Indulonane Nevvariboludu In Telugu – ఇందులోననే నెవ్వరిబోలుదు

ఇందులోననే నెవ్వరిబోలుదు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇందులోననే నెవ్వరిబోలుదు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇందులోననే నెవ్వరిబోలుదు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: ఇందులోననే నెవ్వరిబోలుదు
సంఖ్య : 581
పుట: 390
రాగం: పాడి

పాడి

78 ఇందులోన నే నెవ్వరిఁబోలుదు
అంది నీవాఁడ నేననుకొంటిఁజుమ్మీ

||పల్లవి||

జలజనాభ నీ శరణనువారలు
అల నారదసనకాదులు
కెలన మరియు నీ కింకరవర్తులు
తెలిసినబ్రహ్మాదిదేవతలు

||ఇందు||

నోరార హరి నిను నుతించువారలు
చేరువనుండేటిశేషాదులు
ధారుణిలో నీదాసాన(ను?) దాసులు
మారుతిముఖ్యులు మహామహులు

||ఇందు||

బడి నీచే ముక్తివడసినవారలు
సుడిగొనుమునిజనశుకాదులు
కడఁగిన శ్రీవేంకటపతి నీవే
తడవి నన్ను దయదలఁచుమీ

||ఇందు||581

అవతారిక:

శ్రీమన్నారాయణుని ఆశ్రయించేవారిలో మూడు రకాలవారుంటారు. నారదమహర్షివంటి శరణాగతులు, ఆదిశేషునివంటి దాసులు, శుకమహర్షివంటి జీవన్ముక్తులు. వీరందరి ఆశయం ఒకటే అయినా అవలంభించిన మార్గాలలో భిన్నత్వమున్నది. ఇందులో నేనెవ్వరి బోలుదును స్వామీ! అని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులవారు. నేనుమాత్రం నీవాడను అనుకొంటూనే బ్రతుకు వెళ్ళమారుస్తున్నానని అంటున్నారు. తడవి నన్ను దయచూడుము ప్రభూ! నవవిధ భక్తిలో యేదోఒక విధమున తనను కడతేర్చమని బ్రతిమిలాడుతున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! ఈ క్రిందివారిలో నేనెవ్వరి బోలియున్నానో తెలుపుము ప్రభూ! అంది (స్థిరపడి) ఇంతవరకు నేను నీవాడనే అని అనుకొంటున్నాను సుమా!

ఓ జలజనాభా! (పద్మనాభా) ఆనాటి నారదుడు సనకసనందనాది ఋషులు కెలన (దిక్కు) నీవే అన్నారు. వారు నీ శరణాగతులు. శరణని నిన్ను ఆశ్రయించినవారు. మరియు తెలిసిన (విఖ్యాతులైన) బ్రహ్మాదిదేవతలు నీ కింకరవర్తులు (భృత్యులు) వీరంతా ఆవిధముగా నీ శరణాగతులై నిశ్చింతగానున్నారు.

ఓ శ్రీహరీ! ఆదిశేషుడు నీ చేరువనే వుండి నీకు పానుపువలె సేవించుచు, నోరార (వేయినోళ్ళతో) నిన్ను కీర్తించుచు నీవాడైనాడు. మారుతి (ఆంజనేయుడు) మొదలైన మహామహులు ఈ ధారుణిలో (భూమిపై) నీదాస్యమును తరించే మార్గముగా నెంచుకొన్నారు. వారంతా నీ దాసానుదాసులుగావుండి నీ భక్తులకు యెన్నో వుపకారాలు చేస్తున్నారు.

ఓ పరమపురుషా! శుకమహర్షి, భారతము వ్రాసిన తన తండ్రి వ్యాసునివలె, తను కూడా భాగవతము వినిపించి బడి (శీఘ్రముగా) నీచే ముక్తిని బడసినాడు. వారంతా సుడిగొను (చుట్టుకొని) నీవద్దనే వుండే జీవన్ముక్తులు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను కడగి (యత్నించి) తడవి (గ్రహించి) దయదలచవయ్యా! ఎందుకంటే నేను నీవాడను తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. వారిధిశయన వో వటపత్రపరియంక
  2. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  3. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  4. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  5. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  6. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ

Kousalya Nandana Rama Kamalaptakula Rama In Telugu – కౌసల్యానందనరామ కమలాప్తకులరామ

కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కౌసల్యానందనరామ కమలాప్తకులరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
సంఖ్య : 275
పుట: 185
రాగం: సాళంగనాట

సాళంగనాట

54 కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
భాసురవరద జయపరిపూర్ణ రామ

||పల్లవి||

మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు
జనించి తాటకఁ జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి
అనుమతి పరశురామునిచేఁ గైకొంటిని

॥కౌస॥

సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి
అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి
చొప్పుతో మాయామృగము సోదించి హరియించి
కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటిని

॥కౌస॥

సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించీ
చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా

॥కౌస॥275

అవతారిక:

కౌసల్యానందనుడైన శ్రీరాముని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. సూర్యవంశతిలకుడైన ఈయన శోభాయమానమైన వరములనిస్తాడట. పరిపూర్ణమైన జయమునిస్తాడట. ఇదివరలో చెప్పినట్లే ఇది కీర్తనే కాక రామాయణ పునశ్చరణ కూడా. అన్నమయ్యకు రామకథ ఆదినుంచి చెప్పటమే అలవాటు. ఈ రాముడు అనుమతి పరశురామునిచేగైకొనెనట. అంటే.. దుష్టశిక్షణకు అనుమతిని పొందాడన్నమాట. నాయనా! నా అవతార లక్ష్యం పరిసమాప్తమయింది, దుష్ట క్షత్రం నశించి ధర్మరక్షణ క్షాత్రానికి తెరలేచింది, ఇక ధర్మరక్షణ భారం నీదే అని అనుమతినిచ్చాడట రామునికి పరశురాముడు.

భావ వివరణ:

కౌసల్యానందనుడవైన (కౌసల్యాదేవికుమారుడవైన) రామా! నీవు కమలాప్తకుల (సూర్యవంశమున జన్మించిన) రామచంద్రుడవు భాసురవరదుడవు (శోభాయమానమైన వరములనను గ్రహించువాడవు). పరిపూర్ణమైన జయమునిచ్చు రామయ్యవు.

మునుపు (ఇదివరలో) నీవు దశరథరాముడవై తమ్ముల మువ్వురితో జన్మించావు. తాటకను సంహరించి విశ్వామిత్రుని జన్నము (యజ్ఞమును) గాచినావు (రక్షించినావు) వెనుకొని (తదనంతరము) శివధనస్సును విరిచి సీతాదేవిని పెండ్లాడినావు. పరశురామునిచే అనుమతిగైకొని దుష్టశిక్షణకు శ్రీకారం చుట్టితివి. అవతారావిష్కరణకు పూనుకొన్నావు.

చుప్పనాతి అని పేరుగాంచిన శూర్పనఖను శిక్షించి స్త్రీయని వదలినావు. సొరిది (ఆక్రమములో) అనేక మంది ఋషులను రక్షించినావు. ఆవెనుక ఖరదూషణాదులను సంహరించితివి. చొప్పుతో (ఆవిధముగా) మాయామృగమును (మాయలేడిని) సోదించి హరించితివి (వెదకి సంహరించితివి. హనుమంతునికప్పి (బ్రాహ్మణునివలె వచ్చిన హనుమంతుని గుర్తించి బంటుగా నేలుకొంటివి.

సొలసి (పరిక్రమించి) వాలిని అడచితివి (సంహరించితివి) సుగ్రీవుని గూడుక (కూడుకొని) జలధిని బంధించి సేతువును నిర్మించి, లంకను జయించితివి. వెలయ (అతిశయించి) రావణాసురుని గెలిచి విభీషణునికి మన్నింపుతో లంకారాజ్యప్రదానము చేసితివి. ఆపై అయోధ్యలో పట్టాభిషిక్తుడవైనావు. ఓ శ్రీవేంకటేశ్వరా! అదయ్య నీరామ గాధ. ఇది విని తరించామయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sadanandamu Sarveshwara Ni In Telugu – సదానందము సర్వేశ్వర నీ

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సదానందము సర్వేశ్వర నీ- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : సదానందము సర్వేశ్వర నీ-
సంఖ్య : 369
పుట: 248
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

53 సదానందము సర్వేశ్వర నీ-
పదారవిందముపై భక్తి

||పల్లవి||

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీసాకారము
నయమగుశ్రవణానందము వినినను
క్రియగలిగిననీకీర్తనము

||సదా||

చెలఁగి యందరికి జిహ్వానందము
పలుమరుఁ గొనునీప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు

||సదా||

ధరఁ బరమానందము నీదాస్యము
గరిమల శ్రీవేంకటవిభుఁడా
నరహరి నిత్యానందము నినుఁ దగ-
నరవిరిఁ జేయసమారాధనము

||సదా||369

అవతారిక:

ప్రతిజీవీ సంతోషం కోసమే జీవిస్తాడు. సంతోషంకోసమే వెంపర్లాడతాడు. అయితే రేయింబవళ్ళలాగా, సంతోషమూ దు:ఖమూ రెండూ సదా (కలకాలంవుండేవి కావు) వస్తుంటాయి పోతుంటాయి. మరి సదానందము (యెప్పుడూ ఆనందాన్నిచ్చే దేమిటి? ఆ సర్వేశ్వరుడి పాదారవిందములపై భక్తి అని అంటున్నారు అన్నమాచార్యులవారు. నయనాందము, శ్రవణానందము, జిహ్వానందము, దేమానందము, పరమానందము, నిత్యానందము – యేమిటేమిటో వివరిస్తున్నారు విని తరించండి. జ్ఞానము అంటే ఇదే సుమా!

భావ వివరణ:

ఓ సర్వేశ్వరా! నా పదారవిందములపై భక్తి (నీపాదపత్మములపై అచంచలమైన భక్తిప్రపత్తి) సదానందము (సర్వకాల సర్వావస్థలయందు ఆనందమునొసగునది).

నరులకు సురులకు నయనానందమయుయేది? (కన్నులకు ఆనందము నొసగునదేమిటి?) శ్రీహరీ! సర్వులకు జయము నొసగే నీసాకార (ఆకారముతో కూడిన) రూపముకంటే నయనానందకరము మరొకటి లేదు. ఇక వినినను (వినుటకు) నయముగ (స్వాంతనము కలిగించే శ్రవణానందము (చెవులకు ఆనందకరమైనది యేది? క్రియగలిగిన (పూనిక గలిగిన) నీ నామసంకీర్తనము మాత్రమే ఆ శ్రవణానందము నీయగలదు.

జిహ్వా (నాలుక) కలిగించే ఆనందమువల్ల నేనరులు దేనినైనా భుజించగలుగుతున్నారు. చెలగి (అతిశయించి) అందరికీ అట్టి జిహ్వానందము కలిగించునది యేదీ? యెన్నోసార్లు స్వీకరించే ఆస్వామి ప్రసాదమే జిహ్వానందకరము. ఇక లుధులకు (బుద్ధిమంతులకు) దేహమునకు ఆనందము కలిగించునదేది? నలుగడ (అనిచోట్లలో) బలమైన నీపాదములకు జేయు ప్రణామములు (సాష్టాంగవందనములే) దేహానందము గరిమల (మహిమగల శ్రీవేంకటేశ్వరుడా! ధరలో (భూలోకంలో) పరమానందమునొసగునదేది? నీకు చేసే దాస్యమే (భృత్యునిగా జీవించుటే) ఓనరహరీ! నిత్యానందము (ప్రతిరోజూ ఆనందము) నొసగునదేది? తగునట్లు అరవిరి (వినమృలై ముకుళిత హస్తములతో) జేయు నీసమారాధనమే నిత్యానందములు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Narayana Mantra pushpam In Telugu – నారాయణ మంత్రపుష్పం

Narayana Mantra pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. మంత్ర పుష్ప అనేది పూజల ముగింపులో, హిందూ దేవతలకు పుష్పాలను సమర్పించే సమయంలో, పాడే వేద శ్లోకం. మంత్రం, వేద మంత్రాల పుష్పగా, పరిగణించబడుతుంది. ఈ మంత్రం యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకం నుండి తీసుకోబడింది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

నారాయణ మంత్రపుష్పం

ఓం ధాతా పురస్తాద్యముదాజహార,
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః
తమేవం విద్యానమృత ఇహ భవతి,
నాన్యః పంథా అయనాయ విద్యతే.
ఓం సహస్ర శీర్ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం.
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.
విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,
పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం,
పరోజ్యోతి రాత్మా నారాయణః పరః,
నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
యచ్చకించిజ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,
అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః
అనన్తమవ్యయం కవిగ్ం సముద్రేఒన్తం విశ్వశమ్భువమ్
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్
అధో నిష్ట్యా వితస్త్యానే నాభ్యాముపరి తిష్ఠతి
జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,
సన్తతరం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.
తస్యాన్తో సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః.
సోగ్రభు గ్విభజ నిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్థ్వ మధశ్శాయీ రశ్శయస్తస్య సంతతా,
సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః,
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ తన్వీ పీతా భాస్వత్యణూపమా,
తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్పోక్షరః పరమః స్వరాట్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వై శ్రవణాయ కుర్మహే
స మే కామా న్కామకామాయ మహ్యం
కామేశ్వరోవైశ్రవణో దదాతు.
కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః
తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః, దివీచ చక్షురాతతం,
తద్విప్రాసో విపన్యవో జాగృవాంస స్సమింధతే విష్ణోర్యత్పరమం పదమ్.
నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్ /
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో: యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.
సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
ఛత్రం ధారయామి
చామరైః ధారయామి
గీతం శ్రావయామి
నృత్యం శ్రావయామి
ఆందోళికా మారోపయామి
సమస్త రాజోపచారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

ప్రార్ధన:

అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం,
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్.
సగుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం
జనార్దనం జనానందం జానకీవల్లభం హరిమ్.
ప్రణమామి సదా భక్త్యా నారాయణ మజం పరం,
దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితమ్.
నిస్తారయతు సర్వేషు తథా నిష్టభయేషు చ
నామాన్యేతాని సంకీర్త్య ఫల మీప్సిత మాప్నుయాత్
సత్య్నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం,
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రార్ధనా నమస్కారమ్ సమర్పయామి.

సర్వోపచారాలు:

చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి

ఫలమ్

ఇదం ఫలం మయా స్థాపితం పురతస్తవ.
తేన మే సఫలా వాప్తి ర్భవే జ్జన్మని జన్మని
శ్లో// యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు,
నూన సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్.

క్షమా ప్రార్థన:

(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన
యాత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ రమా సత్యనారాయణ స్వామి పూజావిధానం సంపూర్ణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)

అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభమ్ //

తదుపరి ఇక్కడ స్వామి వ్రత కథ చదువవలెను.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

మరిన్ని భక్తి యోగాలు:

Sri Krishna Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Ashtottara Shatanama Stotram Telugu

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్

శ్రీకృష్ణః కమలానాథో, వాసుదేవస్సనాతనః,
వసుదేవాత్మజః పుణ్యో, లీలామానుషవిగ్రహః.

1

శ్రీవత్సకౌస్తుభధరో, యశోదావత్సలో హరిః,
చతుర్భుజాత్తచక్రాసి, గదాశంఖాద్యుదాయుధః.

2

దేవకీనందన శ్రీశో, నందగోపప్రియాత్మజః,
యమునావేగ సంహారీ, బలభద్ర ప్రియానుజః.

3

పూతనాజీవితహర, శ్శకటాసురభంజనః,
నందవ్రజజనానందీ సచ్చిదానంద విగ్రహః.

4

నవనీత విలిప్తాంగో నవనీతనటో నఘః,
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః.

5

షోడశస్ర్తీ సహస్రేశః త్రిభంగీమధురాకృతిః,
శుకవాగమృతాబ్దేందుః గోవిందో యోగినాం పతిః.

6

వత్సవాటచరో నంతో, ధేనుకాసురభంజనః,
తృణీకృతతృణావర్తో, యమళార్జునభంజనః.

7

ఉత్తాలతాలభేత్తా చ, తమాల శ్యామలాకృతిః,
గోపగోపీశ్వరో యోగీ, కోటిసూర్యసమప్రభః.

8

ఇళాపతిః పరంజ్యోతిః, యాదవేంద్రో యదూద్వహః,
వనమాలీ పీతవాసాః, పారిజాతాపహారకః.

9

గోవర్ధనాచలోద్ధర్తా, గోపాలస్సర్వపాలకః,
అజో నిరంజనః కామజనకః కంజలోచనః.

10

మధుహా మధురానాథ్, ద్వారకానాయకో బలీ,
బృందావనాంత సంచారీ, తులసీ దామభూషణః.

11

శ్యమంతకమణేర్హర్తా, నరనారాయణాత్మకః,
కుబ్జా కృష్ణాంబరధరో, మాయీ పరమపూరుషః.

12

ముష్టికాసుర చాణూర, మల్లయుద్ధ విశారదః,
సంసారవైరీ కంసారి, మురారిర్నరకాంతకః.

13

అనాదిబ్రహ్మచారీ చ, కృష్ణావ్యసనకర్శకః,
శిశుపాల శిరశ్చేత్తా, దుర్యోధన కులాంతకః.

14

విదురాక్రూర వరదో, విశ్వరూప ప్రదర్శకః,
సత్యవాక్సత్యసంకల్పః, సత్యభామారతో జయీ.

15

సుభద్రాపూర్వజో విష్ణుః భీష్మముక్తి ప్రదాయకః.
జగద్గురు ర్జగన్నాథో, వేణునాద విశారదః.

16

వృషభాసుర విధ్వంసీ, బాణాసురకరాంతకః,
యుధిష్టిరప్రతిష్ఠాతా, బర్హిబర్హావతంసకః.

17

పార్థసారథిరవ్యక్తో, గీతామృతమహోదధిః,
కాళీయఫణి మాణిక్య, రంజిత శ్రీపదాంబుజః.

18

దామోదరో యజ్ఞభోక్తా, దానవేంద్రవినాశకః,
నారాయణః పరం బ్రహ్మ, పన్నగాశనవాహనః.

19

జలక్రీడాసమాసక్త, గోపీవస్త్రాపహారకః,
పుణ్యశ్లోకస్తీర్థపాదో, వేదవేద్యో దయానిధిః.

20

సర్వతీర్థాత్మకస్సర్వగ్రహరూపీ పరాత్పరః,
ఏవం శ్రీకృష్ణదేవస్య, నామ్నామష్టోత్తరం శతమ్.

21

కృష్ణనామామృతం నామ, పరమానందదాయకమ్,
అత్యుపద్రవదోషఘ్నం, పరమాయుష్యవర్ధనమ్.

22

ఇతి శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్.

మరిన్ని అష్టోత్తరములు:

Devani Paksapatamo Tirigelokulavelto In Telugu – దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో

దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
సంఖ్య : 422
పుట: 284
రాగం: నారాయణి

నారాయణి

41 దేవ నీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
శ్రీవిభుఁడ నీవేకాదా చిత్తములోనయ్యా.

||పల్లవి||

దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదు:ఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా.

||దేవ||

విని కిందరి కొకటే విషయాలు నొకరీతే
మునిఁగేటిజాతిభేదములివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే
పెనఁగేటిగుణముల పెక్కు జాడ లేలయ్యా.

||దేవ||

అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింక సేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా.

||దేవ||422

అవతారిక:

అన్నమాచార్యులవారి కీర్తనలలో పల్లవి చాల చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. “ఓ దేవదేవా! శ్రీకాంతుడా! పైకి చూడటానికి జరిగేవన్నీ నీకు పక్షపాత బుద్ధి వున్నదా అనే భ్రమ కలిగిస్తాయి. లేకపోతే అనుక్షణం భ్రమల లోనే వుండే ఈ లోకులలోని ‘వెల్తి’ (తక్కువ భాగ్యమో, యెక్కువ భాగ్యమో) యెందుకు కలుగుతున్నాయి? మరి మా అందరి చిత్తములో అంతర్యామివి నీవొక్కడివే అయితే ఈ హెచ్చుతగ్గులెందుకు వస్తున్నాయి?” మా శారీరక ధర్మాలు ఒక్కటే శారీర దారుఢ్యాలు వేరు, వినేది ఒకటే అర్థమయ్యేది వేర్వేరు, ఆకలి వొకటే అరుగుదల వేర్వేరు. ఒకడిది మంచి గుణం ఒకడిది చెడ్డగుణం యెందుకిలా? యేమిటి నీ మాయ?

భావ వివరణ:

ఓ దేవదేవా! నీ పక్షపాత వైఖరియో లేక తిరిగేలోకుల వెల్తియో (భ్రమలకు లోనయ్యే లోకుల యొక్క భాగ్యప్రాప్తిలోని విభేదమో) తెలియకుండా వున్నది. మా అందరి చిత్తములో అంతర్యామిగా నీవే వుండగా ఓ శ్రీవిభుడా! ఇలా యెందుకు ఒకరు గొప్ప ఒకరు తక్కువ అవుతున్నారు?

దేవా! ప్రపంచంలో మానవులందరికీ రేయింబవళ్ళు ఒక్కలాగే వుంటాయి కదా? మరి వారి సుఖదు:ఖాలు ఒకేలా యెందుకుండటంలేదు? హెచ్చుతగ్గులెందుకు? అన్ని జీవుల భవము (పుట్టుక) ప్రాణములు ఒక్కటే కదా? మరి లోకంలో పాపపుణ్యములనుభవించడంలో తేడా యెందుకు వస్తున్నది?

ప్రభూ! అందరి వినికి (వినేశక్తి) ఒక్కటే… విషయాలు (విషయములపై ఆసక్తీ) ఒక్కటే, మరి, మునిగేటి (అంతులేని) జాతిభేదము యెందుకు కలుగుతున్నది. అనయము (నిరంతరం) మన చూచే శక్తి ఒక్కటే… ఆకలిదప్పులూ ఒక్కటే కాని మనలో పెనవేసుకొన్న గుణాలలో తేడాలన్నీ యెందుకు వుంటున్నవి?

ఓ శ్రీవేంకటేశ్వరా! మా అందరిలోనూ అంతర్యామిగా చరించేది. నీవొక్కడివే, మరి మాకు వేర్వేరు చింతలు, వేర్వేరు చిలుగులు (ఉపద్రవములు) యెందుకు కలుగుతున్నాయి? ఏమిటి నామాయ? ఏమిటీ విచిత్రం? అందుకే నీకు శరణు అంటున్నాను. ఓ అయ్యా! అందుకే నీవు నన్ను నిరంతరం కాపాడుతున్నావు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిః

గౌరీ అష్టోత్తర శతనామావళిః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గౌరీ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Gowri Ashtottara Shatanamavali Telugu

గౌరీ అష్టోత్తర శతనామావళిః

  • ఓం గౌర్యై నమః
  • ఓం గిరిజాతనూభవాయై నమః
  • ఓం జగన్మాత్రే నమః
  • ఓం వీరభద్రప్రసువే నమః
  • ఓం విశ్వరూపిణ్యై నమః
  • ఓం కష్టదారిద్య్రశమన్యై నమః
  • ఓం శాంభవ్యై నమః
  • ఓం బాలాయై నమః
  • ఓం భద్రాదాయిన్యై నమః
  • ఓం సర్వమంగళాయై నమః
  • ఓం మహేశ్వర్యై నమః
  • ఓం మంత్రారాధాయ్యై నమః
  • ఓం హేమాద్రిజాయై నమః
  • ఓం పార్వత్యై నమః
  • ఓం నారాయణాంశజాయై నమః
  • ఓం నిరీశాయై నమః
  • ఓం అంబికాయై నమః
  • ఓం మునిసం సేవ్యాయై నమః
  • ఓం మేనకాత్మాజాయై నమః
  • ఓం కన్యకాయై నమః
  • ఓం కలిదోషవిగాతిన్యై నమః
  • ఓం గణేశజనన్యై నమః
  • ఓం గుమాంబికాయై నమః
  • ఓం గంగాధరకుటుంబిన్యై నమః
  • ఓం విశ్వవ్యాప్తిన్యై నమః
  • ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
  • ఓం శివాయై నమః
  • ఓం శాంకర్యై నమః
  • ఓం భవాన్యై నమః
  • ఓం మాంగల్యదాయిన్యై నమః
  • ఓం మంజుభాషిణ్యై నమః
  • ఓం మహామాయాయై నమః
  • ఓం మహాబలాయై నమః
  • ఓం హైమవత్యై నమః
  • ఓం పాపానాశిన్యై నమః
  • ఓం నిత్యాయై నమః
  • ఓం నిర్మలాయై నమః
  • ఓం మృడాన్యై నమః
  • ఓం మానిన్యై నమః
  • ఓం కుమార్త్యె నమః
  • ఓం దుర్గాయై నమః
  • ఓం కాత్యాయిన్యై నమః
  • ఓం కమలార్చితాయై నమః
  • ఓం కృపాపూర్ణాయై నమః
  • ఓం సర్వమయ్యై నమః
  • ఓం సర్వస్వత్యై నమః
  • ఓం అమరసం సేవ్యాయై నమః
  • ఓం అమృతేశ్వర్యై నమః
  • ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః
  • ఓం బాల్యారాధితభూతదాయూ నమః
  • ఓం హిరణ్యయై నమః
  • ఓం సూక్ష్మాయై నమః
  • ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
  • ఓం సర్వభోగప్రదాయై నమః
  • ఓం సామశిఖరాయై నమః
  • ఓం కర్మబ్రహ్మమయ్యై నమః
  • ఓం వాంఛితార్ధదాయై నమః
  • ఓం చిదంబర శరీరిణ్యై నమః
  • ఓం దేవ్యై నమః
  • ఓం కమలాయై నమః
  • ఓం మార్కండేయవరప్రసాదాయై నమః
  • ఓం పుణ్యాయై నమః
  • ఓం సత్యధర్మరతాయై నమః
  • ఓం శంకరూపిణ్యై నమః
  • ఓం బగళాయై నమః
  • ఓం మాతృకాయే నమః
  • ఓం సత్యై నమః
  • ఓం కల్యాణ్యై నమః
  • ఓం సౌభాగ్యదాయై నమః
  • ఓం అమలాయై నమః
  • ఓం అన్నపూర్ణాయై నమః
  • ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
  • ఓం అంబాయై నమః
  • ఓం భానుకోటి ప్రభావత్యై నమః
  • ఓం పరాయై నమః
  • ఓం శీతాంశుకృత శేఖరాయై నమః
  • ఓం సర్వకాలసుమంగల్యై నమః
  • ఓం సామశిఖరాయై నమః
  • ఓం వేదాంతలక్షణాయై నమః
  • ఓం కామకలనాయై నమః
  • ఓం చంద్రార్కాయుత తాటంకాయై నమః
  • ఓం శ్రీచక్రవాసిన్యై నమః
  • ఓం కామేశ్వరపత్న్యై నమః
  • ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
  • ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః
  • ఓం పురుషార్థప్రదాయై నమః
  • ఓం సర్వసాక్షిణ్యై నమః
  • ఓం శ్యామలాయై నమః
  • ఓం చండై నమః
  • ఓం భగమాలిన్యై నమః
  • ఓం విరజాయై నమః
  • ఓం స్వాహాయై నమః
  • ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
  • ఓం దీక్షాయణ్యై నమః
  • ఓం సర్వవస్తూత్తమాయై నమః
  • ఓం శ్రీవిద్యాయై నమః
  • ఓం షోడశాక్షర దేవతాయై నమః
  • ఓం స్వధాయై నమః
  • ఓం ఆర్యాయై నమః
  • ఓం దీక్షాయై నమః
  • ఓం శివాభిదానాయై నమః
  • ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
  • ఓం నాదరూపాయై నమః
  • ఓం త్రిగుణాంబికాయై నమః
  • ఓం శ్రీమహాగౌర్యై నమః

మరిన్ని అష్టోత్తరములు:

Vande Shivam Shankaram In Telugu – వందే శివం శంకరమ్

Vande Shivam Shankaram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వందే శివం శంకరమ్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Vande Shivam Shankaram Lyrics Telugu

వందే శివం శంకరమ్

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సర్వజగద్విహారమతులం వందేన్దక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హారే ర్వల్లభమ్!
వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే దివ్యమచిన్త్య మద్వయ మహం వందే ర్క దర్పాపహం
వందే నిర్మల మాదిమూల మనిశం మఖ ధ్వంసినమ్ !
వందే సత్యమనన్త మాద్యమభయం వందే శాన్తాకృతం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్!
వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్థ గంగాధరమ్ !
వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్!
వందే విప్రసురార్చితాంఘ్ర కమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూత గణేశ మవ్యయ మహం వందే ర్థ రాజ్యప్రదమ్ !
వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్డే నకారాపహం
వందే రావణ నందిభృంగి వినతం వందే సుపర్ణావృతమ్!
వందే శైల సుతార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్దేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్!
వందే జహ్నుసుతారి మికేశ మనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

మరిన్ని స్తోత్రములు

Sri Markandeya Kruta Shiva Stavam In Telugu – శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్

Sri Markandeya Kruta Shiva Stavam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్ గురించి తెలుసుకుందాం…

Sri Markandeya Kruta Shiva Stavam Lyrics

శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
సింజినీ కృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం |
క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

1

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్ర సరోరుహం |
దేవ సింధు తరంగ శీకర సిక్త శీత జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

2

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం |
అంధకాంతక మాశ్రితామర పాదపం మదనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

3

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహం |
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః |

4

యక్ష రాజ సఖం భగాక్ష హరం భుజంగ కళేబరం
శైలరాజ సుతాపరిష్కృత చారుదివ్య విభూషణం |
క్ష్వేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

5

ఔషధం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం ।
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

6

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినం |
క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమావృతం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతివై యమః ||

7

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |
సోమవారి నభోహుతాశన సోమవా ద్యఖిలాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

8

మృత్యుభీత మృకండు సూనుకృతస్తవం శివసన్నిధౌ |
యత్రకుత్రచయః పఠేన్నహి తస్య మృత్యు భయంభవేత్ ||
పూర్ణ మాయు రరోగితా మఖిలార్థ సంపద మాదరాత్ ।
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః ॥

చంద్రశేఖర చంద్రశేఖర – చంద్రశేఖర పాహిమాం |
చంద్రశేఖర చంద్రశేఖర – చంద్రశేఖర రక్షమామ్ ||

ఇతి శ్రీమార్కండేయ కృత శివస్తవమ్

మరిన్ని స్తోత్రములు

Anganaku Virahame Singaramaya In Telugu – అంగనకు విరహమే సింగారమాయ

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంగనకు విరహమే సింగారమాయ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 21
కీర్తన: అంగనకు విరహమే సింగారమాయ
సంఖ్య : 415
పుట: 277
రాగం: చారుకేశి

చారుకేశి

65 అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవేయిది చిత్తగించవయ్యా

||పల్లవి||

కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల చెమరించి జలకమాడే
బలు తమకాన నీకు పక్కన నెదురువచ్చి
నిలువున కొప్పు వీడి నీలి చీర గప్పెను.

||అంగన||

సుదతి నిన్ను చూచి సోయగపు సిగ్గులను
పొదలి చెక్కుల దాకా పూసె గంధము
మదన మంత్రములైన మాటల మర్మము సోకి
ముదురు పులకలను ముత్యాలు గట్టెను.

||అంగన||

గక్కన కాగిట నిన్ను కలసి ఈ మానిని
చొక్కి చంద్రాభరణపు సొమ్ములు వెట్టే
అక్కున శ్రీ వేంకటేశ అలిమేలుమంగ నీకు
దక్కి సరసములను తలబాలు వోసెను.

||అంగన||

అవతారిక:

నీ అగ (అలిమేల్మంగ)కు విరహతాపమే గొప్ప సింగారమయ్యిందయ్యా శ్రీనివాసా! ఆమెను సమీపించి నీవే యిది గమనించవయ్యా! అని నచ్చచెబుతున్నారు అన్నమాచార్యులవారు. అమలిన శృంగారంతో జగతికి ఆదిదంపతులను కీర్తించటం మధురభక్తి క్రింద పెద్దలు తార్కాణించారు. వారు యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియులు కాదు, శృంగార సామ్రాజ్యాన్ని యేలే సామ్రాట్టు, సామ్రాజ్ఞి.
అమ్మవారికి ముదురు పులకల ముత్యాల సరాలు పేర్చిన పదకవితాపితామహునికి జోహారు అనకుండా యెలవుండగలము చెప్పండి. శృంగారాన్ని గోప్యత కొంతకప్పాలనే నా ఉద్దేశ్యము కూడా.

భావ వివరణ:

ఆహా! ఈ అంగనకు (యువతికి) తను పొందే విరహమే సింగారమై (గొప్ప అలంకరణ వలె) భాసించుచున్నది. ఓ ప్రభూ! చెంగట (ఆమెను చేరి) నీకు నీవే ఇది చిత్తగించవయ్యా (అర్థం చేసికొనుమయ్యా!)

ఈ కలికి (యువతి) లోలో నిన్ను దలచి గక్కున (వెంటనే) కరగి (పరవశించి) జలజల చెమటతో జలకమాడినట్లయినది. నీకు యెదురువచ్చినప్పుడు బలవత్తరమైన తమకాన, నిలువున కొప్పు (నిట్టనిలువుగానున్న సిగకొప్పు) ముడివీడి, నీలిచీరె గప్పెను (నల్లని వస్త్రము వంటికి కప్పినట్లుండెను).

ఈ సుదతి (యువతి) నిన్ను చూచినదే తడవుగా ఎరుపెక్కిన చెక్కిళ్ళను తెలియకుండా దట్టముగా గంధమును పూసినది. మదనమంత్రములవంటి నీ నర్మగర్భమైన మాటల భావము భామ మనస్సును తాకి శరీరము పులకలుదేరినది ఆ పులకల విస్తరింపు ముత్యాల వానవలె దట్టముగా నాక్రమించెను.

అంతలో నీవా మానినిని కౌగిట జేర్చితివి. అలసిన ఆమె నీ మెడలోని చంద్రహారమువలె భాసించినది. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ దేవి అలమేలుమంగ ఆపై నీ అక్కున దక్కి (సందిట జిక్కి) తన సరస సల్లాపములను తలంబ్రాలు పోసి నిన్ను మురిపించి తానునూ మురిసినది.

ఓ జగజ్జననీ జనకులారా! మిమ్మట్లు భావించగల ఆచార్యులవారిదే భాగ్యము. వారి కృపవలన మేమూ ధన్యులమైతిమి కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: