకరీ ఓయమ్మ! త్రినయనీ దీనుల దిక్కునీవే కాశ్మీరమందున గల త్రిపురేశ్వరీ! శ్రీధరీ! నీవె విశ్వేశ్వరియును స్వర్గద్వారంబుల పలుకవాటంబులన్ దెరిపించుతల్లివి దేవి నీవు.

తా॥ ఓతల్లీ! ‘అ’ నుండి ‘క్ష’ వరకు గల అన్ని అక్షరంబులలో నీవున్నావు. ఈశ్వరుని అర్ధాంగివైన నీవు శాంభవివి, త్రినయనివి, దీనులకు దిక్కువు నీవె. కాశ్మీరమునగల త్రిపురేశ్వరీ శ్రీధరీ నీవే విశ్వేశ్వరివి. స్వర్గద్వార కవాటము తెరిపించెడి దేవతవి.

Annapurna Stotram Lyrics

శ్లో॥ 7

ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7||

సీ॥ సర్వలోకంబుల జయమొసంగెడి తల్లి! సర్వజయేశ్వరి! జయము నీకు ఓదయాసంద్రమా! ఓసదాశుభకరీ! నారీ జనాప్రియ! హరుని రాణి! నీలివర్ణంబుతో నీకు శోభనొసంగు కురుల నొప్పెడి తల్లి కొలుతునమ్మ నిత్యాన్నదానమన్ నియమంపుటీశ్వరి! సాక్షాత్తు నీవల్ల మోక్షమగును.

తా॥ సమస్త లోకాలకు జయమొసగెడి ఓ తల్లీ సర్వజయేశ్వరీ నీకు మంగళమగు గాక. ఓదయాసాగరమా సదా శుభమొసంగు సదా శివుని రాణీ! స్త్రీజనప్రియా! నీలి కురులు నీ సౌందర్యమును ఇనుమడింపజేయు చున్నవి. నిత్యాన్నదానవ్రత పరాయణీ సాక్షాత్తు మోక్షప్రదాయనివి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా మాకు జ్ఞానభిక్ష ప్రసాదించుము అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ మాకు అందించుము.

శ్లో॥ 8

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

సీ॥ బంగారు గరిటెను బట్టి హస్తంబున అన్నంబు బెట్టెడి అమ్మనీవు మేలు సువర్ణ రత్నాల హారాల, వా మాదేవి! మ్రొక్కెద పాదములను దక్షయజ్ఞమునందు దీక్షాపరీ దేవి! సుందర స్తనయుగ సుందరీవు భక్తాళికోరెడి వరప్రదాయిని మాకు అభయ ప్రదాతవౌ అమ్మ వీవు.

తా॥ నీవు చేతిలో బంగారు గరిటను ధరించి, అన్నము పెట్టెడి అమ్మవి. మేలైన సువర్ణరత్న హారాలను ధరించిన ఓ వామాదేవీ! నీకు మ్రొక్కెదను. దక్షయజ్ఞమున దహింపబడిన ఓ తల్లీ సుందర స్తనయుగ సుందరివి. ఎనలేని భక్తుల కోర్కెలు దీర్చెడి అమ్మా! నీవు అభయ ప్రదాయనివి, ఓ కాశీ పట్టణాధీశ్వరీ మమ్ము కాపాడుము. ఓ తల్లీ అన్నపూర్ణా మాకు జ్ఞాన భిక్షనిమ్ము. దయగొని మాకు చేగర్రవలె సహాయమందించుము. మా అండవై యుండి కాపాడుము తల్లీ.

శ్లో॥ 9

చంద్రార్కానల కోటికోటి సదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |
మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

సీ॥ కోటి చంద్రాగ్నులు కోటి సూర్యులతోటి సమమైన తేజంబు జనని కుండె చంద్ర సూర్యాగ్నుల సమకుండలములతో బాల సూర్యుని వంటి వన్నెతల్లి అర్క చంద్రులు బోలు అధరంబులున్ గల దేవి ఈ ఈశ్వరి దివ్యచరిత పొత్తంబు, జపమాలబూని పాశంబును, అంకుశంబును దాల్చు అమ్మ ఈమె.

తా॥ ఆ తల్లికి కోటి సూర్య అగ్ని చంద్రుల కాంతి కలిగి యున్నది. చంద్రసూర్యఅగ్ని తేజమునకు ధీటైన కుండలములు ఈ తల్లి కర్ణాభరణములు. ఆ జనని శరీరపువన్నె బాల సూర్యునివంటిది. చంద్రసూర్య సమశోభగల అధరములు ఈ తల్లికి గలవు. ఓ అమ్మా! ఒకచేత పుస్తకము, ఒకచేత జపమాల, ఒకచేత పాశము, ఒకచేత అంకుశము ధరించి యుందువు. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞానభిక్ష ప్రసాదించుము అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ మాకు అందించుము.

శ్లో॥ 10

క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||

శ్లో॥ 11

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||

కం॥ సంపూర్ణంబుగనన్నము నింపుగలోకాలకిమ్ము ఈశ్వరురాణీ! ఇంపుగ వైరాగ్యము సిద్ధింపగ జ్ఞానంపు భిక్షదేవీ! గిరిజా!

తా॥ ఓ పార్వతీ దేవీ! లోకాల కన్నింటికి చక్కగ అన్నము ప్రసాదించు ఓ ఈశ్వరురాణీ! మాకు రాగబంధము నసించునట్లు అనుగ్రహించి జ్ఞాన భిక్ష నొసంగుము.

శ్లో॥ 12

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః |
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

కం॥ జననియె పార్వతి యౌనట జనకుండే హరుడు నిజము, జగతిని బంధుల్ గొనకొని శివభక్తాళియె తనదేశమునైన భువనత్రయముననైననున్.

తా॥ ఈ మనదేశంలోనైనా ముల్లోకాలలో ఎక్కడైన ఆ పార్వతీదేవియే తల్లి, శంకరుడే తండ్రి శివభక్తులందరూ బంధువులే.

Gaja kacchava Sangramam in Telugu – గజ కచ్ఛవ సంగ్రామం

Gaja kacchava Sangramam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గజ కచ్ఛవ సంగ్రామం నీతికథ.

గజ కచ్ఛవ సంగ్రామం

(ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడు తనతల్లి వినతకు దాసీత్వం తప్పించడానికి నాగుల కోరికమీద ” ‘అమృత కలశం’ తేవడానికి బయలుదేరుతాడు. దారిలో తన ఆకలితీరేదారి చెప్పమని తం. డి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెపుతున్నారు.)

ఇక్కడకు సమీపంలోనే ఒకానొక దివ్యమైన సరోవరం ఉంది. అది కలువలతో, కమలాలతో, వివిధరకముల జల పక్షులతో నయనానందకరంగా ఉంటుంది. ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్చపం (తాబేలు) ఉన్నది. కొలను ఒడ్డునే ఒక మత్తగజం ఉన్నది.

ఈ ఏనుగు తన పొడుగాటి తొండంతో ఆ ఆ తాబేలుమపట్టిలాగి హిం సిస్తుండేవి. తాబేలు ఏనుగుకాళ్ళు పట్టి లోపాలకు ఈడ్చి హింస పెడ్తూ ఉండేది.

అలా అవి ఎన్నో ఎళ్ళుగా కొట్టుకుంటున్నాయి. ఆ రెండు జంతు వులూ నీకు ఆహారంగా సరిపోతాయి అన్నాడు.

అదివిని గరుత్మంతుడు :
‘పితృపూజ్య వాటిమధ్య ద్వేషకారణం ఏమిటి?ఏనుగుతో తాబే లుకు పోరాటం ఎలా సంభవం’ అని ప్రశ్నించాడు.

కశ్యపుడు :
“నా కునా ! ఆ ప్రాణులు రెండూ పూర్వజన్మలో మానవులు. అ తమ్ములుగా పుట్టాయి. పెద్దవాడు విభాసుడు. రెండోవాడు సుబ్రతీకుడు.

ఇద్దరు నిత్యం ప్రాతః కాలంలోలేచి స్నానసంధ్యాదులు ముగించి, నియమ పరాయణులయి పరబ్రహ్మను ఆరాధించేవారు. అయితే వారికి కొంత ధనసంపద ఉంది. ఆ ధనంలో తనవంతు తనకు పంచిపెట్ట మున్నాడు సుప్రతీకుడు.

అన్న విభాసుడు!
‘తమ్ముడూ ! ప్రలోభం పుట్టినవారు సంపదలు పంచుకుంటారు. మనం అన్నదమ్ములం. మనకు లోభం పనికిరాదు. పైగా ధనవ్యామో హంవల్ల ద్వేషం పెరిగి కలహాలు వస్తాయి. అప్పుడు ఇరుగు పొరుగులు పరిష్కారం చెయ్యడానికివచ్చి ఈ భేదభావాలు రెచ్చగొడతారు: అందు వల్ల మనం సర్వనాశనం అవుతాం. కనక పంపకాలమాట ఎప్పుడూ మనస్సులోకి రానివ్వకు. ఇంటి పెద్దకొడుకు తండ్రితో సమానం. నువ్వు నా బిడ్డవంటివాడవు’ అని సముదాయించ బోయాడు.

సుప్రతీకుడు వినలేదు. ఏమయినాసరే పంపకాలు జరిగి తీరా అన్నాడు.
అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి –
‘ అన్న గారి మాటమీద గౌరవంలేకుండా ఉన్న నువ్వు మహారణ్యంలో ఏనుగు గర్భానపడి, గజజన్మఎత్తు’ అని శపించాడు.
సుప్రతీకుడు మరింతకోపంతో – ‘అదే అరణ్యంలో చెరువులో కాబేలువై పుడతావు నువ్వు’ అని శపించాడు.

ఇద్దరూ పవిత్రమానవ శరీరాలు విడిచి జంతువు లయ్యారు. అది మొదలుగా ఆ ఏనుగు గట్టుమీదనిలిచి ఘీంకరిస్తుంది. తాబేలు నీటిమీద తేలి అలలు రేపుతుంది. యుద్ధం ఆరంభమవుతుంది.

అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో.
ఆ ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు, పొడవు వన్నెండు యోజనాలు .
తాబేలు చుట్టుకొలత పది యోజనాలు, మందం మూడు యోజనాలు,

ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం, దాని పరిసర వనం గగ్గోలయి పోతున్నాయి.
ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు.
ఆ వనంలో ఏ మృగమూ హాయిగా ఆహారం తీసుకు తిరగడానికి అవకాశంలేదు.

ఆ రెండుజంతువులనూ నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువూ, వనమూ, మరికొన్ని ప్రాణులకు ఆధారమవుతాయి. ఆ ప్రాంత ములో పక్షులూ, జంతువులూ స్వేచ్ఛగా తిని, తాగి, తిరుగుతాయి. వెళ్ళు, నీకు శుభం” అని తండ్రి ఆశీర్వదించాడు,

గరుత్మంతుడు తండ్రికి నమస్కారంచేసి సెలవు తీసుకున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరి, సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు.
తొండం ఎత్తి ఏనుగు ఘీంకరిస్తున్నది. తాబేలు అలలు రేపుతున్నది. ఒక్కపూపులో క్రిందికిదిగి గరుత్మంతుడు ఒక కాలిగోళ్ళకు తాబేలును తగిలించి, రెండవ కాలిగోళ్ళతో ఏనుగును అందుకుని విశాలమైన పర్వత శిఖరానికి పోయి హాయిగా ఆరగించాడు.

ఈ విధంగా ఆ అన్నదమ్ములపోరు ముగిసింది.
ఈ కథను విన్నవారే దీర్ఘకాలంసాగే పోటీలనూ, పోరావాలనూ గజకచ్ఛవసం గ్రామంతో పోలుస్తూంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Deepakuni Guruseva In Telugu – దీపకుని గురుసేవ

Deepakuni Guruseva

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దీపకుని గురుసేవ నీతికథ.

దీపకుని గురుసేవ

పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు “పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గము” అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీ నదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేద వేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.

శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు “కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు
కదా!

నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.

గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు “గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండి” అని అన్నాడు. “దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను” అని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.

కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది. గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి “ఇంత కొంచెం తెచ్చావెందుకు” అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.

అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి “వత్సా! అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకో” అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు “స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను” అని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి “గురుదేవా! మీకు స్వస్థత కోరుతాను” అని అన్నాడు. వేదధర్యుడు “నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి” అని చెప్పాడు.

మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు “పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకో” అని అన్నాడు. అందఱికీ సాష్టాంగ వందనము చేసి ఆనందాశ్రువులతో “స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు” అని అడిగినాడు. “తథాస్తు” అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురునేవానిరతితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు.
  2. కర్మ పాశం తెగనిది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము. కావున పాపకర్మలెన్నడు చేయరాదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vovo Raakaasulaala Voddu Sundi Vairamu In Telugu – వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము

వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 15
కీర్తన: వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
సంఖ్య : 140
పుట: 93
రాగం: గౌళ

గౌళ

69 వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో

||పల్లవి||

జగములో రాముఁడై జనియించే విష్ణుఁ డిదె
అగపడి లక్ష్మి సీత యయి పుట్టెను
తగు శేషశంకచక్ర దైవసాధనము లెల్ల
తగిలి లక్ష్మణ భరత శత్రుఘ్నులయిరి

||వోవో||

సురలు వానరు లైరి సూర్యుఁడు సుగ్రీవుఁడు
మరిగి రుద్రుఁడు హనుమంతుఁడాయెను
సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁడైనాఁడు
వెరవరి నలుఁడే విశ్వకర్మ నుండి

||వోవో||

కట్టిరి సేతు వప్పుడే ఘను లెల్లా దాఁటిరి
ముట్టిరి లంకా నగరమును దళము
అట్టి శ్రీవేంకటేశుఁ డాతఁడే యీతఁడై
వొట్టుచు వరము లిచ్చె వొనర దాసులకు

||వోవో||

అవతారిక:

పెదతిరుమలాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో రాక్షస స్వభావం కలిగినవారిని హెచ్చరిస్తున్నారు. ఒరే రాకాసుల్లారా! మీకు మాతో వైరము వద్దురా. మేము ఈ ఏడుకొండలవాడిని శరణని హాయిగా వున్నవాళ్ళం. మీరూ అదేపని చేయండి. ఆ నాడు త్రేతాయుగంలో మీ రావణాసురుని చంపటానికి ఆ విష్ణువు తన పరివారంతో సహా భూమ్మీద అవతరించి మిమ్మల్నందరినీ మట్టికరిపించాడు. దుష్ట శిక్షణాకార్యక్రమం పూర్తిచేసికొని నేడు తన శరణాగతులకు అంతులేని వరములనిస్తున్నాడు. మీరంతా మీ ప్రవర్తన మార్చుకోండిరా! అంటున్నారు.

భావ వివరణ:

ఓరోరీ! రాక్షసులారా! సన్మార్గులతో వైరము (శతృత్వం) వద్దు సుండీ (సుమా!) ఈ శ్రీవేంకటేశ్వరుడే దేవుడు (భగవంతుడు). ఈ సంగతి తెలుసుకోండిరా! ఈ దేవదేవుని శరణు అనండిరా!

(ఈయనే ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువు. రావణుడు నరులను వానరులను తన కాలిగోటికి సరిరారని భావించి, బ్రహ్మను వరములడిగేటప్పుడు దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన వారితో తనకు మృత్యువు రాకూడదన్నాడు. వాడిని చంపటానికి విష్ణువు తన పరివారంతో సహా భూమిపై నర వానరులుగా తల్లి కడుపులద్వారా పుట్టి వాడిని నిర్జించాడు. వాళ్ళంతా యెవరెవరు యెలా పుట్టారో తెలుసుకొని ఆనందించండి.)

ఆ శ్రీమహావిష్ణువు భూమిపై రామునిగా జన్మించాడు. అగపడి (తానూ సిద్ధమై) లక్ష్మీదేవి సీతయై పుట్టింది. ఆయన పరివారమైన ఆదిశేషుడు, సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ ఆ రాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులవలె జన్మించారు.

ఆ శ్రీహరి పరివారమంతా రాముని పరివారంగా యెలా వానరజన్మలెత్తారో తెలిసి ఆనందించండి. సూర్యుడే సుగ్రీవునిగా అవతరించాడు. రుద్రుడు (శంకరుడు) మహా బుద్ధిమంతుడైన హనుమతుడయ్యాడు. బ్రహ్మదేవుడు భల్లూకపతియైన జాంబవంతునివలె అవతరించాడు. వారధిని నిర్మించిన నలుడే దేవశిల్పి విశ్వకర్మ సుమా!

ఆ తరువాత కథ మీ అందరికీ తెలిసిందే కదా! వారంతా రావణ వధ కోసం ఘనులై అప్పుడే సేతువును కట్టి, దాటి, లంకానగరమును ముట్టిరి (ముట్టడించిరి). ఆ తిరుమల శ్రీవేంకటేశ్వరుడె ఈనాడు, ఇక్కడ శ్రీరామచంద్ర మూర్తిగా వెలసి ఒనర (ఒప్పునట్లుగా) తనదాసులకు ఒట్టుచు (శపధముతో) అనేక వరములిస్తున్నాడు. రాండర్రా! మీరు వచ్చి ఈయనను ఆశ్రయించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sarva Shatrunjaya Hanumanth Stothram In Telugu – సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం

Shatrunjaya Hanumanth Stothram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం

శ్లో॥ శ్రీమంతం హనుమంత మాత్తరిపుభి ర్భూభృత్త రుద్రాభిధం।
వగద్వాలబద్ధవై రినిచయం చామీకరాద్రి ప్రభం ।
రోషాద్రక్తపిశంగనేత్రనలినం భూభంగ మంగస్ఫుర ।
త్రోద్యచ్ఛండమయూఖ మండలముఖం దుఃఖాపహం దుఃఖినాం ॥

కౌపీనం” కటిసూత్ర మౌం జ్యజినయుగ్ధహం విదేహత్మజా ।
ప్రాణాధీశ పదారవింద నిహితస్వాంతం కృతాంతం ద్విషాం ।
ధ్యాత్వైవం సమరాంగణస్థిత మథానీయ స్వహృత్పంకజే ।
సంపూజ్యాన్ని ఖిల పూజనోక్తవిధినా సంప్రార్థయే త్రార్థితం ॥

తా॥ ఇట్లు ధ్యాన మొనర్చి యీ క్రింద వ్రాయబడిన స్తోత్రము చేయవలెను.

శ్లో॥ హనుమ న్నంజనీసూనో మహాబలపరాక్రమ ।
లోలల్లాంగూలపాతేన మామారాతీన్ని పాతయ ॥

మర్కటాధిప మర్తాండ మండల గ్రాసకారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

అక్షక్షఫణిపింగాక్ష క్షితిజాశుగ్వినాశన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

రుద్రావతార సంసార దుఃఖభారాపహారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

శ్రీరామచరణాంభోజ మధురాయితమానస ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

వాలికాలరదక్లాంత సుగ్రీవోవ్మోచన ప్రభో ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

సీతావిరహవారీశ మగ్నసీతేశతారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

రక్షోరాజ ప్రతాపాగ్ని దమ్యమానజగత్ప్రన॥
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రక్షసా బోధిమందర ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

వుచ్ఛ గుచ్ఛ స్ఫూరర్రూమానల దగ్గారిపన్తన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

జనన్మనోదురల్లంఘ్య పారావారవిలంఘన ।
లోలల్లాంగూలపాతేన మమారాతీ న్నిపాతయ ॥

శ్లో॥ స్మృతమాత్రసమస్తే పూరక ప్రణత ప్రియ
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

రాత్రించరచమూరాశి కరనైక వికర్తన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

జానకీ జానకీజాని ప్రేమపాత్ర పరంతప ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

భీమాదిక మహావీర వీరావేశావతారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

వజ్రాంగనఖ దంష్టేశ వజ్రవజ్రవగుంఠన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

ఆఖర్వ గర్వ గంధర్వ పర్వతోచ్ఛేవనస్వర ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాత తీక్ష కరాన్వయ ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షిత ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

రామాది విప్రయోగార్త భరతాద్యార్తి నాశన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

శ్లో॥ సశీఘ్రమేవాస్త సమస్తశత్రుః ।
ప్రమోదతే మారుతజ ప్రభావత్ ॥

పై విధముగ అశ్వత్థ వృక్షమూలమునఁ గూర్చిని పై స్తోత్రమునెవడు పఠించునో వెంటనే వాని సమస్త శత్రువులు నశించుననియు హనుమత్ప్రసాదమువలన సంతోషముతో నుండుననియు తాత్పర్యము.

మరిన్ని స్తోత్రములు

Bilvashtakam In Telugu – బిల్వాష్టకమ్

బిల్వాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు బిల్వాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Bilvashtakam Lyrics Telugu

బిల్వాష్టకమ్

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

1

త్రిశాఖైర్బిలపత్రైశ్చ హ్యచ్ఛిదైః కోమలై శ్భుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్.

2

అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్

3

సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోరర్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్.

4

దంతకోటి సహస్రాణి వాజపేయ శతానిచ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్.

5

పార్వత్వాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య సత్ ప్రియం
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్.

6

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వమ్ శివార్పణమ్.

7

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్.

8

బిల్వాష్టక మిదం పుణ్య యఃపఠేచ్ఛివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్।

మరిన్ని అష్టకములు

Chyavana Maharshi – Jalarulu In Telugu | చ్యవన మహర్షి – జాలరులు

chyavanamaharshi-jalarulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చ్యవన మహర్షి – జాలరులు నీతికథ.

చ్యవన మహర్షి – జాలరులు

భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచి మహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా ౧౨ యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.

“ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి” అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.

జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి “మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండి” అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు “రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు” అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడు “అయితే అర్ధరాజ్యమిస్తాను” అని అన్నాడు. “నీ మంత్రులతో సంప్రదించి చూడు” అన్నాడు చ్యవనుడు. “ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తాను” అని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.

ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని “గోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.

ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు “ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి “అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి” అని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకో మన్నారు. వినయముతో నహుషుడు “స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదు” అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదవిని అనుగ్ర హించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
  2. జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
  3. సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
  4. గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి..
  5. ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.

మరిన్ని నీతికథలు మీకోసం: