భక్తి యోగం ఒక హిందూ యోగ పథం, మరియు ఆధ్యాత్మిక అభ్యాసము. ఈ యోగంలో, భక్తి మరియు అనుష్ఠానం ముఖ్యమైనవి. వ్యక్తి తన దైవభక్తిని, పరమాత్మ సంబంధమును అభివృద్ధి చేయడానికి ఈ యోగాన్ని అభ్యసించవచ్చు. భక్తి యోగం మూలమైన ఉద్దీపన అనుభవాలతో, అంతరాళంలో చలింపును చేపట్టేది. ఈ యోగం విశేషంగా దేవుని ప్రేమ మరియు భక్తిని వివరించేది.
Bhakti Yogam | భక్తి యోగం
భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ క్రింది లింకుల ఆధారంగా భక్తి యోగం గురించి తెలుసుకుందాం…
పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.
Pooja | పూజ
పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ క్రింది లింకుల ఆధారంగా పూజ గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ మహిమ్నః స్తోత్రంగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములుగురించి తెలుసుకుందాం…
Sri Sai Baba Ekadasa Sutralu Telugu
శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.
ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును.
నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను.
నా సహాయమును గాని, నా నలహాను గాని, కోరిన తక్షణమోసంగ సంసిద్దుడను.
నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దమే పొడచూపదు.
నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి హారతిగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి గీతాలు సాధకులను ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీస్తాయి, ప్రేమ, శాంతి, సమాధానం మరియు సాంత్వన అంతా వీటికి ఆధారం ఉంటాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలుగురించి తెలుసుకుందాం…
Sri Sai Saptha Swara Geethikalu Telugu
శ్రీ సాయి సప్త స్వర గీతికలు
గీతిక: 1
సాకి:
తల్లి నీవె తండ్రి నీవె రాగమైన భావమైన
ప్రాణమైన దైవమైన నీవె
మదిని మందిరాన్ని చేసి
పరిచితిమి మమతల సింహాసనాన్ని
పల్లవి:
రావయ్య దేవ రమణీయ రూప
కరుణించ రార కరుణా సముద్ర
ఆలకించ రార ఆత్మబంధు నీవ
ఆపదలను పాపెడు అవని నేలు దైవమ
బాబా నీవే… మా సాయి నీవే
॥రావయ్య ||
చరణం 1:
నీ చల్లని చూపుతో పుడమి పావని ఆయె
నీ కాలు తాకినంత కలి అహం పారిపోయె
ఏనాటి పుణ్య వరమొ, ఏనాటికి తీరని బంధమొ
పాపాలను పాపి వేయ మానవ రూపం దాల్చిన
మమ్ముకన్న దైవమ మరల రావయ్య స్వామి
॥రావయ్య ||
చరణం 2:
పూలు పళ్ళు ధూప దీపాలతో
ప్రేమే నైవేద్యాన్ని చేసి నీ నామమే స్మరిస్తు
రాముడవు నీవంటు రహీమువు నీవంటు
ఏసువైన బుద్ధుడైన నానకైన నీవంటు
నీ రాకకె నీ కోసమె నిరీక్షించగ
॥రావయ్య ॥
గీతిక: 2
పల్లవి:
పాహి పాహి పాహి పాహి
పాపనాశక మా ప్రాణ రక్షక
సాయి సాయి సాయి సాయి
సాధు పుంగవ మా ఇష్ట దైవమా
॥ పాహి॥
చరణం 1:
మా కళ్లలోకి చూడవయ్య కాంతులను నింపగ
లోగిల్లలోకి చేరవయ్య లోపాలను తీర్చగ
మనస్సులోన నిలువవయ్య కలతలను పాపగ
మహిమగల స్వామి నీకు మొక్కెదను భక్తి తోడ
మమత గల తండ్రి నిన్ను తలచెదను ప్రేమ తోడ
ముల్లోకాలనేలు వాడవట సృష్టికి మూలానివట
॥పాహి॥
చరణం 2:
అణువణువు ప్రతి అణువు నీ రాకకె నీ కోసమె
క్షణ క్షణము ప్రతి క్షణము పరితపిస్తున్నవి
పంచ భూతమ్ములు పంచేద్రియాలు
నీ కరుణనె నీ తోడునే కోరుతున్నాయి
నాలుగు వేధమ్ములైన నాలుగు దిక్కులైన
నాలుగు వేళలందు కోటి తారకలైన
నీకే దాసోహమట నీవే బ్రహ్మాండమట
॥పాహి॥
గీతిక: 3
పల్లవి:
షిరిడీ పురం మా సాయీ నగరం
కనులారా గాంచినంత కలుగు దర్శనం- కలుగు సాయి దర్శనం
మనసార తలచినంత పలుకు మందిరం- పలుకు బాబ మందిరం
॥షిరిడీ॥
చరణం 1:
పాపాలను పారద్రోలు పావనదామం
ఆర్థులను అక్కు చేర్చు కరుణాలోకం
గుడి కట్టిన గురుద్వారం కనుపించు కాశీ నిలయం
కీర్తించగ క్రీస్తూ గానం ఆలకించ అల్లా నామం
వెలుగొందె ఈ ద్వారక మాయి క్షేత్రం
||షిరిడీ||
చరణం 2:
రోగాలకు తావు లేదు బోగాలకు తావు లేదు
కోపాలకు రూపు లేదు తాపాలకు తనువు లేదు
మమతకిది మందిరమై భక్తికి భవ సాగరమై
వెలుగొందె ఈ ద్వారకమాయి క్షేత్రం
||షిరిడీ||
గీతిక: 4
సాకి:
బాబా… సాయి బాబా…
పల్లవి:
నీ పాదాలే కడుగన పూజలే సేయన
భక్తితోడ కొలువన భజనలే సేయన
బాబా అని పిలువన సాయీ అని తలువన
॥పాదాలే॥
చరణం:
నీ రూపం నీ నామం ప్రతి అణువున నిండగ
అణువునై పోన నీ చెంతకు నే చేరన
॥పాదాలే॥
నీ ప్రేమ నీ కరుణ ప్రతి పువ్వున విరియగ
పువ్వునై పోన నీ చరణాలను తాకన
॥పాదాలే॥
నీ చూపు నీ తోడు ప్రతి మదిన నిలువగ
భక్తుడనై పోన నే హారతులే యివ్వన
॥పాదాలే॥
గీతిక: 5
పల్లవి:
అన్నింట నీ రూపమె ప్రతినోట నీ నామమె
సద్గురు నాథ మా సాయీ ప్రభువా
పాలించు వాడవు లాలించు వాడవు
మనసున్న వాడవు మానవీయ రూపుడవు
॥అన్నింట॥
చరణం 1:
కుల మతాలు కూల దన్ని ప్రేమలే పంచినావు
మానవతను బోధించి మనస్సులే దోచినావు
భక్తినే చాటి నువ్వు కరుణయే చూపినావు
బాబాగా మిగిలినావు
॥అన్నింట॥
చరణం 2:
అఖిలాండ మూర్తివి అండగ నిలిచినావు
లోకాలను ఏలు నీవు లోగిల్లకు చేరినావు
చింతలనే తీర్చి నువ్వు చీకట్లను బాపినావు
చిదానందునిగా మారినావు
॥అన్నింట॥
గీతిక: 6
పల్లవి:
షిరిడీశ తండ్రి పరమేశ
శివరూప సాయి రామేశ
యేలుకొను వాడవయ్య వరాలిచ్చు వాడవయ్య
మహిమ గల తండ్రివయ్య మహితాత్ముడ నీవయ్య
అలకయేల భూనితివో మంకు నేల పట్టితివో
చరణం 1:
ఆర్థులము మేమయ్య ఒంటరిగా మిగిలితిమి
తోడుగ నిలువ రార తప్పులను తెలుపగ
కన్నులలో నీవుంటివి కడదాక నిలిచి పోర
కపటాలు లేనట్టి కమనీయ రూపుడవు
॥షిరిడీశ॥
చరణం 2:
దైవానివి నీవయ్య దయగల తండ్రివయ్య
భక్తులము మేమురాగ భజనలే సేయగ
ప్రేమతో మమ్ము చేరి భక్తినే చాటర
మానవతారూపుడ మనస్సు గల నాథుడ
॥షిరిడీశ ॥
గీతిక: 7
సాకి:
ఓం షిరిడి నాథాయ నమః
ఓం మాధవ సాయినే నమః
పల్లవి:
జగతికి మూలం సృష్టికి ప్రతి రూపం
మానవతకు మారు పేరు సాయీ నామం
మా బాబా నిలయం
చరణం 1:
ఈశుడు తానె పరమేశడు తానె
జీవుడు తానె దేవుడు తానె
ఆత్మయు తానే పరమాత్మయు తానె
ఎలా పిలిచిన ఎలా తలచిన
పిలిస్తే పలుకు వాడు సాయీ…
॥జగతికి॥
చరణం 2:
లీలలెన్నొ చేయువాడు ప్రేమలే పంచువాడు
కరుణయే చూపు వాడు లోకమ్ముల నేలు వాడు
గీతలోన నిండినాడు ఖురానైన వెలిగినాడు
క్రీస్తుగా పిలిచిన నానకని తలచిన
మదిలోన నిలుచు వాడు సాయీ…..
Discover The Ultimate Collection Of Devotional Hymns And Prayers | Bhakti Ved
Welcome to the Bhakti Ved Website. Our platform provides an extensive array of hymns, ashtakas, dandakas, and other sacred chants and devotional verses In Telugu. We are dedicated to facilitating your spiritual journey, ensuring that you can effortlessly follow and engage in devotionaland rituals. With our resources, you can profoundly enrich your devotional path and elevate your spiritual experiences.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పార్వతి దేవి, హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవతలలో ఒకరు. ఆమె శివుని పత్నిగా, గణపతి మరియు కార్తికేయుల తల్లిగా విఖ్యాతి గాంచింది. పార్వతి, శక్తి లేదా దుర్గా రూపంలో కూడా పూజించబడుతుంది. ఆమె శాంతియుత స్వభావంతో పాటు శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధించబడుతుంది. పార్వతి దేవి కథలు, పురాణాలు, వేదాలు, మరియు ఇతిహాసాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. ఆమె జీవితంలో ప్రతి ఘట్టం ఆదర్శప్రాయంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. పార్వతి దేవి కృష్ణవర్ణంలో, అందమైన మంగళసూత్రం ధరించి, నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంది. పార్వతి దేవి పూజ అనేక రూపాల్లో, రీతులలో జరుగుతుంది. భక్తులు ఆమెను శివునితో కలిసి లేదా స్వతంత్రంగా కూడా పూజిస్తారు. పార్వతి దేవి పూజించడం వలన భక్తులకు శాంతి, సమృద్ధి, సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. తద్వారా పార్వతి దేవి తెలుగు ప్రజల మన్ననలు పొందుతూ, వారి జీవితాల్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు పార్వతీదేవి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
అంబా జగదంబా
పరమ పావనీ “పార్వతీదేవి” గీర్వాణనుత గిరిజాదేవి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… మేనక నీతికథ.
మేనక
(బహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలాముఖ్యమయన పాత్ర నిర్వ హిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అదికూడా శకుంతలకథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది: ప్రస్తుతకథ ఆదిపర్వంలోనిది.)
వసిష్ఠమహర్షితో వచ్చిన వైరం కారణంగా, ఆయనవలె బ్రహ్మర్షి కావాలనే కోరికతో విశ్వామిత్రుడు తీవ్రనియమాలతో తపస్సు చేస్తున్నాడు.
దేవేంద్రుడు ఆ తపోదీక్షకు భయపడి ఏ విధంగానయినా దానికి భంగం కలిగించాలని బాగా ఆలోచించి, ఆలోచించి ఏ మానవుడయినా కామినీ, కాంచనాలకు దాసు డవుతాడని నిశ్చయించుకున్నాడు.
ధనంకంటే మనిషిని సుందరీమణులే మరింతగా వంచించగలరని భావించి, అప్సరసలకు తలమానికమయిన మేనకను పిలిపించి:
‘ అప్పరోజునశిరోమణి !
ఇప్పుడు మవ్వాక దేవకార్యం సాధించవలసి ఉంది. నా వజ్రా యుధం పనిచెయ్యనిచోట్ల నీ కంటిచూపులు తీవ్రంగా పనిచేస్తాయని మేమెరుగుదుము. ఆ శక్తిని ప్రయోగించి కార్యం సాధించాలి.
విశ్వామిత్రిమహర్షి పేరు విని ఉంటావు. ఆయన గాధిరాజ నంద మడు. రాజభోగాలన్నీ అనుభవించి, వసిష్ఠులవారితో యుద్ధానికిపోయి, ఆ బ్రహ్మవేత్తముందు ఆగలేక రాజశక్తికంటే బ్రహ్మవిదులశక్తి ఘన మనదని గ్రహించి, దానిని సాధించడానికి తీవ్రంగా తపస్సు చేస్తు న్నాడు. అదిమాకు సంతానం కలిగిస్తున్నది. ఆయన దీక్షకు భంగం కలిగించడం సామాన్యవిషయంకాదు. ఆయన శక్తి కూడా అసాధారణ మయినది,
అయినా నీ రూపం, లావణ్యంగా, నాట్య విద్యా ప్రావీణ్యం వీటితో ఆయన తపస్సమాధికి భంగం కలిగించాలి’ అన్నాడు.
మాటలు వింటున్న మేనక శరీరం ఆపాదమస్తకం కంపించింది. గుండె నిబ్బరం తగ్గింది.
‘ ప్రభూ ! మీ మాటకు ఏనాడూ ఎదురు చెప్పకుండా తలవంచి వెళ్ళి పనులు చేసుకువచ్చాం. కాని, విశ్వామిత్రులవారి పేరు వింటేనే మాకు గుండె దద్దరిల్లుతున్నది.
ఆయన సామర్థ్యం మీ రెరుగనిదికాదు. ఆయన తపస్సు, తేజస్సు ఎంతటివో అంతకంటే పదిరెట్లు ఆయనకు క్రోధం. దీనికేకదా మీరు భయ పడుతున్నారు మీరే భయభ్రాంతులయేచోట మా గతి ఏం కావాలి?
వసిష్ఠులవారి కొడుకు లందరినీ సంహరించిన క్రోధమూర్తి ఆయని. తపస్సుకి అంతరాయం కలగకుండా తన ఆశ్రమ సమీపంలో నదిని ప్రవ హింపజేసుకున్న శక్తిశాలి. మతంగునిచేత యజ్ఞం చేయించినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి సోమపానం చెయ్యక తప్పలేదు. వసిష్ఠులవారు శపించిన త్రిశంకునిచేత యజ్ఞంచేయించి, ఆ రునికోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు.
ఆయన కన్నులెర్రజే స్తే ముల్లోకాలూ భస్మం అవుతాయి. కోపంతో భూమిమీద తన్నితే భూగోళం గజ గజ వణుకుతుంది. మేరు పర్వతాన్ని గడ్డి పరకలా చూడగలడు. అంతటి మహామహుని దగ్గరకు నన్ను వెళ్ళ మంటున్నారు.
నేను పెడతాను. అంతకుముందు ఆయన ఉన్న వనం అంతా వసంతశోభతో, మల యవవనాలతో, సుగంధ సౌరభంతో అలరారు తుండాలి. నేను ఆమహర్షి ఎదుటకు వెడుతున్నప్పుడు వాయువు నా పైట చెరుగును ఎగరవేసుకు పోవాలి.
ఇన్నిటితోపాటు మన్మథుడు జాగరూకతతో తన పనిని కొనసాగిం చాలి. అప్పుడు మీ శాసనాన్ని నేను సక్రమంగా పాలించగలుగు తామ’ అంది.
దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి పంపించాడు.
మేనక అమరావతి విడిచి విశ్వామిత్రుని తపోవన వాటికకు వచ్చింది.
అప్పటికే ఆశ్రమ పరిసరాలలో అతలు మొగ్గ తొడిగాయి. చెట్లు పూలతోనిండి సువాసన భీమతున్నాయి. గాలి చల్లగా పోతుతున్నది.
అటువంటి సమయంలో ఆశ్రమ సమీపాన తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రునికి అల్లంతదూరంలో నిలబడి, అభినయంతో చేతులు జోడించింది మేనక.
ఆమె చేతిగాజులు, కాలి అందెలమువ్వలు కదలి వన సన్నగా ధ్వని చేస్తూ ఆ మహర్షి చెవులలో చేరుతున్నాయి.
ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచే వేళకు ఆమె అంజలి బంధంతో నాట్యం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి గాలి విసురుతో ఆమె పైట కండువా ఎగిరి దూరంగా పడింది.
కన్నులు విప్పిచూశాడు విశ్వామిత్రుడు.
చూస్తున్న విశ్వామిత్రుడు తపస్వి,
చూసిన విశ్వామిత్రుని దీక్ష పడలింది.
నెమ్మదిగా లేచాడు.
ఆమె సిగ్గుతో వెనుదిరిగి పై టకండువా కోసం అడుగులు వేస్తూ వెను దిరిగి చూస్తున్నది.
కనులు మిలమిలలాడిస్తున్నది.
గాలి మరింత రేగింది.
ఆమె పరికిణీ చక్రంలో తిరిగి పైకి లేచింది.
విశ్వామిత్రుని మనస్సు వివశమయింది.
తన స్వాధీనం తప్పిన మనస్సులో కామవికారం పుట్టింది.
కామక్రోధాలను జయించి బ్రహ్మర్షి వదం చేరాలనే పట్టుదలతో మానవ సంచారం లేని మహారణ్యంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వామిత్రుడు ఆ వనంలో ఏకాంతంలో పైటజారిన మందరీమణి కనిపించే సరికి సర్వమూ మరిచిపోయి మనసులో మదనతాపం రేగగా మేనకను చేరబిలిచాడు.
మేనక సిగ్గుతో, భయపడుతూన్నట్లు రాజహంసలా నెమ్మదిగా అడుగులో అడుగువేస్తూ ఆయనను సమీపించింది.
విశ్వామిత్రుడు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.
పది సంవత్సరాల కాలం గడిచింది.
అంతా ఒక నిమేషంలో అనిపించింది, ఆ విశ్వామిత్రునికి.
అప్పటికి మేనక గర్భవతి అయింది.
ప్రసవ కాలం సమీపిస్తున్నది.
నాటికి తెలిపింది, విశ్వామిత్రునికి
ఏమని?
తను కామాన్ని జయించలేదని.
అంతే మేనకను విడిచి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు, తపో దీక్ష
మేనక ప్రసవించి శిశువును మాలినీ నదితీరాన ఒక చెట్టు క్రింద వదలి దేవలోకం చేరుకుంది.
ఆ అమ్మాయి పేరే శకుంతల.
(ఎంతటి మహామహులయినా ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలను చేర నిస్తే పతనం తప్పదని నీతి)