Sri Dattatreya Ashtottara Shatanamavali In Telugu – దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళీ

Sri Dattatreya Ashtottara Shatanamavali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Dattatreya Ashtottara Shatanamavali Lyrics In Telugu

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళీ

  • ఓం శ్రీదత్తాయ నమః
  • ఓం దేవదత్తాయ నమః
  • ఓం బ్రహ్మదత్తాయ నమః
  • ఓం విష్ణుదత్తాయ నమః
  • ఓం శివదత్తాయ నమః
  • ఓం అత్రిదత్తాయ నమః
  • ఓం ఆత్రేయాయ నమః
  • ఓం అత్రివరదాయ నమః
  • ఓం అనసూయాయ నమః
  • ఓం అనసూయాసూనవే నమః
  • ఓం అవధూతాయ నమః
  • ఓం ధర్మాయ నమః
  • ఓం ధర్మపరాయణాయ నమః
  • ఓం ధర్మపతయే నమః
  • ఓం సిద్ధాయ నమః
  • ఓం సిద్ధిదాయ నమః
  • ఓం సిద్ధిపతయే నమః
  • ఓం సిద్ధసేవితాయ నమః
  • ఓం గురవే నమః
  • ఓం గురుగమ్యాయ నమః
  • ఓం గురోర్గురుతరాయ నమః
  • ఓం గరిష్ఠాయ నమః
  • ఓం వరిష్ఠాయ నమః
  • ఓం మహిష్ఠాయ నమః
  • ఓం మహాత్మనే నమః
  • ఓం యోగాయ నమః
  • ఓం యోగగమ్యాయ నమః
  • ఓం యోగాదేశకరాయ నమః
  • ఓం యోగపతయే నమః
  • ఓం యోగీశాయ నమః
  • ఓం యోగాధీశాయ నమః
  • ఓం యోగపరాయణాయ నమః
  • ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః
  • ఓం దిగంబరాయ నమః
  • ఓం దివ్యాంబరాయ నమః
  • ఓం పీతాంబరాయ నమః
  • ఓం శ్వేతాంబరాయ నమః
  • ఓం చిత్రాంబరాయ నమః
  • ఓం బాలాయ నమః
  • ఓం బాలవీర్యాయ నమః
  • ఓం కుమారాయ నమః
  • ఓం కిశోరాయ నమః
  • ఓం కందర్పమోహనాయ నమః
  • ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
  • ఓం సురాగాయ నమః
  • ఓం విరాగాయ నమః
  • ఓం వీతరాగాయ నమః
  • ఓం అమృతవర్షిణే నమః
  • ఓం ఉగ్రాయ నమః
  • ఓం అనుగ్రరూపాయ నమః
  • ఓం స్థవిరాయ నమః
  • ఓం స్థవీయసే నమః
  • ఓం శాంతాయ నమః
  • ఓం అఘోరాయ నమః
  • ఓం గూఢాయ నమః
  • ఓం ఊర్ధ్వరేతసే నమః
  • ఓం ఏకవక్త్రాయ నమః
  • ఓం అనేకవక్త్రాయ నమః
  • ఓం ద్వినేత్రాయ నమః
  • ఓం త్రినేత్రాయ నమః
  • ఓం ద్విభుజాయ నమః
  • ఓం షడ్భుజాయ నమః
  • ఓం అక్షమాలినే నమః
  • ఓం కమండలధారిణే నమః
  • ఓం శూలినే నమః
  • ఓం డమరుధారిణే నమః
  • ఓం శంఖినే నమః
  • ఓం గదినే నమః
  • ఓం మునయే నమః
  • ఓం మౌనినే నమః
  • ఓం శ్రీవిరూపాయ నమః
  • ఓం సర్వరూపాయ నమః
  • ఓం సహస్రశిరసే నమః
  • ఓం సహస్రాక్షాయ నమః
  • ఓం సహస్రబాహవే నమః
  • ఓం సహస్రాయుధాయ నమః
  • ఓం సహస్రపాదాయ నమః
  • ఓం సహస్రపద్మార్చితాయ నమః
  • ఓం పద్మహస్తాయ నమః
  • ఓం పద్మపాదాయ నమః
  • ఓం పద్మనాభాయ నమః
  • ఓం పద్మమాలినే నమః
  • ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
  • ఓం పద్మకింజల్కవర్చసే నమః
  • ఓం జ్ఞానినే నమః
  • ఓం జ్ఞానగమ్యాయ నమః
  • ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
  • ఓం ధ్యానినే నమః
  • ఓం ధ్యాననిష్ఠాయ నమః
  • ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
  • ఓం ధూలిధూసరితాంగాయ నమః
  • ఓం చందనలిప్తమూర్తయే నమః
  • ఓం భస్మోద్ధూలితదేహాయ నమః
  • ఓం దివ్యగంధానులేపినే నమః
  • ఓం ప్రసన్నాయ నమః
  • ఓం ప్రమత్తాయ నమః
  • ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః
  • ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
  • ఓం వరదాయ నమః
  • ఓం వరీయసే నమః
  • ఓం బ్రహ్మణే నమః
  • ఓం బ్రహ్మరూపాయ నమః
  • ఓం విష్ణవే నమః
  • ఓం విశ్వరూపిణే నమః
  • ఓం శంకరాయ నమః
  • ఓం ఆత్మనే నమః
  • ఓం అంతరాత్మనే నమః
  • ఓం శ్రీ దత్తాత్రేయాయ నమో నమః

మరిన్ని అష్టోత్తరములు:

Ashtottara – అష్టోత్తర

Ashtottara

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అటువంటి అష్టోత్తరాన్నిఎలా చదవాలి, ఏయ్ ఏయ్ అష్టోత్తరాన్ని చదవాలి, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి, మొదలగు అష్టోత్తర విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం.

Ashtottara – అష్టోత్తర

Tulasi Matha Mangala Harathulu In Telugu – తులసి మాత మంగళ హారతులు

Tulasi Matha Mangala Harathulu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. తులసీ మాత అంటేనే తులసి మొక్కకు దేవతా రూపంగా భావించి పూజించడం. హిందూ ధర్మంలో తులసీ మాతకు ప్రత్యేక స్థానం ఉంది. తులసీ అనేది పవిత్రమైన మొక్క, విశేషించి విష్ణుమూర్తికి ప్రియమైనది. తులసీ మొక్కను పూజించడం వల్ల మనకు శుభాలు కలుగుతాయని మన పురాణాలు, శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు తులసి మాత మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

తులసీ ప్రదక్షిణం

గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా ।
ఒంటి ప్రదక్షణం నీకిస్తినమ్మా ।
వైకుంఠ సన్నిధీ నాకియ్యవమ్మా ।
రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
నిండారు సంపదలు నాకియ్యవమ్మా ।
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
ముత్తైదువతనం నాకియ్యవమ్మా ।
నాల్గో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
నవధాన్య రాసులను నాకియ్యవమ్మా ।
అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
అయువైదోతనం నాకియ్యవమ్మా ।
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ।
అత్తగల పుత్రుడ్ని నాకియ్యవమ్మా ।
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా ।
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తానమ్మా ।
యమునిచే బాధలు తప్పించవమ్మా ।
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
తోడుతా కన్యలకు తోడియ్యవమ్మా ।
పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మా ।
వెదలు పాడితే ఏకాశి మరణం ।
పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం ।
రామ తులసీ లక్ష్మీ తులసి నిత్యం ।
మా యింట వెలుగై విలసిల్లవమ్మా ।

తులసి గోవిందం

కుదుళ్ళ తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
కూర్మాము తానాలు గోవిందా రామ ।
చేసివచ్చిన ఫలము గోవిందా రామ ।
మొక్కల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
మొక లింగ తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
ఆకుల్లో తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
హర్షవల్లి తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
జంట తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
జగన్నాధ తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
పువ్వుల్ల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
వున్నెగిరి తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
కాయల్ల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
కాశీలో తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
పండిన తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
ఏడేడు లోకాలు గోవిందా రామ ।
తిరిగి వచ్చిన ఫలము గోవిందా రామ ।

మరిన్ని భక్తి గీతాలు : 

Govinda Damodara Stotram In Telugu – గోవింద దామోదర స్తోత్రమ్

Govinda Damodara Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గోవింద దామోదర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Govinda Damodara Stotram Lyrics

గోవింద దామోదర స్తోత్రమ్

అగ్రే కురూణామథ పాండవానాం
దుఃశాసనేనాహృతవస్త్రకేశా ।
కృష్ణా తదాక్రోశదనన్యనాథా
గోవింద దామోదర మాధవేతి ॥

1

శ్రీకృష్ణ విష్ణో మధుకైటభారే
భక్తానుకంపిన్ భగవన్ మురారే ।
త్రాయస్వ మాం కేశవ లోకనాథ
గోవింద దామోదర మాధవేతి ॥

2

విక్రేతుకామా కిల గోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః ।
దధ్యాదికం మోహవశాదవోచద్
గోవింద దామోదర మాధవేతి ॥

3

ఉలూఖలే సంభృతతండులాంశ్చ
సంఘట్టయంత్యో ముసలైః ప్రముగ్ధాః ।
గాయంతి గోప్యో జనితానురాగా
గోవింద దామోదర మాధవేతి ॥

4

కాచిత్కరాంభోజపుటే నిషణ్ణం
క్రీడాశుకం కింశుకరక్తతుండమ్ ।
అధ్యాపయామాస సరోరుహాక్షీ
గోవింద దామోదర మాధవేతి ॥

5

గృహే గృహే గోపవధూసమూహః
ప్రతిక్షణం పింజరసారికాణామ్ ।
స్ఖలద్గిరాం వాచయితుం ప్రవృత్తో
గోవింద దామోదర మాధవేతి ॥

6

పర్య్యంకికాభాజమలం కుమారం
ప్రస్వాపయంత్యోఽఖిలగోపకన్యాః ।
జగుః ప్రబంధం స్వరతాలబంధం
గోవింద దామోదర మాధవేతి ॥

7

రామానుజం వీక్షణకేలిలోలం
గోపీ గృహీత్వా నవనీతగోలమ్ ।
ఆబాలకం బాలకమాజుహావ
గోవింద దామోదర మాధవేతి ॥

8

విచిత్రవర్ణాభరణాభిరామే-
ఽభిధేహి వక్త్రాంబుజరాజహంసి ।
సదా మదీయే రసనేఽగ్రరంగే
గోవింద దామోదర మాధవేతి ॥

9

అంకాధిరూఢం శిశుగోపగూఢం
స్తనం ధయంతం కమలైకకాంతమ్ ।
సంబోధయామాస ముదా యశోదా
గోవింద దామోదర మాధవేతి ॥

10

క్రీడంతమంతర్వ్రజమాత్మజం స్వం
సమం వయస్యైః పశుపాలబాలైః ।
ప్రేమ్ణా యశోదా ప్రజుహావ కృష్ణం
గోవింద దామోదర మాధవేతి ॥

11

యశోదయా గాఢములూఖలేన
గోకంఠపాశేన నిబధ్యమానః ।
రురోద మందం నవనీతభోజీ
గోవింద దామోదర మాధవేతి ॥

12

నిజాంగణే కంకణకేలిలోలం
గోపీ గృహీత్వా నవనీతగోలమ్ ।
ఆమర్దయత్పాణితలేన నేత్రే
గోవింద దామోదర మాధవేతి ॥

13

గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాయయోగే ।
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి ॥

14

మందారమూలే వదనాభిరామం
బింబాధరే పూరితవేణునాదమ్ ।
గోగోపగోపీజనమధ్యసంస్థం
గోవింద దామోదర మాధవేతి ॥

15

ఉత్థాయ గోప్యోఽపరరాత్రభాగే
స్మృత్వా యశోదాసుతబాలకేలిమ్ ।
గాయంతి ప్రోచ్చైర్దధి మంథయంత్యో
గోవింద దామోదర మాధవేతి ॥

16

జగ్ధోఽథ దత్తో నవనీతపిండో
గృహే యశోదా విచికిత్సయంతీ ।
ఉవాచ సత్యం వద హే మురారే
గోవింద దామోదర మాధవేతి ॥

17

అభ్యర్చ్య గేహం యువతిః ప్రవృద్ధ-
ప్రేమప్రవాహా దధి నిర్మమంథ ।
గాయంతి గోప్యోఽథ సఖీసమేతా
గోవింద దామోదర మాధవేతి ॥

18

క్వచిత్ ప్రభాతే దధిపూర్ణపాత్రే
నిక్షిప్య మంథం యువతీ ముకుందమ్ ।
ఆలోక్య గానం వివిధం కరోతి
గోవింద దామోదర మాధవేతి ॥

19

క్రీడాపరం భోజనమజ్జనార్థం
హితైషిణీ స్త్రీ తనుజం యశోదా ।
ఆజూహవత్ ప్రేమపరిప్లుతాక్షీ
గోవింద దామోదర మాధవేతి ॥

20

సుఖం శయానం నిలయే చ విష్ణుం
దేవర్షిముఖ్యా మునయః ప్రపన్నాః ।
తేనాచ్యుతే తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి ॥

21

విహాయ నిద్రామరుణోదయే చ
విధాయ కృత్యాని చ విప్రముఖ్యాః ।
వేదావసానే ప్రపఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి ॥

22

వృందావనే గోపగణాశ్చ గోప్యో
విలోక్య గోవిందవియోగఖిన్నామ్ ।
రాధాం జగుః సాశ్రువిలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥

23

ప్రభాతసంచారగతా ను గావస్-
తద్రక్షణార్థం తనయం యశోదా ।
ప్రాబోధయత్ పాణితలేన మందం
గోవింద దామోదర మాధవేతి ॥

24

ప్రవాలశోభా ఇవ దీర్ఘకేశా
వాతాంబుపర్ణాశనపూతదేహాః ।
మూలే తరూణాం మునయః పఠంతి
గోవింద దామోదర మాధవేతి ॥

25

ఏవం బ్రువాణా విరహాతురా భృశం
వ్రజస్త్రియః కృష్ణవిషక్తమానసాః ।
విసృజ్య లజ్జాం రురుదుః స్మ సుస్వరం
గోవింద దామోదర మాధవేతి ॥

26

గోపీ కదాచిన్మణిపంజరస్థం
శుకం వచో వాచయితుం ప్రవృత్తా ।
ఆనందకంద వ్రజచంద్ర కృష్ణ
గోవింద దామోదర మాధవేతి ॥

27

గోవత్సబాలైః శిశుకాకపక్షం
బధ్నంతమంభోజదలాయతాక్షమ్ ।
ఉవాచ మాతా చిబుకం గృహీత్వా
గోవింద దామోదర మాధవేతి ॥

28

ప్రభాతకాలే వరవల్లవౌఘా
గోరక్షణార్థం ధృతవేత్రదండాః ।
ఆకారయామాసురనంతమాద్యం
గోవింద దామోదర మాధవేతి ॥

29

జలాశయే కాలియమర్దనాయ
యదా కదంబాదపతన్మురారిః ।
గోపాంగనాశ్చుక్రుశురేత్య గోపా
గోవింద దామోదర మాధవేతి ॥

30

అక్రూరమాసాద్య యదా ముకుందశ్-
చాపోత్సవార్థం మథురాం ప్రవిష్టః ।
తదా స పౌరైర్జయసీత్యభాషి
గోవింద దామోదర మాధవేతి ॥

31

కంసస్య దూతేన యదైవ నీతౌ
వృందావనాంతాద్ వసుదేవసూనూ । (సూనౌ)
రురోద గోపీ భవనస్య మధ్యే
గోవింద దామోదర మాధవేతి ॥

32

సరోవరే కాలియనాగబద్ధం
శిశుం యశోదాతనయం నిశమ్య ।
చక్రుర్లుఠంత్యః పథి గోపబాలా
గోవింద దామోదర మాధవేతి ॥

33

అక్రూరయానే యదువంశనాథం
సంగచ్ఛమానం మథురాం నిరీక్ష్య ।
ఊచుర్వియోగత్ కిల గోపబాలా
గోవింద దామోదర మాధవేతి ॥

34

చక్రంద గోపీ నలినీవనాంతే
కృష్ణేన హీనా కుసుమే శయానా ।
ప్రఫుల్లనీలోత్పలలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥

35

మాతాపితృభ్యాం పరివార్యమాణా
గేహం ప్రవిష్టా విలలాప గోపీ ।
ఆగత్య మాం పాలయ విశ్వనాథ
గోవింద దామోదర మాధవేతి ॥

36

వృందావనస్థం హరిమాశు బుద్ధ్వా
గోపీ గతా కాపి వనం నిశాయామ్ ।
తత్రాప్యదృష్ట్వాఽతిభయాదవోచద్
గోవింద దామోదర మాధవేతి ॥

37

సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః ।
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి ॥

38

సా నీరజాక్షీమవలోక్య రాధాం
రురోద గోవిందవియోగఖిన్నామ్ ।
సఖీ ప్రఫుల్లోత్పలలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥

39

జిహ్వే రసజ్ఞే మధురప్రియా త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి ।
ఆవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి ॥

40

ఆత్యంతికవ్యాధిహరం జనానాం
చికిత్సకం వేదవిదో వదంతి ।
సంసారతాపత్రయనాశబీజం
గోవింద దామోదర మాధవేతి ॥

41

తాతాజ్ఞయా గచ్ఛతి రామచంద్రే
సలక్ష్మణేఽరణ్యచయే ససీతే ।
చక్రంద రామస్య నిజా జనిత్రీ
గోవింద దామోదర మాధవేతి ॥

42

ఏకాకినీ దండకకాననాంతాత్
సా నీయమానా దశకంధరేణ ।
సీతా తదాక్రందదనన్యనాథా
గోవింద దామోదర మాధవేతి ॥

43

రామాద్వియుక్తా జనకాత్మజా సా
విచింతయంతీ హృది రామరూపమ్ ।
రురోద సీతా రఘునాథ పాహి
గోవింద దామోదర మాధవేతి ॥

44

ప్రసీద విష్ణో రఘువంశనాథ
సురాసురాణాం సుఖదుఃఖహేతో ।
రురోద సీతా తు సముద్రమధ్యే
గోవింద దామోదర మాధవేతి ॥

45

అంతర్జలే గ్రాహగృహీతపాదో
విసృష్టవిక్లిష్టసమస్తబంధుః ।
తదా గజేంద్రో నితరాం జగాద
గోవింద దామోదర మాధవేతి ॥

46

హంసధ్వజః శంఖయుతో దదర్శ
పుత్రం కటాహే ప్రతపంతమేనమ్ ।
పుణ్యాని నామాని హరేర్జపంతం
గోవింద దామోదర మాధవేతి ॥

47

దుర్వాససో వాక్యముపేత్య కృష్ణా
సా చాబ్రవీత్ కాననవాసినీశమ్ ।
అంతః ప్రవిష్టం మనసా జుహావ
గోవింద దామోదర మాధవేతి ॥

48

ధ్యేయః సదా యోగిభిరప్రమేయః
చింతాహరశ్చింతితపారిజాతః ।
కస్తూరికాకల్పితనీలవర్ణో
గోవింద దామోదర మాధవేతి ॥

49

సంసారకూపే పతితోఽత్యగాధే
మోహాంధపూర్ణే విషయాభితప్తే ।
కరావలంబం మమ దేహి విష్ణో
గోవింద దామోదర మాధవేతి ॥

50

భజస్వ మంత్రం భవబంధముక్త్యై
జిహ్వే రసజ్ఞే సులభం మనోజ్ఞమ్ ।
ద్వైపాయనాద్యైర్మునిభిః ప్రజప్తం
గోవింద దామోదర మాధవేతి ॥

51

త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే ।
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి ॥

52

గోపాల వంశీధర రూపసింధో
లోకేశ నారాయణ దీనబంధో ।
ఉచ్చస్వరైస్త్వం వద సర్వదైవ
గోవింద దామోదర మాధవేతి ॥

53

జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి ।
సమస్తభక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి ॥

54

గోవింద గోవింద హరే మురారే
గోవింద గోవింద ముకుంద కృష్ణ ।
గోవింద గోవింద రథాంగపాణే
గోవింద దామోదర మాధవేతి ॥

55

సుఖావసానే త్విదమేవ సారం
దుఃఖావసానే త్విదమేవ గేయమ్ ।
దేహావసానే త్విదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి ॥

56

దుర్వారవాక్యం పరిగృహ్య కృష్ణా
మృగీవ భీతా తు కథం కథంచిత్ ।
సభాం ప్రవిష్టా మనసా జుహావ
గోవింద దామోదర మాధవేతి ॥

57

శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధన నాథ విష్ణో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

58

శ్రీనాథ విశ్వేశ్వర విశ్వమూర్తే
శ్రీదేవకీనందన దైత్యశత్రో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

59

గోపీపతే కంసరిపో ముకుంద
లక్ష్మీపతే కేశవ వాసుదేవ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

60

గోపీజనాహ్లాదకర వ్రజేశ
గోచారణారణ్యకృతప్రవేశ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

61

ప్రాణేశ విశ్వంభర కైటభారే
వైకుంఠ నారాయణ చక్రపాణే ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

62

హరే మురారే మధుసూదనాద్య
శ్రీరామ సీతావర రావణారే ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

63

శ్రీయాదవేంద్రాద్రిధరాంబుజాక్ష
గోగోపగోపీసుఖదానదక్ష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

64

ధరాభరోత్తారణగోపవేష
విహారలీలాకృతబంధుశేష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

65

బకీబకాఘాసురధేనుకారే
కేశీతృణావర్తవిఘాతదక్ష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

66

శ్రీజానకీజీవన రామచంద్ర
నిశాచరారే భరతాగ్రజేశ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

67

నారాయణానంత హరే నృసింహ
ప్రహ్లాదబాధాహర హే కృపాలో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

68

లీలామనుష్యాకృతిరామరూప
ప్రతాపదాసీకృతసర్వభూప ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

69

శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

70

వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చిద్-
అహో జనానాం వ్యసనాభిముఖ్యమ్ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥

71

మరిన్ని స్తోత్రములు:

Sri Dattatreya Stotram In Telugu – శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్

Sri Dattatreya Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Dattatreya Stotram Lyrics

శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||

1

అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తః పరమాత్మా దేవతా, శ్రీదత్త ప్రీత్యర్థే జపే వినియోగః ||

నారద ఉవాచ |
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

1

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ||

2

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

3

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

4

యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

5

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవః సదాశివః | [మధ్యే విష్ణు]
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

6

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

7

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

8

జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

9|

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తు తే ||

10

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

11

అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

12

సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ |
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

13

శూలహస్త గదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

14

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్త ముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తు తే ||

15

దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

16

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తు తే ||

17

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ ||

18

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ |

మరిన్ని స్తోత్రములు:

Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

Ammavari Mangala Harathi Patalu In Telugu

Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అమ్మవారి పుణ్యమి అని పిలిచే అమ్మవారు మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. అమ్మవారు అనగా దేవతా స్వరూపమైన తల్లి అని అర్థం. వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వివిధ పేర్లతో పూజింపబడతారు. భారతీయుల విశ్వాసాలలో అమ్మవారు అన్ని శక్తులకు మూలమైన, సృష్టి, స్థితి, లయాలకు అధిపతిగా భావించబడతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అమ్మవారి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

దేవీ త్రినేత్రణీ

పావన స్వభావ దేవీ శ్రీదేవీ
(శంకరాభరణ స్వరాలు – త్రిశ్రం తాళం)

చ 1) దేవీ త్రినేత్రీణి దివ్య సుకృతి
నవ్య హరతీ
అవ్యయ హారతీ – దివ్యహారతి-సతీసార హారతీ॥

చ 2) జగములేల చాలును
నీ చరణ యుగళియే
చరణయుగళియే – చరణయుగళియే
కరుణ యుగళియే – సతీ పంచయుగలకీ॥

చ 3) నరసమాంబ ఆశ్రితవరా
సరస గుణగుణా
సరస గుణగుణా సరస గుణగుణా
సరస గుణగుణా సతీ సర్వగుణగుణా

జయ జయ హారతి జయ వరలక్ష్మీ

ప్రియనయ జయలక్ష్మీ వరలక్ష్మీ
(పున్నాగ వరాళి రాగం – ఆదితాళం)

పల్లవి: జయ జయ హారతీ జయవరలక్ష్మీ
జయ జయ మంగళ మమ్మా భవానీ

||జయ||

చ 1) పతిత పావనీ పాపవిమోచని
పరమ కృపాకరి శుభ శాంభవి

||జయ||

చ 2) కోటి సూర్య వంశాభరణీ
మాతా మహేశ్వరీ మము బ్రోవుమమ్మా

||జయ||

మణి మాణిక్యాంబ నీకు మహిత మంగళం

మాణిక్య వీణాపాణీ! మాణిక్యాంబా!
(పీలురాగ స్వరాలు – త్రిశ్రం తాళం)

చ 1) మనీ మాణిక్యాంబ నీకు మహిత మంగళం
దేవి నీదు పాదములకు దివ్యమంగళం

॥మణి॥

చ 2) దేవి నీకు సరిసమాను లెవరు లేరుగా
దేవరాజు మునులు పొగడ దివ్య మంగళం

॥మణి॥

మంగళ హారతిదే ఓ అనసూయాదేవీ

అమృతానందమయీ! అనసూయాదేవీ!
(హరికాంభోజి స్వరాలు – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: మంగళం హారతీదే శ్రీ అనసూయాదేవీ నీకు
మంగళహారతిదే శ్రీ అత్రిమహాముని అతివా

చ 1) చిన్ననాటి నుండి నీవు పతిభక్తితో మెలగి
నారద మహామునికి రాళ్లు సెనగలు చేసితిని

॥మం॥

లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవులు గూడి మిమ్ము
భంగము చేయుటకు పతులను వేడితి

॥మం॥

చ 3) ముగ్గురు మూర్తులు ఏక కాలము నందు
అతిధులై వచ్చిరట అత్రిమహాముని కడకు

॥మం॥

చ 4) అన్నంబు కూరలు అతివ వడ్డించగ
వంటి వస్త్రంబుతోటి వద్దుపో పొమ్మనిరి

॥మం॥

చ 5) పతివ్రతవు నీవు కనుక పతినామ స్మరణచేసి
కమండల ఉదకములో గ్రక్కున చల్లితివి

॥మం॥

చ 6) ముగ్గురు మూర్తులు ముద్దుబాలురై
ఉగ్గుబాలు పోసి నీవు ఉయ్యాల లూపితివి

॥మం॥

చ 7) లక్ష్మీ సరస్వతి మరి పార్వతీదేవి గూడి
పరుగున వచ్చితిరి ఆత్రిముని ఆశ్రమమునకు

॥మం॥

చ 8) పతిభిక్ష పెట్టమని పాదములపై బడగ
ఉయ్యాలలో బాలురను ఒడిలోను ఉంచితివి

॥మం॥

చ 9) తల్లీ మీకు మేము వరములిస్తామంటే
త్రిమూర్తులు నీ కడుపున పుట్టుటే కోరితివి

॥మం॥

చ 10) వరుసతో వారింట దత్తాత్రేయులై జన్మించి
సంతోష సాగరమున నోలలాడించితివి

॥మం॥

మంగళగిరికి మంగళ మివ్వరే

హరి మనోహర విహరీ గిరీ!
(మోహనరాగం – మిశ్రచాపుతాళం)

చ 1) మంగళ గౌరికి మంగళమివ్వరె
గంగాధరుని రాణి గౌరి పార్వతి

॥మం॥

చ 2) అష్ట హస్త్రములతో అవతరించినట్టి
దుష్ట సంహారిణికి తుహిన గిరిజకపుడు

॥మం॥

మంగళమిదే మాతా అన్నపూర్ణ

అర్ణవోదీర్ణా! అపర్ణా! అన్నపూర్ణా!
(పుష్పతిలకా రాగం – ఆదితాళమ్)

పల్లవి: మంగళమిదె మాతా అన్నపూర్ణా
రంగని సోదరి మగళాంబ నీకు

॥మం॥

చ 1) విశ్వ జనని నీదు మాతా అన్నపూర్ణ
విశ్వముల వాసి విశ్వనాధు రాణి

॥మం॥

చ 2) సాక్షి రూపిణివి మోక్షదాయినివి-మహ
లక్ష్మీ నా మొర విను విశాలాక్షి తల్లీ

॥మం॥

చ 3) సారసాక్షి నన్ను సరగను బ్రోవు
వారణాసి పురి గౌరీ భారతాంబ

॥మం॥

చ 4) మానసమున నీదు ధ్యాన మెపుడు మరువ
దాసురాల నిదే మంగళంబు నీకు

॥మం॥

రమణీ మంగళ మనరే

సుమనస సుమరస రమణీయ మణీ!
శ్రీలక్ష్మీ (వసంత రాగం – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: రమణీ మంగళ మనరే
కమలాల యకు నిట

॥రమణీ||

చ 1) సమద కుంజర యానకు సుకృత విధానకు
కమల రిపు బిండానకు
కర కమల ముకుళ భక్తాభిమానకు

॥రమణీ||

చ 2) లలిత పల్లవ పాణికి నీల జలధర నిభ వేణికీ
జలజ లోచను రాణికీ సాధు సుగుణ శ్రేణికి

॥రమణీ||

చ 3) కలుము లీనెడు మొలక నవ్వుల కలికికి తలిరుబోణికి
సారస దళ నేత్రికి – సౌమ్య
చారు శోభన గాత్రికి

॥రమణీ||

చ 4) భూరి కరుణా ధాత్రికి సర్వ వనితా మైత్రికి
క్రూరభవ త్రికాల మిత్రకు క్షీరపారావార పుత్రికి

॥రమణీ||

చ 5) పోషితాఖిల లోకకూ దురిత తాపన రాగకూ
శేష దాసావన సరోరుహ
శ్రీకరావళీ కమల లోకకు

॥రమణీ||

రమణీ నీకిదుగోనే రతనాల హారతి

అతులిత వితరణి బాణి! లక్ష్మీ
(కేదార రాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: రమణి నీ కిదుగోనే! రతనాల హారతి
హారతి గైకొని! అష్టఐశ్వరము లీయవే

॥రమణీ॥

చ 1) నిదుర కంటికి లేక నిన్ను నే ప్రార్థింతు
నన్ను మన్ననజేసి నళినాక్షి వర మీయవే

॥రమణీ॥

చ 2) అలరు బోణిరొ నీకు! అమరిన పూజలు
మహాలక్ష్మీ మమ్ము బ్రోవు! మాదేవి మామీద దయచూడు

॥రమణీ॥

చ 3) ఐదవతనము చాల! ఆతివ కోరితి నమ్మా
ఆలస్య మిక నేల! ఆనతియ్యవే తల్లీ

॥రమణీ॥

రాణి భారతి శర్వాణి భారతి

అజుని రాణీ! వీణా పుస్తక పాణి!
(సింధుభైరవి రాగం – ఆదితాళం)

చ 1) రాణీ భారతీ శార్వాణీ భారతీ
పాణిలోచనా గొనుము ఇదే ముత్యాల హారతి

॥ రాణీ ॥

చ 2) పల్లవా ధర మృధు వల్లనాధరా
మల్లెపూల సరు లొసగెద మగువ హారతి

॥ రాణీ ॥

చ 3) మధుర భాషిణీ ఈ మందహాసినీ
సదా కావలెనే ముదం బొప్పగా

॥ రాణీ ॥

మమ్ముల నేలిన లలితా హారతి

(భైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: మమ్ముల నేలిన లలితా హారతి
యమ్మగు నీ చరణముమ్మలే మా గతి
సమ్ముద మొప్పగ రమ్మమ్మా యిటు

॥మ॥

చ 1) అమ్మా రాజరాజేశ్వరీ దేవీ
నమ్మితి నీ చరణమ్ములే లలితా
నమ్మినకృప శ్రీ త్రిపుర సుందరీ
యిమ్మహి నను బ్రోవగ రమ్మమ్మా

॥మ॥

చ 2) పలుకుల తేనెలు చిలికిన
చిలుకల కొలికి లలిత లలితరస
గులికా తలపులు నిలిపితి నీపై
అలరుచు వచ్చీ ఆదుకొనుము సతి

॥మ॥

Ammavari Mangala Harathi Patalu With Lyrics

సుందరీ శుభవదన

ఆనంద నందన వన సుందరీ! త్రిపుర సుందరీ
(పూరీ కళ్యాణిరాగం – రూపక తాళం)

పల్లవి: సుందరీ శుభవదనా
వందన మిదె గొను త్రిపుర

॥సుందరీ॥

చ 1) అభయమిచ్చి బ్రోచునట్టి త్రిభువనేశ్వరి
శుభదాయని శంకరి కృపగొను కామేశ్వరి

॥సుందరీ॥

చ 2) దిక్కునీవే నమ్మియుంటి దీనన బ్రోవవే
మక్కువతో నీ పదములు మ్రొక్కెదనే మోహనాంగీ

॥సుందరీ॥

చ 3) నీదు మాయ తెలియతరమే హే దయానిధే అంబా

హారతి గొనుమా

సుమరస సుమ కోమలాంగీ బాల త్రిపుర సుందరీ
(జంఝాటిరాగం – జుంపె తాళం)

పల్లవి: హారతి గొనుమా కమలాలయా
రామా కర్పూరపు హారతి

॥హారతి ||

అనుపల్లవి: నారీ నీపాద వారిజములు
కోరెదను మది జయ హారతి

॥హారతి ||

చ 1) పల్లవ పాణి బాణి బాలికామణి
చాల నమ్మితి బాలరో యికజాల
మేలను బ్రోవగ జయహారతి

॥హారతి ||

చ 2) ఇందువదనా సింధుర మందగమనా
కుందరవదన బొగడగ జయహరతీ

॥హారతి ||

హారతు లివ్వరే నారీమణులారా!

పరమ పావనీ తిరుప్పావై ఆండాళ్ళదేవీ
(భైరవిరాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: హారతులివ్వరే నారీమణులారా
వారిజాక్షులు మా తల్లి ఆండాళ్ళుకు

॥హారతు॥

చ 1) పచ్చలు స్థాపిన పళ్ళెరములో
ముచ్చటలదీర మత్స్య కంఠులార

॥హారతు॥

చ 2) తల్లి తాయారుకు శ్రీదేవి భూదేవి
కెల్ల కోర్కెలిచ్చు కర్పూరాండాళ్ళుకు

॥హారతు॥

చ 3) తల్లి చంద్రమతి ద్రౌపది మానవతి
సకల కోర్కె లిచ్చి యాండాళ్ళుకు

॥హారతు॥

చ 4) కోరిన వారికి కొంగు బంగారమై
సమస్త కోర్కెలిచ్చు తల్లి యాండాళ్ళుకు

॥హారతు॥

ఆదరించి మమ్ము బ్రోచి చేకొను హారతి

॥సుందరీ॥

హారతి గొనుమా

సుమరస సుమ కోమలాంగీ బాల త్రిపుర సుందరీ
(జంఝాటిరాగం – జుంపె తాళం)

పల్లవి: హారతి గొనుమా కమలాలయా
రామా కర్పూరపు హారతి

॥హారతి ||

అనుపల్లవి: నారీ నీపాద వారిజములు
కోరెదను మది జయ హారతి

॥హారతి ||

చ 1) పల్లవ పాణి బాణి బాలికామణి
చాల నమ్మితి బాలరో యికజాల
మేలను బ్రోవగ జయహారతి

॥హారతి ||

చ 2) ఇందువదనా సింధుర మందగమనా
కుందరవదన బొగడగ జయహరతీ

॥హారతి ||

శ్రీరంగ మణికిని – శ్రితకల్పవల్లికిని

ధీమణి! సుమాణి! నభోమణీ బీబీ నాంచారీ
(మధ్మమావతి రాగం ఆదితాళం)

పల్లవి: శ్రీరంగమణీకని! శ్రితకల్పవల్లికిని
చిత్తజుని తల్లికిని! శ్రీపతికి
నారీ శిరోమణికిని! నవపద్మ పాణికి
నన్నేలు శ్రీరంగ! నాంచారునకు

||జయ మంగళం మహోత్సవ మంగళం||

చ 1) సొగసుగడు మెరయ! కర్పూరపు పరిమళము
ముదముగను జవాది! మేనలది
అగణితంబైనట్టి! హారములు ధరియించి
నగుచున్న శ్రీరంగ! నాంచారునకు

||జయ||

చ 2) కోటలేడును చుట్టు! కోవెలలు నూటారు
నాటుకొని కావేరీ! నడుమనున్న
నాటకుడు శ్రీరంగనాధు! వక్షము నందున
నటియించు శ్రీరంగ! నాంచారునకు

||జయ||

చ 3) బంగారు పళ్ళెరములో! భాసిల్లు నవరత్న
శృంగారమైన మంగళహారతి
అంగీకరించి మాకు! అఖిల సంపదలొసగు
రంగైన శ్రీరంగ నాంచారునకు

||జయ||

సర్వం హనుమదర్పణమస్తు

Ammavari Mangala Harathi Patalu

లలితా హారతి

శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత – పసిడి పాదాలకిదె నీరాజనం
రమేశ్వరుని పుణ్యభాగ్యాలరాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజం

– బంగారు తల్లికిదె నీరాజనం

1. బంగారు హారాలు సింగారు మొలకించు అంబికా హృదయకూ నీరాజనం
శ్రీగౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీసింహాసనేశ్వరికి నీరాజనం

||బంగారం||

2. కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతొ నీరాజనం
పాశాంకుశ పుష్పబాణ చాపదారికి, పరమపావనమైన నీరాజనం

||బంగారం||

3. కాంతి కిరణాలతో కలికిమెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం
కాంతలందరి పసుపు-కుంకుమలు కాపాడు కాత్యాయినికి నిత్యనీరాజనం

||బంగారం ||

4. చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలవరేకులవంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం

||బంగారం||

5. ముదమారమోమున ముచ్చటగ ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యలహలకిదే నీరాజనం

||బంగారం||

6. శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మీకిదే నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి, శారదామాయికిదే నీరాజనం

||బంగారం||

7. ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్యనీరాజనం
జన్మజన్మల తల్లి జగధీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం

||బంగారం||

8. సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్యనీరాజనం బంగారం తల్లికిదే నీరాజనం

||బంగారం||

అంబ నీకిదిగో మంగళ త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం

||బంగారం||

మంగళ హారతి

రచయిత : బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం – కెంపైన నీరాజనం

– భక్తి పెంపైన నీరాజనం.

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం – బంగారు నీరాజనం

– భక్తి పొంగారు నీరాజనం.

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మా తల్లి గాజులకు నీరాజనం – రాగాల నీరాజనం

– భక్తి తాళాల నీరాజనం.

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం – ముత్యాల నీరాజనం భక్తి

– భక్తి జతనాల నీరాజనం.

చెకిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగరకు నీరాజనం – రతనాల నీరాజనం

– భక్తి జతనాల నీరాజనం.

పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం – అనురాగ నీరాజనం

– భక్తి కనరాగ నీరాజనం.

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మా తల్లి కుంకుమకు నీరాజనం – నిండైన నీరాజనం

– భక్తి మెండైన నీరాజనం.

తేటిపిల్లల వోలె గాలి కల్లలనాడు.
మా తల్లి కురులకు నీరాజనం – నీలాల నీరాజనం

– భక్తి భావాల నీరాజనం.

జగదేకమోహిని, సర్వేశగేహిని
మా తల్లి రూపునకు నీరాజనం – నిలువెత్తు నీరాజనం

– భక్తి విలువెత్తు నీరాజనం.

మరిన్ని భక్తి గీతాలు : 

Sthotralu – స్తోత్రాలు

Sthotralu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు  స్తోత్రముల గురించి తెలుసుకుందాం…

Sthotralu – స్తోత్రాలు

Kulam Kadu Gunam Pradhanam In Telugu – కులం కాదు గుణం ప్రధానం

Kulam Kadu Gunam Pradhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కులం కాదు గుణం ప్రధానం నీతికథ.

కులం కాదు గుణం ప్రధానం

(ఇది ఆరణ్యపర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్నిబట్టి, కుల వర్గ విద్వేషాలు ఈవాటి నాగరిక సమాజంలో బలిసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావనీ, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసు కోవాలి.)

కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు యివ్వడం ఈ వాడు పెరిగినంతగా భారతకాలం నాడు లేనేలేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎఱిగిందే. అటువంటి అంశం

ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వపంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్ననది. ఆ నది ఒడ్డునే చక్కని నిడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విపుడు తపస్సు చేసుకుంటూ, మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపు తున్నాడు.

అలా తపస్సు చేసుకునే రోజులలో …..
ఓకనాడు
ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టుమీది కొంగ రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది.
అంతలో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే: కన్నులు ఎర్రజేసి పై కి చూశాడు.

చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది.
ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకువెళ్ళి, ఒక యింటి గుమ్మంలో నిలబడి: ‘భవతి భిక్షాం దేహి”, అన్నాడు.
ఆ మాట చెవిని పడగానే యింట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంటయింటి వయిపు నడిచింది.

అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి యింటికి వచ్చాడు.

భర్తన చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి, విసన కర్రతో కొంతసేపు విసిరి, భోజనం చేయించి, పరుండాక, భిక్ష తీసుకుని వీథిలోకి వచ్చింది.

అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె :
“స్వామీ! మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను మరెవరి విషయమయినా చూసుకుంటాను. పతి
సేవను మించిన పరమార్థం వేరే లేదు, నాకు ‘

అని నిలబడింది.
అప్పుడా ముని తెల్లబోయి :
‘అమ్మా! ఎక్కడో, అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలి సింది ? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లీ’, అని ప్రార్థించాడు.

గృహిణి : ‘మునీశ్వరా ! ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలానగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపు తున్నాడు. వానిపేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వవిషయాలూ బోధిస్తాడు, వెళ్ళండి’, అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు.

నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి, తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు.
బడ్డాడు.

అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిం

వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి:

‘ ఆర్యా ! ‘ ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నదా ? అని అడిగాడు.

వచ్చిన మునికి మతిపోతోంది.

‘అక్కడ ఆ యిల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మ వ్యాధుడు ఆ ప్రతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసినా ఏ శక్తి సాధించ లేకపోయాము,

ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రత దీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు.

జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయి వానికి ఇంత శక్తి ఎలా వచ్చింది’ అని ఆలోచనలో పడ్డాడు.

అది గ్రహించి ధర్మవ్యాధుడు :
‘స్వామీ! ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి మా యింటికి వెడదాం. నాకు యింతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తు న్నారు కదూ ! ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను ”

అని వినయంగా యింటికి తీసుబవెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచంమీద పడుకున్న, ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగ క్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమ స్కరించి, ఆవిడకు సేవచేసి :

‘స్వామీ! ఇదే నేను చేసేవి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లి దండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు.

తొమ్మిది మాసాలు గర్భంలో మనలను భరించి, ప్రసవవేదనపడి, మనకు జన్మనిచ్చి, నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మన ఆరోగ్యం కోపం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది.

అటువంటి తల్లి ఋణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా?
అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి, మనకోసం ఎన్నో బాధలు పడే తండ్రి ఋణం కూడా తీరదు.
అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత ఋణ భారం తగ్గుతుంది.

వీరిని సేవించు కోవడం కంటె నేను చేసే సాధన ఏమీలేదు. దాని వల్లనే నేను సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లి దండ్రులను సేవించుకుంటూ ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే! మరేంలేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా! అది జీవహింస కాదా, దానిపిల్ల పాపం కదా అని. ఇక్కడ తమ కొక పరమ రహస్యం చెప్పాలి.

అదీ ధర్మ సూక్ష్మం అంటే –
ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒక దానిమీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులూ, నాలుగు కాళ్ళ జంతువులూ యివే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నింటిలోనూ జీశం ఉన్నది. అయితే అవి పక్షులవలె ఎగరడం లేదు కనక జీవం లేదనుకోవడం న్యాయమా।

జీవి బ్రతికి, పెరగడానికి మరోజీవం బలికాక తప్పదు.
అలాకాదు, యిదే జీవహింస అంటారా!
నేను మానినింతలో నా దుకాణానికి వచ్చేవారందరూ మాంసా హారం వదులుతారా ! అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలిపు కోవడానికి ఆవశ్యకమయిన ఆహారంకోసం జరిపేది హింసకాదు.

మరొశ్రమాలు ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను.

వ్యాపారంలో దొంగ తూకాలూ, అధిక లాభాలూ నేనెరుగను.
నా ధర్మాన్ని నేను విడిచి పర ధర్మాన్ని స్వీకరించము. ఆకలి గొన్న వారికి పిడికెడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగ క్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు, పొరుగులవారి కష్ట సుఖాలలో భాగం పంచు కుంటాను.

అన్నిటినీ మించిన విషయం –

ఈ మనస్సు ఉన్నదే యిది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదియ్యాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వరారాధనం చెయ్యాలి.

నేను చేసేది యింతే! ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలూ ఉండవు, ఈ జీవితం ఎంతవరకూ పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం’ అని బోధించాడు.

గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు కేసుకునేందుకు వెళ్ళాడాయన.

మరిన్ని నీతికథలు మీకోసం:

Guruseva Satphalitam Istundi In Telugu – గురుసేవ సత్ఫలితం ఇస్తుంది

Guruseva Satphalitam Istundi In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గురుసేవ సత్ఫలితం ఇస్తుంది నీతికథ.

గురుసేవ సత్ఫలితం ఇస్తుంది

(ఇది ఆదిపర్వంలో కథ. గురు సేవ ఎంత అవసరమో, దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి.)

ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపా ధ్యాయు డుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యానంచేసేవారు.

ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవచేస్తూ వినయ విధేయతలతో విద్యనేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్యయందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్యనేర్ప గల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవీ అనాటి గురుకులాలు.

అటువంటి గురుతులంలో పైలునివద్ద ఉదంకుడని శిష్యుడుండే వాడు. ఈ ఉదంకుడు విద్యపూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవుతీసుకునే ముందు, చేతులు కట్టుకు నిలబడి, తలవంచి.

‘ఆచార్యా! గురునక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి’, అన్నాడు
అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించి :
“నాయనా నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు,’ అన్నాడు.

ఉదంకుడు అలాగే నిలబడి:
‘ఆచార్యా! గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయంకాదు. కమఠ మీరు ఆజ్ఞాపించండి’, అన్నాడు.
వాని పట్టుదల, ధర్మవిరతిచూపి సంతోషంతో:

నాయనా! ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురు దక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు’, అన్నాడు పై లుడు.

ఉదంకుడు లోపలకు వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విష యం చెప్పాడు.

అప్పుడావిడ :
‘నాయనా మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్యనేర్పు కున్నాడు. ఆ రాజుభార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు, అంది.

ఉదంకుడు పరమానందంతో బయలుదేర పండగా ఆవిడ పిలిచి ” నాయనా ! ఇంక నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చెయ్య బోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి’ అంది.

‘చిత్తం, తల్లీ’ అని ఉదంకుడు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహావృషభంమీద ఒకా నౌక పురుషుడు అడ్డుగా వచ్చి:

‘ఈ గోమయం భక్షించివెళ్ళు. అనుమానించకు. దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు’, అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని, త్వరగా రాజు గారింటికి వెళ్ళాడు.

మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి, అతని సమాచారం అడిగి: ‘మీ రాకవల్ల మా జన్మ ధన్యమయింది. ఊరకరారు మహాత్ములు! ఏ పనిమీద వచ్చారో చెప్పండి’, అనగా గురుపత్ని కోరిక వివరించాడు.

మహారాజు వినయంగా
‘ ఓ విద్వాంసుడా ? మీరు ఏదికోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి. ఆవిడ సంతోషంగా ఇస్తుంది’, అన్నాడు.

ఉదంకుడు క్షణాలలో అంతిపురికిపోయి తిరిగివచ్చి :
‘రాజా! మీరు విద్వాంసులతో పరిహాసాలాడుతా రమకో లేదు. మహారాణి అంతఃపురంలో లేదు’, అన్నాడు.

రాజు: ఓ మహాత్మా! క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనబడదు. మీ వంటివారు అుచిగా ఉన్నారనీ అనలేను.

ఉదంకుడు: గుర్తుకు వచ్చింది మహారాజా! నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళూ, చేతులూ, ముఖం కడగకుండా ఆచమించాను. ఇలాచెప్పి అప్పటి కప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాశకు కారణం చెప్పాడు.

రాణి! విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి. ఒకమాట. ఈ కుండలాలు దొంగిలించాలని చిర కాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి.

ఉదంకుడు అవి తీసుకుని చక చక వస్తున్నాడు. కొంక దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు.

ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరటచేరి, కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని ఆవహరించి పారిపోయాడు.

ఉడంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములామారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు.

దానిగుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికిపోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు.

కనిపించకపోగా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు.

నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. దానికి వన్నెండు ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్న వదనంతో ‘ వరం కోరుకో’ అన్నాడు.

ఉదంకుడు: నాగలోకమంతా నా వశంలో ఉండాలి.
“అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు’ అన్నాడా పురుషుడు.

ఉదంకుడు ఊదగా నాగలోకంనిండా అగ్నిజ్వాలలు వ్యాపించాయి. ఆ మంటలకు తాళలేక తక్షకుడువచ్చి కుండలాలు సమర్పించి పాదాలమీద వడ్డాడు.

అప్పటికే కాలాతీతం కావస్తున్నది. ‘గురుపత్నీ వ్రత సమయానికి ఎలాచేరడం’ అని విచారిస్తుండగా ఆ పురుషుడు తన గుర్రంయిచ్చి అదృశ్యం అయ్యాడు.

మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమయ్యింది.

అప్పటికి గురువుగారి భార్య అభ్యంగస్నానంచేసి వ్రతానికి సన్నద్ధు రాలవు తున్నది.

ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి, ఆశీర్వాదం పొంది, గురువుగారి దగ్గరకు వచ్చాడు.

ఇంత ఆలస్యం ఎందుకయింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. ‘నాయనా! నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఆయన ఐరావతం. ఆ గోమయం అమృతం. అది భక్షించక పోతే నువ్వు నాగలోకంలో జీవించవు.

నాగలోకంలో స్త్రీలను చూశావే, వారు ధాత- విధాతలు.
నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. చక్రాన్ని తిప్పే ఆరుగురూ ఋతువులు, పన్నెండాకులూ మాసాలు. ఆ చక్రం సంవత్సర రూప మయిన కాలచక్రం.

అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. ఆ గుర్రం అగ్ని హోత్రుడు.

ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడవు కనక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో, గురుశుశ్రూష చేసి విద్యనేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇకనువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు” సర్వశుభాలూ కలుగుగాక’, అని గురువుగారు ఆశీర్వదించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు

Lord Rama Mangala Harathi With Lyrics In Telugu

Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీరాముడు (లేదా శ్రీరామచంద్రుడు) హిందూ మతంలో ప్రముఖమైన దేవుడు. ఆయనను విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పూజిస్తారు. రాముడు ఐక్య వేదాన్తం, ధర్మ పరిపాలకుడు, సత్యవ్రతుడు, క్షమాశీలతగల వ్యక్తి, గొప్ప భర్త, ప్రేమపూర్వక భక్తుడు మరియు క్షమాశీలతగల రాజు అని పిలుస్తారు. శ్రీరాముడు దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడిగా అయోధ్యలో జన్మించాడు. రాముడి కథ ప్రధానంగా రామాయణం అనే మహాకావ్యంలో వర్ణించబడింది. వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణం, 24,000 శ్లోకాలతో, రాముడి జీవితాన్ని మరియు ఆయన యాత్రలను వివరిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీరాముడు మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

ధీరునకు వనధి గంభీరునకు

శుంభత్సారంభ గాంభీర్యా! శ్రీరామా
(పున్నాగవరాళి రాగం – మిశ్రచాపుతాళం)

చ 1) ధీరునకు వనధి గంభీరునకు
దుష్ట సంహారునకు ఘనమణి హరునకునూ,
హర కర్పూర నీ హర హీర పటీర
రాళి కీర్తి విస్తారునకునూ

॥జయ మంగళం నిత్య శుభ॥

చ 2) మంగళము రామునకు మహిత శుభధామునకు
మంగళము సీతా సమేతునకునూ
మంగళము సుర మకుట మణి లలిత పాదునకు
మంగళము క్షీరాబ్ధి మందిరునకూ

॥జయ మంగళం నిత్య శుభ॥

చ 3) అద్యునకు బ్రహ్మది వేద్యునకు
దుర్మదభేద్యునకు ప్రజరుజా వైద్యునకునూ
సద్యోఫల ప్రదున కాద్యంత రహితునకు
విద్యా విలేక జన హృద్యునకూ

॥జయ మంగళం నిత్య శుభ॥

చ 4) జైత్రునకు సౌమిత్రి మిత్రునకు
భక్తవన చైత్రునకు నవపద్మ నేత్రునకునూ
మిత్ర వంశాబ్ది సన్నిత్రునకు సుర వినుత
పాత్రునకు జగదవని సూత్రునకునూ

॥జయ మంగళం నిత్య శుభ॥

నిరాకారా నిరంజనా నీకు హారతి

నీహార సాకార నిర్మలానందా! శ్రీరామా
(పూరి కళ్యాణ రాగం – త్రిశ్రగతి తాళం)

పల్లవి: నిరాకార నిరంజనా నీకు హారతీ
మా రామచంద్రునకు మనసు హారతీ నా మనసు హారతీ

॥ నిరాకార

చ 1) పంచభూతములను ఐదు
ప్రమిదల గాను చేసినాను
మించిపోయే గుణము తీసి
మంచి వత్తి వేసినాను
అహంకారమనే గుణము తీసి
అక్షతలు చేసినాను
కామమనే గుణము తీసి
తరచి చమురు పోసినాను

చ 2) మాయ అనే తెరను తీసి దక్షిణగా ఉంచినాను
దూషణమనే గుణము తీసి ధూపముగ వేసినాను
కామ క్రోధములను తీసి కైవత్తిగ వెలిగించినాను
ప్రేమయనే గుణముతీసి నైవేద్యము చేసినాను

||నిరాకార||

బాలుడా నీకిదే హారతీ

శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీరామచంద్రా నీకు కర్పూర హారతి – వలె
(శంకరాభరణ రాగం – మిశ్రచాపు తాళం)

చ 1) బాలుడా నీ కిదే హారతి
సుగుణ బాలుడవై వర్థిల్లుమా
చాలగ దేవదేవులు కొలచుచు
శాశ్వత సుఖముల నొందుమా

॥బాలుడా||

చ 2) విద్యాధికుల వెలయుచు విద్యల
వేదమె నేర్చి సుఖింపుమా
ఘనమతినై విద్యా గురువుల యెడ
కడు భక్తిని చెల్లింపుమా

॥బాలుడా||

చ 3) ఆయుర్భాగ్యము నొంది ధరిత్రిని
అఖిల సుఖముల నొందుమా
కృత్యం బైన సనాతనంబు మును
హితమతి తోడ చరింపుమా

॥బాలుడా||

చ 4) జననీ జనకుల అజ్ఞల నెల్ల
సతతము తలను ధరింపుమా
పాయని దేహారోగ్య సుఖముల
నిత్యముగ బడసి వర్థిల్లుమా

॥బాలుడా||

చ 5) బంధు జనాదరంబు నీకు ఇల
పాత్రుడవై చరియింపుమా
బంధ విమోచన పరామాత్ముని
కడు భక్తిని చెల్లింపుమా

॥బాలుడా||

మంగళ మనరేమీ రంగనా మణులారా

రంగు హొరంగు చెలరేగిన శ్రీరామా
కాంభోజి రాగం – త్రిశ్రగరి ఆదితాళం)

పల్లవి: మంగళ మనరేమీరంగనామణులారా!
పొంగుచు దాసుల బ్రోచిన స్వామికి

చ 1) దశరథ పుత్రునకు దశముఖ శత్రువునకు
శశివదనునకు విశద చారిత్రునకు

॥మం॥

చ 2) పుండరీకాక్షునకు కుండల శయనునకు
చండ విక్రమునకు ఆంజనేయ సఖునకు

॥మం॥

చ 3) ఘననిభ తేజునకు మునిజన పూజ్యునకు
అమరనుత సేవ్వునకు జానకీనాథునకు

॥మం॥

చ 4) మదన సుందరునకు సదమల గాత్రునకు
సదయ సద్భక్తునకు ఉదయగిరి నిలయునకు

॥మం॥

మంగళం ధీరునకు

సారభీర ధీరోదారునకు సూర్యరాయ
అరభి రాగం – త్రిశ్రగతి ఆదితాళం)

చ 1) మంగళం ధీరునకు అబ్ధి గంభీరునకూ
దుష్ట సంహారునకూ ఘన మణీహారునకు
హారతి కర్పూర – నీ హార హార పటీర
తారాళి కీర్తి విస్తారునకు మంగళం||

చ 2) మంగళం రామునకు మహిత శుభనామమునకు
మంగళం సీతా సమన్వితునకు మంగళం|
సుర మకుట మణి కలిత పాదునకు మంగళం
క్షీరాబ్ధి మందిరునకు జయ మంగళం||

చ 3) అద్యునకు బ్రహ్మదివేద్యునకు దుర్మదా
భేద్యునకు ప్రజరుజా వైద్యునకు సర్వపాప
హరునకు సద్యఃఫల ప్రదునకు ఆద్యంత
రహితునకు విద్యా వివేక జన హృద్యునకు

చ 4) జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన
చైత్రునకు నవపద్మ నేత్రునకునూ మిత్ర
వంశాబ్ది సన్మిత్రునకు సురవినుత పాత్రునకు
జగదావన సూత్రునకు జయ మంగళం|

మంగళ మిదిగో మందర ధరా

సంకందన సుందర వందితా శ్రీరామా
(హరి కాంభోజిరాగం – మిశ్రచాపుతాళం)

చ 1) మంగళ మిదిగో మందర ధరా
మధుసూదనా పలు! మాట లింతేనా

॥మం॥

చ 2) మత్స్యావతార! కూర్మావతార
రక్షించుము రా రామావతారా

॥మం॥

చ 3) కర్పూర హారతి! కరుణతో గైకొను
కౌశల్య తనయా! కరి రాజ వరదా

॥మం॥

చ 4) గోవిందా శౌరీ! గోపాల కృష్ణా
గోవర్ధ నోద్ధార! కాచి రక్షించరా

॥మం॥

రంగా! నీకిదే మంగళం

రంగదుత్తుంగ నానందతరంగా రంగ!
(మోహనరాగం ఆదితాళం)

పల్లవి: రంగా నీకిదే మంగళం – కస్తూరి రంగా నీకిదే మంగళం
చ 1) రంగ ఖగరాట్ తురంగ కలుష వి
భంగా తవ మోహనాంగా వయ్యారి

॥రంగా॥

చ 2) హరే విబుధ విహారీ ఉభయ
కావేరీ తీర విహారీ వయ్యారి

॥రంగా॥

చ 3) అన్నా యితరుల నన్నెవరు-నీ
కన్న నన్ను బ్రోవుచున్నా-వయ్యారి

॥రంగా॥

చ 4) లీలా శేషాంశు లీలా కరుణాల
వాలా జగత్పరిపాలా-వయ్యారి

॥రంగా॥

చ 5) అయ్యా వరము మాకియ్య నిను నమ్మి
తయ్య నను బ్రోవుమయ్య-వయ్యారీ

॥రంగా॥

చ 6) హాసా మహ చిద్విలాసా శేషాచల
దాశార్చిత పరమేశా-వయ్యారి

॥రంగా॥

రమా రమణ గొనుమా

క్షమా సుమా రామా!
(ఆనందభైరవి రాగం ఆదితాళం)

పల్లవి: రమా రమణ గొనుమా జయ హారతి గొనుమా
అను పల్లవి కౌశల్య సుకుమార కమలా మనోహరా
దశరథ వరపుత్ర శశిశేఖర మిత్రా

॥రమా॥

చ 1) ఈశా పరమేశా జగధీశా దాస జన హృదయ
వాసా చిద్విలాస సర్వలోక వాసా శ్రీనివాసా

చ 2) రామా రఘు రామా రణభీమా
రామా రఘు వంశాంబుధి సోమా
నీల మేఘ శ్యామా నిగమాంత గుణనీమా
తారకరామ స్కందపురి రామా

రామ రామ యని రమణులు స్మరియించి

భూమ క్షేమానంద సీతా శ్రీరామా
(సురట రాగం – మిశ్రచాపుతాళం)
ఘల్లు ఘల్లు మని-వలె

చ 1) రామ రామ యని రమణులు స్మరియించి
రంగైన రాఘవునకు శృంగార గాత్రునకు హరివిల్లు
విరచియు అతివను పెండ్లాడి
అతిఘోర వనములో మసలిన రామా

॥మంగళమ మంగళం||

చ 2) రాతి నాతిగ జేసి రాక్షసులు వధియించి
ఆదివిష్ణుడవయి అవతరించిన స్వామి
ఆ పాప కర్మునిచే అతివను గోల్పోయి
అక్కడ వనములో వెతలు చెందిన స్వామి

॥మంగళమ మంగళం||

చ 3) గురువు ఆజ్ఞకు నాడు అతి బద్ధుడై యుండి
రంగైన తాటకిని సంహరించి, మౌని
జన్నము గాచి సౌమిత్రి జాడగాంచి
సకల సంతోషముతో నీరజనేత్రా

॥మంగళమ మంగళం||

చ 4) నారదు తుంబురులు నృత్యముగానము చేయ
బ్రహ్మరుద్రాదులు పలువిధముల పాడ
దశరథ మహరాజు నిండా దీవెనలిచ్చి
సకల సంభ్రమముతో శోభిల్లు రామా

॥మంగళమ మంగళం||

చ 5) రామ రామ యని రమణులు స్మరియించి
రంగైన రాఘవునకు శృంగార గాత్రునకు
నిగమ గోచర రామ నిత్య పరంధామ
నీకు అర్పణము గాను నీరాజనమ్ము

॥మంగళమ మంగళం||

Lord Rama Mangala Harathi

సీతా రామ జయ మంగళం

దశరథ తనయా జయ మంగళం
రాజీవలోచన జయ మంగళం

చ 1) కౌశల్య వర కుమార ఘనత మీరగ భానువంశ
పాలకా నీకు వజ్రాల హారతు లివిగో

||రామ||

చ 2) ముని వెంట వేగ వెడలి తాటకి మద మణచి
యజ్ఞమును గాచిన స్వామీ నీకు ముత్యాల హారతు లివిగో

||రామ||

చ 3) శృంగారమున సీతకు మంగళ సూత్రము కట్టిన
రంగగు రామా నీకు మంగళ హారతులివిగో

||రామ||

చ 4) ముత్యాల తలంబ్రాలు ముదముతో సీతకు బోసిన
సత్యస్వరూపునకు చంద్రాల హారతి యిదిగో

||రామ||

చ 5) నాలుగోనాడు నాగవల్లి కిపుడు
బలి గావించిన స్వామీ మీకు పచ్చల హారతు లివిగో

||రామ||

చ 6) మెచ్చి సీత నప్పగించి సంతోషించిన
స్వామీ నీకు నీలాల హారతి లివిగో

||రామ||

చ 7) జనకుని కూతురిని జానకిని పెండ్లాడిన
వీర రామచంద్ర నీకు వజ్రాల హారతులివిగో

॥రామ||

రామా! కర్పూర హారతి గైకొనుమా

రవికుల జలథి సోమా రాజలలామా
శ్రీరామా (సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: రామా కర్పూర హారతి గైకొనుమా

చ 1) సోదరు లిద్దరు లేడి కోసము వేగ
ఆ మాయ రావణుడు అ సీతను కొనిపోగ

॥రామా॥

చ 2) పర్ణశాలకు పోయి వెదకి చూచిన గాని
తరుణి గానక తల్లడిల్లితి శ్రీరామా

||రామా॥

రామచంద్రాయ జనకరాజ మనోహరాయ

ధీరాయ! శుభాయ! నందరాయ! శ్రీరామా
(నవరోజ్ స్వరాలు – త్రిశ్రగతి తాళం)

చ 1) రామచంద్రాయ జనక
రాజతనయ మనోహరాయ మామ కాభీష్ట దాయ

॥మహిత మంగళం||

చ 2) కౌశలేద్రాయ మంద హాసదాస పోషకాయ
వాసవాది వినుత సర్వ

॥దాయ మంగళం||

చ 3) చారు కుంకు మోపోత చందనాది చర్చితాయ
సారకటక శోభితాయ

॥భూరి మంగళం||

చ 4) లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సదృశ దేహాయ

॥చారు మంగళం||

చ 5) దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
భావ గురువరాయ

॥భవ్య మంగళం||

చ 6) పుండరీ కాక్షాయ పూర్ణ చంద్రావనాయ
ఆండజ వాహనాయ

॥ఆతుల మంగళం॥

చ 7) రాజ విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్ర కాశితాయ

॥శుభమంగళం||

చ 8) రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరి పరాయ

॥చారు మంగళం||

రామచంద్రా నీకు కర్పూరహారతిస్తును

సుగుణ గుణ సాంద్రా! శ్రీరామచంద్రా!
(శంకరాభరణ రాగం – మిశ్రచాపుతాళం)

చ 1) రామచంద్రా నీకు కర్పూరహారతి గైకొనుమా
పాము మీదను పవళించిన
స్వామి నిన్నిక మరువను

||రామ||

చ 2) ఎన్ని విధముల నన్నుతించిన కన్నులకే కనిపించవా?
నన్నుగన్న తండ్రి నీకే విన్నవించిన బ్రోవవా

||రామ||

చ 3) కోపమేలను దాపుచేరితి పాపములు నెడబాపరా
తామరసాక్ష నీదు పదములు
తప్పకను భజియింతురా

||రామ||

చ 4) పన్నగ గజరాజు నేలిన భక్తవత్సలు డందురూ
నన్ను రక్షణ సేయకుండిన నమ్మా నీ కథలన్నియూ

||రామ||

ధీరునకు వనధి గంభీరునకు

ధీరసమీరా! సారసమీరా! శ్రీరామా
(పున్నాగవళి రాగం – మిశ్రచాపు తాళం)

చ 1) ధీరునకు వనధి గంభీరునకు
దుష్టసంహారునకు ఘనమణీ హారునకునూ
హర కర్పూర నీహార పటీర
తారాళి కీర్తి విస్తారునకునూ

॥జయ మంగళం నిత్య శుభమంగళం ॥

చ 2) మంగళము రామునకు మహిత శుభధామునకు
మంగళం సీతా సమేతునకునూ
మంగళం సుర మకుట మణీలలిత పాదునకు
మంగళం క్షీరాబ్ధి మందిరునకూ

॥జయ మంగళం||

చ 3) ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు
దుర్మద భేద్యునకు భవరుజా వైద్యునకునూ
సద్యోఫల ప్రదున కాద్యంత రహితునకు
విద్యా వివేక జనహృద్యునకూ

॥జయ మంగళం||

చ 4) జైత్యునకు సౌమిత్రి మిత్రునకు
భక్తవన చైత్రునకు నవపద్మ నేత్రునకునూ
మిత్రవంశాబ్ది సన్మిత్రునకు సుర వినుత
పాత్రునకు జగదావన సూత్రునకునూ

॥జయ మంగళం ॥

సీతా సమేతాయ

సీతాఖ్యాత సంప్రీతా సీతా
(అఠాణా రాగం – జుంపె తాళం)

చ 1) సీతా సమేతాయ శ్రితమనోల్లాస
నీతి వాక్యాయ అతి నిర్మలాయ
రాతి నాతిగ జేసి రక్షంచి జగములను
దాతవై బ్రోచు దశరథ సుతాయ

॥జయ మంగళం నిత్యశుభ||

చ 2) మౌనితో చనుదెంచి దుష్టరక్షణము చేసి
శివుని విల్విరిచి సీతను వరియించి
అయోధ్యపురికి భువినెన్నగ
జనుదెంచి కౌశల్యా గారాలపట్టికిపుడు

॥జయ॥

చ 3) రామచంద్రున కపుడు రాజ్యాభి షేకంబు
చేయవలెనని రాజు చెప్పగాను
తామసంబున కైక తన వరమ్ములిమ్మనగ
బూమిపై వ్రాలిన పుణ్యదాసుడు

॥జయ॥

హారతి గైకొను అరమరచేయక

గురుతర సుందరవర వదనా! శ్రీరామా
(యమునా కళ్యాణి రాగం తాళం)

పల్లవి: హారతి గైకొను అరమర చేయక
ఆశ్రిత పాలా శ్రీరామచంద్ర

॥హారతి ||

చ 1) శివుని విల్లు విరచి సీతను పెండ్లాడి
పరశురాముని భంగపరచిన శ్రీరామా

॥హారతి ||

చ 2) లక్ష్మణ సోదర తక్షణమేగియు
ఈ స్థితిలోన ఇక దయ చూడు

॥హారతి ||

చ 3) అచ్యుతా! అహల్యా శాప పరిహారా
సీతా మనోహరా శ్రీరామచంద్రా

॥హారతి ||

హారతి గైకొనుమా శ్రీరామచంద్రా!

రవికుల చంద్రా! సత్కీర్తి సాంద్రా
(కన్నడ రాగం – ఆదితాళం)

పల్లవి: హారతి గైకొనుమా శ్రీరామచంద్రా

చ 1) కర్పూర హారతి కరుణతో గైకొను
కనికర ముంచుమా కౌశల్య తనయా

॥హారతి ||

చ 2) మంగళ హారతి మహిమతో గైకొని
మరి మరి మము బ్రోవ దశరధ తనయా

॥హారతి ||

శ్రీరామా గొను కర్పూర హారతిదిగో

గారా మారగ జేచితికోరా శ్రీరామా
(సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: శ్రీరామా గొను కర్పూర హారతిదిగో
సీతాదేవికి ముత్యాల హారతిదిగో

చ 1) నిత్య నిరామయ భృత్యుల బ్రోవరారా
సత్య స్వరూపా గొను సర్వేశ హారతిదిగో

||శ్రీరామా||

చ 2) బ్రోవా నందన సుంత ఆది మధ్యాంత శూన్య
వాద భేద విహీన పరమాత్మా హారతిదిగో

||శ్రీరామా||

చ 3) వేంకట శివగురుని శంకలేక బ్రోవ
వేంకట రంగనాయన కిచ్చిన హారతిదే

||శ్రీరామా||

మరిన్ని భక్తి గీతాలు :