Aranya Kanda Sarga 11 In Telugu – అరణ్యకాండ ఏకాదశః సర్గః

Aranya Kanda Sarga 11 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకాదశః సర్గలో, రాముడు సరస్సు దాటి వస్తాడు, దాని నుండి దివ్య సంగీతం వినిపిస్తుంది. సరస్సు యొక్క నీటి క్రింద నుండి సంగీత స్వరాలను చూసి ఆశ్చర్యపోయిన అతను అనుసరిస్తున్న ఋషిని విచారించాడు మరియు ఆ ఋషి ఋషి మందకర్ణి యొక్క ఘట్టాన్ని వివరిస్తాడు.

అగస్త్యాశ్రమః

అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా |
పృష్ఠతస్తు ధనుష్పాణిర్లక్ష్మణోఽనుజగామ హ ||

1

తౌ పశ్యమానౌ వివిధాన్ శైలప్రస్థాన్వనాని చ |
నదీశ్చ వివిధా రమ్యా జగ్మతుః సీతయా సహ ||

2

సారసాంశ్చక్రవాకాంశ్చ నదీపులినచారిణః |
సరాంసి చ సపద్మాని యుక్తాని జలజైః ఖగైః ||

3

యూథబద్ధాంశ్చ పృషతాన్మదోన్మత్తాన్విషాణినః |
మహిషాంశ్చ వరాహాంశ్చ నాగాంశ్చ ద్రుమవైరిణః ||

4

తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే |
దదృశుః సహితా రమ్యం తటాకం యోజనాయతమ్ ||

5

పద్మపుష్కరసంబాధం గజయూథైరలంకృతమ్ |
సారసైర్హంసకాదంబైః సంకులం జలచారిభిః ||

6

ప్రసన్నసలిలే రమ్యే తస్మిన్సరసి శుశ్రువే |
గీతవాదిత్రనిర్ఘోషో న తు కశ్చన దృశ్యతే ||

7

తతః కౌతూహలాద్రామో లక్ష్మణశ్చ మహాబలః |
మునిం ధర్మభృతం నామ ప్రష్టుం సముపచక్రమే ||

8

ఇదమత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే |
కౌతూహలం మహజ్జాతం కిమిదం సాధు కథ్యతామ్ ||

9

వక్తవ్యం యది చేద్విప్ర నాతిగుహ్యమపి ప్రభో |
తేనైవముక్తో ధర్మాత్మా రాఘవేణ మునిస్తదా ||

10

ప్రభావం సరసః కృత్స్నమాఖ్యాతుముపచక్రమే |
ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలికమ్ ||

11

నిర్మితం తపసా రామ మునినా మాండకర్ణినా |
స హి తేపే తపస్తీవ్రం మాండకర్ణిర్మహామునిః ||

12

దశ వర్షసహస్రాణి వాయుభక్షో జలాశ్రయః |
తతః ప్రవ్యథితాః సర్వే దేవాః సాగ్నిపురోగమాః ||

13

అబ్రువన్వచనం సర్వే పరస్పరసమాగతాః |
అస్మాకం కస్యచిత్స్థానమేష ప్రార్థయతే మునిః ||

14

ఇతి సంవిగ్నమనసః సర్వే తే త్రిదివౌకసః |
తత్ర కర్తుం తపోవిఘ్నం దేవైః సర్వైర్నియోజితాః ||

15

ప్రధానాప్సరసః పంచ విద్యుత్సదృశవర్చసః | [చ్చలిత]
అప్సరోభిస్తతస్తాభిర్మునిర్దృష్టపరావరః ||

16

నీతో మదనవశ్యత్వం సురాణాం కార్యసిద్ధయే |
తాశ్చైవాప్సరసః పంచ మునేః పత్నీత్వమాగతాః ||

17

తటాకే నిర్మితం తాసామస్మిన్నంతర్హితం గృహమ్ |
తథైవాప్సరసః పంచ నివసంత్యో యథాసుఖమ్ ||

18

రమయంతి తపోయోగాన్మునిం యౌవనమాస్థితమ్ |
తాసాం సంక్రీడమానానామేష వాదిత్రనిఃస్వనః ||

19

శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహరః |
ఆశ్చర్యమితి తస్యైతద్వవచనం భావితాత్మనః ||

20

రాఘవః ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశాః |
ఏవం కథయమానస్య దదర్శాశ్రమమండలమ్ ||

21

కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతమ్ |
ప్రవిశ్య సహ వైదేహ్యా లక్ష్మణేన చ రాఘవః ||

22

ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః |
తథా తస్మిన్స కాకుత్స్థః శ్రీమత్యాశ్రమమండలే ||

23

ఉషిత్వా తు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః |
జగామ చాశ్రమాంస్తేషాం పర్యాయేణ తపస్వినామ్ ||

24

యేషాముషితవాన్పూర్వం సకాశే స మహాస్త్రవిత్ |
క్వచిత్పరిదశాన్మాసానేకం సంవత్సరం క్వచిత్ ||

25

క్వచిచ్చ చతురో మాసాన్పంచషట్ చాపరాన్క్వచిత్ |
అపరత్రాధికం మాసాదప్యర్ధమధికం క్వచిత్ ||

26

త్రీన్ మాసానష్టమాసాంశ్చ రాఘవో న్యవసత్సుఖమ్ |
తథా సంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై ||

27

రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ |
పరివృత్య చ ధర్మజ్ఞో రాఘవః సహ సీతయా ||

28

సుతీక్ష్ణస్యాశ్రమం శ్రీమాన్పునరేవాజగామ హ |
స తమాశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః ||

29

తత్రాపి న్యవసద్రామః కించిత్కాలమరిందమః |
అథాశ్రమస్థో వినయాత్కదాచిత్తం మహామునిమ్ ||

30

ఉపాసీనః స కాకుత్స్థః సుతీక్ష్ణమిదమబ్రవీత్ |
అస్మిన్నరణ్యే భగవన్నగస్త్యో మునిసత్తమః ||

31

వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శ్రుతమ్ |
న తు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా ||

32

కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీమతః |
ప్రసాదాత్తత్రభవతః సానుజః సహ సీతయా ||

33

అగస్త్యమభిగచ్ఛేయమభివాదయితుం మునిమ్ |
మనోరథో మహానేష హృది మే పరివర్తతే ||

34

యదహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయమ్ |
ఇతి రామస్య స మునిః శ్రుత్వా ధర్మాత్మనో వచః ||

35

సుతీక్ష్ణః ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజమ్ |
అహమప్యేతదేవ త్వాం వక్తుకామః సలక్ష్మణమ్ ||

36

అగస్త్యమభిగచ్ఛేతి సీతయా సహ రాఘవ |
దిష్ట్యా త్విదానీమర్థేఽస్మిన్స్వయమేవ బ్రవీషి మామ్ ||

37

అహమాఖ్యామి తే వత్స యత్రాగస్త్యో మహామునిః |
యోజనాన్యాశ్రమాదస్మాత్తథా చత్వారి వై తతః ||

38

దక్షిణేన మహాంఛ్రీమానగస్త్యభ్రాతురాశ్రమః |
స్థలీప్రాయే వనోద్దేశే పిప్పలీవనశోభితే ||

39

బహుపుష్పఫలే రమ్యే నానాశకునినాదితే |
పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్నసలిలాః శివాః ||

40

హంసకారండవాకీర్ణాశ్చక్రవాకోపశోభితాః |
తత్రైకాం రజనీం వ్యుష్య ప్రభాతే రామ గమ్యతామ్ ||

41

దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః |
తత్రాగస్త్యాశ్రమపదం గత్వా యోజనమంతరమ్ ||

42

రమణీయే వనోద్దేశే బహుపాదపసంవృతే |
రంస్యతే తత్ర వైదేహీ లక్ష్మణశ్చ సహ త్వయా ||

43

స హి రమ్యో వనోద్దేశో బహుపాదపసంకులః |
యది బుద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిమ్ ||

44

అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః |
ఇతి రామో మునేః శ్రుత్వా సహ భ్రాత్రాఽభివాద్య చ ||

45

ప్రతస్థేఽగస్త్యముద్దిశ్య సానుజః సీతయా సహ |
పశ్యన్వనాని రమ్యాణి పర్వతాంశ్చాభ్రసన్నిభాన్ ||

46

సరాంసి సరితశ్చైవ పథి మార్గవశానుగాః |
సుతీక్ష్ణేనోపదిష్టేన గత్వా తేన పథా సుఖమ్ ||

47

ఇదం పరమసంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్ |
ఏతదేవాశ్రమపదం నూనం తస్య మహాత్మనః ||

48

అగస్త్యస్య మునేర్భ్రాతుర్దృశ్యతే పుణ్యకర్మణః |
యథా హి మే వనస్యాస్య జ్ఞాతాః పథి సహస్రశః ||

49

సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః |
పిప్పలీనాం చ పక్వానాం వనాదస్మాదుపాగతః ||

50

గంధోఽయం పవనోత్క్షిప్తః సహసా కటుకోదయః |
తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్ఠసంచయాః ||

51

లూనాశ్చ పథి దృశ్యంతే దర్భా వైడూర్యవర్చసః |
ఏతచ్చ వనమధ్యస్థం కృష్ణాభ్రశిఖరోపమమ్ ||

52

పావకస్యాశ్రమస్థస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే |
వివిక్తేషు చ తీర్థేషు కృతస్నాతా ద్విజాతయః ||

53

పుష్పోపహారం కుర్వంతి కుసుమైః స్వయమార్జితైః |
తత్సుతీక్ష్ణస్య వచనం యథా సౌమ్య మయా శ్రుతమ్ ||

54

అగస్త్యస్యాశ్రమో భ్రాతుర్నూనమేష భవిష్యతి |
నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా ||

55

యస్య భ్రాత్రా కృతేయం దిక్ఛరణ్యా పుణ్యకర్మణా |
ఇహైకదా కిల క్రూరో వాతాపిరపి చేల్వలః ||

56

భ్రాతరౌ సహితావాస్తాం బ్రాహ్మణఘ్నౌ మహాసురౌ |
ధారయన్బ్రాహ్మణం రూపమిల్వలః సంస్కృతం వదన్ ||

57

ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణః |
భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్తం మేషరూపిణమ్ ||

58

తాన్ద్విజాన్భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణా |
తతో భుక్తవతాం తేషాం విప్రాణామిల్వలోఽబ్రవీత్ ||

59

వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతా వదన్ |
తతో భ్రాతుర్వచః శ్రుత్వా వాతాపిర్మేషవన్నదన్ ||

60

భిత్త్వా భిత్త్వా శరీరాణి బ్రాహ్మణానాం వినిష్పతత్ |
బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభిః ||

61

వినాశితాని సంహత్య నిత్యశః పిశితాశనైః |
అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా ||

62

అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః |
తతః సంపన్నమిత్యుక్త్వా దత్త్వా హస్తోదకం తతః ||

63

భ్రాతరం నిష్క్రమస్వేతి చేల్వలః సోఽభ్యభాషత |
స తం తథా భాషమాణం భ్రాతరం విప్రఘాతినమ్ ||

64

అబ్రవీత్ప్రహసన్ధీమానగస్త్యో మునిసత్తమః |
కుతో నిష్క్రమితుం శక్తిర్మయా జీర్ణస్య రక్షసః ||

65

భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాదనమ్ |
అథ తస్య వచః శ్రుత్వా భ్రాతుర్నిధనసంశ్రయమ్ ||

66

ప్రధర్షయితుమారేభే మునిం క్రోధాన్నిశాచరః |
సోఽభిద్రవన్మునిశ్రేష్ఠం మునినా దీప్తతేజసా ||

67

చక్షుషాఽనలకల్పేన నిర్దగ్ధో నిధనం గతః |
తస్యాయమాశ్రమో భ్రాతుస్తటాకవనశోభితః ||

68

విప్రానుకంపయా యేన కర్మేదం దుష్కరం కృతమ్ |
ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ ||

69

రామస్యాస్తం గతః సూర్యః సంధ్యాకాలోఽభ్యవర్తత |
ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథావిధి ||

70

ప్రవివేశాశ్రమపదం తమృషిం సోఽభ్యవాదయత్ |
సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః ||

71

న్యవసత్తాం నిశామేకాం ప్రాశ్య మూలఫలాని చ |
తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే ||

72

భ్రాతరం తమగస్త్యస్య హ్యామంత్రయత రాఘవః |
అభివాదయే త్వాం భగవన్సుఖమధ్యుషితో నిశామ్ ||

73

ఆమంత్రయే త్వాం గచ్ఛామి గురుం తే ద్రష్టుమగ్రజమ్ |
గమ్యతామితి తేనోక్తో జగామ రఘునందనః ||

74

యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చావలోకయన్ |
నీవారాన్పనసాంస్తాలాంస్తిమిశాన్వంజులాన్ధవాన్ ||

75

చిరిబిల్వాన్మధూకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్ |
పుష్పితాన్పుష్పితాగ్రాభిర్లతాభిరనువేష్టితాన్ ||

76

దదర్శ రామః శతశస్తత్ర కాంతారపాదపాన్ |
హస్తిహస్తైర్విమృదితాన్వానరైరుపశోభితాన్ ||

77

మత్తైః శకునిసంఘైశ్చ శతశశ్చ ప్రణాదితాన్ |
తతోఽబ్రవీత్సమీపస్థం రామో రాజీవలోచనః ||

78

పృష్ఠతోఽనుగతం వీరం లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ |
స్నిగ్ధపత్రా యథా వృక్షా యథా శాంతమృగద్విజాః ||

79 [క్షాంతా]

ఆశ్రమో నాతిదూరస్థో మహర్షేర్భావితాత్మనః |
అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా ||

80

ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపహః |
ప్రాజ్యధూమాకులవనశ్చీరమాలాపరిష్కృతః ||

81

ప్రశాంతమృగయూథశ్చ నానాశకునినాదితః |
నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా ||

82

దక్షిణా దిక్కృతా యేన శరణ్యా పుణ్యకర్మణా |
తస్యేదమాశ్రమపదం ప్రభావాద్యస్య రాక్షసైః ||

83

దిగియం దక్షిణా త్రాసాద్దృశ్యతే నోపభుజ్యతే |
యదాప్రభృతి చాక్రాంతా దిగియం పుణ్యకర్మణా ||

84

తదాప్రభృతినిర్వైరాః ప్రశాంతా రజనీచరాః |
నామ్నా చేయం భగవతో దక్షిణా దిక్ప్రదక్షిణా ||

85

ప్రథితా త్రిషు లోకేషు దుర్ధర్షా క్రూరకర్మభిః |
మార్గం నిరోద్ధుం నిరతో భాస్కరస్యాచలోత్తమః ||

86

నిదేశం పాలయన్యస్య వింధ్యః శైలో న వర్ధతే |
అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుతకర్మణః ||

87

అగస్త్యస్యాశ్రమః శ్రీమాన్వినీతజనసేవితః |
ఏష లోకార్చితః సాధుర్హితే నిత్యరతః సతామ్ ||

88

అస్మానభిగతానేష శ్రేయసా యోజయిష్యతి |
ఆరాధయిష్యామ్యత్రాహమగస్త్యం తం మహామునిమ్ ||

89

శేషం చ వనవాసస్య సౌమ్య వత్స్యామ్యహం ప్రభో |
అత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ||

90

అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే |
నాత్ర జీవేన్మృషావాదీ క్రూరో వా యది వా శఠః ||

91

నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః |
అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగైః సహ ||

92

వసంతి నియతాహారా ధర్మమారాధయిష్ణవః |
అత్ర సిద్ధా మహాత్మానో విమానైః సూర్యసన్నిభైః ||

93

త్యక్తదేహా నవైర్దేహైః స్వర్యాతాః పరమర్షయః |
యక్షత్వమమరత్వం చ రాజ్యాని వివిధాని చ ||

94

అత్ర దేవాః ప్రయచ్ఛంతి భూతైరారాధితాః శుభైః |
ఆగతాః స్మాశ్రమపదం సౌమిత్రే ప్రవిశాగ్రతః |
నివేదయేహ మాం ప్రాప్తమృషయే సీతయా సహ ||

95

Aranya Kanda Sarga 11 Meaning In Telugu PDF

ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు.

ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు.

“రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు.

ఆ అప్సరసలు మాణ్ణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ ఐదుగురు
అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ ఐదుగురు అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్య ధ్వనులే మీరు వింటున్నారు.” అని అన్నాడు.

ఆ మాటలు విన్న రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశమములలో కొంత కాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు.

ఒక ఆశ్రమములో పది మాసములు, మరొక ఆశ్రమములో ఒక సంవత్సరము, మరొక ఆశ్రమములో నాలుగు మాసములు, ఐదు మాసములు, ఆరు మాసములు, ఒక మాసము, ఒకటిన్నర మాసము, మూడు మాసములు, ఎనిమిది మాసములు ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసిం చారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, అక్ష్మణుడు తమ వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగాగడిపారు.

(దీనికి సంబంధించిన శ్లోకము ఇక్కడ ఉదహరిస్తాను. చదవండి.)
తదాసంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై,
రమతశ్చానుకూల్యేన యయు: సంవత్సరా దశ.

ఆ విధంగారాముడు ఆశ్రమములలో నివసిస్తూ ఉండగా పది సంవత్సరములు అనుకూలంగా గడిచిపోయాయి. అంటే ఈ పదిసంవత్సరములు రాముడు ఒక్క రాక్షసుని కూడా చంపలేదు. మరి రాముడు మునులను రక్షిస్తాను అని వారికి ఇచ్చిన మాట ఏమైనట్టు. వారు రాక్షసుల చేతిలో అనుదినమూ బాధలు పడుతున్నారా! చస్తున్నారా! సీతను, లక్ష్మణుని అయినా వదులుకుంటాను కానీ నేను మునులకు ఇచ్చిన మాట తప్పను. అందుకే ధనుర్బాణాలు ధరించాను అన్న రాముడు వారి ఊసెత్తకుండా పది సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. కానీ వారి కష్టాలు బాధలు తీర్చలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?దీని అర్థం ఏమయి ఉంటుంది.

దీనికి సమాధానం మనకు ముప్పదవ సర్గలో కనిపిస్తుంది. రాముడు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఇష్టపడలేదు. ఒకేసారి రాక్షసులనందరినీ మట్టు పెట్టాలని అనుకున్నాడు. అదును కోసం వేచి ఉన్నాడు. శూర్పణఖ వల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం 14,000+5,000 సైనికులను ఖరుని, దూషణుని, త్రిశిరుని ఒకేసారి సంహరించి దండకారణ్యములో రాక్షస బాధను శాశ్వతంగా నివారించాడు. రాముడు తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసరం వేచిఉన్నాడు. ఇలా అర్థం చేసుకుంటే రాముని ఆంతర్యం మనకు అర్థం అవుతుంది.)

తరువాత ధర్మజ్ఞుడైన రాముడు, సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ, తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు.

ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. “మహాత్మా! అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కధలు గా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి.” అని ప్రార్థించాడు.

“రామా! మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు (అగస్త్యభ్రాత) ఆశ్రమము కలదు.

(ఈ అగస్త్య భ్రాత గురించి మన ఇంట్లో పెద్ద వాళ్లకు తెలుసు. అగస్త్యుని సోదరునికి పేరు లేదు. అంతా అగస్త్య భ్రాత అంటారు. “వీడెవడో అగస్త్య భ్రాతలా ఉన్నాడే!” అని అనడం మనం వింటూ ఉంటాము. అగస్త్యభ్రాత అనేది ఒక నానుడి.)

రామా! నీవు అగస్త్య భ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లు. అగస్త్య భ్రాత ఆశ్రమము నకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది.” అని అన్నాడు.

తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలు దేరాడు. దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును చేరుకున్నారు.

ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నార చీరలు, చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్ని హోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో! సందేహము లేదు. ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము.

లక్ష్మణా! నీకు తెలుసా! అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు వారికి ఎంతో ఉపకారము చేసాడు. ఎలాగంటే…..

ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొనేవాడు. “ ఈ రోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి” అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారి పోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు.

బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత “వాతాపీ! బయటకు రా!” అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి, ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరేఅన్నాడు.

ఒక రోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేసాడు. “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ బ్రేవ్మంటూ త్రేన్చాడు. అంతే. అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు “వాతాపీ! బయటకు రా!’ అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు.

అగస్త్యుడు నవ్వాడు. “ఇంకెక్కడి వాతాపి. వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు.” అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేసాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత” అని వివరించాడు రాముడు.

(ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గు, పాలు పట్టిన తరువాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మా అబ్బాయి తాగిన పాలుజీర్ణం” అని పొట్ట మీద నిమురడం మనం చూస్తూ ఉంటాము.)

అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయంసంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేసారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు.

మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని అగస్త్యభ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్య భ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు.

ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హెూమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకొన్నాడు. అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మృగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి.

“ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహా ముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు.

ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, ఈ క్రూరులకు, వంచకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇదీ ఆ ఆశ్రమ మహాత్మ్యం.

లక్ష్మణా! ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను, సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత ఓం తత్సత్.

అరణ్యకాండ ద్వాదశః సర్గః (12) >>

Balakanda Sarga 77 In Telugu – బాలకాండ సప్తసప్తతితమః సర్గః

BalaKanda Sarga 77 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, పరశు రాముడు నిష్క్రమణ సమయంలో వివాహ బృందం అయోధ్యకు చేరుకుంటుంది. వివాహానికి ముందు వచ్చిన భరతుని మామ అయిన యుధాజిత్ ఇప్పుడు భరతుడు మరియు శత్రుఘ్నులను తన రాజ్యానికి తీసుకువెళతాడు. అప్పటి నుండి రామ, లక్ష్మణులు తమ తండ్రి కోరిక మేరకు వారి వారి సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. రాముడు మరియు సీత వారి ఆనందకరమైన వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు.

అయోధ్యాప్రవేశః

గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః |
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకమ్ ||

1

అభివాద్య తతో రామో వసిష్ఠప్రముఖానృషీన్ |
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందనః ||

2

జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ |
అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాథేన పాలితా ||

3

రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథః సుతమ్ |
బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవమ్ ||

4

గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః |
పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవ చ ||

5

చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీమ్ |
పతాకాధ్వజినీం రమ్యాం జయోద్ఘుష్టనినాదితామ్ ||

6 [తూర్య]

సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
రాజప్రవేశసుముఖైః పౌరైర్మంగళవాదిభిః ||

7

సంపూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైః సమలంకృతామ్ |
పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః ||

8

పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః |
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం ప్రియమ్ ||

9

ననంద సజనో రాజా గృహే కామైః సుపూజితః |
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా ||

10

వధూప్రతిగ్రహే యుక్తా యాశ్చాన్యా రాజయోషితః |
తతః సీతాం మహాభాగామూర్మిలాం చ యశస్వినీమ్ ||

11

కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః |
మంగలాలేపనైశ్చైవ శోభితాః క్షౌమవాససః ||

12

దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్ |
అభివాద్యాభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా ||

13

రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః |
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః ||

14

శుశ్రూషమాణాః పితరం వర్తయంతి నరర్షభాః |
కస్యచిత్త్వథ కాలస్య రాజా దశరథః సుతమ్ ||

15

భరతం కేకయీపుత్రమబ్రవీద్రఘునందనః |
అయం కేకయరాజస్య పుత్రో వసతి పుత్రక ||

16

త్వాం నేతుమాగతో వీర యుధాజిన్మాతులస్తవ |
శ్రుత్వా దశరథస్యైతద్భరతః కైకయీసుతః ||

17

గమనాయాభిచక్రామ శత్రుఘ్నసహితస్తదా |
ఆపృచ్ఛ్య పితరం శూరో రామం చాక్లిష్టకారిణమ్ ||

18

మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శత్రుఘ్నసహితో యయౌ |
గతే చ భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః ||

19

పితరం దేవసంకాశం పూజయామాసతుస్తదా |
పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః ||

20

చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ |
మాతృభ్యో మాతృకార్యాణి రామః పరమయంత్రితః ||

21 [కృత్వా]

గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత | [చకార హ]
ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తదా ||

22

రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః |
తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః ||

23

స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః |
రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్ ||

24

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి |
మనస్వీ తద్గతమనా నిత్యం హృది సమర్పితః ||

25

గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత |
తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే ||

26

అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా |
తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా |
దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ ||

27

తయా స రాజర్షిసుతోఽభిరామయా
సమేయివానుత్తమరాజకన్యయా |
అతీవ రామః శుశుభేఽతికామయా
విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః ||

28

Balakanda Sarga 77 In Telugu Pdf With Meaning

పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వసిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలాఅన్నాడు.

“తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి.” అని అన్నాడు.

అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్లి పోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుట పడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు.

వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు.

కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు,మాండవికి, శ్రుతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేసారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవచేసు కుంటూ ఉన్నారు.

కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు.

“నాయనా భరతా! నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకొని వెళ్లుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగు చుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాత గారింటికి వెళ్లి ఆయనను సంతోష పెట్టు.” అని అన్నాడు.

భరతుడు తండ్రి మాట ప్రకారము చేసాడు. తండ్రికి తల్లులకు, పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.

భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవజేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.

రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరు కున్నారు.

రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనే వాడు.

సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసి పోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము.
బాలకాండము సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

వాల్మీకి రామాయణే అయోధ్యకాండ >>

Ayodhya Kanda Sarga 76 In Telugu – అయోధ్యాకాండ షట్సప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 76

అయోధ్యాకాండం యొక్క షట్సప్తతితమః సర్గంలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్రంగా దుఃఖిస్తూ తన గత పాపాలను తలుచుకుంటాడు. ఆయన కైకేయితో చేసిన వాగ్దానం ఫలితంగా రాముడు అడవికి వెళ్లిపోయినందుకు పశ్చాత్తాపంతో బాధపడతాడు. రాత్రిలో దశరథుడు కౌసల్య, సుమిత్రలతో తన బాధను పంచుకుంటాడు. దశరథుడు రాముని విడిచి ఉండలేక, ఆ వేదనతో అణచిపడి, తన ప్రాణాలను విడుస్తాడు. ఆయన చివరి క్షణాలలో రాముని మరియాదలను, అతని కరుణామయ స్వభావాన్ని తలుచుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు దశరథుని మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోతారు, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది.

దశరథౌర్ధ్వదైహికమ్

తమేవం శోకసంతప్తం భరతం కేకయీ సుతమ్ |
ఉవాచ వదతాం శ్రేష్ఠో వసిష్ఠః శ్రేష్ఠ వాగృషిః || ౧ ||

అలం శోకేన భద్రం తే రాజపుత్ర మహాయశః |
ప్రాప్తకాలం నరపతేః కురు సంయానముత్తమమ్ || ౨ ||

వసిష్ఠస్య వచః శృత్వా భరతర్ధారణాం గతః |
ప్రేతకార్యాణి సర్వాణి కారయామాస ధర్మవిత్ || ౩ ||

ఉద్ధృతం తైలసంరోదాత్ స తు భూమౌ నివేశితమ్ |
ఆపీతవర్ణవదనం ప్రసుప్తమివ భూపతిమ్ || ౪ ||

సంవేశ్య శయనే చాగ్ర్యే నానారత్నపరిష్కృతే |
తతర్దశరథం పుత్రః విలలాప సుదుఃఖితః || ౫ ||

కిం తే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యనాగతే |
వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలమ్ || ౬ ||

క్వ యాస్యసి మహారాజ హిత్వేమం దుఃఖితం జనమ్ |
హీనం పురుషసింహేన రామేణాక్లిష్ట కర్మణా || ౭ ||

యోగక్షేమం తు తే రాజన్ కోఽస్మిన్ కల్పయితా పురే |
త్వయి ప్రయాతే స్వస్తాత రామే చ వనమాశ్రితే || ౮ ||

విధవా పృథివీ రాజన్ త్వయా హీనా న రాజతే |
హీనచంద్రేవ రజనీ నగరీ ప్రతిభాతి మామ్ || ౯ ||

ఏవం విలపమానం తం భరతం దీనమానసమ్ |
అబ్రవీద్వచనం భూయో వసిష్ఠస్తు మహామునిః || ౧౦ ||

ప్రేత కార్యాణి యాన్యస్య కర్తవ్యాని విశాంపతేః |
తాన్యవ్యగ్రం మహాబాహో క్రియంతామవిచారితమ్ || ౧౧ ||

తథేతి భరతః వాక్యం వసిష్ఠస్యాభిపూజ్య తత్ |
ఋత్విక్ పురోహితాచార్యాన్ త్వరయామాస సర్వశః || ౧౨ ||

యే త్వగ్నయో నరేంద్రస్య చాగ్న్యగారాద్బహిష్కృతాః |
ఋత్విగ్భిర్యాజకైశ్చైవ తే హ్రియంతే యథావిధి || ౧౩ || [ఆహ్రియంత]

శిబికాయామథారోప్య రాజానం గతచేతనమ్ |
బాష్పకంఠా విమనసః తమూహుః పరిచారకాః || ౧౪ ||

హిరణ్యం చ సువర్ణం చ వాసాంసి వివిధాని చ |
ప్రకిరంతః జనా మార్గం నృపతేరగ్రతః యయుః || ౧౫ ||

చందనాగురునిర్యాసాన్ సరలం పద్మకం తథా |
దేవదారూణి చాహృత్య క్షేపయంతి తథాపరే || ౧౬ ||

గంధానుచ్చావచాంశ్చాన్యాన్ తత్ర గత్త్వాఽథ భూమిపమ్ |
తతః సంవేశయామాసుశ్చితా మధ్యే తమృత్విజః || ౧౭ ||

తథా హుతాశనం దత్వా జేపుస్తస్య తదృత్విజః |
జగుశ్చ తే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః || ౧౮ ||

శిబికాభిశ్చ యానైశ్చ యథాఽర్హం తస్య యోషితః |
నగరాన్నిర్యయుస్తత్ర వృద్ధైః పరివృతాస్తదా || ౧౯ ||

ప్రసవ్యం చాపి తం చక్రురృత్విజోఽగ్నిచితం నృపమ్ |
స్త్రియశ్చ శోకసంతప్తాః కౌసల్యా ప్రముఖాస్తదా || ౨౦ ||

క్రౌంచీనామివ నారీణాం నినాదస్తత్ర శుశ్రువే |
ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశః || ౨౧ ||

తతః రుదంత్యో వివశాః విలప్య చ పునః పునః |
యానేభ్యః సరయూతీరమ్ అవతేరుర్వరాంగనాః || ౨౨ ||

కృతోదకం తే భరతేన సార్ధమ్
నృపాంగనా మంత్రిపురోహితాశ్చ |
పురం ప్రవిశ్యాశ్రుపరీతనేత్రాః
భూమౌ దశాహం వ్యనయంత దుఃఖమ్ || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తతితమః సర్గః || ౭౬ ||

Ayodhya Kanda Sarga 76 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. “నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దుఃఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు.” అని పలికాడు. కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దు:ఖించాడు.

“మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది.” అని విలపిస్తున్నాడు భరతుడు. ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వసిష్ఠుడు ఇలా అన్నాడు.

“భరతా! పోయినవారి గురించి చింతించి ప్రయోజనములేదు. జరుగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు.” అని అన్నాడు. అగ్ని గృహమునుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకొని వచ్చారు. దశరథుని పార్థివశరీరమును బయటకుతీసుకొని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకొని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేసారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు. ఋత్విక్కులు హెమం చేసారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు.

ఋత్విక్కులు, దశరథుని భార్యలు దశరథుని చితికి అప్రదక్షిణంగా తిరిగారు. అంత:పుర స్త్రీలందరూ రోదిస్తున్నారు. భరతుడు దశరథుని చితికి నిప్పంటించాడు. భరతుడు, మహారాజు భార్యలు, అందరూ దశరథునికి జలతర్షణములు విడిచారు. పదిదినములు గడిచిపోయినవి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గః (77) >>

Ayodhya Kanda Sarga 75 In Telugu – అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 75

అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గంలో, సుమంత్రుడు రాముడు, సీత, లక్ష్మణులను గంగానది వద్ద వదిలి కుశలముగా తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు. సుమంత్రుడు వధూతి దశరథుని వద్దకు వెళ్ళి రాముని అరణ్యవాసం గురించి వివరించాడును. దశరథుడు రాముని వేదనతో బాధపడి, వేదనతో వ్యాకులుడైనాడు. రాముడు లేని జీవితాన్ని తట్టుకోలేక, రాముడి తలపులో ఉంటూ కన్నీళ్ళతో వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదు, రాముని స్వరాన్ని మళ్లీ వినాలని తహతహలాడతాడు. దశరథుడు చివరికి తాపత్రయంతో రాముడి తలపులో తన ప్రాణాలు విడుస్తాడు.

భరతశపథః

దీర్ఘకాలాత్సముత్థాయ సంజ్ఞాం లబ్ధ్వా చ వీర్యవాన్ |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం దీనాముద్వీక్ష్య మాతరమ్ || ౧ ||

సోఽమాత్యమధ్యేభరతో జననీమభ్యకుత్సయత్ |
రాజ్యం న కామయే జాతు మంత్రయే నాపి మాతరమ్ || ౨ ||

అభిషేకం న జానామి యోఽభూద్రాజ్ఞా సమీక్షితః |
విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్నసహితోఽవసమ్ || ౩ ||

వనవాసం న జానామి రామస్యాహం మహాత్మనః |
వివాసనం వా సౌమిత్రేః సీతాయాశ్చ యథాఽభవత్ || ౪ ||

తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః |
కౌసల్యా శబ్దమాజ్ఞాయ సుమిత్రామిదమబ్రవీత్ || ౫ ||

ఆగతః క్రూర కార్యాయాః కైకేయ్యా భరతః సుతః |
తమహం ద్రష్టుమిచ్ఛామి భరతం దీర్ఘదర్శినమ్ || ౬ ||

ఏవముక్త్వా సుమిత్రాం సా వివర్ణా మలినా కృశా |
ప్రతస్థే భరతః యత్ర వేపమానా విచేతనా || ౭ ||

స తు రామానుజశ్చాపి శత్రుఘ్న సహితస్తదా |
ప్రతస్థే భరతః యత్ర కౌసల్యాయా నివేశనమ్ || ౮ ||

తతః శత్రుఘ్నభరతౌ కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ |
పర్యష్వజేతాం దుఃఖార్తాం పతితాం నష్ట చేతనామ్ || ౯ ||

రుదంతౌ రుదతీం దుఃఖాత్సమేత్యార్యాం మనస్వినీమ్ |
భరతం ప్రత్యువాచేదం కౌసల్యా భృశ దుఃఖితా || ౧౦ ||

ఇదం తే రాజ్య కామస్య రాజ్యం ప్రాప్తమకంటకమ్ |
సంప్రాప్తం బత కైకేయ్యా శీఘ్రం క్రూరేణ కర్మణా || ౧౧ ||

ప్రస్థాప్య చీరవసనం పుత్రం మే వనవాసినమ్ |
కైకేయీ కం గుణం తత్ర పశ్యతి క్రూరదర్శినీ || ౧౨ ||

క్షిప్రం మామపి కైకేయీ ప్రస్థాపయితుమర్హతి |
హిరణ్యనాభో యత్రాస్తే సుతః మే సుమహా యశాః || ౧౩ ||

అథవా స్వయమేవాహం సుమిత్రానుచరా సుఖమ్ |
అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవః || ౧౪ ||

కామం వా స్వయమేవాద్య తత్ర మాం నేతుమర్హసి |
యత్రాసౌ పురుషవ్యాఘ్రః పుత్రో మే తప్యతే తపః || ౧౫ ||

ఇదం హి తవ విస్తీర్ణం ధనధాన్యసమాచితమ్ |
హస్త్వశ్వరథసంపూర్ణం రాజ్యం నిర్యాతితం తయా || ౧౬ ||

ఇత్యాదిబహుభిర్వాక్యైః క్రూరైః సంభర్త్సితోఽనఘః |
వివ్యథే భరతస్తీవ్రం వ్రణే తుద్యేవ సూచినా || ౧౭ ||

పపాత చరణౌ తస్యాస్తదా సంభ్రాంతచేతనః |
విలప్య బహుధాఽసంజ్ఞో లబ్దసంజ్ఞస్తతః స్థితః || ౧౮ ||

ఏవం విలపమానాం తాం భరతః ప్రాంజలిస్తదా |
కౌసల్యాం ప్రత్యువాచేదం శోకైః బహుభిరావృతామ్ || ౧౯ ||

ఆర్యే కస్మాదజానంతం గర్హసే మామకిల్భిషమ్ |
విపులాం చ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే || ౨౦ ||

కృతా శాస్త్రానుగా బుద్ధిర్మాభూత్తస్య కదాచన |
సత్యసంధః సతాం శ్రేష్ఠో యస్యార్యోఽనుమతే గతః || ౨౧ ||

ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యం చ ప్రతి మేహతు |
హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోఽనుమతే గతః || ౨౨ ||

కారయిత్వా మహత్కర్మ భర్తా భృత్యమనర్థకమ్ |
అధర్మః యోఽస్య సోఽస్యాస్తు యస్యార్యోఽనుమతే గతః || ౨౩ ||

పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ |
తతస్తం ద్రుహ్యతాం పాపం యస్యార్యోఽనుమతే గతః || ౨౪ ||

బలిషడ్భాగముద్ధృత్య నృపస్యారక్షతః ప్రజాః |
అధర్మః యోఽస్య సోఽస్యాస్తు యస్యార్యోఽనుమతే గతః || ౨౫ ||

సంశ్రుత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణామ్ |
తాం విప్రలపతాం పాపం యస్యార్యోఽనుమతే గతః || ౨౬ ||

హస్త్యశ్వరథసంబాధే యుద్ధే శస్త్రసమాకులే |
మా స్మ కార్షీత్సతాం ధర్మం యస్యార్యోఽనుమతే గతః || ౨౭ ||

ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా |
స నాశయతు దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౨౮ ||

మా చ తం వ్యూఢబాహ్వంసం చంద్రార్కసమతేజనమ్ |
ద్రాక్షీద్రాజ్యస్థమాసీనం యస్యార్యోఽనుమతే గతః || ౨౯ ||

పాయసం కృసరం చాగం వృథా సోఽశ్నాతు నిర్ఘృణః |
గురూంశ్చాప్యవజానాతు యస్యార్యోఽనుమతే గతః || ౩౦ ||

గాశ్చ స్పృశతు పాదేన గురూన్ పరివదేత్స్వయమ్ |
మిత్రే ద్రుహ్యేత సోఽత్యంతం యస్యార్యోఽనుమతే గతః || ౩౧ ||

విశ్వాసాత్కథితం కించిత్పరివాదం మిథః క్వచిత్ |
వివృణోతు స దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౩౨ ||

అకర్తా హ్యకృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః |
లోకే భవతు విద్వేష్యో యస్యార్యోఽనుమతే గతః || ౩౩ ||

పుత్రైర్దారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారితః |
సైకో మృష్టమశ్నాతు యస్యార్యోఽనుమతే గతః || ౩౪ ||

అప్రాప్య సదృశాన్ దారాననపత్యః ప్రమీయతామ్ |
అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్యార్యోఽనుమతే గతః || ౩౫ ||

మాత్మనః సంతతిం ద్రాక్షీత్స్వేషు దారేషు దుఃఖితః |
ఆయుః సమగ్రమప్రాప్య యస్యార్యోఽనుమతే గతః || ౩౬ ||

రాజ స్త్రీబాలవృద్ధానాం వధే యత్పాపముచ్యతే |
భృత్యత్యాగే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతామ్ || ౩౭ ||

లాక్షయా మధుమాంసేన లోహేన చ విషేణ చ |
సదైవ బిభృయాద్భృత్యాన్ యస్యార్యోఽనుమతే గతః || ౩౮ ||

సంగ్రామే సముపోఢే స్మ శత్రుపక్షభయంకరే |
పలాయామానో వధ్యేత యస్యార్యోఽనుమతే గతః || ౩౯ ||

కపాలపాణిః పృథివీమటతాం చీరసంవృతః |
భిక్షమాణో యథోన్మత్తో యస్యార్యోఽనుమతే గతః || ౪౦ ||

మద్యే ప్రసక్తో భవతు స్త్రీష్వక్షేషు చ నిత్యశః |
కామక్రోధాభిభూతస్తు యస్యార్యోఽనుమతే గతః || ౪౧ ||

మా స్మ ధర్మే మనో భూయాదధర్మం సునిషేవతామ్ |
అపాత్రవర్షీ భవతు యస్యార్యోఽనుమతే గతః || ౪౨ ||

సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్రశః |
దస్యుభిర్విప్రలుప్యంతాం యశ్యార్యోఽనుమతే గతః || ౪౩ ||

ఉభే సంధ్యే శయానస్య యత్పాపం పరికల్ప్యతే |
తచ్చ పాపం భవేత్తస్య యస్యార్యోఽనుమతే గతః || ౪౪ ||

యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే |
మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతామ్ || ౪౫ ||

దేవతానాం పితౄణాం చ మాతాపిత్రోస్తథైవ చ |
మా స్మ కార్షీత్ స శుశ్రూషాం యస్యార్యోఽనుమతే గతః || ౪౬ ||

సతాం లోకాత్సతాం కీర్త్యాః సంజ్జుష్టాత్ కర్మణస్తథా |
భ్రశ్యతు క్షిప్రమద్యైవ యస్యార్యోఽనుమతే గతః || ౪౭ ||

అపాస్య మాతృశుశ్రూషామనర్థే సోఽవతిష్ఠతామ్ |
దీర్ఘబాహుర్మహావక్షాః యస్యార్యోఽసుమతే గతః || ౪౮ ||

బహుపుత్రో దరిద్రశ్చ జ్వరరోగసమన్వితః |
స భూయాత్సతతక్లేశీ యస్యార్యోఽనుమతే గతః || ౪౯ ||

ఆశామాశం సమానానాం దీనానామూర్ధ్వచక్షుషామ్ |
ఆర్థినాం వితథాం కుర్యాద్యస్యార్యోఽనుమతే గతః || ౫౦ ||

మాయయా రమతాం నిత్యం పరుషః పిశునోఽశుచిః |
రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౫౧ ||

ఋతుస్నాతాం సతీం భార్యామృతుకాలానురోధినీమ్ |
అతివర్తేత దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౫౨ ||

ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ని షేవతామ్ |
త్యక్తధర్మరతిర్మూఢో యస్యార్యోఽనుమతే గతః || ౫౩ ||

విప్రలుప్తప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ |
తదేవ ప్రతిపద్యేత యస్యార్యోఽనుమతే గతః || ౫౪ ||

పానీయదూషకే పాపం తథైవ విషదాయకే |
యత్తదేకః స లభతాం యస్యార్యోఽనుమతే గతః || ౫౫ ||

బ్రాహ్మణాయోద్యతాం పూజాం విహంతు కలుషేంద్రియః |
బాలవత్సాం చ గాం దోగ్దుః యస్యర్యోఽనుమతే గతః || ౫౬ ||

తృష్ణార్తం సతి పానీయే విప్రలంభేన యోజయేత్ |
లభేత తస్య యత్పాపం యస్యార్యోఽనుమతే గతః || ౫౭ ||

భక్త్యా వివదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతః |
తస్య పాపేన యుజ్యేత యస్యార్యోఽనుమతే గతః || ౫౮ ||

విహీనాం పతి పుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మజః |
ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తో నిపపాత హ || ౫౯ ||

తథా తు శపథైః కష్టైః శపమానమచేతనమ్ |
భరతం శోక సంతప్తం కౌసల్యా వాక్యమబ్రవీత్ || ౬౦ ||

మమ దుఃఖమిదం పుత్ర భూయః సముపజాయతే |
శపథైః శపమానో హి ప్రాణానుపరుణత్సి మే || ౬౧ ||

దిష్ట్యా న చలితో ధర్మాత్ ఆత్మా తే సహలక్ష్మణః |
వత్స సత్య ప్రతిజ్ఞో మే సతాం లోకమవాప్స్యసి || ౬౨ ||

ఇత్యుక్త్వా చాంకమానీయ భరతం భ్రాతృవత్సలమ్ |
పరిష్వజ్య మహాబాహుం రురోద భృశదుఃఖితా || ౬౩ ||

ఏవం విలపమానస్య దుఃఖార్తస్య మహాత్మనః |
మోహాచ్చ శోక సంరోధాత్ బభూవ లులితం మనః || ౬౪ ||

లాలప్యమానస్య విచేతనస్య
ప్రణష్టబుద్ధేః పతితస్య భూమౌ |
ముహుర్ముహుర్నిశ్శ్వసతశ్చ ఘర్మమ్
సా తస్య శోకేన జగామ రాత్రిః || ౬౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః || ౭౫ ||

Ayodhya Kanda Sarga 75 Meaning In Telugu

పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక, తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలయింది కైక. కాని తనకొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు. శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేల మీద పడి ఉన్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది.

ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తల పైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే, తన తండ్రి మరణిస్తే, తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి. పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైక తో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అనీ, తాను అమాయకుడననీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు.

“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.

భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.

“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.

భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.

భరతుని చూచినకౌసల్యకు దుఃఖము ఆగలేదు. ఏడుస్తూ భరతుని పొదిపట్టుకొంది. గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. “నాయనా భరతా! నీవు రాజ్యము కావాలని కోరుకున్నావు. నీకు అన్నదమ్ముల బాధ కానీ దాయాదుల బాధ కానీ లేని రాజ్యము లభించింది. నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వలన నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది. కైక తన కొడుక్కు రాజ్యము కావాలని కోరుకోడంలో తప్పులేదు. కానీ నా కొడుకును నార చీరలు కట్టించి అడవులకు పంపడం దేనికి? దాని వలన ఆమెకు కలిగే ప్రయోజనము ఏమి? అంతకన్నా నన్ను కూడా రామునితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే బాగుండేది. ఆమె కోరుకున్నా కోరుకోక పోయినా నేను, సుమిత్రా, మా కుమారుల వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాము. నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నాము. నీకు మామీద దయ ఉంటే మమ్ములను రాముడు ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. ఇదే మేము నిన్ను కోరేది.” అని భరతుని సూదుల వంటి మాటలతో బాధపెట్టింది కౌసల్య.

ఆ మాటలకు చలించిపోయాడు భరతుడు. తనకు ఏ పాపమూ తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు. తుదకు కౌసల్యకూడా ఆ ప్రకారము మాట్లాడింది. ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు. గట్టిగా కౌసల్య కాళ్లు పట్టుకున్నాడు. భోరునవిలపిస్తున్నాడు. కౌసల్యముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! నా సంగతి నీకు తెలియదా. రాముడు అంటే నాకు ఎంత ప్రేమా భక్తి ఉందో నీకు తెలియదా. ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు. నా అన్న రాముని అరణ్యములకుపంపిన వారికి ధర్మశాస్త్రము గురించి ఏమీ తెలియదు. వారి బుద్ధి చెడిపోయినది.

అమ్మా! నాకు తెలిసీ, నేను రాముని అడవులకుపంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపమును, సూర్యుని ఎదురుగా మలమూత్రవిసర్జన చేసిన పాపమును, పాపాత్ములను సేవించిన పాపమును పొందుతాను. అమ్మా! నేనే కనక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పనిచేయించుకొని వారికి పారితోషికము ఇవ్వని పాపమున పోతాను. రాముడు అడవులకు పోవడం నాకు తెలిసీ నేను ఊరకుంటే నేను రాజద్రోహము చేసిన పాపమున పోతాను.

నేను కనక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్టయితే నేను ప్రజల నుండీ పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపమున పోతాను. (ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఇదే పాపం చేస్తున్నారు.)

అమ్మా! నేను కనక రాముని అరణ్యములకో పోవుటకు నా సమ్మతి తెలిపినట్టయితే నేను యాగము చేయించుకున్న తరువాత ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన పోతాను.

నేను కనక నా అన్న రాముని అరణ్యవాసమునకు కారణము అయితే నేను యుద్ధములో పారిపోయి వచ్చిన వాడు పొందే పాపమును, పెద్దలను అవమానించిన పాపమును, వేదాధ్యయనము చెయ్యని పాపమును, మిత్రద్రోహము చేసిన పాపమును, భార్యాబిడ్డలకు, బంధువులకుపెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నమును భుజించిన పాపమును, సంతానము కలుగని వాడు పొందే పాపమును, రాజును, స్త్రీలను, బాలురను వృద్ధులను చంపిన పాపమును, తాను పోషించ వలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపమును, అక్రమ వ్యాపారములను చేసిన వాడు పొందే పాపమును, ఇతరుల ఇండ్లు తగలపెట్టిన వాడు పొందే పాపమును, ఉదయము, సాయంత్రమూ నిద్రించేవాడు పొందే పాపమును, గురువుగారి భార్యను కామించే వాడు పొందే పాపమును, దేవతలను ఆరాధించని వాడు, తల్లితండ్రులకు సేవచేయని వాడు పొందే పాపమును, క్రూరపు పనులు చేయుచూ, అబద్ధాలు ఆడుతూ, అపవిత్రంగా, అధర్మంగా, అందరికీ భయపడుతూ దొంగవలె బతికేవాడు పొందే పాపమును, కట్టుకున్న భార్యను వదిలి, పరస్త్రీల వెంట తిరిగేవాడు పొందే పాపమును, తాగే నీరు పాడుచేసేవాడు, ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపమును, సిద్ధంగా ఉన్న పూజను పాడుచేసేవాడు పొందేపాపమును, దూడకు కూడా మిగల్చకుండా ఆవునుండి పాలు అన్నీపితికేవాడు పొందే పాపమును, నా దగ్గర జలం ఉండీ, దప్పికతో ఉన్న వారికి జలం ఇవ్వని వాడు పొందే పాపమును, ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూచేవాడు పొందే పాపమును, పొందుతాను.

అమ్మా! నేను కనక రాముని అడవులకు పంపడానికి అనుమతి ఇచ్చినట్టు నీవు భావిస్తే నేను ప్రజలందరిచేతా అందరికీ అపకారము చేసేవాడి గానూ, కృతఘ్నుడు గానూ, ఆత్మహత్యాసదృశు డుగానూ, సిగ్గులేని వాడిగానూ అవమానింపబడతాను. నేను మీ అందరి శాపములు తగిలి బిచ్చము ఎత్తుకొంటూ పిచ్చివాని వలె బతుకుతాను. నిత్యమూ మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ, పాపములు చేస్తూ బతుకుతాను. ధర్మభ్రష్టుడిని, సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను. ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను.

ఇకనైనా నన్ను నమ్మవా అమ్మా.” అని భరతుడు ఎన్నో ఒట్లు పెట్టుకున్నాడు. కౌసల్య పాదాల మీద పడ్డాడు భరతుడు. భరతుని మాటలు విన్న కౌసల్యకు నోట మాట రాలేదు. భరతుని పైకి లేవదీసింది. “కుమారా భరతా! నీవు ఇన్ని ఒట్లు పెట్టుకొని నా దు:ఖము మరింత ఎక్కువ చేసావు. భరతా! నీవు ధర్మాత్ముడివి. ఆవిషయం నాకు తెలుసు. కాని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను. ఏమీ అనుకోకు” అంటూ భరతుని కౌగలించుకొని కౌసల్య దు:ఖిస్తూ ఉంది. ఆ ప్రకారంగా భరతుడు, కౌసల్య దు:ఖిస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్సప్తతితమః సర్గః (76) >>

Ayodhya Kanda Sarga 74 In Telugu – అయోధ్యాకాండ చతుఃసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 74

అయోధ్యాకాండం యొక్క చతుఃసప్తతితమః సర్గం లో రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి అరణ్యాన్ని చేరుతారు. ఈ సమయంలో దశరథ మహారాజు, కైకేయి కోరిన రెండు వరాలు ఇవ్వడం వల్ల, రాముని అడవికి పంపడం వల్ల బాధతో మరణిస్తారు. భార్య కైకేయి కారణంగా తన కుమారుడిని వనవాసానికి పంపడం వల్ల ఆయన తీవ్రంగా బాధపడతారు. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అక్కడి వనచరుల సహాయంతో జీవనం సాగిస్తారు. కైకేయి చేసిన కార్యం పట్ల దశరథుడు తీవ్ర పశ్చాత్తాపంతో, తపస్సు చేస్తూ రాముని తిరిగి రావాలని ఆశిస్తూ చివరకు మరణిస్తారు.

కైకేయ్యాక్రోశః

తాం తథా గర్హయిత్వా తు మాతరం భరతస్తదా |
రోషేణ మహతాఽవిష్టః పునరేవాబ్రవీద్వచః || ౧ ||

రాజ్యాద్భ్రంశస్వ కైకేయి నృశంసే దుష్టచారిణి |
పరిత్యక్తా చ ధర్మేణ మా మృతం రుదతీ భవ || ౨ ||

కిం ను తేఽదూషయద్రాజా రామః వా భృశధార్మికః |
యయోః మృత్యుర్వివాసశ్చ త్వత్కృతే తుల్యమాగతౌ || ౩ ||

భ్రూణహత్యామసి ప్రాప్తా కులస్యాస్య వినాశనాత్ |
కైకేయి నరకం గచ్ఛ మా చ భర్తుః సలోకతామ్ || ౪ ||

యత్త్వయా హీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణా |
సర్వలోకప్రియం హిత్వా మమాప్యాపాదితం భయమ్ || ౫ ||

త్వత్కృతే మే పితా వృత్తః రామశ్చారణ్యమాశ్రితః |
అయశో జీవలోకే చ త్వయాఽహం ప్రతిపాదితః || ౬ ||

మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే |
న తేఽహమభిభాష్యోఽస్మి దుర్వృత్తే పతిఘాతిని || ౭ ||

కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా మమ మాతరః |
దుఃఖేన మహతాఽవిష్టాస్త్వాం ప్రాప్య కులదూషిణీమ్ || ౮ ||

న త్వమశ్వపతేః కన్యా ధర్మరాజస్య ధీమతః |
రాక్షసీ తత్ర జాతాఽసి కులప్రధ్వంసినీ పితుః || ౯ ||

యత్త్వయా ధార్మికో రామర్నిత్యం సత్యపరాయణః |
వనం ప్రస్థాపితో దుఃఖాత్ పితా చ త్రిదివం గతః || ౧౦ ||

యత్ప్రధానాఽసి తత్పాపం మయి పిత్రా వినా కృతే |
భ్రాతృభ్యాం చ పరిత్యక్తే సర్వ లోకస్య చాప్రియే || ౧౧ ||

కౌసల్యాం ధర్మసంయుక్తాం వియుక్తాం పాపనిశ్చయే |
కృత్వా కం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామినీ || ౧౨ ||

కిం నావబుధ్యసే క్రూరే నియతం బంధుసంశ్రయమ్ |
జ్యేష్ఠం పితృసమం రామం కౌసల్యాయాత్మ సంభవమ్ || ౧౩ ||

అంగప్రత్యంగజః పుత్రః హృదయాచ్చాపి జాయతే |
తస్మాత్ప్రియతమో మాతుః ప్రియత్వాన్న తు బాంధవః || ౧౪ ||

అన్యదా కిల ధర్మజ్ఞా సురభిః సురసమ్మతా |
వహమానౌ దదర్శోర్వ్యాం పుత్రౌ విగతచేతసౌ || ౧౫ ||

తావర్ధదివసే శ్రాంతౌ దృష్ట్వా పుత్రౌ మహీతలే |
రురోద పుత్రశోకేన బాష్పపర్యాకులేక్షణా || ౧౬ ||

అధస్తాద్వ్రజతస్తస్యాః సురరాజ్ఞో మహాత్మనః |
బిందవః పతితా గాత్రే సూక్ష్మాః సురభిగంధినః || ౧౭ ||

ఇంద్రోఽప్యశ్రునిపాతం తం స్వగాత్రే పుణ్యగంధినమ్ |
సురభిం మన్యతే దృష్ట్వా భూయసీం తాం సురేశ్వరః || ౧౮ ||

నిరీక్షమాణః శక్రస్తాం దదర్శ సురభిం స్థితామ్ |
ఆకాశే విష్ఠితాం దీనాం రుదతీం భృశదుఃఖితామ్ || ౧౯ ||

తాం దృష్ట్వా శోకసంతప్తాం వజ్ర పాణిర్యశస్వినీమ్ |
ఇంద్రః ప్రాంజలిరుద్విగ్నః సురరాజోఽబ్రవీద్వచః || ౨౦ ||

భయం కచ్చిన్న చాస్మాసు కుతశ్చిద్విద్యతే మహత్ |
కుతర్నిమిత్తః శోకస్తే బ్రూహి సర్వ హితైషిణి || ౨౧ ||

ఏవముక్తా తు సురభిః సురరాజేన ధీమతా |
పత్యువాచ తతో ధీరా వాక్యం వాక్యవిశారదా || ౨౨ ||

శాంతం పాపం న వః కించిత్ కుతశ్చిదమరాధిప |
అహం తు మగ్నౌ శోచామి స్వపుత్రౌ విషమే స్థితౌ || ౨౩ ||

ఏతౌ దృష్ట్వా కృశౌ దీనౌ సూర్యరశ్మిప్రతాపినౌ |
అర్ద్యమానౌ బలీవర్దౌ కర్షకేణ సురాధిప || ౨౪ ||

మమ కాయాత్ ప్రసూతౌ హి దుఃఖితౌ భారపీడితౌ |
యౌ దృష్ట్వా పరితప్యేఽహం నాస్తి పుత్రసమః ప్రియః || ౨౫ ||

యస్యాః పుత్రసహస్రైస్తు కృత్స్నం వ్యాప్తమిదం జగత్ |
తాం దృష్ట్వా రుదతీం శక్రో న సుతాన్మన్యతే పరమ్ || ౨౬ ||

సదాఽప్రతిమవృత్తాయా లోకధారణకామ్యయా |
శ్రీమత్యా గుణనిత్యాయాః స్వభావపరిచేష్టయా || ౨౭ ||

యస్యాః పుత్రసహస్రాణి సాఽపి శోచతి కామధుక్ |
కిం పునర్యా వినా రామం కౌసల్యా వర్తయిష్యతి || ౨౮ ||

ఏకపుత్రా చ సాధ్వీ చ వివత్సేయం త్వయా కృతా |
తస్మాత్త్వం సతతం దుఃఖం ప్రేత్య చేహ చ లప్స్యసే || ౨౯ ||

అహం హ్యపచితిం భ్రాతుః పితుశ్చ సకలామిమామ్ |
వర్ధనం యశసశ్చాపి కరిష్యామి న సంశయః || ౩౦ ||

ఆనాయయిత్వా తనయం కౌసల్యాయా మహాబలమ్ |
స్వయమేవ ప్రవేక్ష్యామి వనం మునినిషేవితమ్ || ౩౧ ||

న హ్యహం పాపసంకల్పే పాపే పాపం త్వయా కృతమ్ |
శక్తో ధారయితుం పౌరైరశ్రుకంఠైర్నిరీక్షితః || ౩౨ ||

సా త్వమగ్నిం ప్రవిశ వా స్వయం వా దండకాన్విశ |
రజ్జుం బధాన వా కంఠే న హి తేఽన్యత్పరాయణమ్ || ౩౩ ||

అహమప్యవనిం ప్రాప్తే రామే సత్యపరాక్రమే |
కృతకృత్యో భవిష్యామి విప్రవాసితకల్మషః || ౩౪ ||

ఇతి నాగైవారణ్యే తోమరాంకుశచోదితః |
పపాత భువి సంక్రుద్ధో నిశ్శ్వసన్నివ పన్నగః || ౩౫ ||

సంరక్తనేత్రః శిథిలాంబరస్తథా
విధూత సర్వాభరణః పరంతపః |
బభూవ భూమౌ పతితో నృపాత్మజః
శచీపతేః కేతురివోత్సవక్షయే || ౩౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃసప్తతితమః సర్గః || ౭౪ ||

Ayodhya Kanda Sarga 74 Meaning In Telugu

తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలక లేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు.

“అమ్మా! నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేసావు. అమ్మా నేను మరణించిన తరువాత నా శవాన్ని, ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగానీ. ఏమ్మా! నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా! ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీకు ఏమి అపకారము చేసాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు?

నీవు చేసినపాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు, భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా! ఈ తుచ్ఛమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్నుకూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రిమరణానికి కారణం నీవే అయినా, నేనే ರಾಜ್ಯಂ కోసరం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు. తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది. నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు. నువ్వు నా తల్లివి కావు. నావు శత్రువుతో సమానము. భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరురాలను నా తల్లి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ మూలంగా కౌసల్యకు, సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది.

నీవు ఇక్ష్వాకు వంశమునకే కాదు నీ తండ్రి అశ్వపతి వంశమునకు కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు. మా తాత గారి వంశములో పుట్టిన రాక్షసివి. నీవు చేసిన పాపపు పనులకు నాకు పితృవియోగము, సోదరుల వియోగము కలిగాయి. ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు. నీకు మరొక పాపలోకము సృష్టింపబడవలెను.

అమ్మా! నీకు రాముని సంగతీ, నా తండ్రి దశరథుని సంగతీ తెలియదా! వారు ధర్మము తప్పని వారనీ, ఆడి తప్పని వారనీ తెలియదా! వారికి ఇంత ద్రోహం ఎలా చేసావమ్మా! నేను నీ కన్న కొడుకును. నీ శరీరం నాకు పంచి ఇచ్చావు. మరి నాకు ఈ పితృవియోగము, భ్రాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా! తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను విను ….పూర్వము ఒక సారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు (కోడె దూడలు) భూమిని దున్నుతూ సొమ్మసిలి పడిపోవడం చూచిందట. అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట. ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడినవట. ఆ కంటినీరు కామధేనువువి అని అనుకున్నాడు దేవేంద్రుడు. వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరకు వెళ్లాడట. ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించి ఇలా అంది.

“దేవేంద్రా! నా పుత్రులు అయిన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సొమ్మసిలి పడిపోయాయి. కాని దయజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలితిప్పుతూ బాధపెడుతున్నాడు. నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్లు వచ్చాయి. బరువుమోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరము పంచుకొని పుట్టాయి. ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా!” అని పలికింది కామధేనువు.

అమ్మా! ఈ లోకంలో ఉన్న కోటాను కోట్ల ధేనువులు అన్నీ కామధేనువు పుత్రులే. కానీ, కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేనువు. అటువంటిది లేక లేక కలిగిన కన్నకొడుకులను పోగొట్టుకున్న ఆ  కౌసల్య, సుమిత్ర నిరంతరమూ కార్చే కన్నీరు నీకు కనపడలేదా అమ్మా! వారి దుఃఖము నీ మనసును కదిలించలేదా?

అమ్మా! కన్నకొడుకులను కన్నతల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. నేను వెంటనే నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవులకు పోతాను. అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు. లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యములకు రా! అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకొని మరణించు. ఇదితప్ప నీకు వేరుమార్గము లేదు. రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తేగానీ నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు.” అని కోపంతో ఊగి పోతూ తల్లి కైకను శతవిధాలా దూషించాడు భరతుడు. ఆయాసం వచ్చి నేలమీద కూలబడి పోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదినాలుగవ సర్ద సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గః (75) >>

Balakanda Sarga 75 In Telugu – బాలకాండ పంచసప్తతితమః సర్గః

BalaKanda Sarga 75 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచసప్తతితమః సర్గలో, సందర్శకుడు పరశు రాముడు విష్ణువు మరియు శివుడి విల్లుల పురాణాలను రాముడికి వివరిస్తాడు. తన కుమారులను విడిచిపెట్టమని దశరథుడు చేసిన అభ్యర్థనను పట్టించుకోకుండా, పరశు రాముడు దశరథ రాముడిని నేరుగా ఉద్దేశించి, విష్ణువు యొక్క పొడవాటి ధనుస్సుతో లక్ష్యం వేయమని అడుగుతాడు మరియు దశరథ రాముడు అలా చేయగలిగితే, పరశురాముడు ద్వంద్వ యుద్ధం చేస్తానని చెప్పాడు. అతనిని.

వైష్ణవధనుఃప్రశంసా

రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్ | [వీర]
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||

1

తదద్భుతమచింత్యం చ భేదనం ధనుషస్త్వయా |
తచ్ఛ్రుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభమ్ ||

2

తదిదం ఘోరసంకాశం జామదగ్న్యం మహద్ధనుః |
పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ ||

3

తదహం తే బలం దృష్ట్వా ధనుషోఽస్య ప్రపూరణే |
ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యమహం తవ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా |
విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ||

5

క్షత్రరోషాత్ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః |
బాలానాం మమ పుత్రాణామభయం దాతుమర్హసి ||

6

భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినామ్ |
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి ||

7

స త్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరామ్ |
దత్త్వా వనముపాగమ్య మహేంద్రకృతకేతనః ||

8

మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే |
న చైకస్మిన్హతే రామే సర్వే జీవామహే వయమ్ ||

9

బ్రువత్యేవం దశరథే జామదగ్న్యః ప్రతాపవాన్ |
అనాదృత్యైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత ||

10

ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే |
దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణా ||

11

అతిసృష్టం సురైరేకం త్ర్యంబకాయ యుయుత్సవే |
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్స్థ యత్త్వయా ||

12

ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః |
తదిదం వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

13

సమానసారం కాకుత్స్థ రౌద్రేణ ధనుషా త్విదమ్ |
తదా తు దేవతాః సర్వాః పృచ్ఛంతి స్మ పితామహమ్ ||

14

శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా |
అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః ||

15

విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః |
విరోధే చ మహద్యుద్ధమభవద్రోమహర్షణమ్ ||

16

శితికంఠస్య విష్ణోశ్చ పరస్పరజయైషిణోః |
తదా తు జృంభితం శైవం ధనుర్భీమపరాక్రమమ్ ||

17

హుంకారేణ మహాదేవః స్తంభితోఽథ త్రిలోచనః |
దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః ||

18

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ |
జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః ||

19

అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తదా |
ధనూ రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః ||

20

దేవరాతస్య రాజర్షేర్దదౌ హస్తే ససాయకమ్ |
ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

21

ఋచీకే భార్గవే ప్రాదాద్విష్ణుః సన్న్యాసముత్తమమ్ |
ఋచీకస్తు మహాతేజాః పుత్రస్యాప్రతికర్మణః ||

22

పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః |
న్యస్తశస్త్రే పితరి మే తపోబల సమన్వితే ||

23

అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః |
వధమప్రతిరూపం తు పితుః శ్రుత్వా సుదారుణమ్ ||

24

క్షత్రముత్సాదయన్రోషాజ్జాతం జాతమనేకశః |
పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే ||

25

యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే |
దత్త్వా మహేంద్రనిలయస్తపోబలసమన్వితః ||

26

స్థితోఽస్మి తస్మింస్తప్యన్వై సుసుఖం సురసేవితే |
అద్య తూత్తమవీర్యేణ త్వయా రామ మహాబల ||

27

శ్రుత్వాతు ధనుషో భేదం తతోఽహం ద్రుతమాగతః |
తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ ||

28

క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్ |
యోజయస్వ ధనుఃశ్రేష్ఠే శరం పరపురంజయమ్ |
యది శక్నోసి కాకుత్స్థ ద్వంద్వం దాస్యామి తే తతః ||

29

Balakanda Sarga 75 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! ” అని రాముని పిలిచాడు పరశురాముడు.

ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు.

“ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము.

ఓ పరశురామా! నీవు సామాన్యుడవుకావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేసావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మా కందరకూ ప్రాణభిక్ష పెట్టు.” అని వేడుకున్నాడు.

కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి. బాగా ధృడమైనవి. బలమైనవి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ తయారు చేసాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది.

ఒక సారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు? అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయూడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారి తీసాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేసాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడి పోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.

పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివ ధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన ఋచీకుని వద్ద ఉంచాడు. ఋచీకుడు మా తాతగారు. మా తాత గారైన ఋచీకుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు. మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు.

పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్ని ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానినీ పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేసాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేసాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్రపర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను.

ఓ రామా! నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. ” అని పలికాడు పరశురాముడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్సప్తతితమః సర్గః (76) >>

Valmiki Ramayana Bala Kanda In Telugu – వాల్మీకి రామాయణం బాలకాండ

Valmiki Ramayana Bala Kanda In Telugu

బాలకాండ, రామాయణంలో మొదటి భాగం, శ్రీరాముడు మరియు అతని సోదరుల బాల్య జీవితం, అయోధ్య రాజ్యం మరియు దశరథుడు రాజు గురించి చెప్పబడింది. బాలకాండంలోని ముఖ్యమైన అంశాలు శ్రీరాముడు మరియు అతని సోదరుల జననం, విద్య, ఋష్యశృంగ యాగం మరియు పట్టాభిషేకం గురించి తెలుపుతాయి.

Valmiki Ramayana Bala Kanda Telugu Pdf

బాలకాండ

  1. ప్రథమః సర్గః
  2. ద్వితీయః సర్గః
  3. తృతీయః సర్గః
  4. చతుర్థః సర్గః
  5. పంచమః సర్గః
  6. షష్ఠః సర్గః
  7. సప్తమః సర్గః
  8. అష్టమః సర్గః
  9. నవమః సర్గః
  10. దశమః సర్గః
  11. ఏకాదశః సర్గః
  12. ద్వాదశః సర్గః
  13. త్రయోదశః సర్గః
  14. చతుర్దశః సర్గః
  15. పంచదశః సర్గః
  16. షోడశః సర్గః
  17. సప్తదశః సర్గః
  18. అష్టాదశః సర్గః
  19. ఏకోనవింశః సర్గః
  20. వింశః సర్గః
  21. ఏకవింశః సర్గః
  22. ద్వావింశః సర్గః
  23. త్రయోవింశః సర్గః
  24. చతుర్వింశః సర్గః
  25. పంచవింశః సర్గః
  26. షడ్వింశః సర్గః
  27. సప్తవింశః సర్గః
  28. అష్టావింశః సర్గః
  29. ఏకోనత్రింశః సర్గః
  30. త్రింశః సర్గః
  31. ఏకత్రింశః సర్గః
  32. ద్వాత్రింశః సర్గః
  33. త్రయస్త్రింశః సర్గః
  34. చతుస్త్రింశః సర్గః
  35. పంచత్రింశః సర్గః
  36. షట్త్రింశః సర్గః
  37. సప్తత్రింశః సర్గః
  38. అష్టాత్రింశః సర్గః
  39. ఏకోనచత్వారింశః సర్గః
  40. చత్వారింశః సర్గః
  41. ఏకచత్వారింశః సర్గః
  42. ద్విచత్వారింశః సర్గః
  43. త్రిచత్వారింశః సర్గః
  44. చతుశ్చత్వారింశః సర్గః
  45. పంచచత్వారింశః సర్గః
  46. షట్చత్వారింశః సర్గః
  47. సప్తచత్వారింశః సర్గః
  48. అష్టచత్వారింశః సర్గః
  49. ఏకోనపంచాశః సర్గః
  50. పంచాశః సర్గః
  51. ఏకపంచాశః సర్గః
  52. ద్విపంచాశః సర్గః
  53. త్రిపంచాశః సర్గః
  54. చతుఃపంచాశః సర్గః
  55. పంచపంచాశః సర్గః
  56. షట్పంచాశః సర్గః
  57. సప్తపంచాశః సర్గః
  58. అష్టపంచాశః సర్గః
  59. ఏకోనషష్టితమః సర్గః
  60. షష్టితమః సర్గః
  61. ఏకషష్టితమః సర్గః
  62. ద్విషష్టితమః సర్గః
  63. త్రిషష్టితమః సర్గః
  64. చతుఃషష్టితమః సర్గః
  65. పంచషష్టితమః సర్గః
  66. షట్షష్టితమః సర్గః
  67. సప్తషష్టితమః సర్గః
  68. అష్టషష్టితమః సర్గః
  69. ఏకోనసప్తతితమః సర్గః
  70. సప్తతితమః సర్గః
  71. ఏకసప్తతితమః సర్గః
  72. ద్విసప్తతితమః సర్గః
  73. త్రిసప్తతితమః సర్గః
  74. చతుఃసప్తతితమః సర్గః
  75. పంచసప్తతితమః సర్గః
  76. షట్సప్తతితమః సర్గః
  77. సప్తసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 55 In Telugu | అయోధ్యాకాండ పంచపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 55 In Telugu

అయోధ్యా కాండ సర్గ 55 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.

యమునాతరణమ్

ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రావరిందమౌ |
మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం గిరిం ప్రతి ||

1

తేషాం చైవ స్వస్త్యయనం మహర్షిః స చకార హ |
ప్రస్థితాంశ్చైవ తాన్ ప్రేక్ష్యపితా పుత్రానివాన్వగాత్ ||

2

తతః ప్రచక్రమే వక్తుం వచనం స మహామునిః |
భరద్వాజో మహాతేజాః రామం సత్యపరాక్రమమ్ ||

3

గంగాయమునయోః సంధిమాసాద్య మనుజర్షభౌ |
కాలిందీమనుగచ్ఛేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితామ్ ||

4

అథాసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతసమాపగాం |
తస్యాస్తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ ||

5

తత్ర యూయం ప్లవం కృత్వా తరతాంశుమతీం నదీమ్ |
తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్ఛదమ్ ||

6

వివృద్ధం బహుభిర్వృక్షైః శ్యామం సిద్ధోపసేవితమ్ |
తస్మై సీతాఽంజలిం కృత్వా ప్రయుంజీతాశిషః శివాః ||

7

సమాసాద్య తు తం వృక్షం వసేద్వాఽతిక్రమేత వా |
క్రోశమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యథ కాననమ్ ||

8

పలాశబదరీమిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః |
స పంథాశ్చిత్రకూటస్య గతః సుబహుశో మయా ||

9

రమ్యో మార్దవయుక్తశ్చ వనదావైర్విపర్జితః |
ఇతి పంథానమావేద్య మహర్షిః సంన్యవర్తతః ||

10

అభివాద్య తథేత్యుక్త్వా రామేణ వినివర్తితః |
ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్ ||

11

కృతపుణ్యాః స్మ సౌమిత్రే మునిర్యన్నోఽనుకంపతే |
ఇతి తౌ పురుషవ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ ||

12

సీతామేవాగ్రతః కృత్వా కాలిందీం జగ్మతుర్నదీమ్ |
అథాఽసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతోవహాం నదీమ్ ||

13

తౌ కాష్ఠసంఘాటమథో చక్రతుస్సుమహాప్లవమ్ ||

14

శుష్కైర్వంశైః సమాస్తీర్ణముశీరైశ్చ సమావృతమ్ |
తతో వేతసశాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్ ||

15

చకార లక్ష్మణశ్ఛిత్వా సీతాయాః సుఖమాసనమ్ |
తత్ర శ్రియమివాచింత్యాం రామో దాశరథిః ప్రియామ్ ||

16

ఈషత్సంలజ్జమానాం తామధ్యారోపయత ప్లవమ్ |
పార్శ్వే చ తత్ర వైదేహ్యా వసనే భూషణాని చ ||

17

ప్లవే కఠినకాజం చ రామశ్చక్రే సహాయుధైః |
ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం ప్రతిగృహ్య తౌ ||

18

తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ |
కాలిందీమధ్యమాయాతా సీతా త్వేనామవందత ||

19

స్వస్తి దేవి తరామి త్వాం పారయేన్మే పతిర్ర్వతమ్ |
యక్ష్యే త్వాం గోనహస్రేణ సురాఘటశతేన చ ||

20

స్వస్తి ప్రత్యాగతే రామే పురీమిక్ష్వాకుపాలితామ్ |
కాలిందీమథ సీతా తు యాచమానా కృతాంజలిః ||

21

తీరమేవాభిసంప్రాప్తా దక్షిణం వరవర్ణినీ |
తతః ప్లవేనాంశుమతీం శీఘ్రగామూర్మిమాలినీమ్ ||

22

తీరజైర్బహుభిర్వృక్షైః సంతేరుర్యమునాం నదీమ్ |
తే తీర్ణాః ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్ ||

23

శ్యామం న్యగ్రోధమాసేదుః శీతలం హరితచ్ఛదమ్ |
న్యగ్రోధం తముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్ ||

24

నమస్తేఽస్తు మహావృక్ష పారయేన్మే పతిర్వ్రతమ్ |
కౌసల్యాం చైవ పశ్యేయం సుమిత్రాం చ యశస్వినీమ్ ||

25

ఇతి సీతాఽంజలిం కృత్వా పర్యగచ్ఛద్వనస్పతిమ్ |
అవలోక్య తతః సీతామాయాచంతీమనిందితామ్ ||

26

దయితాం చ విధేయాం చ రామో లక్ష్మణమబ్రవీత్ |
సీతామాదాయ గచ్ఛ త్వమగ్రతో భరతానుజ ||

27

పృష్ఠతోఽహం గమిష్యామి సాయుధో ద్విపదాం వర |
యద్యత్ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా ||

28

తత్తత్ప్రదద్యా వైదేహ్యా యత్రాస్య రమతే మనః |
గచ్ఛతోస్తు తయోర్మధ్యే బభూవ జనకాత్మజా ||

29

మాతంగయోర్మధ్యగతా శుభా నాగవధూరివ |
ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీమ్ ||

30

అదృష్టపూర్వాం పశ్యంతీ రామం పప్రచ్ఛ సాఽబలా |
రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ ||

31

సీతావచనసంరబ్దః ఆనయామాస లక్ష్మణః |
విచిత్రవాలుకజలాం హంససారసనాదితామ్ ||

32

రేమే జనకరాజస్య తదా ప్రేక్ష్య సుతా నదీమ్ |
క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ |
బహూన్మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుర్యమునా వనే ||

33

విహృత్య తే బర్హిణపూగనాదితే
శుభే వనే వానరవారణాయుతే |
సమం నదీవప్రముపేత్య సమ్మతం
నివాసమాజగ్ము రదీనదర్శనాః ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 55 Meaning In Telugu

ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి.

మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేసాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు.” అని అన్నాడు భరద్వాజుడు.

ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి “మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్లండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్థించాడు. ఆమాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు.

వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకొని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పను తయారు చేసారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామ లక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధము లను, తెప్పలో పెట్టారు. తరువాత రామ లక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు.

తెప్ప యమునానదీ మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. “అమ్మా యమునా నదీమతల్లీ! మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్య వాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు వేయి గోవులను, వంద ఘటముల మద్యమును సమర్పించుకుంటాను.” అని మొక్కుకుంది.

తరువాత అందరూ యమునా నది దక్షిణతీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామ అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది.
తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు.

సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి మొక్కలు, లతల గూర్చీ రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్లయొక్క ఆకులను పూలను తీసుకొని వచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక త్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటుచేసుకున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః (56) >>

Ayodhya Kanda Sarga 50 In Telugu – అయోధ్యాకాండ పంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 50 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచాశః సర్గ, “గుహసంగతమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం ప్రయాణిస్తారు మరియు వారి మార్గంలో గుహ అనే అనుచరుడు మరియు స్నేహితుడు కలుసుకుంటారు. గుహ, కేవట్ కులానికి చెందినవాడు, రాముడి పట్ల ఎంతో భక్తి మరియు ప్రేమ చూపిస్తూ, అతడిని ఆదరించే విధంగా ప్రవర్తిస్తాడు. రాముడు మరియు అతని కుటుంబం గుహతో గడిపిన సమయం, అతని ఆతిథ్యం, మరియు స్నేహం ఈ సర్గలో హృద్యంగా వర్ణించబడ్డాయి. ఈ సర్గ రాముడు తన నిస్వార్థత మరియు వినయంతో గుహను సంతృప్తి పరచడం, అలాగే స్నేహం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

గుహసంగతమ్

విశాలాన్కోసలాన్రమ్యాన్యాత్వా లక్ష్మణపూర్వజః |
అయోధ్యాఽభిముఖో ధీమాన్ప్రాంజలిర్వాక్వమబ్రవీత్ ||

1

ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||

2

నివృత్తవనవాసస్త్వామనృణో జగతీపతేః |
పునర్ద్రక్ష్యామి మాత్రా చ పిత్రా చ సహ సఙ్గతః ||

3

తతో రుధిరతామ్రాక్షో భుజముద్యమ్య దక్షిణమ్ |
అశ్రుపూర్ణముఖో దీనోఽబ్రవీజ్జానపదం జనమ్ ||

4

అనుక్రోశో దయా చైవ యథార్హం మయి వః కృతః |
చిరం దుఃఖస్య పాపీయో గమ్యతామర్థసిద్ధయే ||

5

తేఽభివాద్య మహాత్మానం కృత్వా చాపి ప్రదక్షిణమ్ |
విలపంతో నరా ఘోరం వ్యతిష్ఠంత క్వచిత్క్వచిత్ ||

6

తథా విలపతాం తేషామతృప్తానాం చ రాఘవః |
అచక్షుర్విషయం ప్రాయాద్యథాఽర్కః క్షణదాముఖే ||

7

తతో ధాన్యధనోపేతాన్దానశీలజనాన్శివాన్ |
అకుతశ్చిద్భయాన్రమ్యాం శ్చైత్యయూపసమావృతాన్ ||

8

ఉద్యానామ్రవణోపేతాన్సంపన్నసలిలాశయాన్ |
తుష్టపుష్టజనాకీర్ణాన్గోకులాకులసేవితాన్ ||

9

లక్షణీయాన్నరేంద్రాణాం బ్రహ్మఘోషాభినాదితాన్ |
రథేన పురుషవ్యాఘ్రః కోసలానత్యవర్తత ||

10

మధ్యేన ముదితం స్ఫీతం రమ్యోద్యానసమాకులమ్ |
రాజ్యం భోగ్యం నరేంద్రాణాం యయౌ ధృతిమతాంవరః ||

11

తత్ర త్రిపథగాం దివ్యాం శివ తోయామశైవలామ్ |
దదర్శ రాఘవో గఙ్గాం పుణ్యామృషినిసేవితామ్ ||

12

ఆశ్రమైరవిదూరస్థైః శ్రీమద్భిః సమలంకృతామ్ |
కాలేఽప్సరోభిర్హృష్టాభిః సేవితాంభోహ్రదాం శివామ్ ||

13

దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితామ్ |
నాగగంధర్వపత్నీభిః సేవితాం సతతం శివామ్ ||

14

దేవాక్రీడశతాకీర్ణాం దేవోద్యానశతాయుతామ్ |
దేవార్థమాకాశగమాం విఖ్యాతాం దేవపద్మినీమ్ ||

15

జలఘాతాట్టహాసోగ్రాం ఫేననిర్మలహాసినీమ్ |
క్వచిద్వేణీకృతజలాం క్వచిదావర్తశోభితామ్ ||

16

క్వచిత్స్తిమితగంభీరాం క్వచిద్వేగజలాకులామ్ |
క్వచిద్గంభీరనిర్ఘోషాం క్వచిద్భైరవనిస్వనామ్ ||

17

దేవసంఘాప్లుతజలాం నిర్మలోత్పలశోభితామ్ |
క్వచిదాభోగపులినాం క్వచిన్నిర్మలవాలుకామ్ ||

18

హంససారససంఘుష్టాం చక్రవాకోపకూజితామ్ |
సదా మత్తైశ్చ విహగైరభిసన్నాదితాంతరామ్ ||

19

క్వచిత్తీరరుహైర్వృక్షైర్మాలాభిరివ శోభితామ్ |
క్వచిత్ఫుల్లోత్పలచ్ఛన్నాం క్వచిత్పద్మవనాకులామ్ ||

20

క్వచిత్కుముదషండైశ్చ కుడ్మలైరుపశోభితామ్ |
నానాపుష్పరజోధ్వస్తాం సమదామివ చ క్వచిత్ ||

21

వ్యపేతమలసంఘాతాం మణినిర్మలదర్శనామ్ |
దిశాగజైర్వనగజైర్మత్తైశ్చ వరవారణైః ||

22

దేవోపవాహ్యైశ్చ ముహుః సన్నాదితవనాంతరామ్ |
ప్రమదామివ యత్నేన భూషితాం భూషణోత్తమైః ||

23

ఫలైః పుష్పైః కిసలయైర్వృతాం గుల్మైర్ద్విజైస్తథా |
శింశుమారైశ్చ నక్రైశ్చ భుజంగైశ్చ నిషేవితామ్ ||

24

విష్ణుపాదచ్యుతాం దివ్యామపాపాం పాపనాశినీమ్ |
[* తాం శంకరజటాజూటాద్భ్రష్టాం సాగరతేజసా || *]

25

సముద్రమహీషీం గఙ్గాం సారసక్రౌఞ్చనాదితామ్ |
ఆససాద మహాబాహుః శృఙ్గబేరపురం ప్రతి ||

26

తామూర్మికలిలావర్తామన్వవేక్ష్య మహారథః |
సుమంత్రమబ్రవీత్సూతమిహైవాద్య వసామహే ||

27

అవిదూరాదయం నద్యాః బహుపుష్పప్రవాలవాన్ |
సుమహానిఙ్గుదీవృక్షే వసామోఽత్రైవ సారథే ||

28

ద్రక్ష్యామః సరితాం శ్రేష్ఠాం సమ్మాన్యసలిలాం శివామ్ |
దేవదానవగంధర్వమృగమానుషపక్షిణామ్ ||

29

లక్ష్మణశ్చ సుమంత్రశ్చ బాఢమిత్యేవ రాఘవమ్ |
ఉక్త్వా తమిన్గుదీవృక్షం తదోపయయతుర్హయైః ||

30

రామోఽభియాయ తం రమ్యం వృక్షమిక్ష్వాకునందనః |
రథాదవాతరత్తస్మాత్సభార్యః సహలక్ష్మణః ||

31

సుమంత్రోఽప్యవతీర్యాస్మాన్మోచయిత్వా హయోత్తమాన్ |
వృక్షమూలగతం రామముపతస్థే కృతాంజలిః ||

32

తత్ర రాజా గుహో నామ రామస్యాత్మసమః సఖా |
నిషాదజాత్యో బలవాన్స్థపతిశ్చేతి విశ్రుతః ||

33

స శృత్వా పురుషవ్యాఘ్రం రామం విషయమాగతమ్ |
వృద్ధైః పరివృతోఽమాత్యైరజ్ఞాతిభిశ్చాభ్యుపాగతః ||

34

తతో నిషాదాధిపతిం దృష్ట్వా దూరాదుపస్థితమ్ |
సహ సౌమిత్రిణా రామః సమాగచ్ఛద్గుహేన సః ||

35

తమార్తః సంపరిష్వజ్య గుహో రాఘవమబ్రవీత్ |
యథాఽయోధ్యా తథేయం తే రామ కిం కరవాణి తే ||

36

ఈదృశం హి మహాబాహో కః ప్రప్స్యత్యతిథిం ప్రియమ్ |
తతః గుణవదన్నాద్యముపాదాయ పృథగ్విధమ్ |
అర్ఘ్యం చోపానయత్క్షిప్రం వాక్యం చేదమువాచ హ ||

37

స్వాగతం తే మహాబాహో తవేయమఖిలా మహీ |
వయం ప్రేష్యా భవాన్భర్తా సాధు రాజ్యం ప్రశాధి నః ||

38

భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితమ్ |
శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే ||

39

గుహమేవం బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ ||

40

అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వథా వయమ్ |
పద్భ్యామభిగమాచ్చైవ స్నేహసందర్శనేన చ ||

41

భుజాభ్యాం సాధు వృత్తాభ్యాం పీడయన్వాక్యమబ్రవీత్ | [పీనాభ్యాం]
దిష్ట్యా త్వాం గుహ పశ్యామి హ్యరోగం సహ బాంధవైః ||

42

అపి తే కుశలం రాష్ట్రే మిత్రేషు చ ధనేషు చ |
యత్త్విదం భవతా కించిత్ప్రీత్యా సముపకల్పితమ్ |
సర్వం తదనుజానామి నహి వర్తే ప్రతిగ్రహే ||

43

కుశచీరాజినధరం ఫలమూలాశినం చ మామ్ |
విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరమ్ ||

44

అశ్వానాం ఖాదనేనాహమర్థీ నాన్యేన కేనచిత్ |
ఏతావతాఽత్ర భవతా భవిష్యామి సుపూజితః ||

45

ఏతే హి దయితా రాజ్ఞః పితుర్దశరథస్య మే |
ఏతైః సువిహితైరశ్వైర్భవిష్యామ్యహమర్చితః ||

46

అశ్వానాం ప్రతిపానం చ ఖాదనం చైవ సోఽన్వశాత్ |
గుహస్తత్రైవ పురుషాంస్త్వరితం దీయతామితి ||

47

తతశ్చీరోత్తరాసంగః సంధ్యామన్వాస్య పశ్చిమామ్ |
జలమేవాదదే భోజ్యం లక్ష్మణేనాఽఽహృతం స్వయమ్ ||

48

తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణః |
సభార్యస్య తతోఽభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రితః ||

49

గుహోఽపి సహ సూతేన సౌమిత్రిమనుభాషయన్ |
అన్వజాగ్రత్తతో రామమప్రమత్తో ధనుర్ధరః ||

50

తథా శయానస్య తతోఽస్య ధీమతః
యశస్వినో దాశరథేర్మహాత్మనః |
అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా
తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ ||

51

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 50 Meaning In Telugu

రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో
పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు.

అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు.” అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు.

రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకమునుండి అప్సరసలు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారూ. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగానూ కొన్ని ప్రదేశములలో నెమ్మదిగానూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులుయధేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీజలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కాని అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానము చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతోనూ, పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగాతీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిబేరపురమునకు చేరుకున్నాడు.

“సుమంత్రా! రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇల్గుదీ వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి, ఈ చెట్టు కిందనే నిద్రించెదము.” అని అన్నాడు రాముడు.

రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆవృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచి పెట్టి, రాముని వద్దకు వచ్చాడు.

ఆ శృంగిబేరపురంలో బోయజాతికి చెందిన వాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ, సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగలించుకున్నాడు. గుహుని క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నాడు.

“రామా! ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇదీ అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. క్షణంలో సమకూరుస్తాను.” అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు,సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు.

“రామా! భోజన పదార్థములు సిద్ధంగాఉన్నాయి. మీరందరూ భోజనం చేయండి.” అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిధ్యము. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కాని నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రిగారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము. అదే నాకుమహదానందము.” అని అన్నాడు రాముడు.

వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేసాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ, సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు.

రామునికి ఓ పట్టాన కటిక నేలమీద నిద్రపట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Ayodhya Kanda Sarga 73 In Telugu – అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గః 

Ayodhya Kanda Sarga 73

అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు మరియు వారి సహచరులు అరణ్యానికి చేరుకుని రాముడిని కలుసుకుంటారు. భరతుడు రాముని పాదాలకు నమస్కరిస్తూ అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, తండ్రి ఆజ్ఞను అవహేళన చేయలేమని స్పష్టం చేస్తాడు. భరతుడు రాముడికి పాదుకలను తీసుకువచ్చి, తన స్థానంలో రాజ్యం పాలించాలని కోరుతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుడిని అంగీకరిస్తాడు. ఈ సర్గలో రాముడు తన వ్రతాన్ని కొనసాగిస్తూ, భరతుడు తన తమ్ముడి కర్తవ్యాన్ని గౌరవిస్తూ, పాదుకలను తీసుకుని తిరిగి వెళతాడు.

కైకేయీవిగర్హణమ్

శ్రుత్వా తు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ |
భరతో దుఃఖ సంతప్తైదం వచనమబ్రవీత్ || ౧ ||

కిం ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః |
విహీనస్యాథ పిత్రా చ భ్రాత్రా పితృసమేన చ || ౨ ||

దుఃఖే మే దుఃఖమకరోర్వృణే క్షారమివాదధాః |
రాజానం ప్రేతభావస్థం కృత్వా రామం చ తాపసమ్ || ౩ ||

కులస్య త్వమభావాయ కాల రాత్రిరివాగతా |
అఙ్గారముపగూహ్య స్మ పితా మే నావబుద్ధవాన్ || ౪ ||

మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని |
సుఖం పరిహృతం మోహాత్కులేఽస్మిన్ కులపాంసిని || ౫ ||

త్వాం ప్రాప్య హి పితా మేఽద్య సత్యసంధో మహాయశాః |
తీవ్రదుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపః || ౬ ||

వినాశితో మహారాజః పితా మే ధర్మవత్సలః |
కస్మాత్ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనం గతః || ౭ ||

కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకాభిపీడితే |
దుష్కరం యది జీవేతాం ప్రాప్య త్వాం జననీం మమ || ౮ ||

నను త్వార్యోఽపి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమామ్ |
వర్తతే గురువృత్తిజ్ఞో యథా మాతరి వర్తతే || ౯ ||

తథా జ్యేష్ఠా హి మే మాతా కౌసల్యా దీర్ఘదర్శినీ |
త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే || ౧౦ ||

తస్యాః పుత్రం కృతాత్మానం చీరవల్కలవాససమ్ |
ప్రస్థాప్య వనవాసాయ కథం పాపే న శోచసి || ౧౧ ||

అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినమ్ |
ప్రవ్రాజ్య చీరవసనం కిం ను పశ్యసి కారణమ్ || ౧౨ ||

లుబ్ధాయా విదితః మన్యే న తేఽహం రాఘవం ప్రతి |
తథా హ్యనర్థో రాజ్యార్థం త్వయాఽఽనీతః మహానయమ్ || ౧౩ ||

అహం హి పురుషవ్యాఘ్రౌ అపశ్యన్ రామలక్ష్మణౌ |
కేన శక్తిప్రభావేన రాజ్యం రక్షితుముత్సహే || ౧౪ ||

తం హి నిత్యం మహారాజో బలవంతం మహాబలః |
అపాశ్రితోఽభూద్ధర్మాత్మా మేరుర్మేరువనం యథా || ౧౫ ||

సోఽహం కథమిమం భారం మహాధుర్యసముద్ధృతమ్ |
దమ్యో ధురమివాసాద్య సహేయం కేన చౌజసా || ౧౬ ||

అథవా మే భవేచ్ఛక్తిర్యోగైః బుద్ధి బలేన వా |
సకామాం న కరిష్యామి త్వామహం పుత్ర గర్ధినీమ్ || ౧౭ ||

న మే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయామ్ |
యది రామస్య నావేక్షా త్వయి స్యాన్మాతృవత్సదా || ౧౮ ||

ఉత్పన్నా తు కథం బుద్ధిస్తవేయం పాపదర్శినీ |
సాధుచారిత్రవిభ్రష్టే పూర్వేషాం నో విగర్హితా || ౧౯ ||

అస్మిన్కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః || ౨౦ ||

న హి మన్యే నృశంసే త్వం రాజధర్మమవేక్షసే |
గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీమ్ || ౨౧ ||

సతతం రాజవృత్తే హి జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
రాజ్ఞామేతత్సమం తత్స్యాదిక్ష్వాకూణాం విశేషతః || ౨౨ ||

తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్రశోభినామ్ |
అద్య చారిత్రశౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తతమ్ || ౨౩ ||

తవాపి సుమహాభాగాః జనేంద్రాః కులపూర్వగాః |
బుద్ధేర్మోహః కథమయం సంభూతస్త్వయి గర్హితః || ౨౪ ||

న తు కామం కరిష్యామి తవాఽహం పాపనిశ్చయే |
త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ || ౨౫ ||

ఏష త్విదానీమేవాహమప్రియార్థం తవనఘమ్ |
నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజనప్రియమ్ || ౨౬ ||

నివర్తయిత్వా రామం చ తస్యాహం దీప్తతేజసః |
దాసభూతో భవిష్యామి సుస్థిరేణాంతరాత్మనా || ౨౭ ||

ఇత్యేవముక్త్వా భరతః మహాత్మా
ప్రియేతరైః వాక్య గణైస్తుదంస్తామ్ |
శోకాతురశ్చాపి ననాద భూయః
సింహో యథా పర్వతగహ్వరస్థః || ౨౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమః సర్గః || ౭౩ ||

Ayodhya Kanda Sarga 73 Meaning In Telugu

తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని  తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు.

“అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా! అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు. కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేసావు? ఎవరి కోసం చేసావు ఇదంతా? ఇంత చేసికూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా!

అమ్మా! నేను, నీ కుమారుడు భరతుని, అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకురాజ్యము కట్టబెట్టడానికేనా! నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేసావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా! నీకు తెలుసో లేదో! నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలిం చాడు. అటువంటిది, రాముడు లేకుండా, నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒక వేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గానీ, నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేసావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమూ తీరదు.
అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈక్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ, రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కవ ప్రేమతో చూచుకొనే వాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను.

అమ్మా! నాకు తెలియక అడుగుతాను! నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా! దీని వలననీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా! అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది. నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేసావా!

మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకీ పెద్దవాడు రాజ్యభారము వహిస్తే, మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజ ధర్మము మీద గౌరవము లేదా! అమ్మా! ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో, అందరిలోకీ పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుం టారు. ఈ నాడు నీవు మా రాజధర్మానికి చేటుతెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకురాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఇదే నా నిశ్చయము.”అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దు:ఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>