Lord Krishna Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

Lord Krishna Mangala Harathi Patalu In Telugu

Lord Krishna Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

కృష్ణుడు (లేదా కృష్ణభగవానుడు) హిందూ మతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలలో ఒకరు. ఆయనను వైష్ణవ సంప్రదాయంలో విష్ణువుకి అష్టావతారాలలో ఎనిమిదవ అవతారంగా పూజిస్తారు. శ్రీకృష్ణుడు యాదవ వంశంలో వసుదేవుడు, దేవకుల కుమారుడుగా మథురలో జన్మించాడు. ఆయన జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా అత్యంత భక్తితో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జీవితంలో ఎన్నో సంఘటనలు, లీలలు ఉన్నాయి. చిన్నప్పటి నుండే ఆయన అసురులను సంహరించి, తన భక్తులను కాపాడేవాడు. బాల్యంలో పొట్టి కృష్ణుడి బదురి గోపాలుల కోసం చేసిన అద్భుతాలు, నందగోపుల పాలు, పెరుగు కాపాడిన విధానం, గోపికలతో క్రీడలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీకృష్ణ మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

కేశవా హారతి గైకొను
ఈశా! భవా! కేశవా!

(ఉదయరవిచంద్రిక రాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: కేశవా యీ హారతి గొను ఇంత కోపంబేలనో హరీ
చ 1) పన్నగేంద్ర శయనా రారా పాపము లెడబాపగ రారా
పారిజాత సుమహరణ రాధా రుక్మిణీ వల్లభా

॥ కేశవా ॥

చ 2) కోపమటరా గోపబాలా కోరితి నిన్ గావగరావా
కరుణ తోడుత మమ్ము గావుము
గరుడ వాహన వేగమెరా

॥ కేశవా ॥

చ 3) వాసిగా యీ సంసార సాగర పురము నందుననోదేవ
దానురాలను రక్షింపరా ధర్మపాలన వీడకే

॥ కేశవా ॥

కోరిన హారతుల్ గోవిందునకు
ఆనంద నందన మందిర శ్రీకృష్ణా

(కాపీరాగం – ఆదితాళం)

పల్లవి: కోరిన హారతుల్ గోవిందునకు
కోమలాంగులు గూడివ్వరే॥

ఆ.ప.) పద్మనాభునకు పాటలు పాడిన
పాపాములన్నియు తొలగునుగా॥
గోకులమందున గోవర్ధనమెత్తి
కాచి రక్షించిన శ్రీకాంతునకు

జయ జయ మంగళం శుభమంగళం.
ప్రియ జయ జయ శుభజయ మంగళం శ్రీకృష్ణా

యదుకుల కాంభోజి రాగం – ఆదితాళం)

చ 1) జయ మంగళం శుభ మంగళం
నంద నందనా నీకు మంగళం
జయ మంగళం శుభ మంగళం
నంద నందనా నీకు మంగళం
నిను పాడగా నరులాడగా నీవు
వేడ్కతో జగమేలగ కనులారగ
నిను చూడగ జాతి నై తిర కృష్ణ బాలక॥

పక పక నవ్వుచు పరుగిడబోకు
శుభంకర! శుభకర! సుంధరవీరా! బాలగోపాలా

(యమునా కళ్యాణ రాగం – ఆదితాళం)

ఆ.ప.) పక పక నవ్వుచు పరుగిడబోకుర!
పడతి యశోదా భాగ్యఫలంబా!

పల్లవి: బాలగోపాల మంగళ హారతు లిచ్చెద
చ 1) లేగ తోకను బట్టి లేమ జెడకు చుట్టి
ఊరకె తోలుట ఉచితముగాదు కృష్ణ

॥బాల॥

మాధవ గొనుమా మంగళ హారతి.
సుధామధుగాధా మాధవా!

(జంగ్లారాగం ఆదితాళం)

పల్లవి: మాధవ గొనుమా మంగళ హారతు లిచ్చెద

॥మాధవ॥

చ 1) ఉరమున సిరియును మెరయుచు నుండగ
గరుడ కిన్నెరులు గానము సేయగ
వరుడ వని నెర నమ్మితిని
సరగున మము దయ జేకొను

చ 2) సృష్టి స్థితి లయముననే కృష్ణుడవై జన్మించితిని
దుష్టుల మద మణగించి శిష్టుల పరిపాలించెడి

॥మాధవ॥

మానినిరో మాధవునికి మంగళం
జ్ఞానమాసత్రేణ మాధవా! శ్రీహరి

(హరి కాంభోజి రాగం – త్రిశ్రగలి తాళం)

చ 1) మానినిరో మాధవునకు మంగళం బని
పాడగా పాడగా మానవతులు కూడి వేగ
దీనజనుల బ్రోవు మనుచు
గానలోల గారవించు

॥మానినిరో॥

చ 2) మకరిచేత చిక్కి హరి మొరలు పెట్టగా
తికమకలై సకలాత్ముడు వేగ వచ్చి
సకలనుతా శస్త్రమున
మకరి ద్రుంచి కరి గాచిన

॥మానినిరో॥

చ 3) అంబ తపసి వెడలు బుద్ధి
అంబరీశుని శపియింపగ
డింబ మనుచు చక్రమంటి
కుంభినీ తన యార్చితునకు
సంభ్రమమును కలిగించును

॥మానినిరో॥

చ 4) తులువలైన కౌరవులు
వలువ లొలువ కరుణ కల్గి
కలత తీర్చి పిలువక – నే తరలి వచ్చి
వలువ లిచ్చి పగబాపిన

॥మానినిరో॥

Lord Krishna Mangala Harathi Patalu In Telugu pdf

మంగళ హారతిదేరా
ఆవిరళ సంగరఖేలన ధీరా! గోపాల

(జంగ్లా రాగం – ఆదితాళం)

పల్లవి: మంగళా హారతిదేరా మార సుందరా!
చ 1) రాధారమణా రమ్య గుణాకర
రక్షించు సమయ మిదేరా రాజేంద్ర వినుత

॥మం॥

చ 2) వేణునాద ప్రియ వేగమె కాపాడగ
వేడితీరా నిన్ను వేగమె రారా

॥మం॥

చ 3) గోకులమందున గోపాలుర గూడి
గోవర్ధన మెత్తిన గోపాలా రారా

॥మం॥

చ 4) పదునాల్గు భువనములు బొజ్జ నిల్పిన తండ్రి
పాపుల నందన జంపిన పన్నగ శయనా

॥మం॥

చ 5) వైకుంఠ మందునా వటపత్రసాయివై
వామ భాగమునందు గూడి

॥మం॥

మంగళ హారతిదేరా
ఆనంద నందన సుందరా శ్రీ కృష్ణా

(జంగ్లా రాగం – ఆదితాళం)

పల్లవి: మంగళ హరతిదేరా మారా సుందరా రాధా రమణా రమ్యగుణాకర
రక్షించు సమయ మిదే రాజేంద్ర వినుతా!

చ 1) వేణునాద ప్రియ వేగమె కాపాడరా
వేడితిరా నిన్ను వేవేగమె రారా

॥మం॥

చ 2) గోకుల మందున గోపాలురతో గూడి
గోవర్ధన మెత్తిన గోపాల బాల రారా

॥మం॥

చ 3) పదునాల్గు భువనముల్ బొజ్జ నిలిపిన తండ్రి
పాపుల దుష్టుల చంపిన పన్నగ శయనా

॥మం॥

చ 4) వైకుంఠ మందున వటపత్రశాయివై
వామభాగము నందు లక్ష్మీతో గూడిన

॥మం॥

రంగా! నీకిదే మంగళం.
రంగదుత్తుంగ నానందతరంగా రంగ!

(మోహనరాగం – ఆదితాళం)

పల్లవి: రంగా నీకిదే మంగళం – కస్తూరి రంగా నీకిదే మంగళం

చ 1) రంగ ఖగరాట్ తురంగ కలుష వి
భంగా తవ మోహనాంగా వయ్యారి

॥రంగా॥

చ 2) హరే విబుధ విహారీ ఉభయ
కావేరీ తీర విహారీ వయ్యారి

॥రంగా॥

చ 3) అన్నా యితరుల నన్నెవరు-నీ
కన్న నన్ను బ్రోవుచున్నా-వయ్యారి

॥రంగా॥

చ 4) లీలా శేషాంశు లీలా కరుణాల
వాలా జగత్పరిపాలా-వయ్యారి

॥రంగా॥

చ 5) అయ్యా వరము మాకియ్య నిను నమ్మి
తయ్య నను బ్రోవుమయ్య-వయ్యారీ

॥రంగా॥

చ 6) హాసా మహ చిద్విలాసా శేషాచల
దాశార్చిత పరమేశా-వయ్యారి

॥రంగా॥

రాధా మనోహర హారతి ఇదేరా
సుధా మధుర నిధీ! శ్రీకృష్ణా

(శుద్ధసావేరీ రాగం – ఆదితాళం)

పల్లవి: రాధా మనోహర హారతి ఇదేరా గైకొను ధీరా

చ 1) నారాయణ దామోదర కేశవ
నందుని వర సుకుమారా
నను గావగ నీవేరా
మందారధార సుందరాకార

||రాధా॥

చ 2) శేషశైల ద్వారకావాసా నిజమనీషా రవికుల భూషా
ఆహల్య శాప విమోచనా!
గోపాల బాల కృప జూపుమివేళ

||రాధా॥

చ 3) వైకుంఠవాసా వామనరూపా
వందన మీదే గైకోరా
నను గావవేర వేగరా
కరిరాజ మిత్ర కౌసల్య తనయా

॥రాధా॥

Lord Krishna Mangala Harathlu In Telugu pdf

మంగళ హారతిదేరా
మంగళాంగా! దివ్మతురంగా! శ్రీకృష్ణా!

(జంగ్లారాగం – ఆదితాళం)

పల్లవి: మంగళహారతిదేరా మారా సుందరా
రాధా రమణా రమ్యగుణాకర
రక్షించు సమయ మిదేరా రాజేంద్రా వినుతా

చ 1) వేణునాద ప్రియ వేగమె కాపాడరా
వేడితిరా నిన్ను వేవేగమె రారా

॥మం॥

చ 2) గోకులమందున గోపాలురతో గూడి
గోవర్ధన మెత్తిన గోపాల బాల రారా

॥మం॥

చ 3) పదునాల్గు భువనముల్ బొజ్జలోనిల్పిన తండ్రి
పాప పుదుష్టుల చంపిన పన్నగశయనా

॥మం॥

చ 4) వైకుంఠమందున వటపత్రశాయి వై
వామభాగమునందు లక్ష్మితో గూడిన

॥మం॥

సంగీతలోలా నందునిబాలా
రంగా తరంగ సంగీత భంగీ శ్రీకృష్ణా

(యమునా కళ్యాణి రాగం – ఆదితాళం)

పల్లవి: సంగీతలోలా నందునిబాలా మంగళహారతిగొను మీవేళా||
చ 1) అంగన లందరు శృంగారమ్ముగ
బంగారు పళ్ళెరముల కొని పాడ

చ 2) దేవేంద్రుడు శిలావర్షమ్ము
ధేనువు లన్నిటి పై కురియింపగ కృష్ణ

చ 3) గోవర్ధన గిరి గోటితో ఎత్తి
గోపాలకులను గాచిన కృష్ణ

చ 4) శిశుపాలకునకును చెలియను ఇచ్చుట
సద్విధంబని నుడివెడి జపములు

చ 5) వనుధేశులతో వంచన చేయక
వనిత రుక్మిణిని వేగమె పరిణయమాడిన కృష్ణ

హారతు లేశారమ్మ
ధీరవీర సారమారా శ్రీకృష్ణా

(ఫరజు రాగం – జుంపె తాళం)

పల్లవి: హారతు లివ్వరమ్మా – శ్రీ వేణుగోపాలుని బోలేటి తమ్మునకు

చ 1) తమ్మిట్లు, జూకాలు, తళతళ మెరయగ
వన్నెచక్కనీ చుక్క చిన్నారి తమ్మునకు

॥హారతి ||

చ 2) కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మ్రోయగ
చిట్టి పాదాలతో చిందాడే తమ్మునకు

॥హారతి ||

చ 3) వెయ్యి నూటపదహార్లు వెయ్యవలెనేగాని
కొద్దిగా వేస్తేను కోపగిస్తా మేము

॥హారతి ||

శ్రీ రాధాపతే మంగళం
మధుర సుమధుర రాధాపతే

(సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: శ్రీరాధాపతే మంగళం ఓధీరా గంభీరా సుందరసుకుమార

చ 1) వేది గోచరుడవు నీవేకదా
మోదముతో నను బ్రోవ రారా
రాదా దయరాదా ఇది మర్యాద

॥రాధా॥

చ 2) మందర ధర నీదు సౌందర్యము
పొందుగ వర్ణింప సాధ్యమా
ఆనందా నంద గోవిందా ముకుందా.

॥రాధా॥

చ 3) ధరలోన మైసూరు పురములోన
వరలిన నన్ను దాసుడను
రాతిని నాతిగ చేసిన శ్రీరామా

॥రాధా॥

మరిన్ని భక్తి గీతాలు : 

Saksham Leni Prema Kastani Kaligistundi In Telugu – సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది

Saksham Leni Prema Kastani Kaligistundi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది నీతికథ.

సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది

మేనకా, విశ్వామిత్రులు ఎవరి దారిని వారు వెళ్ళారు. ఒక చెట్టు నీడలో శకుంతములు (పక్షులు) పోషిస్తున్నాయి పసిపాపను.

అటువై పు నదీస్నానానికి వచ్చాడు కణ్వమహర్షి. ఆయన కంట పడింది ఆ పాప. ఆమెను రెండు చేతులలోనికి తీసుకుని తన ఆశ్రమానికి తెచ్చి పెంచుతున్నాడు.

శకుంతములు (పక్షులు) పోషించిన కారణంగా ఆమెకు శకుంతల అని పేరుపెట్టాడు.

ఆమె పెరిగి పెద్దదవుతున్నది.
చక్కనిచుక్కలా, అప్పుడే విరిసిన పువ్వులా పదహారేళ్ళ ప్రాయంతో శకుంతల ఆశ్రమంలో తిరుగుతూ కణ్వమహర్షిని కన్నతండ్రిలా సేవించు కుంటున్నది.

అలా రోజులు గడుస్తూండగా ఒకనాడు దుష్యంతమహారాజు ఆ అర డ్యానికి వేటకు వచ్చాడు. వేట సాగుతుండగా ఆ మహారాజు కణ్వమహర్షి ఆశ్రమ ప్రాంతం చేరాడు.

సమీపంలో మహర్షి ఆశ్రమం కనిపించగానే పరివారాన్ని దూరంగా ఉంచి, ఒంటరిగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు.
ఎంతటి మహారాజయినా, ఆ రోజులలో వేదవిదులను, మును లను, మహర్షులను అప్పుడప్పుడు స్వయంగా వెళ్ళి దర్శించి, వారి ఆశీ ర్వాదాలు పొందే సంప్రదాయం ఉండేది.

ఆ భావంతోనే ఆశ్రమ పరిసరాలలోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా సేననూ, పరివారాన్ని దూరంగా ఉంచి వచ్చాడు.

ఆశ్రమం దగ్గర ఎవరూ కనబడలేదు. కొంచెం లోపలకు నడిచాడు. ఎదురుగా శకుంతల కనిపించింది.

ఆమె శరీర లావణ్యం, అవయవ శోభ మహారాజు మనస్సుమ ఆకర్షించాయి.

మహారాజును చూస్తూనే ఆమె అతిథిమర్యాదలు జరిపింది. ఇరు పురూ కుశలప్రశ్నలు వేసుకున్నారు.

అప్పుడు శకుంతల:
‘ఆర్యా! తమరు మా ఆశ్రమానికి ఏ పనిమీద దయచేశారో సెల విస్తారా’ అంది.

‘ పద్మముఖీ !
నేను అవిల మహారాజు కుమారుడను. నన్ను దుష్యంతుడని పిలు స్తారు. మహాఋషి కణ్వులవారిని దర్శించి వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని వచ్చాము. వారు కనిపించలేదు’ అన్నాడు దుష్యంతుడు.

శకుంతల! మహారాజా! మా పితృపాదులు ఫలాలు తేవడానికి వెళ్ళారు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకొనేలోగా వస్తారు.

దుష్యంతుడు: ఓ లావణ్యలహరి చూడగానే మమ్ము ఆకర్షించిన నీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ అరణ్యంలో ఆశ్రమాలలో ఉండవలసిన అవసరం నీ కెందుకు కలిగింది? నువ్వెవరి బిడ్డవు? ఈ ప్రశ్నలు ఎందుకడుగుతున్నానంటే కణ్వమహర్షి ఇంద్రియాలను జయించి తపోదీక్షలో ఉన్నారని విన్నాం. ఆయనకు వంశానం కలిగే అవకాశం లేదు. నిన్ను నా భార్యగా గ్రహించి రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిని చేయాలని ఉంది.

శకుంతల ఆర్యా! కణ్వమహర్షి నాకు గురువులు. వారి అనుమతి లేనిదే నేను స్వతంత్రించి ఏ పనీ చెయ్యను. వారు రాగానే మీరు వారిని అడగండి.

దుష్యంతుడు: అతిలోకసుందరీ బ్రహ్మచర్య వ్రతనిష్ఠలో ఉండే కణ్వమహర్షి సంతానం ఎలా కలిగింది?

శకుంతల: మహారాజా! నేను మేసకా విశ్వామిత్రుల బిడ్డను. నన్ను చిన్ననాటి నుంచీ పెంచి పెద్ద చేసిన వీరే నాకు తండ్రివంటివారు.

దుష్యంతుడు : విశ్వామిత్రుని పుత్రివయిన నువ్వు రాజ వంశానికి చెందిన దానవు కనక, రాజులకు ఉచితమయిన గాంధర్వ వివాహం మనం చేసుకోవచ్చు. దానికి ఒకరి అనుమతి అవసరం లేదు.

శకుంతల: మహారాజా! గాంధర్వం ధర్మబద్దమయితే నేను మిమ్ము పెళ్ళి చేసుకుంటాను. కాని ఒక నియమం ఉంది. మీవల్ల నాకు కలిగిన కుమారుడు మీ రాజ్యానికి చక్రవర్తి కావాలి.
అంగీకరించాడు దుష్యంతుడు,
ఇద్దరూ కొంతసేపు సుఖించారు.

దుష్యంతుడు ఆమెను అనునయించి రాజధానికి వెళ్ళగానే చతు రంగ బలాలను పంపి మహారాణిగా తీసుకు వెడతానన్నాడు.

దుష్యంతుడు వెళ్ళిన కొద్దిసేపటికి కణ్వమహర్షి వచ్చాడు. సిగ్గుతో, భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి, చిరునవ్వుతో స్వాగతం పలక లేదు.

కణ్వమహర్షి ఆమెనుచూసి ‘అమ్మా! ఆశీర్వాదం. ఏం జరిగింది. తల్లీ ? నిర్భయంగా చెప్పు’ అన్నాడు.

‘పితృపూజ్య ః దుష్యంత మహారాజు మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనను నేను భర్తగా స్వీకరించాను. అనంతర కథ మీరు గ్రహించ గలరు’ అంది శకుంతల.

కణ్వమహర్షి ప్రసన్న వదనంతో !
‘అమ్మా ! చాలా సంతోషం. అనురాగ తరంగిత హృదయులయిన మీరు ఏర్పరచుకున్న సంబంధం క్షత్రియులకు తగినదే. దీనినే గాంధర్వం అంటారు. యోగ్యుడయిన భర్తను పొందావు.

అందువల్ల నీవు ధర్మాత్ముడూ, మహా బలిష్ఠుడూ అయిన కుమా రుని కని కీర్తి పొందుతావు, నీ పుత్రుడు సర్వశత్రు సంహారం చేసి భూ మండలాన్ని పరిపాలించగలడు, ‘ అని ఆశీర్వదించాడు.

రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి.
మహారాజు నుండి కబురు లేదు. శకుంతల మనసంతా దుష్యంతుని మీదనే ఉన్నది. ఆకలి వెయ్యడం లేదు. పరిశుభ్రంగా స్నానం చెయ్యా అనిపించడం లేదు. ఏ పూట కాపూట రాజధాని నుండి రథం వస్తుందని ఎదురు చూస్తున్నది.

ఈలోగా నెలలు నిండి ఒకానొక శుభ ముహూర్తంలో ఆమె ప్రస వించింది.

కణ్వమహర్షి ఆ బాలుడికి జాతక కర్మ జరిపించాడు.
బాలుడు పెరుగుతున్నాడు. వాని చేతులలో చక్రాలు చక్రవర్తి లక్షణాలని నలుగురు అంటూంటే ఉప్పొంగేది శకుంతలలోని మాతృ హృదయం. ఆరేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ బాలుడు సింహంవలె పరాక్రమించి, ఆశ్రమ పరిసరాలకు వచ్చే పెద్దపులులనూ, సింహాలనూ, మదగజాలనూ చెవులు వట్టి ఆడించే వాడు.

అది చూసి అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు.

పెరుగుతూ ఉన్న బాలునికి రాజవంశ సంప్రదాయానుసారం అన్ని విద్యలూ నేర్పుతున్నాడు కణ్వమహర్షి.

పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
అప్పుడొకనాడు కణ్వమహర్షి :

‘అమ్మా! అంతవరకూ మహారాజు కబురు పంపలేదు. ఇప్పుడు నీ కొడుకు యువరాజు పదవి అలంకరించవలసిన వయసులో ఉన్నాడు. ఎంతటి పతివ్రతయినా చిరకాలం పుట్టింట ఉండకూడదు. భర్త దగ్గరే కష్టమయినా, సుఖమయినా అనుభవించడం భార్యకు ధర్మం,’ అని ఆమె కుమారుని దగ్గరగా తీసుకుని.

‘నాయనా! చంద్రవంశీయుడయిన దుష్యంత మహారాజు నీ తండ్రి. నువ్వు మీ అమ్మతో అక్కడకు వెళ్ళి యువరాజు పదవిని ధర్మ దీక్షతో నిర్వహించాలి’ అని తన శిష్యులను పిలిచి.

‘నాయనలారా వీరిద్దరినీ తీసుకు వెళ్ళి దుష్యంత మహారాజు దగ్గర విడిచి రండి’, అన్నాడు.

ప్రయాణ సన్నద్ధురాలై శకుంతల ఆయన పాదాలకు అభివాదం చేసింది.

బ్రహ్మచర్య దీక్షితుడూ, తపస్సంపన్నుడూ అయిన కణ్వమహా మునికి కన్నీరాగలేదు.

పెంచిన ప్రేమ నిండిన గుండెలో బాధ పుట్టింది. కంటనీరు ఒలి కింది. గద్గద స్వరంతో:

‘ లోకమంటే ఏమిటో ఎరగని ఈ అమాయకురాలిమీద దేవతలం దరూ దయ చూపాలి !’ అని ఆశీర్వదించి పంపాడు.

శకుంతల తన కుమారుడైన భరతుని (సర్వదమనుని ముద్దుపేరు) వెంట పెట్టుకుని దుష్యంతుని దగ్గరకు బయలుదేరింది.

అరణ్యం దాటి రాజధాని చేరి దుష్యంతుని కోటలో ఆయన కొలు వులో శకుంతలనూ, భరతునీ విడిచి కణ్వుని శిష్యులు తరలి వెళ్ళారు.

దుష్యంత మహారాజు సభా భవనంలో సింహాసనం మీద ఉన్నాడు. మంత్రి, సామంత, దండనాథులతో విద్వాంసులు కూడా ఆ సభలో ఉచి తావనాల మీద అలరారుతున్నారు.

అప్పుడు వచ్చిన శబంతల, తన కుమారుడయిన భరతుని భుజం మీద చెయ్యి వేసి

‘నాయనా! సత్య ధర్మ పరాయణుడైన ఈ మహారాజు మీనాన్న గారు. ఆయనకు నమస్కరించు,’ అని తను కూడా చేతులు జోడించింది.

కుమారుడు భరతుడు సంతోషంతో ఆశగా తండ్రి వైపు చూశాడు. దుష్యంతుడు: ఓ తరుణీ। నీ బిడ్డను తీసుకుని ఏ ప్రయోజనం కోరి వచ్చావో అడుగు।

శకుంతల మహారాజా! వీడు మీ కుమారుడు. అలనాడు మీరు వేటకు వచ్చి కణ్వాశ్రమంలో గాంధర్వవిధిని నన్ను వివాహం చేసుకునే ముందు నా బిడ్డకు యువరాజు పదవి యిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవలసిన భారం మీ మీద ఉంది.

దుష్యంతుడు! ఓ మూర్ఖురాలా! నువ్వెవరివి? నిన్ను నే నెప్పుడూ చూడలేదు. ఇటువంటి అసందర్భపు ప్రలాపాలు కట్టిపెట్టి బయటికినడు.

శకుంతల మహారాజా ! మీరు నన్ను చూడనేలేదా? గుర్తు తెచ్చు కోండి. పన్నెండేళ్ళ క్రితం వేటకువచ్చి మాలినీ నది తీరాన కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర నన్ను కలిసి మీ రాడిన మాటలు మరవ కండి. పంచ భూతాలూ, సూర్య చంద్రులూ, అంతరాత్మ-ఇవన్నీ మనం చేసే ప్రతి పనికీ సాక్షులు. వాటి కన్ను గప్పి ఎవరూ ఏమీ చెయ్యలేరు.

ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కనక మీరు తిరస్కారభావంతో చూస్తున్నారు. మీ సభలో నా మాటలు అరణ్యరోదనంలా ఉన్నాయి. ఒక్కటి మరువకండి. పురుషుడు పుత్ర రూపంలో భార్యాగర్భంలో ప్రవేశించి పితృదేవతలను ఉద్ధరిస్తాడు. పున్నామ నరకంమంచి కుమారుని వల్లనే బయటపడతాడు. భార్య అనేది తండ్రివలె పురుషుని హితవు కోరుతుంది. తల్లి వలె ఓరిమితో ఓదారుస్తుంది. మిత్రుని వలె సాయపడుతుంది. లోకంలో ఎవ రయినా భార్య కలవానినే విశ్వసిస్తారు. వివాహం కానివాడు ఎంత ధనవంతుడయినా ఆ పంపద, అడవిశాసిన వెన్నెం. అన్ని విధాల తోడునీడగా ఉండాలి కనకనే భార్యను ఎన్నుకునేటప్పుడు రూపంతోపాటు గుణం, గుణంతో శీలం, శీలంతో సంప్రదాయ పదాచారాలు చూచుకుంటారు పెద్దలు.

పోగా –
భార్యగర్భం నుంచి ప్రభవించిన బాలుడు సర్వ విధాలా తండ్రిని పోలి ఉంటాడు. అద్దంలో ప్రతి బింబంలా కుమారునిలో తండ్రి రూపం సాక్షాత్కరిస్తుంది. అందువల్ల నే పుత్రోదయ, దర్శనాలు తండ్రికి ఆహ్లాదం కలిగిస్తాయి.

దేశ భ్రష్టులయి, దుర్భర దారిద్య్ర్యం అనుభవించే వారయినా భార్య దగ్గర ఉంటే ఆకష్టాలు మరచిపోతారు. అందువల్లనే భార్యను అనాదరంతో, ఆగ్రహంతో బాధించరాదు అని వివేకవంతులు చెపు తున్నారు.

మహారాజా ! అంతకంటే ప్రధాన ధర్మం ఉంది.
అది పుత్ర వాత్సల్యం.
పసితనంలో ఎక్కడ పడితే అక్కడ పాకుతూ, దుమ్ములో దొర్లుతూ, అల్లంత దూరంలో తండ్రి కనిపించే సరికి కిలకిల నవ్వుతూ వచ్చి రెండు కాళ్ళూ చుట్టివేసుకుని ఆశగా చూసే కొడుకుకంటే ఆనందం కలిగించే విషయం మరొకటి ఉన్నదా?

నామాట మీకు ఎంత చేదుగా ఉన్నా ఈ మీ కుమారుని వైపు చూడండి. మీ ఒడిలో కూర్చుని యువరాజు ఠీవిని ఒలికించాలనే కోరిక వీడి కన్నులలో మీకు కనిపిస్తుంది.

చిన్న చిన్న చీమల నుంచి పక్షులు, పశువులు తమ సంతానం మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. తన గూటిలో ఉన్న కోకిల గుడ్లను కూడా కాకి అమాయకంగా తన సంతానమే అని సాకి పొదుగుచున్నది.

అది ఎరిగిన మీరు మీ కుమారుని విషయంలో ఆవాదరం చూపడం న్యాయం కాదు.

సామాన్య మానవుడు కూడా తిరిగి తిరిగి యింటికి రాగానే తన బిడ్డలను దగ్గరగా తీసుకుని ముద్దులాడి పొంగిపోతాడు.

మరొక మాట:
తన బిడ్డకు ” జాతక కర్మ” జరుపుతూ
” అంగాదంగాత్
సంభవసి……..

నా ప్రతి అవయవం నుంచి మవు జన్మించావు. నా హృదయంలో నువ్వే. నా ఆత్మ నువ్వు. అటువంటి నువ్వు నూరేళ్ళు సుఖంగా బ్రతుకు అంటాడు.

చూడండి నిర్మలమయిన కొలనిలో ప్రతిబింబంలా వీడు ముమ్మూ ర్తులా మిమ్ము పోలి ఉన్నాడు..

అని అలా శకుంతల చెప్పుకు పోతున్నది.
దుష్యంతుడు కదలకుండా పెదవి మెదవకుండా కూర్చున్నాడు.
“మహారాజా ! రాజ కార్యాలలో మునిగి తేలే మీకు అన్ని విష యాలూ గుర్తుండవు.

పన్నెండేళ్ళ క్రితం
వేటకోసం అడవికి వచ్చారు.
మీ బాణానికి అందక పరుగెత్తే లేడికోసం తిరుగుతూ మా ఆశ్ర మంలో ప్రవేశించి గాంధర్వ విధానాన నన్ను పెళ్ళి చేసుకున్నారు.

అప్సరో భామలలో అగ్రశ్రేణికి చెందిన మేనక నా తల్లి .
తేజోవంతుడూ, తపస్వీ అయిన విశ్వామిత్రులవారు నా జనకులు. నన్ను పెంచిన జనకుడు బ్రహ్మర్షి కణ్వులు.

అటువంటి ఉత్తమురాలి నయిన నన్ను తియ్య తియ్యని మాట లతో పరిగ్రహించారు. ఆనాటి మన సమాగ ఫలం ఈ బాలుడు,

విశ్వరక్షతులైన మీరు నా ప్రాణ నాథులు. ధర్మ పరులయిన మీరు నన్ను మోసం చెయ్యకండి.

చిన్న నాడే నా తలిదండ్రులు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా ప్రాణ నాథులయిన మీరు కూడా తిరస్కరిస్తున్నారు. కష్టాలు నాకు కొత్తకాదు. కాని ఈ బాలుడు మాత్రం మీ కుమారుడే’ అని నిట్టూర్చింది.

దుష్యంతుడు శకుంతలా సాధారణంగా అబద్ధా లాడడం ఆడవారికి సహజ గుణం. నీ మాటలు మరి సమ్మక్తివంత అబద్దాల పుట్టణ.

ఎక్కడి విశ్వామిత్ర మహర్షి ।
వారికి కలిగిన నువ్వు ఇలా కుంటలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను నమ్మలేను. నువ్వు ఏమేమో కథలు చెపుతున్నావు. నా కనలుగుర్తు లేవు.

శకుంతల మహారాజా! ధర్మ భ్రష్టులను తాచుపాముతో పోలుస్తారు, అందుకే భర్తృ హీవలకు వాస్తికులు కూడా భయపడతారు.

మహారాజా వందనూతులు తవ్వించడం కంటే ఒక దిగుడుబావి నిర్మించడం మంచిది. అటువంటివి నూరు నిర్మించడం కంటే ఒక పర్కతువు మంచిది. అవి నూరు చెయ్యడం కంటే గుణవంతుడయిన కొడుకును కనడం శ్రేష్ఠం. కుమారులు నూరుగురికంటె ఒక్క సత్య వాక్యం శ్రేయోదాయకం. సత్యమే పరమేశ్వరరూపం. అందుచేత మీరు సత్యాన్ని మరువకండి. నన్ను విడిచినా బాధలేదు. నేను పెడతాను. ఆఖరు సారిగా ఇటు వీడికన్నులలో మీ చూపుని నిలవండి. మీ కొడు కవునో కాదో తెలుస్తుంది. సరిగ్గా ఆ సమయానికి ఆ శరీరవాణి ఇలా పలికింది.

‘మహారాజా! ఈమె నీ భార్య, వీడు నీ కుమారుడు. ఆమె నిజం చెప్పింది.’
ఆ మాటలు విని దుష్యంతుడు
‘సభాసదులారా !
విన్నారు కదా ధర్మ దేవత పలుకులు.

ఈమె చెప్పిందంతా నిజమే. కాని ముందుగా అంగీకరిస్తే మీ రంతా ఈ పుణ్యశీలను శంకిస్తారని ఇంతసేపు ఆగామ’

అని కొలువు చాలించి, శకుంతలా భరతులను దగ్గరగా తీసుకుని అంతఃపురానికి వెళ్ళి తన తల్లికి నమస్కరింపజేసి, విషయం వివరించి, ఆశీర్వాదాలు పొందాడు.

(భారతంలో మొదటి ప్రేమ కథ ఇది. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కల్గిస్తుంది. నాడు ధర్మం రక్షించి ఉండకపోతే ఈ నాటి ప్రేమ కథే ఇది కూడా)

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhakti Yogam | భక్తి యోగం

Bhakti Yogam

భక్తి యోగం ఒక హిందూ యోగ పథం, మరియు ఆధ్యాత్మిక అభ్యాసము. ఈ యోగంలో, భక్తి మరియు అనుష్ఠానం ముఖ్యమైనవి. వ్యక్తి తన దైవభక్తిని, పరమాత్మ సంబంధమును అభివృద్ధి చేయడానికి ఈ యోగాన్ని అభ్యసించవచ్చు. భక్తి యోగం మూలమైన ఉద్దీపన అనుభవాలతో, అంతరాళంలో చలింపును చేపట్టేది. ఈ యోగం విశేషంగా దేవుని ప్రేమ మరియు భక్తిని వివరించేది.

Bhakti Yogam | భక్తి యోగం

భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ క్రింది లింకుల ఆధారంగా భక్తి యోగం గురించి తెలుసుకుందాం…

Pooja | పూజ

Pooja

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

Pooja | పూజ

పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ క్రింది లింకుల ఆధారంగా పూజ గురించి తెలుసుకుందాం…

Sri Ganesh Mahimna Stotram In Telugu | శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం

Sri Ganesh Mahimna Stotram In Telugu

Sri Ganesh Mahimna Stotram In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం

అనిర్వాచ్యం రూపం స్తవననికరో యత్ర గలిత
స్తథా వక్ష్యే స్తోత్రం ప్రథమపురుషస్యాత్ర మహతః |
యతో జాతం విశ్వం స్థితమపి సదా యత్ర విలయః
స కీదృగ్గీర్వాణః సునిగమనుతః శ్రీగణపతిః ||

గణేశం గాణేశాః శివమితి చ శైవాశ్చ విబుధాః
రవిం సౌరా విష్ణుం ప్రథమపురుషం విష్ణుభజకాః |
వదంత్యేకం శాక్తాః జగదుదయమూలాం పరిశివాం న
జానే కిం తస్మై నమ ఇతి పరం బ్రహ్మ సకలమ్ ||

తథేశం యోగజ్జా గణపతిమిమం కర్మ నిఖిలం
సమీమాంసా వేదాంతిన ఇతి పరం బ్రహ్మ సకలమ్ |
అజాం సాంఖ్యో బ్రూతే సకలగుణరూపాం చ సతతం
ప్రకర్తారం న్యాయస్త్వథ జగతి బౌద్ధ ధియమితి ||

కథం జ్ఞేయో బుద్ధేః పరతర ఇయం బాహ్యసరణి
ర్యథా ధీర్యస్య స్యాత్స చ తదనురూపో గణపతిః |
మహత్కృత్యం తస్య స్వయమపి మహాన్సూక్ష్మమణువ
ధ్వనిర్జ్యోతిర్బిందుర్గగనసదృశః కిం చ సదసత్ ||

అనేకాస్యో పారాక్షికరచరణో నంతహృదయ
స్తథా నానారూపో వివిధవదనః శ్రీగణపతిః |
అనంతాహ్వః శక్త్యా వివిధగుణకర్మెకసమయే
త్వసంఖ్యాతానంతాభిమతఫలదో నేకవిషయే ||

న యస్యాంతో మధ్యో న చ భవతి చాదిః సుమహతా
మలిప్తః కృత్వేత్థం సకలమపి ఖంవత్స చ పృథక్ |
స్మృతః సంస్మర్తౄణాం సకలహృదయస్థః ప్రియకరో
నమస్తస్మై దేవాయ సకలసువంద్యాయ మహతే ||

గణేశాద్యం బీజం దహనవనితాపల్లవయుతం
మనుశ్చెకార్ణో2యం ప్రణవసహితో భీష్టఫలదః
సబిందుశ్చాంగాద్యాం గణకఋషిఛందోఒస్య చ నిచృ
త్స దేవః ప్రాగ్బీజం విపదపి చ శక్తిర్ణపకృతామ్ ||

గకారో హేరంబః సగుణ ఇతి పుంనిర్గుణమయో
ద్విధాప్యేకో జాతః ప్రకృతిపురుషో బ్రహ్మ హి గణః |
స చేశశ్చోత్పత్తిస్థితిలయకరో2యం ప్రథమకో
యతో భూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః ||

గకారః కంఠోర్ధ్వం గజముఖసమో మర్త్యసదృశో
ణకారః కంఠాధో జఠరసదృశాకార ఇతి చ |
అధోభావః కట్యాం చరణ ఇతి హీశో2స్య చ తను
ర్విభాతీత్తం నామ త్రిభువనసమం భూర్భువః సువః ||

గణేశేతి త్ర్యర్థాత్మకమపి వరం నామ సుఖదం
సకృత్రోచ్చైరుచ్చారితమితి నృభిః పావనకరమ్ |
గణేశస్యైకస్య ప్రతిజపకరస్యాస్య సుకృతం
న విజ్ఞాతో నామ్నః సకలమహిమా కీదృశవిధః ||

గణేశేత్యాహ్వాం యః ప్రవదతి ముహుస్తస్య పురతః
ప్రపశ్యంస్తద్వక్త్రం స్వయమపి గణస్తిష్ఠతి తదా |
స్వరూపస్య జ్ఞానం త్వముక ఇతి నామ్నాస్య భవతి
ప్రబోధః సుప్తస్య త్వఖిలమిహ సామర్థ్యమమునా ||

గణేశో విశ్వేఒస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ
గణేశో యత్రాస్తే ధృతిమతిరమైశ్వర్యమఖిలమ్ |
సముక్తం నామైకం గణపతిపదం మంగళమయం
తదేకాస్యే దృష్టే సకలవిబుధాస్యేక్షణసమమ్ ||

బహుక్లేశైర్వ్యాప్తః స్మృత ఉత గణేశే చ హృదయే
క్షణాత్ క్లేశాన్ముక్తోభవతి సహసా త్వభ్రచయవత్ |
వనే విద్యారంభే యుధి రిపుభయే కుత్ర గమనే
ప్రవేశే ప్రాణాంతే గణపతిపదం చాశు విశతి ||

గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగళనిధి
ర్దయాలుర్హేరంబో వరద ఇతి చింతామణిరజః |
వరానీశో ఢుంఢిర్గజవదననామా శివసుతో
మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి ||

మహేశో2యం విష్ణుః సకవిరవిరిందుః కమలజః
క్షితిస్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరుదధిః |
కుజస్తారః శుక్రో పురురుడుబుధో గుశ్చ ధనదో
యమః పాశీ కావ్యః శనిరఖిలరూపో గణపతిః ||

ముఖం వహ్నిః పాదౌ హరిరపి విధాతా ప్రజననం
రవిర్నేత్రే చంద్రో హృదయమపి కామోస్య మదనః |
కరౌ శక్రః కట్యామవనిరుదరం భాతి దశనం
గణేశస్యాసన్వె క్రతుమయవపుశ్చైవ సకలమ్ ||

అనర్ఘ్యాలంకారైరరుణవసనైర్భూషితతనుః
కరీంద్రాస్యః సింహాసనముపగతో భాతి బుధరాట్ |
స్మితాస్యాత్తన్మధ్యేఒప్యుదితరవిబింబోపమరుచిః
స్థితా సిద్ధిర్వామే మతిరితరగా చామరకరా ||

సమంతాత్తస్యాసన్ ప్రవరమునిసిద్ధాః సురగణాః
ప్రశంసంతీత్యగ్రే వివిధనుతిభిః సాంజలిపుటాః |
బిడౌజాద్యైర్బహ్మాదిభిరనువృతో భక్తనికరై
ర్గణక్రీడామోదప్రముదవికటాద్యైః సహచరైః ||

వశిత్వాద్యష్టాష్టాదశదిగఖిలాల్లోలమనువా
గ్ధృతిః పాదూః ఖడ్గంజనరసబలాః సిద్ధయ ఇమాః |
సదా పృష్టే తిష్ఠంత్యనిమిషదృశస్తన్ముఖలయాః
గణేశం సేవంతే ప్యతినికటసూపాయనకరాః ||

మృగాంకాస్యా రంభాప్రభృతిగణికా యస్య పురతః
సుసంగీతం కుర్వంత్యపి కుతుకగంధర్వసహితాః |
ముదః పారో నాత్రేత్యనుపమపదే దౌర్విగలితా
స్థిరం జాతం చిత్తం చరణమవలోక్యాస్య విమలమ్ ||

హరేణాయం ధ్యాతస్త్రిపురమథనే చాసురవధే
గణేశః పార్వత్యా బలివిజయకాలే పి హరిణా |
విధాత్రా సంసృష్టావురగపతినా క్షోణిధరణే
నరైః సిద్ధా ముక్తే త్రిభువనజయే పుష్పధనుషా ||

అయం సుప్రాసాదే సుర ఇవ నిజానందభువనే
మహాన్ శ్రీమానాద్యో లఘుతరగృహే రంకసదృశః |
శివద్వారే ద్వాఃస్థో నృప ఇవ సదా భూపతిగృహే
స్థితో భూత్వోమాంకే శిశుగణపతిర్లాలనపరః ||

అముష్మిన్ సంతుష్టే గజవదన ఏవాపి విబుధే
తతస్తే సంతుష్టాస్ట్రిభువనగతాః స్యుర్బుధగణాః |
దయాళుర్హేరంబో న చ భవతి యస్మింశ్చ పురుషే
వృథా సర్వం తస్య ప్రజననమతః సాంద్రతమసి ||

వరేణ్యో భూశుండిర్భృగుగురుకుజా ముద్గలముఖా
హ్యపారాస్తద్భక్తా జపహవనపూజాస్తుతిపరాః |
గణేశోయం భక్తప్రియ ఇతి చ సర్వత్ర గదితం
విభక్తిర్యత్రాస్తే స్వయమపి సదా తిష్ఠతి గణః ||

మృదః కాశ్చిద్ధాతోశ్ఛదవిలిఖితా వాపి దృషదః
స్మృతా వ్యాజాన్మూర్తిః పథి యది బహిర్యేన సహసా |
అశుద్ధోఒద్ధా ద్రష్టా ప్రవదతి తదాహ్వాం గణపతేః
శ్రుతా శుద్ధో మర్త్యో భవతి దురితాద్విస్మయ ఇతి ||

బహిర్ద్వారస్యోర్ధ్వం గజవదనవర్ష్మేంధనమయం
ప్రశస్తం వా కృత్వా వివిధకుశలైస్తత్ర నిహతమ్ |
ప్రభావాత్తన్మూర్త్యా భవతి సదనం మంగళమయం
విలోక్యానందస్తాం భవతి జగతో విస్మయ ఇతి ||

సితే భాద్రే మాసే ప్రతిశరది మధ్యాహ్నసమయే
మృదో మూర్తిం కృత్వా గణపతితిధౌ ఢుంఢిసదృశీమ్ |
సమర్చత్యుత్సాహః ప్రభవతి మహాన్ సర్వసదనే
విలోక్యానందస్తాం ప్రభవతి నృణాం విస్మయ ఇతి ||

తథా హ్యేకః శ్లోకో వరయతి మహిమ్నో గణపతేః
కథం స శ్లోకేస్మిన్ స్తుత ఇతి భవేత్సంప్రపతితే |
స్మృతం నామాస్యైకం సకృదిదమనంతాహ్వయసమం
యతో యస్యెకస్య స్తవనసదృశం నాన్యదపరమ్ ||

గజవదన విభో యద్వర్జితం వైభవం తే
త్విహ జనుషి మమేత్థం చారు తద్దర్శయాశు |
త్వమసి చ కరుణాయాః సాగరః కృత్స్నదాతా
ప్యతి తవ భృతకోఒహం సర్వదా చింతకోస్మి ||

సుస్తోత్రం ప్రపఠతు నిత్యమేతదేవ
స్వానందం ప్రతి గమనే ప్యయం సుమార్గః |
సంచింత్యం స్వమనసి తత్పదారవిందం
స్థాప్యాగ్రే స్తవనఫలం నతీః కరిష్యే ||

గణేశదేవస్య మాహాత్మ్యమేత
ద్యః శ్రావయేద్వాపి పఠేచ్ఛ తస్య |
క్లేశా లయం యాంతి లభేచ్చ శీఘ్రం
స్త్రీపుత్రవిద్యార్థగృహం చ ముక్తిమ్ ||

ఇతి శ్రీపుష్పదంతవిరచితం శ్రీగణేశమహిమ్నః స్తోత్రమ్ |

మరిన్ని స్తోత్రములు:

Sri Shiva Mahimna Stotram In Telugu | శ్రీ శివ మహిమ్నః స్తోత్రం

Shri Shiva Mahimna Stotram In Telugu

Sri Shiva Mahimna Stotram In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ మహిమ్నః స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ శివ మహిమ్నః స్తోత్రం

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్ర్బహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |
అథా౬వాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః ||

అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయో
రతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి |
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ||

మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవత
స్తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ |
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్ధే౬స్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసితా ||

తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తువ్యస్తం తిసృషు గుణభిన్నాసు తనుషు |
అభవ్యానామస్మిన్ వరద రమణీయామరమణీం
విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః ||

కిమీహః కిం కాయః స ఖలు కిముపాయ భువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ |
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసరదుఃస్థో హతధియః
కుతర్కోజియం కాంశ్చిన్ముఖరయతి మోహాయ జగతః ||

అజన్మానో లోకాః కిమవయవవంతోపి జగతా
మధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి |
అనీశో వా కుర్యాద్భువనజననే కః పరికరో
యతో మందాస్త్వాం ప్రత్యమరవర సంశేరత ఇమే ||

త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ |
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్థవ ఇవ ||

మహోక్షః ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తంత్రోపకరణమ్ |
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్ర్భూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి ||

ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రావ్యాధౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే |
సమస్తేఒప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువంజిప్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా ||

తవైశ్వర్యం యత్నాద్యదుపరి విరించిర్హరిరధః
పరిచ్ఛేత్తుం యాతావనలమనలస్కంధవపుషః
తతో భక్తిశ్రద్ధాభరగురుగృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి ||

అయత్నాదాపాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్భాహూనభృత రణకండూపరవశాన్ |
శిరఃపద్మశ్రేణీరచితచరణాంభోరుహబలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదమ్ ||

అముష్య త్వత్సేవాసమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసేఒపి త్వదధివసతౌ విక్రమయతః |
అలభ్యా పాతాలే౬ప్యలసచలితాంగుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీధ్రువముపచితో ముహ్యతి ఖలః ||

యదృద్ధిం సుత్రామ్లో వరద పరమోచ్చెరపి సతీ
మధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః |
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయో
ర్న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః ||

అకాండబ్రహ్మాండక్షయచకితదేవాసురకృపా
విధేయస్యాసీద్యస్త్రినయనవిషం సంహృతవతః |
స కల్మాషః కంఠే తవ న కురుతే న శ్రియమహో
వికార్కోపి శ్లాఘ్యో భువనభయభంగవ్యసనినః ||

అసిద్ధార్ధా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః |
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః ||

మహీ పాదాఘాతాద్ర్వజతి సహసా సంశయపదం
పదం విష్ణోగ్రామ్యద్భుజపరిఘరుగగ్రహగణమ్ |
ముహుర్ద్యార్ధాస్థ్యం యాతనిభృతజటాతాడితతటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైన విభుతా ||

వియద్వ్యాపీ తారాగణగుణితఫేనోద్గమరుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే |
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమి
త్యనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః ||

రథః క్షోణీ యంతా శతధృతిరగేంద్రో ధనురథో
రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిః శర ఇతి |
దిధక్షోస్తే కోయం త్రిపురతృణమాడంబరవిధి
ర్విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః ||

హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ పదయో
ర్యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలమ్ |
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషా
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్ ||

క్రతౌ సుప్తే జాగ్రత్త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః ||

క్రతౌ సుప్తే జాగ్రత్త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః ||

క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతా
మృషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సురగణాః |
క్రతుభేషస్త్వత్తః క్రతుఫలవిధానవ్యసనినో
ధ్రువం కర్తుః శ్రద్ధావిధురమభిచారాయ హి మఖాః ||

ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా |
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసంతం తేజ ద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః ||

స్వలావణ్యాశంసాధృతధనుషమహ్నాయ తృణవత్
పురః పుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి |
దేవీ యమనిరత దేహార్ధఘటనా
యది స్త్రైణం -దవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః ||

భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాం
స్తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదమ్ |
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మై ధామ్నే ప్రవిహితనమస్యోస్మి భవతే ||

నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః |
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమో
నమః సర్వస్మై తే తదిదమితి శర్వాయ చ నమః ||

బహులరజసే విశ్వోత్పత్తా భవాయ నమో నమః
ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః |
జనసుఖకృతే సత్త్వోద్రిక్తా మృడాయ నమో నమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః ||

కృశపరిణతి చేతః క్లేశవశ్యం క్వ చేదం
క్వ చ తవ గుణసీమోల్లంఘినీ శశ్వదృద్ధిః |
ఇతి చకితమమందీకృత్య మాం భక్తిరాధా
ద్వరద చరణయోస్తే వాక్యపుష్పోపహారమ్ ||

అసితగిరిసమం స్యాత్కజ్జలం సింధుపాత్రే
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ |
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి ||

అసురసురమునీంద్రెరర్చిత స్యేందుమౌళే
ర్గథితగుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య ||
సకలగణవరిష్ఠః పుష్పదంతాభిధానః
రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార ||

అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్
పఠతి పరమభక్త్యా శుద్ధచిత్తః పుమాన్ యః |
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథాత్ర
ప్రచురతరధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ ||

మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః |
అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరమ్ ||

దీక్షా దానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః |
మహిమ్నః స్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశీమ్ ||

కుసుమదశననామా సర్వగంధర్వరాజః
శిశుశశిధరమౌలేర్దేవదేవస్య దాసః |
స ఖలు నిజమహిమ్నో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్దివ్యదివ్యం మహిమ్నః ||

సురవరమునిపూజ్యం స్వర్గమోక్షైకహేతుం
పఠతి యది మనుష్యః ప్రాంజలిర్నాన్యచేతాః |
ప్రజతి శివసమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదంతప్రణీతమ్ ||

ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వభాషితమ్ |
అనౌపమ్యం మనోహారి శివమీశ్వరవర్ణనమ్ ||

ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీమచ్ఛంకరపాదయోః |
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః ||

తవ తత్త్వం న జానామి కీదృశోసి మహేశ్వర |
యాదృశో౬సి మహాదేవ తాదృశాయ నమో నమః ||

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః |
సర్వపాపవినిర్ముక్తః శివలోకే మహీయతే ||

శ్రీపుష్పదంతముఖపంకజనిర్గతేన
స్తోత్రేణ కిల్బిషహరేణ హరప్రియేణ |
కంఠస్థితేన పఠితేన సమాహితేన
సుప్రీణితో భవతి భూతపతిర్మహేశః ||

ఇతి శ్రీపుష్పదంత విరచితం శ్రీ శివ మహిమ్నః స్తోత్రమ్ |

మరిన్ని స్తోత్రములు:

Sri Sai Baba Ekadasa Sutralu In Telugu – శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

Sri Sai Baba Ekadasa Sutralu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు గురించి తెలుసుకుందాం…

Sri Sai Baba Ekadasa Sutralu Telugu

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

  1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
  2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.
  3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
  4. నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును.
  5. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
  6. నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
  7. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
  8. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను.
  9. నా సహాయమును గాని, నా నలహాను గాని, కోరిన తక్షణమోసంగ సంసిద్దుడను.
  10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దమే పొడచూపదు.
  11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

మరిన్ని పోస్ట్లు:

Sri Sai Aarti In Telugu – శ్రీ సాయి హారతి

Sri Sai Aarti In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి హారతి గురించి తెలుసుకుందాం…

Sri Sai Aarti In Telugu

శ్రీ సాయి హారతి

1. ఓం జయ జగదీశహరే – స్వామి జయజగధీశ హరే
భక్తజనోంకే సంకట – దాసగణోంకే
సంకటక్షణమే దూర్: కరే

॥ఓం॥

2. జోధ్యావే ఫలపావే – దుఃఖ వినశమనకా –
సాయి దుఃఖ వినశ మనకా-
సుఖ సంపత్తిఘర్ అవే –
సుఖ సంపత్తిఘర్: అవే కష్టమిటే తనకా-ఓం

॥జయ॥

3. మాత పితా తుమ్ మేరే –
శరణు గహూ కిసకీ సాయి శరణుగహూ కిసకీ
తుమ్ బిన ఔర్ దూజా
తమ బిన ఔర్ నదూజా ఆసకరూ జిసకీ –

ఓం||జయ||

4. తుమ పూరణ పరమాత్మా
తుమ్ అంతర్యామీ సాయి తుమ్ అంతర్యామీ
పరబ్రహ్మ పరమేశ్వర – పరబ్రహ్మ పరమేశ్వర
తుమ్ సబ్ కే స్వామి –

ఓం||జయ||

5. తుమ్ కరుణాకేసాగర్ – తుమ్ పాలనకర్తా –
సాయి తుమ్ పాలనకర్తా
మై మూరఖ్ ఖలా కామి – మై సేవకు తుమ్
స్వామికృపాకరో భర్తా –

ఓం||జయ||

6. తుమ్హ ఏక్ అగోచర సబకే ప్రాణపతీ సాయి సబకే ప్రాణపతీ
కిసీవిధి మిలూందయామయి-కిసీవిధి మిలూందయామయి
తుమకోమైఁకుమతీ-

ఓం||జయ||

7. దీనాబంధూ దుఃఖ హరతా-తుమ్ ఠాకుర్ మేరే
సాయి తుమ్ ఠాకుర్ మేరే
అనే హాత్ బడావో – అపనే హాత్ బడావో
ద్వార పడా తేరే !

ఓం||జయ||

8. విషయ వికార మిఠావో –
పాపహరోఁ దేవా సాయి పాపహరోఁ దేవా-
శ్రద్ధాభక్తి భడావో – శ్రద్ధా భక్తి భడావో –
సంతనకీ సేవా –

ఓం||జయ||

9. పూర్ణబ్రహ్మకీ ఆరతీ జోకోయీ బావే స్వామి జో
కోయీబావే
కహత్ శివానంద స్వామీ కహత్ శివానంద్ స్వామి
సుఖ సంపతి ఆవే
ఓం జయ జగదీశహరే –
సాయి జయజగధీశ హరే
భక్తజనోంకే సంకట –
దాసగణోంకే సంకటక్షణమే దూర్: కరే

॥ఓం॥

శ్రీ సచ్ఛిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజ్క జై

మరిన్ని పోస్ట్లు:

Sri Shiridi Sai Saptha Swararalu In Telugu – శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలు

Sri Shiridi Sai Saptha Swararalu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి గీతాలు సాధకులను ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీస్తాయి, ప్రేమ, శాంతి, సమాధానం మరియు సాంత్వన అంతా వీటికి ఆధారం ఉంటాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలు గురించి తెలుసుకుందాం…

Sri Sai Saptha Swara Geethikalu Telugu

శ్రీ సాయి సప్త స్వర గీతికలు

గీతిక: 1

సాకి:

తల్లి నీవె తండ్రి నీవె రాగమైన భావమైన
ప్రాణమైన దైవమైన నీవె
మదిని మందిరాన్ని చేసి
పరిచితిమి మమతల సింహాసనాన్ని

పల్లవి:

రావయ్య దేవ రమణీయ రూప
కరుణించ రార కరుణా సముద్ర
ఆలకించ రార ఆత్మబంధు నీవ
ఆపదలను పాపెడు అవని నేలు దైవమ
బాబా నీవే… మా సాయి నీవే

॥రావయ్య ||

చరణం 1:

నీ చల్లని చూపుతో పుడమి పావని ఆయె
నీ కాలు తాకినంత కలి అహం పారిపోయె
ఏనాటి పుణ్య వరమొ, ఏనాటికి తీరని బంధమొ
పాపాలను పాపి వేయ మానవ రూపం దాల్చిన
మమ్ముకన్న దైవమ మరల రావయ్య స్వామి

॥రావయ్య ||

చరణం 2:

పూలు పళ్ళు ధూప దీపాలతో
ప్రేమే నైవేద్యాన్ని చేసి నీ నామమే స్మరిస్తు
రాముడవు నీవంటు రహీమువు నీవంటు
ఏసువైన బుద్ధుడైన నానకైన నీవంటు
నీ రాకకె నీ కోసమె నిరీక్షించగ

॥రావయ్య ॥

గీతిక: 2

పల్లవి:

పాహి పాహి పాహి పాహి
పాపనాశక మా ప్రాణ రక్షక
సాయి సాయి సాయి సాయి
సాధు పుంగవ మా ఇష్ట దైవమా

॥ పాహి॥

చరణం 1:

మా కళ్లలోకి చూడవయ్య కాంతులను నింపగ
లోగిల్లలోకి చేరవయ్య లోపాలను తీర్చగ
మనస్సులోన నిలువవయ్య కలతలను పాపగ
మహిమగల స్వామి నీకు మొక్కెదను భక్తి తోడ
మమత గల తండ్రి నిన్ను తలచెదను ప్రేమ తోడ
ముల్లోకాలనేలు వాడవట సృష్టికి మూలానివట

॥పాహి॥

చరణం 2:

అణువణువు ప్రతి అణువు నీ రాకకె నీ కోసమె
క్షణ క్షణము ప్రతి క్షణము పరితపిస్తున్నవి
పంచ భూతమ్ములు పంచేద్రియాలు
నీ కరుణనె నీ తోడునే కోరుతున్నాయి
నాలుగు వేధమ్ములైన నాలుగు దిక్కులైన
నాలుగు వేళలందు కోటి తారకలైన
నీకే దాసోహమట నీవే బ్రహ్మాండమట

॥పాహి॥

గీతిక: 3

పల్లవి:

షిరిడీ పురం మా సాయీ నగరం
కనులారా గాంచినంత కలుగు దర్శనం- కలుగు సాయి దర్శనం
మనసార తలచినంత పలుకు మందిరం- పలుకు బాబ మందిరం

॥షిరిడీ॥

చరణం 1:

పాపాలను పారద్రోలు పావనదామం
ఆర్థులను అక్కు చేర్చు కరుణాలోకం
గుడి కట్టిన గురుద్వారం కనుపించు కాశీ నిలయం
కీర్తించగ క్రీస్తూ గానం ఆలకించ అల్లా నామం
వెలుగొందె ఈ ద్వారక మాయి క్షేత్రం

||షిరిడీ||

చరణం 2:

రోగాలకు తావు లేదు బోగాలకు తావు లేదు
కోపాలకు రూపు లేదు తాపాలకు తనువు లేదు
మమతకిది మందిరమై భక్తికి భవ సాగరమై
వెలుగొందె ఈ ద్వారకమాయి క్షేత్రం

||షిరిడీ||

గీతిక: 4

సాకి:

బాబా… సాయి బాబా…

పల్లవి:

నీ పాదాలే కడుగన పూజలే సేయన
భక్తితోడ కొలువన భజనలే సేయన
బాబా అని పిలువన సాయీ అని తలువన

॥పాదాలే॥

చరణం:

నీ రూపం నీ నామం ప్రతి అణువున నిండగ
అణువునై పోన నీ చెంతకు నే చేరన

॥పాదాలే॥

నీ ప్రేమ నీ కరుణ ప్రతి పువ్వున విరియగ
పువ్వునై పోన నీ చరణాలను తాకన

॥పాదాలే॥

నీ చూపు నీ తోడు ప్రతి మదిన నిలువగ
భక్తుడనై పోన నే హారతులే యివ్వన

॥పాదాలే॥

గీతిక: 5

పల్లవి:

అన్నింట నీ రూపమె ప్రతినోట నీ నామమె
సద్గురు నాథ మా సాయీ ప్రభువా
పాలించు వాడవు లాలించు వాడవు
మనసున్న వాడవు మానవీయ రూపుడవు

॥అన్నింట॥

చరణం 1:

కుల మతాలు కూల దన్ని ప్రేమలే పంచినావు
మానవతను బోధించి మనస్సులే దోచినావు
భక్తినే చాటి నువ్వు కరుణయే చూపినావు
బాబాగా మిగిలినావు

॥అన్నింట॥

చరణం 2:

అఖిలాండ మూర్తివి అండగ నిలిచినావు
లోకాలను ఏలు నీవు లోగిల్లకు చేరినావు
చింతలనే తీర్చి నువ్వు చీకట్లను బాపినావు
చిదానందునిగా మారినావు

॥అన్నింట॥

గీతిక: 6

పల్లవి:

షిరిడీశ తండ్రి పరమేశ
శివరూప సాయి రామేశ
యేలుకొను వాడవయ్య వరాలిచ్చు వాడవయ్య
మహిమ గల తండ్రివయ్య మహితాత్ముడ నీవయ్య
అలకయేల భూనితివో మంకు నేల పట్టితివో

చరణం 1:

ఆర్థులము మేమయ్య ఒంటరిగా మిగిలితిమి
తోడుగ నిలువ రార తప్పులను తెలుపగ
కన్నులలో నీవుంటివి కడదాక నిలిచి పోర
కపటాలు లేనట్టి కమనీయ రూపుడవు

॥షిరిడీశ॥

చరణం 2:

దైవానివి నీవయ్య దయగల తండ్రివయ్య
భక్తులము మేమురాగ భజనలే సేయగ
ప్రేమతో మమ్ము చేరి భక్తినే చాటర
మానవతారూపుడ మనస్సు గల నాథుడ

॥షిరిడీశ ॥

గీతిక: 7

సాకి:

ఓం షిరిడి నాథాయ నమః
ఓం మాధవ సాయినే నమః

పల్లవి:

జగతికి మూలం సృష్టికి ప్రతి రూపం
మానవతకు మారు పేరు సాయీ నామం
మా బాబా నిలయం

చరణం 1:

ఈశుడు తానె పరమేశడు తానె
జీవుడు తానె దేవుడు తానె
ఆత్మయు తానే పరమాత్మయు తానె
ఎలా పిలిచిన ఎలా తలచిన
పిలిస్తే పలుకు వాడు సాయీ…

॥జగతికి॥

చరణం 2:

లీలలెన్నొ చేయువాడు ప్రేమలే పంచువాడు
కరుణయే చూపు వాడు లోకమ్ముల నేలు వాడు
గీతలోన నిండినాడు ఖురానైన వెలిగినాడు
క్రీస్తుగా పిలిచిన నానకని తలచిన
మదిలోన నిలుచు వాడు సాయీ…..

॥జగతి॥

మరిన్ని పోస్ట్లు:

Bhakti Vedalu | ఆధ్యాత్మిక విశ్వం లోకి స్వాగతం

Discover The Ultimate Collection Of Devotional Hymns And Prayers | Bhakti Ved

Welcome to the Bhakti Ved Website. Our platform provides an extensive array of hymns, ashtakas, dandakas, and other sacred chants and devotional verses In Telugu. We are dedicated to facilitating your spiritual journey, ensuring that you can effortlessly follow and engage in devotionaland rituals. With our resources, you can profoundly enrich your devotional path and elevate your spiritual experiences.

STHOTHRALU – స్తోత్రాలు

ASHTOTTARA – అష్టోత్తర

ASHTAKAMULU – అష్టకములు

MANTRALU – మంత్రాలు

BHAKTI GEETHALU – భక్తి గీతాలు

BHAKTI YOGAM – భక్తి యోగం

DANDAKALU – దండకాలు

CHALISALU – చాలీసాలు

KAVACHALU – కవచాలు

KEERTHANALU – కీర్తనలు

NEETHIKATHALU – నీతికథలు

శ్రీమద్రామాయణం లోని కథ

శ్రీమద్భాగవతము లోని కథ

శ్రీమహాభారతం లోని కథ

PANDUGALU – పండుగలు

POOJA – పూజ

PRAPATTULU – ప్రపత్తులు

SUKTULU – సూక్తులు

SUPRABHATAMULU – సుప్రభాతములు

VRATHALU – వ్రతాలు