కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అభయదాయకుడ వదెనీవే గతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
శ్రీమన్నారాయణుని పై శ్రావ్యమైన కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. సర్వులకు అభయప్రదాతవైన ఓ గజేంద్రవరదా! నీవే నాకు దిక్కు ఇప్పుడు నన్ను రక్షించరాదా స్వామీ! అని వేడుకొంటున్నారు. “కింకలుడపవే” – అంటే కినుకదూరం చేయవయ్యా అని అర్థం. కోపము అనే వ్యాధిని పోగొట్టమని భావన. కంధరవర్ణడు అంటే నీలమేఘశ్యాముడని అర్థం. తతచక్రాయుధము అంటే వ్యాపించే స్వభావంగల సుదర్శన చక్రం ఆయుధముగాగలవాడని అర్థం. ఇట్లా అడుగడుగునా అర్ధాలు తెలియని మధురమైన కీర్తన ఇది. సావధానుడు – అంటే యేమిటో వూహించండి.
భావ వివరణ:
ఓ ఇభరక్షకా! (గజేంద్రవరదా!) ఇపుడు నన్ను రక్షించగా నీవే దిక్కు నీవు అభయప్రదాతవు. దీనజనోద్ధారకుడవు. నన్ను కాపాడుము తండ్రీ! ఓ భయహరా! నీవు దైతేయభంజనుడవు (అసురాంతకుడవు); కేశియను రాక్షసాంతకుడవు. సర్వేశ్వరుడవైన ఓ నృసింహా! జయము జయము. మీకు ఇదే నియతము (నియమము). నీచరణములే గతి. క్రియగా (అదేపనిగా) మమ్ము పరిపాలించి మా కింకలుడపవే (మానవులమైన మాకుండే దుర్గుణమైన కోపమును నిర్మూలింపుము ప్రభూ! తన కోపమె తన శత్రువన్నారు కదా!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… ! గీతం గురించి తెలుసుకుందాం…
Sai! Yerchi Kurchi Perchitini… !
సాయి! ఏర్చి కూర్చి పేర్చితిని… !
ధరణి నీ కాంతి సోకగ ధన్యమయ్యె
కలి అహము బూడిదయ్యె నీ కాలు తాకి
మూర్ఖ బుద్ధులు నిను చూసి మూగవోయె
మంచి వెలుగొందె నీ స్పర్శ మహిమ సాయి
1
ఏమిటయ్య నీ మాయకు ఏది అంతు
రాజ్య భోగాలు లేనట్టి రాజు వీవు
సిరులు గిరులెన్నొ యుండిన శివుని వీవె
విశ్వమంత నీదే ఏమి వింత సాయి
2
అలమటించు మా తోడ నీ వలగనేల
ఆదుకొను నాథుడవు నీకు నలుగ తగదు
లోకముల నేలు దొరవు నీలోన జగతి
నిండియుండెను ఇలనీవు నిలువు సాయి
3
అలమటించు వారల నంత అక్కు చేర్చు
దిక్కు లేని వారందరి దిక్కు నీవు
ఆకలి కడుపులన్నింటి నాలకించి
అందరిని దరిచేర్చుకో వయ్య సాయి.
4
పచ్చదనపు పసిడి నేల పాయలందు
కాలకూట విషమదేదొ కలిసినేమొ
సిరులు విరియు చోటున రాళ్ళు చిందుచుండ
నీదు మహిమ దెల్పగ వచ్చి నిలువు సాయి
5
చెలిమి ముందు చెదిరిపోవు చీకటైన
సూర్య చంద్రుల చెలిమితో చూడ ధరణి
మంచి చెలిమితో నీవుండి మహిమ చూపు
చెదరనీయకు నీదైన చెలిమి సాయి
6
నీవు చేసిన లీలలు నీవు గాంచు
అన్నదమ్ముల పోరు ఈ అవని లోన
పాలి పగలాయె నిచ్చట పాము వోలె
విలువ మరచి జనము గక్క విషము సాయి
7
మాన్యుడ మహనీయుడవని మనముతోడ
కోటి కోటి దండంబుల కొలుచు చుంటి
మధ్యముడనైతి నేను నా మతిని గాంచు
కొలుచు కొనుచు గొప్పను చాటు కొందు సాయి
8
కులము లేదు మతము లేదు కుట్ర లేమి
పంతములును నీ చెంతన పట్టవోయి
మాయ జగతికి నీ మహిమలను దెల్పి
మానవతను పెంచితివి ఈ మహిన సాయి
9
రాముడవు నీవు ఏసు రహీము నీవు
ఏ విధముగ పిలిచిన మా యెదను చేరు
మమ్ము గన్న తండ్రివి నీవు మమ్ము గాంచు
మనుచు జీవులు తలప రావయ్య సాయి.
10
చిన్ననాటివౌ ఆటలు చిందు మరచె
చెలిమి చేయ ఆనాటి రోజేమి లేదు
మరల బాల్య మొకటి యున్న మాదుహృదిని
రాని బాల్యపుసిరి చూపరమ్ము సాయి
11
వయసు రేపిన బాసతో వరుస గలిపి
వావి వరుసల నెల్లను వదిలి నారు
వెళ్లి తనముల పోగొట్టి వింత జూపి
జనుల మార్చగ బూనుము సాధు సాయి
12
అవనికే భారతావని అందమగుచు
కుల మతాల భిన్నత్వాన కుదిరి పొత్తు
ఐకమత్యమే సౌఖ్యమ్ము ఐన దిచట
మూడు వర్ణాల ధ్వజముగా మురియ సాయి
13
తోటలో పూలు నిను చేర తొందరపడి
కోర్కెతో నన్ను చూసి పక్కునను విరిసె
పువ్వులెన్ని కోసిన నింక పూలు మిగిలె
పువ్వు వదలక మెడలోన పొదుగు సాయి
14
తల్లిదండ్రుల వోలెను తనువు నిచ్చి
వెలుగు పంచెడి గురువుగా వెలసి నావు
లోకముల నేలు నీకు నా లోగిలంత
యిచ్చి యుంటి కాదన బోకు మెపుడు సాయి
15
పొత్తు కుదురునే పదముల పొగడ నిన్ను
నాదు బ్రతుకెంత నీ ముందు నాదు తండ్రి
నా తరంబే పలుకగ నీ నామమైన
నీదు కాలి ధూళినవను నేను సాయి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీ కృష్ణలీలలు – అఘాసుర వధ నీతికథ.
శ్రీ కృష్ణలీలలు – అఘాసుర వధ
ఏ పరమపూరుషుని బ్రహ్మణ్యులు పరబ్రహ్మ అని, వైష్ణవులు విష్ణువని, శైవులు మరియు ఇతర భక్తులు శివుడని, కాపాలికులు కాలభైర వుడని, శాక్తేయులు శక్తి అని కొలిచెదరో అట్టి వేదవేద్యుడైన స్వామి గోపబాలురకు సఖునిగా స్నేహితునిగా మెలిగి వారితో కలిసి తని ఆడి పాడి వరిని తరింపచేసినాడు. ఆహా! గోపబాలుల అదృష్టమే అదృష్టము. (అదృష్టమంటే కనబడనిది అంటే మన జన్మజన్మాంతరాల కర్మఫలము)
ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుచుండగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు ఒక పెద్ద కొండచిలువ రూపమున వచ్చి నోటిని తెరిచి శ్రీకృష్ణునికై ఎదురుచూసెను. దాని పైపెదవి మేఘమండలమును క్రింది పెదవి భూమిని తాకుచుండెను!
శ్రీకృష్ణలీలలను ప్రత్యక్షముగా చాలాసార్లు చూసిన గోపబాలురు అతడే రక్షిస్తాడనే నమ్మకముతో గోవులతో సహా పెద్దకొండబిలము వలెనున్న అఘాసురుని నోటిలోకి వెళ్ళిపోయినారు. నందకిశోరుడు కూడా లోనికి ప్రవేశించెను. పరమాత్మ ప్రవేశించగానే అఘాసురుడు నోరుమూసివేసెను. విషవాయువుల ప్రభావముచే గోవులు గోపబాలురు ప్రాణములు విడిచిరి. అప్పుడు పరమాత్మ అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరము ఉబ్బునట్టు చేసెను. అఘాసురుని పొట్టపగిలి నందనందనుడు బయటికి వచ్చెను. సంకల్పమాత్రముచే శ్రీకృష్ణుడు గోవులను గోపబాలుర ను బ్రతికించెను. అఘాసురుడు ముక్తినొందెను.
అఘాసురుని వృత్తాంతము
శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు యౌవనుడు బలిష్ఠదేహుడు. కాని పరులను నిందించు స్వభావము కలవాడు. వాడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూచి “ఇన్ని వంకరలేమి” అని హేళన చేసెను. మహర్షి అనుగ్రహము చూపుటకు “ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు” అని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపము చెంది రక్షించమని ప్రార్థించిన అఘాసురునితో అష్టావక్ర మహర్షి.
“నాయనా! పరనింద మృత్యువువంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే నిందింపబడిన వాడి పాపములో సగం మనకివస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యసర్వస్వములో సగం అతనికి వెళిపోతుంది. కావున అనవసరముగా పరనింద చేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది పాపఫలము అనుభవించిన తరువాత ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించినాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మహేశ్వర పంచరత్న స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మృత్యుంజయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Sri Venkateswara Ashtottara Shatanama Stotram Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు చంద్రశేఖరాష్టకమ్గురించి తెలుసుకుందాం…
“భక్తి గీతాలు” అంటే భగవంతుని ఆరాధించే భావంతో ప్రేమ మరియు ఆదరణ కలిగించే గీతములు. ఈ గీతాలు సాధకుల మనసుని పరిశుద్ధీకరించే, అనుభవాత్మకంగా దేవుడి సన్నిధిలో ఆనందాన్ని పొందటంలో సహాయకరమైనవి. భక్తి గీతాలు దేవుని గుణములను, పరమాత్మ సత్యమును స్తుతించే వాక్యాలను మరియు సంకీర్తనలు కలిగిస్తాయి.
Bhakti Geethalu | భక్తి గీతాలు
భక్తి గీతాలు సాధకులను ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీస్తాయి, ప్రేమ, శాంతి, సమాధానం మరియు సాంత్వన అంతా వీటికి ఆధారం ఉంటాయి. ఈ క్రింది లింకుల ఆధారంగా భక్తి గీతాలు గురించి తెలుసుకుందాం…
అన్నమయ్య మనుమడు, చినతిరుమలాచార్యులవారు చెప్పిన బాలకృష్ణునిపై మధుర కీర్తన వినండి. ఈయన కీర్తనలు జానపదుల శైలిలో జనప్రియంగా వుంటాయి. గిలిగించి అంటే చక్కిలిగింత పెట్టటం. అయితే, కింద చూపులు చూచే ఆవులమందకు గిలగించడమేమటి? అంటే మనం గిలిగింతలు పెడితే పాపాయిలెలా సంతోషిస్తారో రేపల్లెలో ఆవులు కూడా కృష్ణను చూచి సంతోషంతో పరవశించాయన్నమాట. ఆ పిల్లాడు కొదలుమాటలు రహస్యంగా గొణుగుతాడట. దానికి ఆడాళ్ళంతా సిగ్గుతో చితికిపోతారట. ఈ చినతిరుమలయ్య అచ్చం తాతగారే. కవిత్వంలోనూ అదే చలాకీతనం. భావ వివరణ చదివి పరవశించండి.
భావ వివరణ:
మా చిన్నన్నా!! రారా! ఓ చిన్నవాడా! రారా! ఓరి బాలకృష్ణా! నిన్ను ముద్దాడెదను రారా!
కృష్ణా! నీవు కొదలు మాటలనే (లోపభూయిష్టమైన మాటలను) గొణుగుచు (రహస్యంగా పలుకుచూ) సుదతుల శిగ్గులు (స్త్రీల సిగ్గును) చూరాడేవు (చితుకునట్లు చేసెదవు), కొంటె వేషాలు వేస్తూ మధురాధరముల రుచి చూపిన జాణకాడవు (రసిక శేఖరుడవు).
ప్రభూ! నీవు చెలుల కౌగిళ్ళలో చెలగి (అతిశయించి) నీ కలికితనముల (నేర్పరితనమున) పరవశింపజేసెదవు. నేడు ఈ తిరుమల శిఖరాలపై లలనామణియైన లకిమమ్మ (లక్ష్మిదేవి)ని కలిసినవాడవై మా ఆరాధ్యదైవమైన శ్రీవేంకటేశ్వరుడవైనావు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్య గురుముఖతః నేర్చుకోవాలి నీతికథ.
విద్య గురుముఖతః నేర్చుకోవాలి
(ఈ కథ అరణ్యపర్వంలో ఉంది)
పూర్వం భరద్వాజుడని మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణస్నేహి తుడు రైభ్యుడు. వారిరువురూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాల కృత్యాలు ముగించి, నదీస్నానంచేసి, నిర్మలచిత్తంతో పరబ్రహ్మధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు.
అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడనే కుమారుడు కలిగాడు. రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని యిద్దరు కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవా రయ్యారు.
భరద్వాజుడు ఎప్పుడూ ధ్యానసమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు. రైభ్యుడు తన కుమారు లిద్దరినీ విద్వాంసులుగా తీర్చి దిద్దు కున్నాడు.
వారుభయులూ వివిధ ప్రాంతాలలో పర్యటించి తను విద్యతో అందరి ప్రశంసలూ పొందుతున్నారు. ఇదిచూసిన యవక్రీతునికి విచారం కలిగి వారివలె తానుకూడా విద్యావంతుడై విశేషఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు. యవక్రితుని తీవ్రనిష్ఠను గ్రహించి దేవేంద్రుడు వచ్చి:
“స్వామీ! విద్య అనేది గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అప్పుడుకాని వేద వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నంమాని ఉత్తమగురువును ఆశ్రయించు ” అన్నాడు. ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణవేషంలో వచ్చి గుప్పిడితో యిక తీసి నదిలో పోస్తున్నాడు. యవక్రీశుడు నదీ స్నానా నికి వచ్చి ఏమిటీవని? ఎందుకు చేస్తున్నావు? అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ: “ఈ నదికి గోడ కడుతున్నాను ” అన్నాడు.
యవక్రీతుడు నవ్వి : ” ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు యిపకతో గోడకట్టటం జీవితంలో సాధ్యమా ! ” అన్నాడు.
అప్పుడా వృద్ధుడు – “నాయనా! గురుకు శూషలేకుండా వేదవిద్య అంతా నేర్చుకోవా లనుకోవడం కంటె నేను చేసేది అవివేకంకాదు. ” అని జవాబిచ్చాడు.
” ఓహో సురపతీ ! మీరు ఎలా అయినాసరే నాకు వేదవిద్య అనుగ్ర హించి విశేషఖ్యాతి కలిగించాలి” అని ప్రార్థించాడు. ఎన్ని చెప్పినా ప్రయోజనంలేదని ఇంద్రుడు అనుగ్రహించాడు.
యవక్రీతుడు పర్వవేదశాస్త్ర విద్యా విదుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్షవిడిచి తండ్రిదగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు.
అప్పుడు భరద్వాజుడు: “నాయనా! ఈ విధంగా విద్యసాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మనాశనకారణం, నాయ
ఇంత చిన్నవయస్సులో తీవ్రతపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతు వవుతుంది. అయినా ఒక మాట విను. నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోకు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు.
యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు.
అలా ఉండగా ఒకనాడు అది వసంతమాసం. అరణ్య మంతా పూలవాసనలతో, ప్రకృతి అంతా పరమరమణీయంగా, జిల్లాన కరంగా ఉంది. అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనుపించింది. యవక్రీతుని మనసు బెదిరింది. ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ యిల్లాలిని బలాత్కరించి భోగించి వెళ్ళిపోయాడు.
ఆశ్రమానికి వచ్చిన రైభ్య మహాముని ఆ కథవిని తీవ్రక్రోధంతో తన శిరస్సు నుండి రెండు జటలు తీసి హోమంచేసి ఒక సుందరాంగినీ, ఒక రాక్షసునీ సృష్టించాడు. వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని సమీపించారు.
ఆ సుందరీమణి తన కోరచూపుతో చిరునవ్వుతో లావణ్యదేహప్రదర్శ నతో యవక్రితుని లొంగదీసి, వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలువు తీసుకు వెళ్ళిపోయింది. అంతతో వానిశక్తి నశించగా ఆ రాక్షసుడు తన శూలంతో యవ క్రీతుని తరిమి పొడవబోయాడు. సరిగా భరద్వాజుని ఆశ్రమద్వారందగ్గరే వానిని సంహరించాడు.
అదిచూచి భరద్వాజుడు: “నాయనా! అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్థాలే తెస్తుందని చెప్పినా విన్నావుకావు.” అని గోలు గోలున విలపించి, ఆ తీవ్రవేదనలో రైభ్యుని శపించి, తానుకూడా అగ్ని లోడదూకి ప్రాణత్యాగం చేశాడు. శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు.
అప్పుడు అర్వావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రినీ, భరద్వాజ, యవక్రీతులనూ బ్రతికించాడు.
పునరుజ్జీవితుడైన యవక్రీతుడు, తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించిః “నేను కూడా ఈ రైభ్యునివలెనే తపస్సుచేసి, వేదవేత్త నయ్యాముకదా అయినా ఈయన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు? ” అనగా దేవతలు…..
“నాయనా! ఆయన గురు శుశ్రూషల్లేశాలతో వేదవిద్యను సాధిం చాడు. కనుక అంత శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధిం చావు, ఆ శక్తి నీకు రాదు. విద్య గురుముఖతః నేర్చుకోవాలి నాయనా ! అని వారు వెళ్ళారు.