Chuchi Mohincha kunduraa Suralina Narulina In Telugu – చూచి మోహించకుందురా సురలైన నరులైన

చూచి మోహించకుందురా సురలైన నరులైన – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో చూచి మోహించకుందురా సురలైన నరులైన కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చూచి మోహించకుందురా సురలైన నరులైన – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: చూచి మోహించకుందురా సురలైన నరులైన
సంఖ్య : 403
పుట: 272
రాగం: తెలుగు కాంబోది

తెలుఁగు కాంబోది

60 చూచి మోహించకుందురా సురలైన నరులైన
తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను

|| పల్లవి||

భాగీరథి పుట్టినపాదపద్మములు
భోగపు మరునిజన్మభూమి నీతొడలు
యోగపు నవబ్రహ్మలుండిన నీనాభి
సాగరకన్యకలక్ష్మి సతమైనవురము

||చూచి||

అందరి రక్షించేటి అభయహస్తము
కంద నసురలఁజంపే గదాహస్తము
సందడిలోకముల యాజ్ఞాచక్రహస్తము
చెంది ధ్రువు నుతియించఁజేయుశంఖహస్తము

||చూచి||

సకలవేదములుండే చక్కనినీమోము
వొకటై తులసిదేవివుండేటిశిరసు
ప్రకటనపు మహిమలఁ బాయనినీరూపము
వెకలిశ్రీవేంకటాద్రివిభుఁడ నీభావము

||చూచి||

అవతారిక:

జగన్మోహనుడైన ఈ వేంకటేశ్వరుడే కళ్ళముందు ప్రత్యక్షమైతే మోహించని వాడెవడన్నావుంటాడా? వాడు నరుడాసురుడా అనే తేడానేవుండదు. అందరూ చేష్టలుడిగి అలా చూస్తూనే వుండిపోతారు… నఖశిఖ పర్యంతం, ఇదిగో ఈ భావమునే అన్నమాచార్యులవారు మధురమైన కీర్తనవలె నావిష్కరిస్తున్నారు. “ప్రకటపు మహిమల బాయని నీరూపము వెకలి శ్రీవేంకటాద్రి విభుడ నీ భావము” అని అంటున్నారు. ఆయన భావము ఆయన రూపంలోనే పాయని మహిమలను ప్రకటిస్తున్నదని అర్థం. భావాలను వివరించటానికి మాటలక్కరలేదు చూపులు చాలు కదా! జాగ్రత్తగా చదవండి మరి.

భావ వివరణ:

ఓ దేవదేవా! తాచి (పూనుకొని నీవు యెవరికన్నులముందైన ప్రత్యక్షమైతే, నిన్ను చూచి సురులైనా, నరులైన మోహించి తీరుతారు. జగన్మోహనుడవైన నిన్ను చూచి మోహించకుండుట యెట్లు సాధ్యము?

నిన్ను ఆపాదమస్తకం వొకసారి చూచే భాగ్యం దక్కితే ఆ జన్మ తరించదా? అదిగో నీ పాదపద్మాలు… పవిత్రమైన భాగీరధి (గంగాదేవి) పుట్టినిల్లు అదేకదా! అవిగో నీతొడలు.. జీవులకు భోగాసక్తిని కలిగించే మరునికి (మన్మధునికి) జన్మభూమి నీవూరువులే. అదిగో నీ నాభి, చతుర్ముఖుడే కాక యోగమున నిష్ణాతులైన నవబ్రహ్మలకు (భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, మరీచి – తొమ్మిదిమందిని నవబ్రహ్మలు అంటారు. వీరినుంచి రకరకాల జీవులు సృష్టించబడ్డాయి). ఇక జగద్విఖ్యాతమైన సాగరపుత్రిక లక్ష్మికి సతమైన (శాశ్వతమైన స్థానము నీ వురము (వక్షస్థలము).

ఇక నేడు మా దగ్గరకు వస్తే… అదిగో ఆ నడుముపైనున్న అభయహస్తము నీ శరణాగతులకు భయపడకండి మీకు నేనున్నాను అని అభయమిస్తున్నది. అందరినీ రక్షిస్తున్నది. అసురులను కందునట్లు (తపించునట్లు) చేయు నీగద (కౌమోదకము) నీహస్తములలో కానవచ్చుచున్నది. నీ ఆజ్ఞాచక్రము, నీ ఆజ్ఞపైలోకములను సందడించగల (తత్తరబెట్టగల నైపుణ్యమున్న దివ్యాయుధము. అది అదిగో నీ కుడిచేతిలోనున్నది. ధ్రువునికి నీ దారి చూపుటకు నినదించిన పాంచజన్య శంఖము, అదే నీ యెడమ చేతనున్నది.

ప్రభూ! సకల వేదములకు నెలవైన నీ ముద్దులొలుకు చక్కని వదనము అదిగో. తులసీదేవికి ఒకేఒక స్థిరనివాసమైన నీ శిరస్సు అదే కన్నులకు విందుజేయుచున్నది. ఆవిధంగా అనేక మహిమలను ప్రకటించుచున్న పాయని (విడువలేని) నీ దివ్యమంగళ విగ్రహము ఏ భావముతో చూస్తే ఆ భావముతో కనబడుతున్నది. వెకలి శ్రీవేంకటేశా! (ఆసక్తిని కలిగించు ఏడుకొండలవాడా!) శరణాగతులకు చల్లనిచూపులే, కుత్సితులకు క్రూరంగా కనుపిస్తాయి. అదే అత్యద్భుతం తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Ekachakrapura Baka Vadha In Telugu – ఏకచక్రపుర బక వధ

Ekachakrapura Baka Vadha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఏకచక్రపుర బక వధ.

ఏకచక్రపుర బక వధ

“అమ్మా! ఎందులకు నీవు పుత్రుత్యాగము చేయుచున్నావు? ఎవ్వని బాహుబలము వలన మనము లాక్షాగృహము నుండి బయటపడ్డామో ఎవ్వని శక్తి సామర్థ్యాలవల్ల దుష్టుడైన పురోచనుడు నశించాడో ఎవ్వని బలపరాక్రమాలు మనల్ని ఎల్లవేళలా దుర్యోధనుని బాఱినుండి కాపాడుతున్నాయో ఏ వీరుని అండ చూసుకుని మనము సుఖముగా జీవిస్తున్నామో ఏ మహాబలశాలి కౌరవాదులకు గుండెదిగులు అయ్యాడో ఎవ్వని పై భారం మోపి పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మఱల పొదుదామనుకుంటున్నామో అట్టి నాగాయుధ బలసంపన్నుడైన భీమసేనుని ఎందులకు త్యాగము చేస్తున్నావు తల్లీ”? అని బకాసురునికి ఆహారముగా వెళుతున్న తమ్ముని చూసి తల్లి అయిన కుంతీదేవిని అడిగాడు ధర్మరాజు.

“నాయనా! ప్రస్తుతము మనము ఈ విప్రోత్తముని ఇంటిలో ఆశ్రయము తీసుకుంటున్నాము. ఆ విప్పుని కుమారుడు బకాసురునకు ఆహారము కాకుండా కాపాడి ఆయన మనపై చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతను చూపించాలి. ప్రత్యుపకారం మన కనీస కర్తవ్యము. సాటి వారు బాధలలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవతాధర్మమ్. అదీ కాక ఇటువంటి పండితోత్తముని రక్షించటం మహాపుణ్యదాయకము. లోభం వల్లకానీ తెలియక గానీ మోహము వల్లకానీ నేనీ నిర్ణయము తీసుకోలేదు.

వెయ్యి ఏనుగుల బలమున్న భీమనేనుని పరాక్రమము మనకు తెలియనిది కాదు. హిడింబాసురుని వధించినప్పుడు మనకి అతని శక్తి ఎంతటిదో తెలిసిపోయింది. ఆ భీమసేనుడు పుట్టిన రోజే నా చేయిజారి క్రింద పడినప్పుడు అతని క్రింద ఉన్న రాయి నుగ్గునుగైపోయింది! యుద్ధములో వజ్రని కూడా ఢీకొనే బలమున్నది భీమునికి. కనుక ఇతడు నిస్సందేహముగా బకాసురుని వధించి ఈ ఊరికి ఉపకారం చేస్తాడనే నా నమ్మకము. ఆ పైన శ్రీకృష్ణుని దయ” అని హితబోధ చేసింది మహాసాధ్వి అయిన కుంతీదేవి.

ధర్మజుడు తల్లి మాటలు విని ఎంతో సంతోషించి పుత్రవాత్సల్యంతో తమ్ముని మనసారా దీవించి పంపినాడు. అనుకున్న ప్రకారం భీమసేనుడు ఒక బండీలో అన్నం నింపుకుని ఆ రాక్షసుని స్థావరమునకు వెళ్ళి అతనిని పిలిచి తానే ఆ ఆహారమంతా తినసాగాడు. బకాసురుడు నరార్భకుడు తన భోజనం తినేస్తున్నాడని కుపితుడై గట్టిగా భీముని వీపుపై గుద్దాడు. చలించని భీమసేనుడు ఆహారం తీసుకుంటూనే ఉన్నాడు. మహా క్రోధముతో బకుడు ఒక పెద్ద వృక్షమును పెకిలించి భీమునిపైకి విసరబోయాడు.

ఇంతలో భీముడు భోజనము ముగించి కాళ్ళూ చేతులూ కడుక్కోని ఆచమించి శుచి అయ్యి రాక్షసుడు విసిరిన చెట్టుని పట్టుకుని తిప్పికొట్టాడు! అలా కొంత సేపు వారు రాళ్ళతో చెట్లతో భీకర యుద్ధం చేసి చివరికి ముష్టియుద్ధము చేయసాగారు. అలసిపోయిన రాక్షసుని బోర్లదోసి తన మోకాలిని బకుని వీపుపైన ఉంచి బలముగా ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు భీముడు. బకుడు ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసినాడు. ఆ కేకలు విని బకుని బంధువులు బయటికి వచ్చారు. భయకంపితులైన వారితో భీముడు “ఇక నుంచీ మీరు మనుషులను హింసించటం మానకపోతే మీకూ ఈ బకునికి పట్టిన గతే పడుతుంది” అని హెచ్చరించాడు. వారందఱూ అలాగే ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజునుండి ఏకచక్రపురం లోని ప్రజలు హాయిగా జీవించడం మొదులుపెట్టారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. కుంతీదేవి ధర్మరాజుకు చేసిన హితబోధ మనమెన్నడూ మఱువరాదు. కృతజ్ఞత ఆర్తరక్షణ కనీస కర్తవ్యాలని మనకు ఈ కథ ద్వారా తెలిసినవి.
  2. ఒక సజ్జనుడు తన బలాన్ని పరోపకారానికి ఎలా ఉపయోగిస్తాడో మనకు ఈ కథలో భీమసేనుని ద్వారా తెలిసినది. దుష్టులైన కౌరవులు తమ బలాన్ని యుక్తిని ప్రజాశ్రయస్సుకు వాడకుండా మత్సరముతో పాండవులను మట్టుపెట్టడానికే ఉపయోగించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Krishna Bhujanga Prayata Ashtakam In Telugu – భుజంగప్రయాతాష్టకమ్

Krishna Bhujanga Prayata Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు భుజంగప్రయాతాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Krishna Bhujanga Prayata Ashtakam Telugu

భుజంగప్రయాతాష్టకమ్

సదా గోపికామండలే రాజమానం లసన్నృత్యబంధాదిలీలానిదానమ్,
గలద్దర్పకందర్పశోభాభిధానం భజే నందసూనుం సదానందరూపమ్.

1

వ్రజ స్త్రీ జనానందసందోహసక్తం సుధావర్షివంశీ నినాదానురక్తమ్,
త్రిభంగాకృతి స్వీకృత స్వీయభక్తం భజే నందసూనుం సదానందరూపమ్.

2

స్ఫురద్రాసలీలావిలాసాతిరమ్యం పరిత్యక్తగేహాదిదా సైకగమ్యమ్,
విమానస్థితా శేష దేవాదినమ్యం భజే నందసూనుం సదానందరూపమ్.

3

స్వలీలారసానందదుగోదమగ్నం ప్రియస్వామినీబాహుకంరైక లగ్నమ్,
రసాత్మైకరూపావబోధం త్రిభంగం భజే నందసూనుం సదానందరూపమ్.

4

రసామోద సంపాదకం మందహాసం కృతాభీరనారీ విహారైకరూపమ్,
ప్రకాశీకృత స్వీయ నానావిలాసం భజే నందసూనుం సదానందరూపమ్.

5

జితానంగసర్వాంగశోభాభిరామం క్షపాపూరితస్వామినీ బృందకాయమ్,
నిజాధీనతావర్తిరామాతివామం భజే నందసూనుం సదానందరూపమ్.

6

స్వసంగీకృతానంతగోపాల బాలం వృతస్వీయగోపీమనోవృత్తిపాలమ్,
కృతానందచౌర్యాదిలీలారసాలం భజే నందసూనుం సదానందరూపమ్.

7

ధృతాద్రీశగోవర్ధనాధారహస్తం పరిత్రాతగోగోపగోపీ సమస్తమ్,
సురాధీశసర్వాదిదేవప్రశస్తం భజేనందసూనుం సదానందరూపమ్.

8

ఇతి శ్రీహరిరాయాచార్యవిరచితం భుజంగ ప్రయాతాష్టకమ్.

మరిన్ని అష్టకములు

Sankama Nivu Sakhshi Chakrama Nivu Sakhshi In Telugu – శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి

శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 15
కీర్తన: శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
సంఖ్య : 169
పుట : 112
రాగం: బౌళి

బౌళి

49 శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
వంకలాడ భుజముల వ్రాసుకొంటి మిమ్మును

॥పల్లవి||

నారాయణా యని యిట్టె నరకములు తరించితి
శ్రీరామా అని పొందితి జీవన్ముక్తి
దూరించి గోవిందా యని తోలితి పాపము లెల్ల
ధీరుఁడనై వళుకెల్ల తిద్దుకొంటి నిదిగో

||శంకమ||

దామోదరా అని తొల్లి దాటితి దు:ఖము లెల్ల
వామనా అని కర్మములు వంగఁ దొక్కితి
భూమిరమణా యని పుట్టుగులు గెలిచితి
వేమరు నితరులకు వెరవ నే నింకను

||శంకమ||

హరి యచ్చుతా యని ఆపదల నణఁచితి
పురుషోత్తమా యని పుణ్యము లెల్లా మీఱితి
అరుదైనా శ్రీవేంకటేశ యని లోకముల మించితి
తొరలి సంసారపుదూరు చక్కఁబెట్టితి

||శంకమ||

అవతారిక:

“వంకలాడ” అంటే వంకరలు దిద్దగా అని అర్థం. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో తన భుజములపై వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముద్రింపజేసికొన్న శంఖ చక్రముద్రలతో “మిమ్మల్ని సాక్షులుగా నాభుజములపై వ్రాయించుకొంటిని” అంటున్నారు. ఎట్లా వ్రాయించుకొన్నారంటే “వంకలాడ” వ్రాయించుకొన్నారట. ఆపైన, విష్ణునామ సంకీర్తన మధురాతి మధురంగా చేస్తున్నారు. ఆశ్రీహరి నామ సంకీర్తన “తొరలి సంసారపు దూరు చక్కబెడుతుందట. కీర్తన పాడినవారికి విష్ణునామ పారాయణ పుణ్యం దక్కుతుందని విడిగా చెప్పనక్కరలేదు కదా! అన్నట్లు వళుకు – అంటే తగవు అని అర్థం.

భావ వివరణ:

ఓ శంకమా (పాంచజన్య శంఖమా!) నీవే మాకు సాఓఇ. ఓ చక్రమా! (సుదర్శన చక్రమా!) నీవే మాకు సాక్షి. నేను విష్ణువునకు చెందిన వాడనని మిమ్మును (మిమ్మల్ని) నా భుజములపై వంకలాడ (వంకరలు దిద్దగా) వ్రాయించుకొంటి (కాల్చి వాతలవలె ముద్రింపజేయించుకొంటిని). కనుక మీరే నాకు చెఱపలేని సాక్ష్యము.

నేను మా ఆచార్యుల కృప జేత వైష్ణవుడనై ఎట్లా తరించానో చెప్తాను వినండి. నేను “నారాయణ” అని యెలుగెత్తి అనగానే నరకద్వారములను దాటి నాను. శ్రీరామా అని చెప్పగానే జీవన్ముక్తిని పొందాను. దూరించి (ఉద్యుక్తుడనై గోవిందా గోవిందా అని గొంతెత్తి యని నేను చేసి కొనిన అశేష పాపాలను తోలివేశాను. ఇదివో నేను ఆ విధంగా ధీరుడనై (విద్వాంసుడనై) వళుకెల్లా (మత్సరమునంతా) దిద్దుకొంటి సవరించుకొంటిని.

దామోదరా అని తనివిదీరా పలికి, నా తొల్లిటి (ఇదివరకు నాకున్న) దు:ఖములను తొలగించుకొంటిని. వేమనా అనే విష్ణు నామమును పలికి నేను చేసిన కర్మల వంగదొక్కితి (అణగద్రొక్కితిని). భూరమణా అనే నామము చెప్పి పురుగులు (జన్మల చక్రవ్యూహమును) గెలిచితిని. నేను ఇక ఇతరములకు (మానవమాత్రులైన అధిపులకు) వేమరు వెరవను (ప్రతిదానికీ భయపడను).

“హరి అచ్యుతా” అనే నామోచ్ఛరణతో నేను నా ఆపదలనన్నింటినీ అణచివేశాను. పురుషోత్తమా అ పుణ్యముల నెల్లా మీఱితి (అతిశయించితిని). శ్రీహరి నామాలలో అరుదైన నామము శ్రీ వేంకటేశ. ఆ నామము నిరంతరం నా నాలికపై నుండగా లోకముల మించితి (సర్వశ్రేష్ఠుడనైతిని) తొరలి (ఈమారు) సంసారపు దూఱు (ప్రాపంచిక లంపటములను) చక్కబెట్టితి (సరిజేసుకొంటిని). ఇది నా ఘనత కాదు తండ్రీ! నీ అపారమైన కరుణయే కారణము.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Sibi Chakravarthy Datalalo Patilenivadu In Telugu – శిబి చక్రవత్తి దాతలలో పాటిలేనివాడు

Sibi Chakravarthy Datalalo Patilenivadu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శిబి చక్రవత్తి దాతలలో పాటిలేనివాడు నీతికథ.

శిబి చక్రవత్తి దాతలలో పాటిలేనివాడు

(ఆరణ్య పర్వంలో రోమశ మహర్షి ధర్మరాజుతో చెప్పిన కథ )

ఉశీనరుడనే మహారాజుండేవాడు. ఆయన కుమారుడు శిబి. ఈయన మహాదాతగా లోకలోకాలలో ప్రఖ్యాతి పొందాడు.

అంతటి కీర్తి వచ్చిన శిబి చక్రవర్తి దాన విశేషం ఏమిటో వరీ క్షించాలని ఇంద్రుడు, అగ్ని బయలుదేరారు.

అగ్ని హోత్రుడు పావురం రూపం ధరించాడు.
దేవేంద్రుడు డేగలా బయలుదేరాడు.

ఆ పావురాన్ని తరుముతూ డేగవస్తున్నది. పావురం గజ గజ వణుకుతూ ఎగిరి ఎగిరి అలసటతో శిబిచక్రవర్తి దగ్గరకు వచ్చిపడి, * శరణు. శరణు, మహారాజా ‘! అని ప్రార్థించింది.

అప్పుడు అక్కడే ఉన్న రాజపురోహితుడు :
‘మహారాజా ! ఈ పావురం ప్రాణభయంతో నిన్ను శరణువేడింది. ఏ జీవికయినా ప్రాణమంత ప్రీతికర మయింది మరొకటి లేదు. అలానే ప్రాణరక్షణ కంటె ఉ త్తను కర్మలేదు.

కాని – పావురాలను చేరదీయడం మృత్యు సూచక మంటున్నారు. విద్యాంసులు, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు’ అన్నాడు.

అది విని ఆ పావురం :
“మహారాజా ! ఆ డేగకు భయపడి నిన్ను శరణు వేడాను . నేనా క మహామునిని. ఆ రూపం విడిచి యిలా తిరుగుతున్నాము. దీనులకూ, అసమర్థులకూ మహారాజే రక్షకుడని వేదాలు ఘోషిస్తున్నాయి కనుక నిన్ను శరణు వేడుకున్నాను” అంది.

అప్పటి కక్కడకు చేరిన వేగః
‘మహారాజా! ప్రతి జీవికీ ఎన్నో రూపాలు ప్రాప్తిస్తాయి. ఇది పావురమై నిన్ను శరణు వేడింది. అయితే పావురాలు డేగలకు ఆహారం అని మరిచిపోట, నా’ నోటి దగ్గరి ఆహారముయిన ఈ పావురాన్ని విడిచి పెట్టి నా ప్రాణాలు కాపాడు” అంది.

ఆ పక్షుల మాటలు వింటున్న శిబి చక్రవర్తి మనస్సు ఆందోళనలో పడింది.

‘ప్రాణ భీకేతో వచ్చి శరణు వేడిన వారికి అభయమివ్వని రాజు యొక్క దేశంలో వానలు కురియక, పంటలుమాడి క్షామదేవత విలయ తాండవం చేస్తుంది. పయిగా అటువంటి రాజ్యంలో ప్రజలకు రక్షణలేక నానా బాధలు పడతారు. అందువల్ల మహారాజు నరకంలో పడతాడు.

మరి ఈ డేగ ఆకలితో ఉంది.’ దాని ఆహారం పావురం. దాని నోటిముందు అన్నం తీసెయ్యడమూ పాపమే. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి ?’ అని ఆలోచించి, ఆలోచించి రాజు ” ఓ డేగా ! నీకు యింతకంటె రుచిగా ఉండే, బలం కలిగించే ఆహారం యిప్పిస్తాను. దీన్ని విడిచిపెట్టు’ అన్నాడు.

డేగః మహారాజా ! ఈ పావురంమాంసం కంటె రుచికరమయిన ఆహారం మరొకటి లేదు. ఏ పక్షి దొరకనప్పుడు పావురాలనే మాకు ఆహా రంగా యిచ్చాడు బ్రహ్మదేవుడు.

శిబి: ఓ డేగా ? శరణు వేడిన ఈ పావురాన్ని విడిచి ధర్మహాని చెయ్యను. నా ప్రాణాలు వదులు కుంటాను కాని అభయమిచ్చిన ప్రాణికి హాని జరగనివ్వను. ఈ విషయం లోకాలన్నిటికీ తెలుసు, అందుచేత నువ్వు పావురాన్ని విడిచి ఏమయినా అడుగు.

డేగః మహారాజా ! నువ్వు అంత దయచూప దలిచినట్ల యితే నా మాట విను. నీ కుడితొడ చీల్చి దానిలోని మాంసం తీసి ఈ పావురం బరువుతో సమంగా తూచి ఆ మాంసం నాకియ్యి. ఆరగిస్తాను.

ఇది వింటూనే శిబి చక్రవర్తి, శ్రమ తెప్పించి ఒక వయిపు పావురాన్ని ఉంచి, కత్తితో తనతొడ కోపి మాంసం తక్కెడలో ఉంచాడు. ఎంత మాంసం పడుతున్నా పావురం బరువుకి సమం కావడం లేదు. రెండవకొడ, చెయ్యికోసి పెట్టినా అది తూగలేదు. అంతలో శిబితానే క్రాసులో కూర్చున్నాడు.

డేగ: చాలు. నేను వెడుతున్నాము, అని ఎగిరిపోయింది.

అది చూసి శిబిచక్రవర్తి :
‘ ఓ పావురమా ! నువ్వెపరవు. ఏమిటి నీ కథ’? అని అడిగాడు.

‘ మహారాజా ! నేను అగ్నిహోత్రుడను. ఆ డేగ దేవేంద్రుడు. నీ కీర్తి విని, నీ శరణాగత రక్షణ దృష్టినీ, దాన శక్తిని పరిశీలించాలని వచ్చాం. నువ్వు విజయం పొందావు. నీ మశశ్చంద్రికలు ఈ భువన భవనం అంతటా వ్యాపిస్తాయి. నీకు కలిగే కుమారుడు కూడా నీ కీర్తిని నిలబెడతాడు’, అని అదృశ్యమయింది.

ఈ విధంగా శరణువేడిన ప్రాణికోసం తన శరీరాన్నే దానం చేసిన మహాపురుషుడు కనకనే ఈ నాటికి శిబి చక్రవర్తి పేరు ప్రఖ్యాత మయింది. దాతల పేరు చెప్పేటప్పుడు ఆ పేరు తప్పని సరిగా చెప్పుకుంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Indra Krita Sri Shiva Stuti In Telugu – ఇంద్రాదికృత శ్రీశివస్తుతిః

Indra Krita Sri Shiva Stuti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఇంద్రాదికృత శ్రీశివస్తుతిః గురించి తెలుసుకుందాం…

Indra Krita Sri Shiva Stuti Lyrics

ఇంద్రాదికృత శ్రీశివస్తుతిః

నమామి సర్వే శరణార్థినో వయం
మహేశ్వర త్ర్యంబక భూతభావన |
ఉమాపతే విశ్వపతే మరుత్పతే
జగత్పతే శంకర పాహి న స్స్వయమ్॥

1

జటా కలాపాగ్ర శశాంక దీధితి
ప్రకాశితాశేష జగత్రయామల |
త్రిశూలపాణే పురుషోత్తమా చ్యుత
ప్రపాహి నో దైత్య భయా దుపస్థితాత్॥

2

త్వమాదిదేవః పురుషోత్తమో హరి
ర్భవో మహేశ స్త్రిపురాంతకో విభుః|
భగాక్షహా దైత్యరిపుః పురాతనో
వృషధ్వజః పాహి సురోత్తమోత్తమ ॥

3

గిరీశజానాథ గిరిప్రియాప్రియ
ప్రభో సమస్తామర లోక పూజిత।
గణేశ భూతేశ శివాక్షయావ్యయ
ప్రపాహి నో దైత్యవరాంతకా చ్యుత ॥

4

పృథ్వ్యాది తత్వేషు భవాన్ ప్రతిష్ఠితో
ధ్వనిస్వరూపో గగనే విశేషతః |
వాయౌ ద్విధా తేజసి స(లీనో) త్రిథా జలే
చతుః క్షితౌ పంచగుణ ప్రథానః ||

5

అగ్నిస్వరూపోసి తరౌ తథోపలే
సత్త్వస్వరూపోసి తథా తిలష్వపి|
తైలస్వరూపో భగవాన్ మహేశ్వరః
ప్రపాహి నో దైత్యగణార్ధితాన్ హర ||

6

నాసిద్యదాకాండమిదం త్రిలోచన
ప్రభాకరేంద్రేందు వినాపి వా కుతః|
తదా భవానేన విరుద్ధ లోచన
ప్రమాద బాధాది వివర్జితః స్థితః ॥

7

కపాలమాలిన్ శశిఖండ శేఖర
శ్మశానవాసిన్ సితభస్మ గుంభిత|
ఫణీంద్ర సంవీత తనోంతకాంతక
ప్రపాహిహీ నో దక్షధియా సురేశ్వర ॥

8

భవాన్ పుమాన్ శక్తిరియం గిరేస్సుతా
సర్వాంగరూపా భగవన్ సదాత్వయి |
త్రిశూల రూపేణ జగద్భయంకరే
స్థితం త్రినేత్రేషు ముఖాగ్నయ స్త్రయః॥

9

జటా స్వరూపేణ సమస్త సాగరాః
కులాచలా స్సింధువహాశ్చ సర్వశః|
శరీరజం జ్ఞానమిదం త్వవస్థితం
తదేవ పశ్యంతి కుదృష్టయో జనాః ॥

10

నారాయణ స్వం జగతాం సముద్భవ
స్తథా భవానేవ చతుర్ముఖో మహాన్|
సత్త్వాది భేదేన తథా గ్ని భేదతో
యుగాది భేదేన చ సంస్థిత స్త్రిధా ॥

11

భవంత మేతే సురనాయకాః ప్రభో
భవార్థినో న్యస్య వదంతి తోషయన్|
యత స్తతో నో భవ భూతిభూషణ
ప్రపాహి విశ్వేశ్వర రుద్ర తే నమః ||

12

ఇతి శ్రీవరాహ పురాణాంతర్గత ఇంద్రాదికృత శివస్తుతి.

మరిన్ని స్తోత్రములు

Sitasameta Rama Sri Rama In Telugu – సీతాసమేత రామ శ్రీరామ

సీతాసమేత రామ శ్రీరామ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సీతాసమేత రామ శ్రీరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సీతాసమేత రామ శ్రీరామ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: సీతాసమేత రామ శ్రీరామ
సంఖ్య : 516
పుట: 347
రాగం: సాళంగనాట

సాళంగనాట

39 సీతాసమేత రామ శ్రీరామ
రాతి నాతిఁజేసిన శ్రీరామ రామ.

||పల్లవి||

ఆదిత్యకులమునందు నవతరించినరామ
కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రుయాగము గాచినరామ
వేదవేదాంతములలో వెలసినరామ.

||సీతా||

బలిమి సుగ్రీవునిపాలినిధానమ రామ
యిల మునుల కభయమిచ్చినరామ
జలధి నమ్ము మొనను సాధించినరామ
అలరు రావణదర్పహరణ రామ.

||సీతా||

లాలించి విభీషణుని లంకయేలించినరామ
చాలి శరణాగతరక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద వెలసినరామ
తాలిమితో వెలయు ప్రతాపపురామ.

||సీతా||516

అవతారిక:

శ్రీరామచంద్రమూర్తిపై చక్కటి భజననందిస్తున్న అన్నమాచార్యులవారి ఈ కీర్తన నాస్వాదించండి. బహు సులభమైన దీనిలో ఒకే ఒక్క మెలిక ‘ఆదరించి విశ్వామిత్రుయాగము గాచిన రామా’ అనే చోట వున్నది. ఇక్కడ ఆదరించడం అంటే సమున్నతమైన గౌరవం అన్నమాట. శ్రీరాముడు పరమాత్మే కదా! ఆయనకి తెలియనిదొక్కటీ వుండదు. అయినా ఏమీ తెలియని అమాయకుడిలా విశ్వామిత్రునికి గురుస్థానం ఇచ్చి ఆయన చెప్పినదంతా విని ఆయన యాగరక్షణ చేసి ‘రాముడు మంచి బాలుడు’ అనిపించుకొన్నాడు. ఇది బహుశా వావిలిపాడు వీరరాఘవునిపై చెప్పిన కీర్తన కావచ్చును.

భావ వివరణ:

సీతాసమేతుడవు (సీతాదేవితో ఒకే సింహాసనమును అధిష్టించియున్న) రాముడవు అయిన శ్రీరామా! శిలవలె అచేతనస్థితిలోవున్న నాతి అహల్యకు చేతనత్వము ప్రసాదించిన రామచంద్రమూర్తివి నీవే.

ఓ శ్రీరామా? నీవు ఆదిత్య కులమున (సూర్యవంశమున) అవతరించినవాడవు; కోదండ భంజనుడవు (శివ ధనస్సును విరిచిన రఘురాముడవు). విశ్వామిత్రునకు నీ గురుస్థానమును ప్రసాదించి, వినయశీలివైన శిష్యుడవై అనేక అస్త్రములను విద్యలను స్వీకరించి ఆయన యాగరక్షణ నెపమున దానవ దమనకు పునాది వేసితివి. వేదవేదాంతముల మూలపురుషుడవైన తారకరాముడవుగా వెలసిన శ్రీరామబ్రహ్మం నీవే.

ఓ శ్రీరామా! అలనాడు నీ బలమేమిటో సుగ్రీవుని కన్నులకు కట్టించి వానిని తిరిగి నిలబెట్టినవానిపాలి నిధానమవు (ఐశ్వర్యమైతివి); రాక్షసులచే వేధించబడుచున్న మునులకు జనస్థానమున అభయమిచ్చి రాక్షసులు పీడ తొలగించితివి. సేతువును నిర్మించదలచి నయమున నీకు లొంగని సాగరుని అమ్ము మొనకుదెచ్చి వానిని సాధించితివి. దర్పముతో (గర్వముతో) కన్నుమిన్ను గానని రావణుని గర్వమును హరించిన రామభద్రుడవైతివి.

అన్న మరణమునకు తానే కారణమని రోదించుచున్న విభీషణుని ఓదార్చి లంకకు యేలికను చేసితివి. కావలసినవారికి కావలసినంత శరణ్యమునొసగి రక్షించితివి. నేడు బంగారు శిఖరముల బోలిన తిరుమల శిఖరములపై శ్రీవేంకటేశ్వరుడవై చేరితివి. నీవే తాలిమితో (అనుపమ క్షమను ప్రదర్శించు) ప్రతాపపు రాముడవై (వీరరాఘవుడవై వెలసితివి. నీవే రాజారాముడవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Dwadasa Jyotirlinga Stotram In Telugu – ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము

Dwadasa Jyotirlinga Stotram Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Dwadasa Jyotirlinga Stotram Lyrics

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము 

సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||

1

శ్రీశైలశృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం |
తమర్జునం మల్లిక పూర్వ మేకం నమామి సంసార సముద్రసేతుం ||

2

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహం సురేశం ||

3

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ |
సదైవ మాంధాతృ పురే వసంత మోంకార మీశం శివ మేక మీడే||

4

పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం |
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||

5

యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః|
సద్భక్తి ముక్తిప్రద మీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే||

6

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రః |
సురాసురైఃయక్ష మహోరగాదైః కేదార మీశం శివమేక మీడే ||

7

సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే, యద్దర్శనాత్
పాతక మాశు నాశం ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే ||

8

సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖై రసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి||

9

యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||

10

సానంద మానందవనే వసంత మానందకందం హతపాప బృందం |
వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

11

ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదారతర స్వభావం ఘృష్టేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||

12

జ్యోతిర్మయం ద్వాదశ లింగకానాం శివాత్మనాం ప్రోక్తం మిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వా మనుజేతి భక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ! ||

13

మరిన్ని స్తోత్రములు

Sri Shiva Mangala Ashtakam In Telugu – మంగళాష్టకం

Sri Shiva Mangala Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళాష్టకం గురించి తెలుసుకుందాం…

Sri Shiva Mangala Ashtakam Telugu

మంగళాష్టకం

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయచ
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||

భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||

సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే
సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||

మృత్యుజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ త్రికోలకేశాయ మంగళమ్ ||

గంగాధరాయ సోమాయ నమో నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||

సదాశివ స్వరూపాయ సమస్తత్పురుషాయ చ
అఘోరాయచ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||

చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదమ్
తస్యాం భీష్ట ప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ ||

మరిన్ని అష్టకములు

Nivu Jagannathumdavu Ne Noka Jivumda Ninte In Telugu – నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే

నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
సంఖ్య : 169
పుట: 113
రాగం: భైరవి

భైరవి

50 నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
నీవలె ననుభవించ నేనెంతవాఁడను

||పల్లవి||

వైకుంఠ పదమేడ వడిఁగోర నెంతవాఁడ
యీ కడ నీ దాసుఁడనౌ టిది చాలదా
చేకొని నీ సాకారచింత యేడ నే నేడ
పైకొని నీ డాగుమోచి బ్రదికితిఁ జాలదా

||నీవు||

సొంపుల నీ యానందసుఖమేడ నే నేడ
పంపు శ్రీవైష్ణవసల్లాపన చాలదా
నింపుల విజ్ఞాన మేడ నేఁ దెలియ నెంతవాఁడ
యింపుగా నీకథ వినుటిదియే చాలదా

||నీవు||

కైవల్యమందు నీతో కాణాచి యాడనాకు
శ్రీ వేంకటాద్రిమీఁది సేవ చాలదా
యీవల శ్రీవేంకటేశ నీ విచ్చిన విజ్ఞానమున
భావించి నిన్నుఁ బొగడే భాగ్యమే చాలదా

||నీవు||

అవతారిక:

“ప్రభూ! నీవు పరమాత్మవు, జగన్నాథుడవు. మరి నేనో? ఒక జీవుడను. ఈ సృష్ఠిలో సర్వమూ నీదే. నీవలె అన్నీ అనుభవించే హక్కు నాకెక్కడిదయ్యా!” అని వినమృలై కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. నీ కైవల్యం పొందగలిగే అర్హత నాకున్నదా స్వామీ? పోనీలేవయ్యా! ఈ తిరుమలో నీసేవాభాగ్యం దక్కితే చాలు నాకు. నీవు నాకిచ్చిన ఈ కొద్దిపాటి విజ్ఞానంతో నిన్నే భావించి నిన్నే కీర్తిస్తూ బ్రతుకుతాను అది చాలునాకు అంటున్నారు. ఇక మనమైతే, అట్లాంటి కోరిక కోరుకోవాలనే కోరిక కలుగని కొరగాని కొరకరాని కొయ్యను నేను.

భావ వివరణ:

ఓ దేవదేవా! నీవు జగన్నాథుడవు. పరమాత్మవు. మరి నేనో, ఒక జీవుడను, నీవు సర్వ భోక్తవు. నీవలె అనుభవించుటకు నేనెంతవాడను ప్రభూ! నీవు వైకుంఠము 9నీయగల సమర్థుడవె. కాని నీవు వైకుంఠమెక్కడ నేనెక్కడ? దాన్ని కోరే అర్హత నాకున్నదా? అయితే అయిందిలే స్వామీ! ఇక్కడ నీదాసుడను అనిపించుకొంటే నాకదే పదివేలు. కొంతమంది నిన్ను సాకారంగా ప్రత్యక్షం చేసికొనవలెనని కోరుకుంటారు. కానీ నేనెక్కడ నీసాకార దర్శనమెక్కడ! ఏదో ఈ వైష్ణవదీక్షలో నీతిరునామము, ఒంటిపై శంఖచక్ర చిహ్నములు నాకుచాలునయ్యా! ఇట్లా పైకొని (నా శరీరంపై దాల్చిన) వాటితో బ్రతికితే అది చాలు నాకు.

సొంపైన నీ బ్రహ్మానందానుభవంతో కలిగే సుఖము నాకు సాధ్యమా తండ్రీ! అదెక్కడ నేనెక్కడ? కానీలే- నాకు నీ వైష్ణవ సల్లాపములు (ప్రవచనములు) చాలును. ఇంపైన విజ్ఞానము (భగవంతుని గురించి జ్ఞానము) కోటికొక్కడికి దక్కుతుంది దాన్ని తెలుసుకోవటానికి నేనెంత వాడను ప్రభూ! ఏదో నీకథాశ్రవణంతో నా బ్రతుకును గడిపేస్తాను నాకది చాలును.

కైవల్యము అంటే నీతో వుండిపోయే భాగ్యం పొందటమే. | ఆమోక్షస్థానమే చిరకాల వాస స్థానము (కాణాచి) అదెక్కడ, నేనెక్కడ? ఇదిగో నీవేంకటాద్రి మీద నీసేవ నాకుండగా అనవన్నీ నాకెందుకయ్యా? ఓ శ్రీవేంకటేశ్వరా! ఇకపై నీవు ఇచ్చిన ఈ విజ్ఞానంతో భాలించి నిన్ను కీర్తిస్తూ బ్రతికేస్తాను. నాకు ఆ భాగ్యం చాలు. ఇంకేదీ వద్దుగాకవద్దు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు