మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
Sri Vasishta Krita Parameshwara Stotram Lyrics Telugu
కావ్యనాయికలను శృంగారశాస్త్రం నాలుగురకాలుగా వర్ణించింది. పద్మినిజాతి స్త్రీ, హస్తిణి, చిత్రిణి, శంకిణి అని చెప్పబడిన వీరిలో ప్రతి యువతి తన శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఆ జాతికి చెందిన స్త్రీగా నిశ్చయింపబడినది. ఈ కీర్తనలో అన్నమాచర్యులవారు నలుగురు గొల్లెతలను ఆ విధంగా విభజించి బంగారు శరీరఛాయతోనున్న గొల్లెత తానెందును. బుట్టని యేతరిజాతి చిన్నది అంటున్నారు. అంటే యేమిటి? సరసశృంగారంకాస్త గూఢంగా వుంటే అందం కదా! భావవివరణ జాగ్రత్తగా చదవండి. కొసమెరుపేమంటే, నలుగురికీ ఆ నల్లనివాడంటే వుల్లములో జల్లే.
భావ వివరణ:
కుందణంపుమై (బంగారు శరీరచ్ఛాయగల) గొల్లెత (ఆ గొల్లభామ) | తాను యెందును (ఏజాతిలోనూ) పుట్టని యేతరిజాతి (అతిశయముగల స్త్రీ). అనగా వూహాసుందరి.
కప్పులుదేరేటి కస్తూరి (నల్లని కస్తూరీ పరిమళముగల) బాహు మూలములామె ప్రత్యేకత. ఆమె కొప్పెర గుబ్బల (వున్నత కుచయుగళము) గల గొల్లెత. ఆమె చల్లలమ్ముటకు పోతుంటే ఆమెమట్టెల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. అప్పని ముందట (హరియెదుట) ఆ హస్తిణీజాతి గొల్లెత నడయాడుచున్నది.
ఆమె తల వెంట్రుకలు, దుంపలు కట్టి (కుచ్చులు కట్టి) పెద్ద కొప్పుతో వున్నది. | ఆమె నడుస్తుంటే గుంపెనగా (అట్టహాసముగా) వుంటుంది. ఆమె కదులుతుంటే ఆమె చెవులకు దరించిన జంపులు (చెంపసరములు) నర్తించుతాయి. చల్లలమ్ముటకు ఆమె మధురానగరంలో నడుస్తుంటే శ్రమవల్ల ఆమె చెంపలు చెమటను చెమరించుచున్నవి. ఆమె తప్పకుండా చిత్తిణీజాతి స్త్రీయే సుమా!
ఇదిగో ఈ గొల్లెతను చూడండి. ఉద్రేకమున ఈమె వీపుపై నఖక్షతములను సైతము జేయగలదు. ఈమె చూపులే చురచురమనునట్లు కోపాగ్నితో వుంటాయి. ఆమె నడుస్తుంటే పరుగెడునట్లుంటుంది. ఈమె చల్లలమ్ముటకు చాపేటి యెలుగున (పెద్ద గొంతుతో కేకలు వేస్తూ అమ్ముతుంది). ఈ జవ్వని శంకిణిజాతి గొల్లెత.
ఈ గొల్లెతను చూశారా? ఈమె అతిశయించిన గారవము (గౌరవము) తో శ్రీవేంకటేశ్వరుని కౌగిటిని యెన్నడు విడువదు. తిరుమలేశునిపై ఆమె యెనలేని కూరిమి (వలపు) కలిగి వుంటుంది. ఈ గొల్లెత యెప్పుడు చల్లలమ్ముటకు పోయినా తనవెంట ఆ రమణుడే వుండాలని ఆశపడుతుంది. ఆమె భారపు (అధికమైన) అలసటను (శ్రమను) తట్టుకోలేదు. ఆమె ఆయనకు ప్రియమైన పద్మినీజాతి స్త్రీ.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సువర్ణ మాలా స్తుతిఃగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వేదసార శివ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
ఒకానొక శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తననాలకించండి. “శిష్టరక్షణమును, దుష్టశిక్షణమును భగవంతుడు శ్రీజయంతినాడు ఒకే సమయంలో సృష్టించె” అంటున్నారు. మునులను రక్షించాడు, దానవులను భక్షించాడు. గోవులను మేపాడు, కంసుని వేపాడు. పాండవులు యెచ్చిరి, కౌరవుల పనిదీరె అని కృష్ణావతారవైశిష్ట్యాన్ని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుడు కూడా ఆయన చేరువనే మెరసినాడట. గతంలో ఇటువంటి కీర్తనలు చూచినా దేని మాధుర్యం దానిదే.
భావ వివరణ:
ఓ భక్తులారా! ఈ శ్రీజయంతినాడు (శ్రీకృష్ణాష్టమినాడు) ఆ భగవంతుడు, శిష్టరక్షణము (మంచివారిని రక్షించుట), దుష్టనిగ్రహము (చెడ్డవారిని నిరోధించుట) ఒక్కవేళనే (ఒకే సమయంలో) సృష్టించెన్ (సిద్ధింపజేశాడు).
శ్రీహరి కృష్ణావతారమును పొందినప్పుడు పరమ మునీంద్రులకు అందరికీ దానవుల భయము వుడిగెను (అణగిపోయినది). తెరలి (కలతపడిన) దైత్యుల గుండెలు, అత్తరి (అప్పుడు) దిగులుచొచ్చె (దిగులుతో దిగాలుపడ్డాయి). ఈ శ్రీజయంతి సిరులుమించిన (వైభవములతిశయించిన) పండుగ అవటంచేత ఈనాడు అంతా జయమే.
ఆ గోవింద వసుదేవుని కొడుకైనప్పుడే కొడుకైనప్పుడే గొల్లపల్లెను (గోకులమునందున్న) గోవులన్నీ సంతోషంతో రంకె వేసినవి. ఎందుకంటే వాటికి భగవంతుడు తమ మూపురాలను ప్రేమగా నిమరటానికి రాబోతున్నాడని తెలిసిపోయింది. అక్కడ మధురలో కంసునికి నోవితోడ (వేదనతో) చూడగానే (యోగమాయ హెచ్చరిక విని జరిగింది చూడగా) భయంతో నూరునిండె (నూరేళ్ళు నిండాయి). ఈ శ్రీజయంతినాడు చేవలు మీరినయట్టి (అందరికీ ధైర్యంకలిగినట్టి ఈరోజున) కంసాదులకు కన్నీళ్ళొచ్చాయి.
నారాయణుడు భువిపై తాన్ నరుడు కాగానే (అవగానే మేం (క్రమముగా) మేనవావిని (మేనరికపు బంధుత్వమునందు) పాండవులు యెచ్చిరి (బలోపేతులయ్యారు). కౌరవులు (దుష్టరాజసమూహంగల కురుసేన) పనిదీరె (పనిముగిసినది). ఈ శ్రీజయంతినాడు ఆ కృష్ణలీల సంకేతముగా, శ్రీవేంకటేశుడు ఈ తిరుమల శిఖరాలపై కమ్మి మెరయగా (వ్యాపించి మెరిసిపోగా) చేరువనే (ఇక్కడే) పండుగ పరిమళించింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లుప్తంగా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…
ఈ కవచమును పైన చెప్పినవిధిగా ప్రతి నిత్యము పఠించినచో సర్వరోగములు, సర్వ శత్రుబయములు తప్పక శమించును. ఇది పూర్వము శ్రీరామునకు వశిష్ఠముని యుపదేశించిన అత్యద్భుత కవచము. ఇది పరాశరసంహితనుండి గ్రహింపబడింది.
“గోవులను కాచే గోవిందుడా! నిన్ను చూచి ఈ రేపల్లె గొల్లభామలు గొల్లుమని నవ్వారయ్యా! వాళ్ళనేమనగలము?” అంటున్నారు అన్నమాచార్యులవారు. నీ కోపాలు యికపై చెల్లేట్లులేవు. మరి నీవు వాళ్ళ చీరెలెత్తికెళ్ళిపోతే మళ్ళీ నిన్నే తిడుతున్నారు, అంటున్నారు. ఈ గోవిందుడు గొల్లవాడలోనున్న సతులనందరినీ ఒక్కవావిగానే చేశాడట. అంటే యేమిటో తెలుసా? ఆ గోవిందుడు, వరుసకు వదినా మరదళ్ళయిన ఇద్దరిని కూడితే వారు ఏమవుతారు? ఒకేవావి కదా! అంటే అక్కా చెల్లెళ్ళేకదా! అదన్నమాట సంగతి. ఇంతా చేసిన ఆ శ్రీసతిలోలుడేనట.
భావ వివరణ:
ఓ గోవిందుడా! ఈ గొల్లెతలను (గొల్లభామలను యేమనేవు (నీవేమి అనగలవు?) నీసంగతులు చెప్పుకొంటూ వాళ్ళు గొల్లుమని నవ్వుకొంటున్నారు చూశావా?
ఓ గోవిందుడా! నీ సుద్దులెల్లా (ముచ్చట్లనన్నియు) ఈ గోపికలు నీ తల్లి యశోదమ్మతో యేపున వున్నవీ లేనివీ కల్పించి యెక్కువగా) చెబుతున్నారు. నీ తీపుల చేతలెల్లా (నీవు పెట్టిన యాతనలు చిలిపి పనులు) అన్నియునూ తేటతెల్లమాయె (బట్టబయలైపోయాయి). ఓ గోవిందుడా నీ అలుకలు చెల్లవిక.
ఒకానొక నృసింహ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తననాస్వాదించండి. “ఓనరులారా! నేటిదినముననే స్తంభములో నరసింహుడు వుదయించి హిరణ్యకశిపుని తుదముట్టించి దేవతలకు శుభములను ఆనందమును యొసగినాడు” అని, ఆయన ప్రహ్లాదుని రక్షించిన వైనం కీర్తిస్తున్నారు. శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుడైన ఆ ఏడుకొండలవాడే ఈయనైనందువలన వంచన సేయక మంచి వరాలిస్తాడు అని అంటున్నారు. ఈ ఔభళేశుడు (అహెూబల నరసింహుడు) గురుతరమైన బ్రహ్మాండ గుహలో వెలసినాడట.
భావ వివరణ:
ఓ నరులారా! నేడే నృసింహ జయంతి. ఈ నరసింహ జయంతి నాడే ఆయన స్తంభమున వెలసి హిరణ్యకశిపుని వధించి సురులకు ఆనందము కలిగించి శుభములనొసగినాడు.
ఈ ఔభళేశుడు (అహోబలేశ్వరుడు) సందించి (పూని) వైశాఖ శుద్ధ చతుర్ధశినాడు, శనివారము రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించినాడు. చక్కగా ఆ హిరణ్యకశిపుని వరముల ననుసరించియే కంభములో పొడమి (స్తంభములోనుంచి పుట్టాడు కాబట్టి యే తల్లిదండ్రికి పుట్టనివాడైనాడు). ఒక కడపమీద వాడిని చంపాడు (కాబట్టి ఇంటా బయటా కాని చోటనే వాడు చచ్చాడు). కందువ (సామర్థ్యంతో) తనవాడియైన గోళ్ళతో (యే ఆయుధముతోను వాడికి చావులేదు కాబట్టి) చీల్చి ఆ కనకకశిపుని (హిరణ్య కశిపుని) వధించినాడు.
ఈయనయెట్లా వున్నాడో ఒకసారి చూడండి. ఈయనది నరమృగరూపము (తల సింహానిది శరీరము నరునిది), నానాహస్తములు (చాలా చేతులు వున్నందున నరుడు కూడా కాదు). అరిది (ఉపయోగింపబడని) శంఖచక్రములు ఆయన హస్తభూషణములుగా వున్నవి. గరిమ (అద్భుతముగా) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడి రక్షించి నిలిచినాడు. ఎక్కడ? బ్రహ్మాండమైన ఈ అహెూబలం కొండ గుహలో నిలిచినాడు.
ఎట్లా నిలిచాడో గమనించండి. ఆ దనుజుని వధానంతరం వెంటనే బంగారు గద్దెపై (సింహాసనముపై) మించుగ (వున్నతముగా) ఇందిరను (శ్రీలక్ష్మిని) తన తొడపై కూర్చుండబెట్టుకొని కొలువైయున్నాడు. ఈయనే అంచె (ఆ తరువాత) శ్రీవేంకటగిరి మీద ఆది పురుషుడు శ్రీవేంకటేశ్వరుడై నిలిచాడు. వంచన సేయక (నమ్మిన తన భక్తులను వంచించక) మంచి మంచి వరములనిస్తున్నాడు. అదిగో ఆయనకు మ్రొక్కండి.