కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
శరణు శరణు వోసర్వేశ్వర నీకు
మరణభయములెల్ల మానుపుటకొఱకు
మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ
దురితములన్నియుఁ దొలఁగించుటకు
||ఆడియ||
దండము దండము నీకు దైవశిఖామణి
పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు
అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి
నిండు నీకరుణ నాపై నించేటి కొరకు
||అడియ||
అభయ మభయము శ్రీయాదినారాయణ
వుభయకర్మము నాకు నూడుచుట కొరకు
విభుఁడ శ్రీవేంకటేశ వినుతిసేసెద నిన్ను
శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు
||అడియ॥ 416
అవతారిక:
అద్భుతమైన శరణాగతి వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అడియను అడియను అయ్యా! అంటే నీదాసాను దాసుణ్ణి ప్రభూ! అని అర్థం. ఈ లోకంలో మూడు విధములైన తాపత్రయములు జీవిని బాధిస్తున్నవి. అవే అధ్యాత్మికము, ఆధిభౌతికము మరియు ఆధిదైవికము. ఇవి తడతాకుతుంటాయి… అంటే తత్తరపడేట్లు చేస్తాయి. ఓ అఖిలలోక నాయకా! శరణు దండము దండము, అభయం అభయం అని వేడుకొంటున్నారు. మరి శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహిస్తే అన్నీ శుభములే కదా!
భావ వివరణ:
ఓ అఖిలలోకైక నాథా! (లోకములన్నింటికీ ఒకే ఒక నాయకుడవైన శ్రీహరీ!) నేనునీ, అడియను అడియను అయ్యా! (దాసానుదాసుడను తండ్రీ!) నాకు తడతాకులు (తత్తరపాటు) కలిగించే తాపత్రయములను మాన్పుటకు నీకు మ్రొక్కెదను.
ఓ సర్వేశ్వరా! నిన్ను శరణుచొచ్చెదను. నా మరణభయములు నెల్ల (నశింపజేయు శంకలనన్నీ) మాన్పుటకు శరణు వేడెదను. ఓ ముకుందా! మాధవా! నా దురితములన్నింటినీ (పాపములన్నీ) తొలగించుటకు మొరవెట్టుచున్నాను.
ఓ దైవశిఖామణీ! (దేవతలందరిలో తలమానికమైన స్వామీ!) పండియుపండని నామతి (పరిపక్వము అయిందీ అనలేము, పరిపక్వము కానిదీ అనలేము అట్టి నా మనస్సును) పాకముసేయుట కొరకు (పరిపక్వత నొందించుటకు) దండము దండము (అనేక నమస్కారములు), అండనే (నిన్నాశ్రయించి) నీకు దాస్యము చేయువాడనైతిని. నీ కరుణ నాపై నింపి నన్ను అనుగ్రహించుటకు నీదాసుడనైతినయ్యా!
ఓ శ్రీ ఆదినారాయణా! నా ఉభయ కర్మములను (సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అనే రెండు రకముల కర్మలను) వూడుచుటకు (తొలగిపోవునట్లు చేయుటకు) నీ అభయమును వేడెదను. నాకు అభయమునిమ్ము. ఓ శ్రీవేంకటపతీ! నిన్ను వినుతి చేసెదనయ్యా! (ప్రార్థించెదను ప్రభూ!) మాకు శుభములన్నింటినీ చూపుటకు నిన్ను యెల్లవేళలా ప్రార్థించెదను తండ్రీ!
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో జగములేలేవాడవు జనార్దనుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
22 జగము లేవాఁడవు జనార్దనుఁడవు
తగ నీవారమై (మే?) నేము ధర నెట్టుండినాను,
||పల్లవి||
గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసినతప్పులు లోఁగొనవే.
॥జగ||
తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు
యెల్లవారికిఁ బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము
చల్లఁగా మానేరములు సైరించుకొనవే.
॥జగ||
దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము
శరణుచొచ్చితి మిఁక క్షమియించుకొనవే.
||జగ|| 229
అవతారిక:
జనుల ‘అర్ధన’ (వేడికోలు) వినేవాడు జనార్దనుడు. “దేవా! నీవు జనార్దనుడవై జగము లేలుతుంటే, మేము నీవారమై, నీదాసులమై ఈలోకంలో పూనికతో వుంటామయ్యా!” అని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. మా తల్లియు దండ్రియును దాతయునూ నీవే ప్రభూ! “అన్యధా శరణం నాస్తి” అని నిన్ను ఆశ్రయించినాము. మాకు నీవే దిక్కు. అసలు సంగతి యేమిటంటే, అవతారికలో కనుపించినంత తేలిక కాదు, దీని భావము. అంతు చిక్కని, చిక్కుముళ్ళు చాలావున్నాయి, అంటే నన్ను నమ్మండి. “కాణాచి” అంటే యేమిటో? చదవండి. రెండేళ్ళ క్రితం ఇదే కీర్తన నేను చేయలేకపోయాను, నేడు చేయగలుగుతున్నాను. ఇదే స్వామి ‘దయ’ అంటే.
భావ వివరణ:
ఓ జనార్దనా! నీవు జగములు (పదినాలుగు భువనములను) పరిపాలించు బ్రహ్మాండనాయకుడవు. నేము (మేము) ఈ ధరన్ (భూమిపై) తగన్ (తగినట్లు) నీవారమై (నీ పరివార భృత్యులమై) నెట్టుండినాము (పూనికతోయున్నాము).
ప్రభూ! నీవే మాకు గతివి (దిక్కైన ఆధారానివి). నీవే మాకు మతివి (మంచీ చెడు విచక్షణ కలిగించే మేధస్సువి). నీవే మాకు కాణాచియైన చోటువు (చిరకాలవాసస్థానమైనవాడవు… అందుచేతనే మన ఆత్మలన్నింటికీ ఆ పరమాత్మ చిరంతనుడు). అన్నిటికీ నీవే సతమైన (శాశ్వతమైన) సాక్షివి (ఆయన నిష్పక్షపాతమైన సాక్షీభూతుడు). మాకు అప్పుడప్పుడు చతురత వలసితే (తెలివితేటలు అతి అయిపోయి) నిన్ను జరతుము (నిందించెదము). తరువాత నీవే దిక్కని కొలుతము (కాళ్ళు పట్టుకొంటుంటాం). తతి (అసాధారణంగా) మేము చేయుచున్న తప్పులను మన్నించుము తండ్రీ!
ఓ దేవా! నీవే మాకు తల్లివి, తండ్రివీ నీవే. మా ప్రాణదాతవు పరమాత్మవూ నీవే. నీవు ఆత్మరూపువవైననూ అందరికీ నివాసస్థానమైన వాడవు. మాకు ఇహమున కోర్కెలు దీర్చి, పరమున మోక్షమునిచ్చేవాడవు నీవే. మల్లడి (నీతో పోట్లాడి) ఒక్కొక్కవేళ నిన్ను మఱచిపోయి తలుచుకోను కూడా తలుచుకోము. మా నేరములను చల్లగా (నెమ్మదిగా) సైరించి కొనవే (క్షమించి మమ్మల్ని కాపాడవయ్యా!)
ఓ జగన్నాథా! నీవు మా దరిదాపువు (సమీపములోనే వున్న గమ్యానివి). అంతులేని దయాస్వరూపుడవు. నీవు విలసిల్లిన శ్రీవేంకటపతివి. ఏదియేమైనా మేము నిన్ను విరివిగా (విస్తృతముగా) వేడుకొని నుతించెదము. నిన్ను శరణుచొచ్చితిమి. ఇక క్షమించుకొనవే (మమ్మల్ని క్షమించి అనుగ్రహించుము తండ్రీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ కవచ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను – అన్నమయ్య కీర్తనలు
నిచ్చలు కోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుచేయ నీతీర్ధమే చాలు
పచ్చిపాపాలణచ నీ ప్రసాదమేచాలు
యెచ్చు కొందు వుపాయాలు ఇకనేల వెదక ॥
॥కేశవ॥
ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిషి కావగ తిరుమణి లాంఛనమే చాలు
మెనసెను దిక్కుదెస ఇకనేల వెదక॥
॥కేశవ॥
నెలవైన సుఖమియ్య నీ ధ్యానమేచాలు
అల దాపుదండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు యికనేల వెదక ॥
॥కేశవ॥
అవతారిక:
తనని తాను కేశవునికి ‘దాసి’ వలె భావించుకొని అన్నమాచార్యులవారు పాడుతున్న చక్కటి కీర్తననాస్వాదించండి. స్వామీ నేను నీవే దిక్కని నమ్మిన దాసిని. నాలో లోపాలు లేవని నేరాలు లేవని నేనను. కానీ అవన్నీ నేను ఈ మానవశరీరం ధరించటం చేత దేహానికి ప్రకృతి సిద్ధమైన నేరాలు. వాటిని ఈనాడు యెంచినందువలన వుపయోగమేమి వుంటుంది? నేను నీ నామ సంకీర్తనతో బ్రతుకుతున్నాను, నీ అర్చన, దాస్యము, కైంకర్యములతో వైష్ణవ దీక్షలో బ్రతుకుతున్నాను నాకు ఇతరములేవీ వద్దు, వద్దు, వద్దు. అంతే… అంటున్నారు.
భావ వివరణ:
ఓ కేశవా! నేను నీదాసినైతిని. అందుచేత అన్నిటా (ఇహపరములు రెంటినీ) గెలిచితి (సాధించగలిగాను). నేను, నాలో లోపాలు లేవని కాని నేరాలు చేయని వాడిని అనిగాని అనలేను. కాని అవి యీ శరీరపు నేరాలు నేను మానవ శరీరధారినైనందువలన దానికి సహజమైన నేరాలు. ఇక వాటిని వెదకనేల? అయినా వాటిని యెదుర్కొనటానికి నా ప్రయత్నాలు నేనూ చేస్తున్నాను.
నేను సదా నీ నామస్మరణతోనే బ్రతుకుతాను. నా కోరికలు తీర్చుటకు అది చాలదా? నీ తీర్థమైన చోటునే వుంటాను. నన్ను నిర్మలుని చేయటానికి అది చాలదా? నేను చేసే పచ్చిపాపాలు బాహాటంగా కనిపిస్తున్న పాపకర్మలు. అణగద్రొక్కుటకు నీ ప్రసాదము చాలదా? ఎచ్చుకొందు వుపాయాలు (ఎక్కువ తక్కువ కిటుకులు) అవసరమా? అక్కర్లేదు నిన్ను నమ్మితే చాలు.
నీకైంకర్యము (శరణాగతి) చాలు నేను ఘనుడను అనిపించుకొంటాను. నీ ముద్రలు (రెండు భుజములపైన ధరించే శంఖ చక్రముద్రలు) చాలును. మొనసి (పూని) అవే నీ ఆయుధాలవలెనే నన్ను రక్షిస్తాయి. మనిషి కావగ (రక్షించి కాపాడుటకు) నేను నానొసట ధరించే నీ తిరుమని లాంఛనము (పంగనామాలు) చాలును వాటితోనే నా మార్గము వెలుగులీనుతున్నది.
ఓ ప్రభూ! నీ దాస్యము నెలవైన (సుప్రతిష్టమైన) సుఖమునిస్తుంది. అలదాపుదండకు (ఆపైన తోడు నీడై కాపాడుటకు) నేను చేసే నీ అర్చనయే చాలును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఇన్నిటా (ఇన్ని విధములైన) నీసేవలు మాకు వున్నవి కదా!) ఎలమి (మా వికాసమునకు) ఇలపై అన్యములైన వుపాయముల వెదకుటెందులకు? నీవు మాకు చాలును తండ్రీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ పూజా విదానం గురించి తెలుసుకుందాం.
శ్రీ హనుమాన్ పూజా విధానం
పూ || తిధౌ || గో ॥ నా ॥ మమ శరీర ఆవాహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధా నివృత్తర్ధ్యం, దుష్టస్థాన స్థితా యే యే గ్రహాః తద్దోష పరిహారార్ధం శ్రీ హనుమత్పూజా ప్రదక్షిణాని కరిష్యే ॥ తదాదౌ నిర్విఘ్న పరిసమాప్తర్థ్యం గణాధిపతి పూజాం కరిష్యే ॥ అథ హనుమత్పూజా విధిః॥
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చక్కని సరసపు శిశువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
చక్కని సరసపు శిశువు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : చక్కని సరసపు శిశువు
సంఖ్య : 151
పుట : 109
రాగం : కన్నడగౌళ
పెక్కు మాయల పెను శిశువు అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారు. అన్నమాచార్యులవారు. పల్లవి తేలికగా వుంటే చరణాలు మరణాలే అన్నమయ్య కీర్తనలలో. స్వామి మున్నిటి శిశువుట అంటే అనాదియైన శిశువు. బొమ్మర పోవడు అంటే దిమ్మతిరిగేట్లు చేయడమన్నమాట. “పుట్టడు వొడమడు బూమెలే చేసీ” అంటే ఏమిటి? తేలికగా కనిపించే అతి క్లిష్టమైన కీర్తన ఇది. సాధ్యమైనంత పొందికగా దీని భావవివరణ కూర్చాను.
భావ వివరణ:
ఓ ప్రజలారా! శిశువు (పొత్తిళ్ళ బాలుని) వలె వున్న ఇతడు చక్కని, సరసమైన (లలితమైన) వాడు. చాలా మాయలు నేర్చిన గొప్ప శిశువు ఈతడు. ఈయన లీలలు వినండి.
ఒకనాడు పూతకి అనే రాక్షసి అందమైన యువతి వలెవచ్చి విషములు చిమ్మెడి రొమ్ములలో పాలు చేపిన (చేపినవని) కొమ్మని (త్రాగునాయనా!) అని ఇచ్చిన వెనువెంటనే, కుడిచేని (పీల్చినాడు). బొమ్మరపోవడు (దిమ్మదిరిగిన ఆ రాక్షసి పారిగొనినది (నశించినది). అమ్మరో! (అయ్యబాబోయ్) వీడు గయ్యాళి శిశువు (రండగొండి పిల్లవాడు).
ఒకనాడు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో చుట్టపు చూపుగా అనుకోకుండా వున్నట్లుండి వచ్చాడు. వచ్చి, బెట్టుగ కౌగిట బిగించేని (అతిశయించి కౌగిటిలో బిగించినట్లు చుట్టేశాడు). అప్పుడు వీడు మాత్రం తక్కువవాడా? బూమెలే చేసీ (మోసాన్ని మోసంతోనే వంచాడు). పైగా వాడు పుట్టడు వొడమడు (పుట్టుకే లేని మగాడు). (పసిబాల శిశువుగా) వున్నంతమాత్రాన పట్టరే! (వీనిని పట్టుట సాధ్యమా?)
ఒకనాడు శకటాసురుడు అనే రాక్షసుడు ‘బండి’ రూపంలో వీడిని చంపాలని వచ్చాడు. అప్పుడు, ఆదిగొని (వాడిపై కన్నువేసి) తాను (ఆ శిశువు) అటు పాదము చాచి, జాతురకు నలరీని (మిక్కిలి చాతుర్యంతో అతిశయించి) బండిని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసి శకటాసురుని చంపేశాడు. ఎందుకంటే ఆ శిశువు యెవ్వరనుకొన్నారు? వేదవేద్యుడు (వేదముల చేతనే తెలియశక్యమైన) దేవదేవుడు. శ్రీవేంకటాద్రి మీద సంతోషంగా వున్న శ్రీవేంకటేశ్వరుడే ఈ మున్నిటి (అనాదియైన మఱియాకు శిశువు).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భర్తను ఎలా వశం చేసుకోవాలి? నీతికథ.
భర్తను ఎలా వశం చేసుకోవాలి ?
(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)
భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా అని ఆశ్చర్య పడే వారు లక్షలకు పయిగా ఉంటారు. కాని లక్ష శ్లోకాల మహాభారతంలో ఈ సత్యభామ ఉండేది అయిదారు నిమిషాలు. ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది. చూడండి.
శకుని ఆడిన మాయ జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కొద్ది రోజులలో అది పూర్తి అయి అజ్ఞాత వాసానికి వెళ్ళాలి.
అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది.
అక్కడ నాలుగయిదు రోజులు గడిపారు. ఒకనాడు పాండవపత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్న వేళ, ఎవరూలేనిచోట, సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి, కొంతసేపు లోకాభిరామాయణం అయాక.
‘వదినా! ఒక్కమాట అడగాలని ఉంది. ఏమీ అనుకోకుండా, దాచుకోకుండా చెపుతావా? అంది.
ద్రుపద రాజనందన చిరునవ్వు నవ్వి ః
“అదేమిటి వదినా నీ దగ్గర దాపరికం ఏవుంటుంది నాకు’ అంది.
సత్యభామ: వదినా! ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఒక్క నాడు నీ అయిదుగురు భర్తలలో ఎవ్వరూ నిన్ను పరుషంగా పలక రించడం కాని, కన్ను లెర్రజేసి చూడడం కాని కనిపించదు. అందరూ అనురాగంతో ఆప్యాయంతోనే నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించావు ?
ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నది స్నానం చేస్తే యింతటి అనురాగాన్ని భర్తమంచి పొందవచ్చునో చెప్పు అంది.
ద్రౌపదీదేవి అంతా విని, మందహాసం చేసి
‘వదినా! ఎంత అమాయకురాలివమ్మా! లోకోత్తర పురుషు డయిన మా అన్నయ్యకు భార్య వయిన నీకు ఇటు వంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా! అయినా అడిగావు కనక విను.
నువ్వు చెప్పిన ప్రజలూ, నోములూ, స్నానాలూ, మందులూ, మాకులూ, మంత్రలూ, తంత్రాలూ మనకు కాదమ్మా.
పతివ్రతా ధర్మాలు తెలియని కుంటలూ, నీచులూ అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు. మనమనస్సులో ఆ వెర్రి ఊహ పుట్టనే కూడదు. పుట్టినా మరుక్షణంలో దానిని పారదోలి మనస్సును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి.
భర్తను వశపరచుకుందుకు ఈ విధంగా మందులూ, మంత్రాలూ ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే యింక చెప్పాలా?.
పాముదూరిన యింటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండి, మనమీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది.
ఎవరో ఏదో ముందు తెచ్చి తినిపించమంటారు. దానివల్ల కొందరు మరణించారనీ, కొందరికి వివరీతంగా రోగాలు వచ్చాయనీ, మరికొందరు. పిచ్చివారయి ఎందుకూ కొరగాకుండా పోయారనీ విని ఉంటావు.
ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలితనం వస్తుండనీ, కొందరికి మాట వడిపోయి మూగవారు అవుతారనీ, కొందరు చెవిటివా ధయారనీ వినే ఉంటావు. అందుచేత ఆ ఆలోచన వదులుకో.
నేను ఎలా సాధించానంటావా! అది చాలా సులభం వదినా!
ముందుగా అహంకారం వదిలేశాము. దురభిమానాన్ని దూరంగా తరిమాను. సాధ్యమయినంతా పెదవి విప్పి మాట్లాడను. తప్పని పరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడుతాను. ఏనాడూ కరకుగా, పరుషంగా మాట్లాడి ఎరగను. మాటతోనే కాదుటమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది ।
ఇక –
నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను. మాకు పరిచయం లేని కొత్తవారితో అసలు మాట్లాడను.. ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళను. అనవసర విషయాలలో జోక్యం కలిగించుకోను.
వీరు ఏ పనిమీదనో అటూ ఇటూ వెళ్ళివస్తే, వారు రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి వారిసేవ కోసం ఎదురు చూస్తాను.
వీరి అవసరాలన్ని నేను స్వయంగా చూసుకుంటానే తప్ప, అది మా దాపదాసీజనానికి విడిచి పెట్టను.
వారు నాకు ఏ విషయం చెప్పినా అది వర రహస్యంగా దాచు తాను. ఎంత చిన్న విషయమయినా సరే, ఆ మాట యితరులకుచెప్పను.
ఈ యింట్లో ఎవరికి ఏది యిష్టమో నాకు లుసు. ఆ పదార్థాలు స్వయంగా వండి, నేనే వడ్డించి, నవ్వుతూ మాట్లాడుతూ వారి చేత హాయిగా భోజనం చేయిస్తాము.
సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకల లాడుతూ ఉండేలా చూసుకుంటాను.
వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను. అంతే తప్ప వెకిలినవ్వులు నవ్వుతూ నిలబడను.
ఇంద్ర ప్రస్థంలో యువరాజు పీఠంమీద వారిని ఎంత గౌరవంతో చూశానో, యీ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేనూ అలానే నడుపుతున్నాను. ఏరాడూ ఆవిడమాటకు ఎదురు చెప్పలేదు.
తెల తెల వారు తూండగా నిద్రలేచి, నిర్మల మయిన మనస్సుతో నా పనులు నేనే చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాపదాని జనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని.
అంతేకాదు, మా రాజభవనంలో వేదవేత్తలూ, వారి శిష్యులూ ఉండేవారు. ఇందరి భోజనథాజనాలూ సరిగ్గా సాగుతున్నదీ లేనిదీ చూసే పని ఎప్పుడూ మరిచిపోలేదు. అందరూ సుఖంగా నిద్రించే వరకూ నేను పడక గదిలో కాలు పెట్టను.
మా కోశాగారంలో ఎంక ఉన్నదీ, అది ఎలా వ్యయమవుతున్నది. నాకు తెలుసు. ఆదాయం వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే.
పని పాటా లేకుండా ఎవరి యింటికీ వెళ్ళకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారినీ వీరినీ నిందించే వారిని దరిజేర నివ్వరాదు.
మరొక ముఖ్య విషయం –
కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండ కూడదు, భర్తతో తప్ప.
ఎప్పుడూ చిరునవ్వుతో, పూలు ముడిచిన జుట్టుతో, పరిశుభ్రమయిన వస్త్రాలు ధరించి, అలంకారాలతో, భర్తసేవకోసం ఎదురు చూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో, శత్రువు లెవరో, స్నేహితు లెవరో తెలుసుకొని వారి వారికి తగినట్టు నడుచుకోవాలి.
నిత్యం సంతోషంతో ఉండాలి. అసంతృప్తి అనేది కలలోకికూడా రాకూడదు.
ఈ సూత్రాలు ఆచరించిననాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణ సఖిగా చూపకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదినా!
ఇవన్నీ నీకు తెలుసు. కాని నేను ఎలా ఉంటున్నానో చెప్పా సంతే అంది ద్రౌపదీ దేవి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వీరబ్రహ్మష్టకముగురించి తెలుసుకుందాం…
శ్రీ వీరబ్రహ్మష్టకము
హైందవ మహమ్మదీయ సఖ్యముకొఱకు
సర్వ మానవ ధర్మంబు చాటి చెప్పి,
“ఆలకింపుఁ డమృతపుత్రు లంద”ఱనెడి
విశ్వధర్మ నిర్ణేత భావింతు నెపుడు.
ఎవని యానతి యవస మహీళు లేని
అలరు ఒత్తుగా శీర్షములందుఁ దాల్చి,
పాలన మొనర్తు ధార్మిక ప్రభుత నెఱపి
అట్టి గురునందు నాచిత్తమలరుఁగాళ.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్గురించి తెలుసుకుందాం…
Sri Venkateswara Mangalasasanam Lyrics In Telugu
శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఒర్థినామ్।
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్గురించి తెలుసుకుందాం…